Dalit Bandhu: దళితబంధు 600కోట్లు.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు
ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన ఎస్సీ కార్పొరేషన్.. ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
Also read: Telangana : తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు.. అలాగే పార్లమెంట్ కొత్త భవనానికి కూడా..
హుజూరాబాద్‌తో షురూ
దళితబంధు పథకం ఇప్పటివరకు నాలుగు కేటగిరీల్లో అమలైంది. తొలుత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది.
Also read: Telangana National Integration Day: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం
కొత్తగా నియోజకవర్గానికి 500 యూనిట్లు..
2022–23 వార్షిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అయితే తొలి విడత కింద ప్రతి సెగ్మెంట్‌కు 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
Also read: Telangana: బుద్ధవనంలో రూ.100 కోట్ల పెట్టుబడులు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP