Skip to main content

Telangana Bjp new president: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా జి. కిషన్‌రెడ్డి

భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను మార్చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది.
Telangana Bjp new president
Telangana Bjp new president

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు కొత్తగా జి. కిషన్‌రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ కొత్త చీఫ్‌గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. 
తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని సైతం తీసుకుంది. పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్‌ జక్కడ్‌ పేరును  జార్ఖండ్‌ బీజేపీ చీఫ్‌గా బాబూలాల్‌ మారాండి పేర్లను ప్రకటించారు. 

 Daily Current Affairs in Telugu: 4 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

కిషన్ రెడ్డి గురించి:
కిషన్ రెడ్డి 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. మూడు దశాబ్దాల కింద అమెరికాకు వెళ్లిన బీజేపీ టీంలో కిషన్ రెడ్డి ఒకరు. అదే బృందంలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఉండడం విశేషం.

కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం:

➤ 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే

➤ 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  ఎమ్మెల్యే

➤ 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక

➤ 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణలో పోరుయాత్ర

➤ 2019లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నిక

➤ ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు.

 India, Malaysia trade in Indian rupee: భారత రూపాయితో విదేశీ వ్యాపారం

 

 

 

Published date : 04 Jul 2023 09:06PM

Photo Stories