Skip to main content

AP Congress Chief: ఏపీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నియమించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మస్తాన్‌ వలీ, జంగా గౌతమ్, పద్మశ్రీ సుంకర, పి.రాకేశ్‌రెడ్డి నియామకాల ప్రతిపాదనను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు.

ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నవంబర్‌ 23న ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా–సోషల్‌ మీడి యా కమిటీ చైర్మన్‌గా ఎన్‌.తులసిరెడ్డిలకు అవకాశం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌ చాందీతో పాటు 18 మంది, కోఆర్డినేషన్‌ కమిటీలో 33 మంది నేతలతో పాటు పీసీసీ విభాగాల అధ్యక్షులు ఉంటారని ఏఐసీసీ వెల్లడించింది. పీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌కు రాజకీయ వ్యవహారాలు, కో–ఆర్డినేషన్‌ కమిటీల్లో చోటు కల్పించారు. 

చ‌ద‌వండి:భారత రాజ్యాంగం-సవరణలు

Published date : 24 Nov 2022 12:16PM

Photo Stories