Skip to main content

YSR Law Nestham: వ‌రుస‌గా నాలుగో ఏడాడి వైఎస్సార్‌ ‘లా నేస్తం’ నిధులు విడుదల

వ‌రుస‌గా నాలుగో ఏడాడి వైఎస్సార్‌ ‘లా నేస్తం’ పథకం కింద అర్హులైన 2,011 మంది జూనియర్‌ న్యాయవాదుల కోసం రూ.­1,00,55,000లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు­త్వం విడుదల చేసింది.
CM YS Jagan Released YSR Law Nestham Funds

ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్ రెడ్డి ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ (బుధ‌వారం) సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయ­వాద వృత్తిలోకి వచ్చిన జూనియర్‌ న్యాయవాదులు వృత్తిలో ఎదు­రయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్‌ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున అందిస్తున్నారు. కాగా ఈ ప‌థ‌కం కింద ఇప్పటివరకు 4,248 మంది న్యాయ­వాదులకు మూడున్నరేళ్లలో రూ.35.40 కోట్లు ఆర్థిక సాయం అందించారు.

అలాగే న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.­100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం అడ్వొకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. కోవిడ్‌ సమ­యంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్‌ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్‌ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు.  

JSW Steel Plant: కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమి పూజ

Published date : 22 Feb 2023 12:46PM

Photo Stories