Eknath Shinde: బలపరీక్ష నెగ్గిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శాసనసభలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నారు. శివసేన తిరుగుబాటువర్గం–బీజేపీ సర్కారుపై తన పట్టును మరింత పెంచుకున్నారు. జూలై 4న బల నిరూపణ(విశ్వాస) పరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. ప్రస్తుతం 287 మంది సభ్యులున్న అసెంబ్లీలో షిండే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 164 మంది, వ్యతిరేకంగా 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాదాపు 263 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పలువురు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జూలై 4న ముగిశాయి. షిండే ప్రభుత్వానికి వరుసగా రెండో రోజు రెండో విజయం దక్కింది. జూలై 3న నిర్వహించిన స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ నెగ్గారు. బలనిరూపణ కంటే ముందు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద షాక్ తగిలింది. ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగార్ షిండే వర్గంలో చేరిపోయారు. దాంతో వారి సంఖ్యకు 40కి పెరిగింది. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వ్యవహరించనున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP