Skip to main content

AP: ఆకట్టుకుంటున్న RBK చానల్‌

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నదాతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్‌ విశేష ఆదరణతో దూసుకుపోతోంది.
RBK TV channel to improve cultivation practices
RBK TV channel to improve cultivation practices

 రెండేళ్లలోనే 1.95 లక్షల సబ్‌స్క్రైబర్లను, 21.50 లక్షల వ్యూయర్‌షిప్‌ను సాధించింది. రైతులతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభినందనలూ చూరగొంటోంది. 

Also read: Central Rural Development Department: ముఖరా(కె).. అవార్డులన్నీ ఆ ఊరికే..

శాస్త్రవేత్తలతో సందేహాల నివృత్తి..
ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నూతన సాగు విధానాలను రైతులకు చేరువ చేసే లక్ష్యంతో యూట్యూబ్‌లో ఈ చానల్‌ను ఏర్పాటు చేశారు. ప్రసారాల వివరాలను ఎప్పటికప్పుడు ఆర్బీకేల పరిధిలోని వాట్సాప్‌ గ్రూపుల ద్వారా రైతులకు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సబ్‌స్క్రైబర్లకు తెలియజేస్తున్నారు. ఈ చానల్‌ కోసం గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఐసీసీ కాల్‌ సెంటర్‌)లో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ చానల్‌ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. శాస్త్రవేత్తల ద్వారా రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆదర్శ రైతుల అనుభవాలను తెలియజేస్తున్నారు. వైఎస్సార్‌ యంత్రసేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు వివరించేందుకు రైతు గ్రూపులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ చానల్‌ ద్వారా 371 ప్రత్యక్ష ప్రసారాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన 895 రైతు ప్రాయోజిత వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. ఆర్బీకే 2.0 వెర్షన్, ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రసారం చేసిన కార్యక్రమానికి అత్యధికంగా 87,233 వ్యూయర్‌షిప్‌ లభించింది. రైతులు ఈ చానల్‌ కార్యక్రమాలను వీక్షించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్‌ నుంచి సిల్వర్‌ బటన్‌ను కూడా సాధించింది. 

Also read: TS SERPకు జాతీయ స్థాయిలో గుర్తింపు

అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి
ఆర్బీకే చానల్‌ అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించింది. నీతి ఆయోగ్, ఐసీఏఆర్‌ తదితర జాతీయ సంస్థతో పాటు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్‌ఏవో సహా వివిధ దేశాల ప్రముఖులు ఈ చానల్‌ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ చానల్‌ కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ తరహా చానల్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు కూడా చేస్తోంది. 

Also read: Telugu University: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 26 Sep 2022 07:42PM

Photo Stories