APIIC: రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు కానున్నాయి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో మూడు సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) పార్కులు ఏర్పటుకానున్నాయి. చిన్న, సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఏపీఐఐసీ వీటిని అభివృద్ధి చేస్తోంది. మొత్తం రూ.18.11 కోట్ల వ్యయంతో జిల్లాలోని కోటిపి(రూ.7.46 కోట్లతో), రాప్తాడు(రూ.4.83 కోట్లతో), కప్పలబండ(రూ.5.82 కోట్లతో)లో ఈ పార్కులను అభిద్ధి చేయనున్నారు. ఒక్కొక్కటి సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నాయి.
రూ.2,868 కోట్లతో పర్యాటక ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.2,868.60 కోట్ల మేర పెట్టుబడులతో పలు భారీ పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు అక్టోబర్ 27న సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం లభించింది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇవి తోడ్పడనున్నాయి.
చదవండి: వైఎస్సార్ యంత్రసేవా పథకం ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మూడు సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటు ప్రణాళికలు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : అనంతపురం జిల్లాలోని కోటిపి, రాప్తాడు, కప్పలబండలో...
ఎందుకు : చిన్న, సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్