Medicines in Hospital: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 843 మందులు ఫ్రీ
Sakshi Education
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు బయట ప్రైవేటుగా మందులు కొనాల్సిన అవసరం రాకుండా.. అవసరమైన ఔషధాలన్నింటినీ అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అత్యవసర, సాధారణ మందుల సంఖ్యను పెంచాలని.. కొత్తగా 123 రకాల మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 720 రకాల మందులను ఫ్రీగా ఇస్తుండగా.. ఈ జాబితాను 843కు పెంచింది. ఇందులో అత్యవసర మందుల జాబితా (ఈఎంఎల్)లో 311, ఇతర సాధారణ (అడిషనల్) మందుల జాబితా (ఏఎఎల్)లో 532 మందులు ఉన్నాయి.
Published date : 08 Jul 2022 05:54PM