Farmers: రైతుబంధు ద్వారా ఎంత మొత్తాన్ని పెట్టుబడి సాయంగా అందజేస్తున్నారు?
Sakshi Education
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం లబ్ధిదారుల్లో సన్నకారు రైతులే ఎక్కువని ఫిబ్రవరి 23న విడుదలైన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్–2021లో వెల్లడైంది. 2018, మే 10వ తేదీన ప్రారంభమైన రైతుబంధు కింద సంవత్సరానికి ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయంగా (రెండు విడతల్లో) ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజా నివేదిక ప్రకారం..
- రైతుబంధు పథకంలో 2.47 ఎకరాల లోపు ఉన్న 43,70,837 మంది సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతోంది. తర్వాత 2.48 ఎకరాల నుంచి 4.94 ఎకరాల వరకున్న చిన్న రైతుల కేటగిరీలో 11,53,096 మంది ఉండగా, 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాల వరకు సెమీ మీడియం కేటగిరీలో 4,89,097 మంది రైతులున్నారు.
- ఇక 9.89 ఎకరాల నుంచి 24.78 ఎకరాల లోపు గల మధ్యతరహా రైతులు 88,708 మందికి రైతుబంధు లబ్ధి చేకూరుతుండగా, 24.78 ఎకరాలు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పెద్ద రైతులు 6,024 మంది ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో పెద్దరైతుల సంఖ్య 0.1 శాతంగా ప్రభుత్వం పేర్కొంది.
- రైతుబంధు పథకం ప్రారంభించిన 2018 నుంచి 2021 వరకు ఏడు దఫాల్లో రూ.43,054.39 కోట్లు మొత్తం లబ్ధిదారులకు అందింది.
రైతుబీమా కింద రూ.3,259.3 కోట్లు
చనిపోయిన 59 సంవత్సరాల లోపు రైతు కుటుంబానికి రూ.5 లక్షలు బీమా మొత్తాన్ని అందించే రైతుబీమా పథకాన్ని కూడా ప్రభుత్వం 2018లోనే ప్రారంభించింది. ఈ పథకం కింద నమోదై చనిపోయిన రైతు కుటుంబాలకు ఇప్పటివరకు రూ.3,259.3 కోట్లు నేరుగా నామినీల ఖాతాల్లో జమయ్యాయి.
చదవండి: రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Published date : 26 Feb 2022 11:29AM