Skip to main content

YSR ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం..

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.
Jagan govt in AP renames NTR university after YSR
Jagan govt in AP renames NTR university after YSR

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రాల విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2022ను బుధవారం ఉభయ సభల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టారు. 

Also read: Dalit Bandhu: దళితబంధు 600కోట్లు.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు

1986 నవంబర్‌ 1వ తేదీన ఏపీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1998 జనవరి 8వ తేదీన ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పేరు మార్చారు. ప్రస్తుతం దానిని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు ప్రవేశ పెట్టిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. 


ఇతర బిల్లులు
దీంతో పాటు ఏపీ కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ), ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సవరణ బిల్లు– 2022కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. 

Also read: AP State Economy: ‘నికరం’గా ఆర్థికవృద్ధి!

బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టిన మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టుల ద్వారా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారన్నారు. ఈ క్రమంలో సీఆర్‌డీఏ చట్టంలో పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చిందని తెలిపారు. పేదలకు సీఆర్‌డీఏ పరిధిలో స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి వీలుగా చట్టంలో సవరణలు చేస్తున్నామన్నారు. రాజధాని పరిధిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలక మండళ్లు, లేక ప్రత్యేకాధికారుల సిఫారసుతో మాస్టర్‌ ప్లాన్‌లో సవరణలు చేసేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు. మరో వైపు ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు–2022ను సభల్లో ఆమోదించారు. 

Also read: Andhra Pradesh Economy: తొలిసారిగా రూ.2 లక్షలు దాటిన ఏపీ తలసరి ఆదాయం

భూముల రీసర్వే చేస్తున్న నేపథ్యంలో భూ యాజమాన్య హక్కుకు సంబంధించి కేంద్రం సూచనలకు అనుగుణంగా కొత్త బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కొత్త చట్టం ద్వారా భూ యజమానులకు కచ్చితమైన టైటిల్‌ రిజిస్టర్‌ నిర్వహిస్తారు. ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సవరణ, ఏపీ కార్మిక సంక్షేమ నిధి రెండో సవరణ, ఏపీ మున్సిపల్‌ లాస్‌ సవరణ బిల్లు–2022తో కలిపి మొత్తం తొమ్మిది బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 22 Sep 2022 05:59PM

Photo Stories