Belgium Scientists: కొబ్బరి చెట్లను క్లోనింగ్ చేసిన యూనివర్సిటీ?
చాలా నెమ్మదిగా పెరిగే కొబ్బరి చెట్లను కూడా తాము క్లోనింగ్ చేయగలిగినట్లు బెల్జియంలోని కె.యు.ల్యువెన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. కె.యు.ల్యువెన్ వర్సిటీ, అలయెన్స్ ఆఫ్ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్‌కు చెందిన పరిశోధకులు... వేగంగా కొబ్బరి మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచడంతోపాటు, కొబ్బరి జన్యు మూలాలను దీర్ఘకాలం పరిరక్షించడంలో విజయం సాధించారు. వీరు సాధించిన విజయంతో భారత్ వంటి దేశాల్లోని కొబ్బరి రైతులు ఎదుర్కొనే వ్యాధులు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల్లో పెరుగుదల వంటి సమస్యల నుంచి విముక్తి కలగనుంది. ఈ ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ సెప్టెంబర్ ఎడిషన్‌లో ప్రచురితమయ్యాయి. అరటి పండుపై సాగించిన పరిశోధనల ఫలితాల స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. మా పరిశోధన కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సాయపడుతుందని వివరించారు.
చదవండి: ఏ సినిమా కోసం అంతరిక్షంలో షూటింగ్ జరపనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొబ్బరి చెట్లను క్లోనింగ్ చేసిన శాస్త్రవేత్తలు
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : కె.యు.ల్యువెన్ వర్సిటీ, అలయెన్స్ ఆఫ్ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్‌కు చెందిన పరిశోధకులు...
ఎందుకు : కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సాయపడుతుందని...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్