Telangana రాష్ట్ర ఖజానాకు మరో రూ.2,500 కోట్ల రుణాలు
దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను అప్పులచిట్టా రూ.22,500 కోట్లకు చేరింది. గత రెండు త్రైమాసికాల్లో కలిపి రూ.20 వేలకోట్లను రుణాలుగా సమీకరించుకుంది. ఈ నెలలోనే మరో రూ.1,500 కోట్లను అప్పులరూపంలో తీసుకోనుంది. దీంతో ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర ప్రభుత్వ అప్పులచిట్టా రూ.23,500 కోట్లకు చేరనుంది. ఇక, మూడో త్రైమాసికంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.8,500 కోట్లకుపైగా రుణాలు తీసుకోనుందని ఆర్బీఐ కేలండర్ చెబుతోంది. ఈ కేలండర్ ప్రకారం రానున్న రెండు నెలల్లో రూ.4,500 కోట్లకుపైగా రుణాలు తీసుకోనుంది. ఈ నెల 11న రూ.500 కోట్లు, 25న రూ.500 కోట్లు, నవంబర్ 1న రూ.1,500 కోట్లు, 15న రూ.1,000 కోట్లు, 29న రూ.500 కోట్లు, డిసెంబర్ 6న రూ.1,500 కోట్లు, 13న రూ.500 కోట్లను రుణం రూపంలో వేలం ద్వారా సమీకరించుకోనుంది. దీంతో మూడో త్రైమాసికం ముగిసేసరికి దాదాపు రూ.30 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులచిట్టా చేరనుంది. ఇక, మిగిలిన త్రైమాసికంలో మరో ఏడెనిమిది వేల కోట్ల రూపాయల మేర ఆర్బీఐ వేలం ద్వారా రుణాలను సమీకరించుకునే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 4th కరెంట్ అఫైర్స్