Andhra Pradesh: సినిమాల రెగ్యులేషన్ చట్టం సవరణ ఉద్దేశం?
సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ సినిమాల రెగ్యులేషన్ చట్టం–1955 సవరణకు రాష్ట్ర మంత్రివర్గం అక్టోబర్ 28న ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం... ఇండియన్ రైల్వే ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ తరహాలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయడానికి పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసి, ఈ సంస్థే నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1094 థియేటర్లు ఉన్నాయి. వాటిలో ఫోన్‌కాల్, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం ప్రేక్షకులకు కల్పించనుంది. థియేటర్ల వద్ద ట్రాఫిక్ అవాంతరాలను తొలగించడానికి, ప్రేక్షకులకు సమయం ఆదా చేయడానికి, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించడానికి ఈ విధానం దోహదపడుతుంది.
చదవండి: వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను ఎక్కడ నిర్మిస్తున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ సినిమాల రెగ్యులేషన్ చట్టం–1955 సవరణకు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్