Skip to main content

AP CM Jagan: రైతుల ఖాతాల్లో డబ్బులు..

సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి మే 4వ తేదీన సమీక్ష నిర్వహించారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యుత్‌ డిమాండ్‌-సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీగా విద్యుత్తును కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు.మార్చిలో 1268.69 మిలియన్‌ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని, ఏప్రిల్‌లో 1047.78 మిలియన్‌ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని అధికారులు పేర్కొన్నారు.

రైతుల ఖాతాల్లో డబ్బులు..
డీబీటీద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాల్లో వేస్తామని, నేరుగా రైతులే చెల్లిస్తారని, దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారని సీఎం అన్నారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ప్రాజెక్ట్‌ విజయవతం అయ్యిందని, 2020–21లో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 ఎం.యు. కరెంటు ఖర్చుకాగా, 2021– 2022లో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరినా 67.76 ఎం.యు. కరెంటు మాత్రమే వినియోగించారని అధికారులు తెలిపారు. 33.75 ఎం.యు. కరెంటు ఆదా అయ్యిందన్నారు.

Published date : 04 May 2022 05:00PM

Photo Stories