Reservoirs: వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన వ్యక్తి?
పచ్చదనం, నేల, నీటి పరిరక్షణ (సాయిల్, వాటర్ కన్జర్వేషన్)కు.. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు దోహదపడుతున్న జీవో 111ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తే అది వినాశనానికి దారితీస్తుందని జల్ బారాదరి చైర్మన్, ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని అధిక భాగం ‘సిమెంట్ కాంక్రీట్ జంగిల్’గా మారిపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. జీవో 111ను ఎత్తేసి భారీ నిర్మాణాలకు అనుమతినిస్తే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలోని ప్రాంతం అంతా బహుళ అంతస్తులు వెలసి.. అక్కడ కొత్తగా మరో పెద్ద కాంక్రీట్ అడవి ఏర్పడి వినాశనానికి దారితీస్తుందన్నారు. ఇప్పుడు ఆ జలాశయాల నీటిని వాడడం లేదంటూ జీవో 111ను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటన ఎంతో ఆందోళనకు గురిచేస్తోందన్నారు.
IFFCO: రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఇఫ్కో రెండో ప్లాంట్ ఏర్పాటు కానుంది?
హిమాయత్ సాగర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చుటకు, 1908నాటి హైదరాబాద్ వరదలు వంటి వరదల బారి నుండి రక్షించుటకు నిర్మించారు. హైదరాబాద్ చివరి నిజాం అయిన ఉస్మాన్ అలీ ఖాన్ వీటిని నిర్మించారు. ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు అయిన ‘హిమాయత్ అలీ ఖాన్’ పేరుతో ఈ హిమాయత్ సాగర్ జలాశయానికి ‘హిమాయత్ సాగర్‘ అని నామకరణం జరిగింది. అలాగే ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగా ఉస్మాన్ సాగర్‌కు ఆ పేరు వచ్చింది. ఇవి రెడు జలాశయాలు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నాయి.
R&D Centre: కెమ్ వేద పరిశోధన కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీవో 111ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తే అది వినాశనానికి దారితీస్తుంది
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : జల్ బారాదరి చైర్మన్, ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్
ఎందుకు : జీవో 111ను ఎత్తేసి భారీ నిర్మాణాలకు అనుమతినిస్తే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలోని ప్రాంతం అంతా బహుళ అంతస్తులు వెలసి.. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్