Skip to main content

AP Capital Expenditure: మూలధన వ్యయంలో ఏపీ టాప్‌

ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధనం వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
AP-Capital-Expenditure
AP Capital Expenditure

ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రి­ల్‌ నుంచి జూన్‌ వరకు మూలధన వ్యయంపై కాగ్‌ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బడ్జెట్‌లో మూలధన వ్య­యం కేటా­యింపుల్లో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 40.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్‌ గణాంకాలు తెలిపాయి.
దేశంలో మరే రాష్ట్రంలోనూ తొలి త్రైమాసికంలో ఇంత మేర వ్యయం చేయలేదని కాగ్‌ గణాంకాలు పేర్కొ­న్నా­యి. పలు రాష్ట్రా­లు బడ్జెట్‌­లో మూ­లధన వ్య­యం కేటాయింపుల్లో ఎంత మే­ర ఖర్చు చేశా­య­నే అంశా­న్ని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక కూడా వెల్లడించింది. మూలధన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ చేసినంత వ్యయం దేశంలో మరే రాష్ట్రం­లోనూ చేయలేదని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. బడ్జెట్‌లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లోనే ఏకంగా 29.70 శాతం వ్యయం చేసిందని తెలిపింది.

Sagar Mala Projects in AP: ఏపీలో లక్షా 20 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌లు

ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించి కాగ్‌ గణాంకాలు కూడా మూల«­దన వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉ­న్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభు­త్వం బడ్జె­ట్‌­లో మూలధన వ్యయం కింద రూ.31,061 కోట్లు కేటాయింపులు చేయగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రూ.12,669 కోట్లు వ్యయం చేసిందని, ఇది కేటాయింపుల్లో 40.79 శాతమని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదే­శ్‌ తరువాత మూలధన కేటాయింపుల్లో ఎ­క్కువ వ్యయం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. మూలధన వ్యయం అంటే నేరు­గా ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు.

Software Technology Parks in AP: ఏపీలో 4 సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ కేంద్రాలు

Published date : 09 Aug 2023 05:21PM

Photo Stories