Skip to main content

DRDO: ‘అగ్ని ప్రైమ్‌’ క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్‌: దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం మధ్య శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైల్‌ ‘అగ్ని ప్రైమ్‌’ ప్రయోగ పరీక్ష విజయవంతమైంది.
'Agni Prime' missile test successful
'Agni Prime' missile test successful

ఒడిశా తీరం అబ్దుల్‌ కలాం దీవిలోని మొబైల్‌ లాంచర్‌ నుంచి అక్టోబర్ 21న ఉదయం 9.45 గంటలకు ఈ పరీక్ష చేపట్టినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వెల్లడించింది. 1,000 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగే ఘన ఇంధనం కలిగిన ఈ మిస్సైల్‌ తాజా ప్రయోగంలో అన్ని రకాల పరామితులను చేరుకున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో అమర్చిన రాడార్లు, టెలిమెట్రీ వ్యవస్థలు మిస్సైల్‌ నావిగేషన్‌ను ట్రాక్‌ చేసి, పర్యవేక్షించాయని వివరించింది. గత ఏడాది డిసెంబర్‌ 18వ తేదీన ఇక్కడే చేపట్టిన ‘అగ్ని ప్రైమ్‌’ ప్రయోగ పరీక్ష కూడా విజయవంతమైనట్లు డీఆర్‌డీవో పేర్కొంది.  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 22 Oct 2022 01:19PM

Photo Stories