PMU: వైద్య పరికరం పాడైతే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆగష్టు 23 న కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పరికరం పాడైపోయినా ఎవరైనా సరే వెంటనే ఫిర్యాదు చేసేందుకు 8888 526666 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొ చ్చింది. రాష్ట్రంలో తొలిసారిగా రూ.20 కోట్లతో ‘బయో మెడికల్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్’పేరుతో వైద్య పరికరాల నిర్వహణకు విధానాన్ని వైద్య ఆరోగ్యశాఖ రూపొందించింది. ఇందులోభాగంగా వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేకంగా ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)లో ఏర్పాటు చేసింది. వైద్య పరికరాల వివరాలన్నీ వెబ్ పోర్టల్‌లో నమోదై ఉంటాయి. అవి ప్రస్తుతం ఏ ఆస్పత్రుల్లో ఉన్నాయి.. తయారీ తేదీ...వారంటీ తేదీ...గతంలో జరిగిన మరమ్మతుల వివరాలు, ప్రస్తుత మెయింటెనెన్స్ కాంటాక్ట్ వివరాలు అందులో ఉంటాయి. రూ.5 లక్షలకు పైగా విలువైన అన్ని రకాల వైద్య పరికరాలు ఏవైనా పాడైతే వెంటనే డాక్టర్ కానీ, రోగికానీ ఇతరులెవరైనా https://emmstelangana.uat. dcservices.in/ లేదా 8888 526666 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP