RYTHU BIMA: రైతు బీమాకు రూ. 1,450 కోట్లు.. ఒక్కో రైతుకు రూ.3,830 చొప్పున చెల్లింపు
గతేడాది కంటే ఎక్కువగా రైతులు ఈ పథకం కింద నమోదు అయ్యారు. గతేడాది 35.64 లక్షల మంది లబి్ధదారులు ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 37.77 లక్షలకు చేరినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే అదనంగా 2.13 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు.
Also read: Lumpy skin disease (LSD): వణికిస్తున్న లంపీ ముప్పు.. పాడి పశువుల్లో వ్యాపిస్తున్న వ్యాధి
2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.
బీమా పరిధిలోని రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు (నామినీ) పరిహారంగా ఎల్‌ఐసీ రూ.5 లక్షలు అందజేస్తుంది.
గతేడాది కంటే ప్రీమియం తగ్గుదల
గతేడాది కంటే ప్రీమియం సొమ్మును తగ్గించేలా ఎల్‌ఐసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. గతేడాది ఒక్కో రైతుకు రూ.4,110 చొప్పున చెల్లించగా, ఈ ఏడాది రూ.3,830 మాత్రమే చెల్లించారు. ఆ ప్రకారం గతేడాది 35.64 లక్షల మంది రైతులకు రూ.1,465 కోట్లు చెల్లించగా, ఈసారి 37.77 లక్షల మంది రైతులకు రూ.1,450 కోట్లు చెల్లించారు.
Also read: Quiz of The Day (September 22, 2022): మన దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP