AP High Court : ఏపీ హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏడుగురు న్యాయాధికారులు ఆగస్టు 4వ తేదీన (గురువారం) ప్రమాణం చేశారు.
జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, జస్టిస్ బండారు శ్యాం సుందర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్, జస్టిస్ బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, జస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జునరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణలతో గవర్నర్ హరిచందన్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేయించారు. వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్ తన అధికారాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తారు. దీంతో కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రమాణం చేయించడం ఆనవాయితీ. సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో ఆయన వచ్చే పరిస్థితి లేదు. దీంతో గవర్నర్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 05 Aug 2022 04:26PM