Hyderabad Metro Expansion: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ
రూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు కనెక్టివిటీని మొత్తం 400 కి.మీలకు విస్తరించాలని నిర్ణయించినట్లు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్‌కి, మంత్రివర్గ సహచరులకు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కొత్తగా వచ్చే మెట్రో కారిడార్లను పేర్కొన్నారు.
కొత్త మెట్రో కారిడార్లు ఇవే..
➤ ఓఆర్‌ఆర్ మెట్రో
➤ జేబీఎస్ నుంచి తూముకుంట
➤ ప్యాట్నీ నుంచి కండ్లకోయ,
➤ ఇస్నాపూర్ నుంచి మియాపూర్
➤ మియాపూర్ నుంచి లక్డికాపుల్
➤ ఎల్‌బీ నగర్ నుంచి పెద్ద అంబర్‌పేట్
➤ ఉప్పల్ నుంచి బీబీనగర్
➤ తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్
➤ ఎయిర్‌పోర్ట్ నుంచి కందుకూరు (ఫార్మా సిటీ)
➤ షాద్‌నగర్ మీదుగా శంషాబాద్ (ఎయిర్‌పోర్ట్)
☛☛ Superfast Railway Line: సూపర్‌ఫాస్ట్ రైల్వే లైన్లకు పచ్చ జెండా..