R&D Centre: కెమ్ వేద పరిశోధన కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ ‘కెమ్ వేద’ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.150 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ నగరంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటనలో భాగంగా మార్చి 21న శాండియాగోలోని కెమ్ వేద కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను గురించి సంస్థ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో కెమ్ వేద కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ భీమారావు పారసెల్లి... హైదరాబాద్‌లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యంత నైపుణ్యం కలిగిన 500 మంది హై స్కిల్డ్ నిపుణులకు పరిశోధన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా ‘కెమ్ వేద’కంపెనీకి పేరు ఉంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది.
3500 Year Old Menhir: ఇనుపయుగం నాటి భారీ మెన్హిర్‌ను ఎక్కడ గుర్తించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కంపెనీ?
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు : లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధనల కోసం..
International Arbitration Center: రాష్ట్రంలోని ఏ నగరంలో ఐఏఎంసీ నిర్మాణానికి భూమిపూజ చేశారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్