America CIA: హవానా సిండ్రోమ్ వ్యాధిని తొలుత ఏ దేశంలో గుర్తించారు?
అమెరికా దౌత్యప్రతినిధులు, గూఢచారులకు సోకుతూ వైద్య రంగానికే సవాల్ విసిరిన హవానా సిండ్రోమ్ మొట్టమొదటిసారిగా భారత్‌లో వెలుగు చూసింది. 2021, సెప్టెంబర్ నెల మొదటి వారంలో భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన అధికారి హవానా సిండ్రోమ్ లక్షణాలతో బాధపడినట్టుగా ఆలస్యంగా బయటపడింది. తిరిగి వెళ్లిన వెంటనే ఆయనకు వైద్యం అందించినట్టు సెప్టెంబర్ 21న సీఎన్‌ఎన్ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 మంది అమెరికా అధికారులు, వారి కుటుంబీకులు ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
క్యూబాలో...
2017 ఏడాదిలో క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిలో తొలిసారిగా హవానా సిండ్రోమ్ వ్యాధి లక్షణాలు మైగ్రేన్ తరహాలో తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం కనిపించాయి. ఎందుకు సోకుతోందో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
రష్యా దాడి చేస్తోందా ?
రష్యా నిఘా వర్గాలు అల్ట్రాసోనిక్ వెపన్స్ వాడడం ద్వారా అమెరికా ఇంటెలిజెన్స్ ప్రతినిధులపై దాడి చేస్తున్నాయని, అందువల్లే నరాల బలహీనత, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయనే అనుమానాలున్నాయి.
అమెరికా ఏమంటోంది?
ఇటీవల అమెరికా దౌత్య ప్రతినిధుల్లో హవానా సిండ్రోమ్ లక్షణాలు బయటకు రావడం సర్వసాధారణంగా మారిందని సీఐఏ వెల్లడించింది. ఎక్కువ మందిలో వైద్యం అందిన వెంటనే ఈ లక్షణాలు సర్దుకుంటున్నాయని, కొందరిలో మాత్రం శాశ్వతంగా మెదడు దెబ్బతింటోందని తెలిపింది. ఇది మానసిక ఒత్తిడికి సంబంధించిన వ్యాధిగా అమెరికాలోని పలువురు న్యూరాలజిస్టులు చెబుతున్నారు.
చదవండి: దేశంలో తొలుత నిఫా వైరస్‌ను ఏ నగరంలో గుర్తించారు?