National Unity Day 2023: కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం, జిల్లా ఏరువాక కేంద్రాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవం
Sakshi Education
భారత ప్రథమ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం, జిల్లా ఏరువాక కేంద్రాల్లో మంగళవారం జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా పరిశోధన స్థానం హెడ్, ప్రధాన శాస్త్రవేత్త డా.జి.మంజులత మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతిజ్ఞ చేయిస్తున్నామని అన్నా రు. శాస్త్రవేత్తలు ఉషారాణి, పి.మధూకర్‌రావు, మదన్‌మోహన్‌రెడ్డి, ఎం.రాజేంద్రప్రసాద్, ప్రియదర్శిని, వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల, పరిపాలన సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు, పరిశోధన స్థానం వ్యవసాయ కార్మికులు, రావెప్ విద్యార్థులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Published date : 01 Nov 2023 06:22PM