Covid-19: టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
దేశ వ్యాప్తంగా 15–18 ఏళ్ల వారికి మొదటి డోసు వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే(2022, జనవరి 5వ తేదీ నాటికి) 52.82 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,89,501 మంది బాలబాలికలకు టీకా వేశారు. రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 76.09 శాతానికి పైగా వ్యాక్సినేషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 24.41 లక్షల మంది టీనేజర్లను గుర్తించారు.
టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్(49.2 శాతం), గుజరాత్(45.29) శాతం ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో 33.44 శాతం, రాజస్తాన్‌లో 22 శాతం నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా జనవరి 3వ తేదీన టీనేజ్ వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 147.72 కోట్ల డోస్‌ల టీకాలను కేంద్రం పంపిణీ చేసింది.
చదవండి: ‘స్మార్ట్’ అధ్యయనానికి ఎంపికైన నగరాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశంలో..
ఎందుకు : 15–18 ఏళ్ల వారిలో 52.82 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సిన్ పంపిణీ చేసినందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్