Telangana: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఏ జిల్లాలో నిర్మించారు?
తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, తొగుట మండలం, తుక్కాపూర్ వద్ద నిర్మించిన శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఫిబ్రవరి 23న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. మల్లన్నసాగర్ రిజర్వాయర్.. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. దీని ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గామాత వద్ద టూరిజం అభివృద్ధికి రూ.1,500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ ఐదు ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం అభివృద్ధి చేయాలన్నారు.
చదవండి: బయో ఆసియా 19వ వార్షిక సదస్సు థీమ్ ఏమిటి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : తుక్కాపూర్, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
ఎందుకు : సిద్దిపేట జిల్లాకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్