కరెంట్ అఫైర్స్(సెప్టెంబర్ 12 - 18, 2019)బిట్ బ్యాంక్
1. ఇటీవల వార్తల్లో నిలిచిన అగ్నిఅస్త్ర, బ్రహ్మాస్త్ర, నీమాస్త్ర అనేవి ఏ రంగానికి చెందినవి?
1) రక్షణ రంగం
2) బయోటెక్నాలజీ
3) సున్నా ఆధారిత వ్యవసాయం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
2. ‘క్రయోడ్రాకెన్ బోరియస్’ అంటే ఏమిటి ?
1) రాకెట్
2) కొత్త జాతులు
3) కొత్త రకం విత్తనం
4) కొత్త స్పేస్ క్రాఫ్ట్
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో దేనిని దక్షిణాసియాలోనే మొదటి క్రాస్‌బోర్డర్ పెట్రోలియం పైప్‌లైన్ అని పిలుస్తారు?
1) చబ్బార్ పోర్టు పైప్‌లైన్
2) మోతీహరి–అమ్లేఖ్గంజీ పైప్‌లైన్
3) 1, 2
4) హిమాలయన్ పెట్రోలియం పైప్‌లైన్
- View Answer
- సమాధానం: 2
4. కింది ప్రకటనలను పరిశీలించండి.
1. ఈ ఏడాది సెప్టెంబరు 2–13 వరకు నోయిడాలో యూఎన్సీసీతో జరిగిన 14వ పార్టీల సమావేశం(కాప్–14)లో అధికారికంగా కరువు సాధనాన్ని ప్రకటించారు.
2. ముందస్తు హెచ్చరిక వ్యవస్థను పర్యవేక్షించడం, విపత్తు ప్రమాదాల నిర్వహణ, విపత్తులను అంచనా వేసి తగ్గింపు చర్యలు చేపట్టడం అనే మూడు ప్రధాన అంశాలను పరిగనలోకి తీసుకున్నారు.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1, 2
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
5.‘కె2–18 బి’ అనేది ఒక?
1. నాసా అంతరిక్ష నౌక కెప్లర్ కనుగొన్న ఎక్సోప్లానెట్.
2. చంద్రయాన్–2 పంపిన సమాచారం ఆధారంగా కె2–18బి వాతావరణంలో నీటి ఆవిరిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1, 2
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 1
6. ‘పాంగోంగ్ త్సో’ సరస్సు ఎక్కడ ఉంది?
1) జమ్మూ కశ్మీర్
2) హిమాచల్ ప్రదేశ్
3) లద్దాఖ్
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 3
7. ములగంధ కుటి విహార్‌లో గౌతమబుద్ధుడు ఏం చేశాడు?
1. మొదటి ధర్మ సంభాషణ చేశాడు
2. సారనాథ్‌ను సందర్శించేటప్పుడు అక్కడ నివసించాడు.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1, 2
4) 1 లేదా 2
- View Answer
- సమాధానం: 2
8. ప్రార్థనా సమాజానికి సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏది?
1) ఎమ్.జి. రనడే స్థాపించారు.
2) బ్రహ్మ సమాజానికి చెందిన ఒక శాఖ
3) హిందూ మతంలో ఒక సంస్కరణ ఉద్యమం
4) 1867లో బొంబాయిలో దీనిని స్థాపించారు.
- View Answer
- సమాధానం: 1
9. 2020 నాటికి 150 గ్రీన్ ఇండియన్ రైల్వే స్టేషన్స్‌కు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏది?
1. భారత రైల్వే సంస్థ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది.
2. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 2020 నాటికి 150 గ్రీన్ రైల్వేస్టేషన్లను ధ్రువీకరించాలని నిర్ణయించారు.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
10. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కింది వాటిలో సరైనవి?
1. రాజ్యాంగంలోని నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44 ప్రకారం దేశమంతటా యూసీసీ అమలు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు.
2. 2018లో లా కమిషన్ ఆఫ్ ఇండియా వారు యూసీసీ అవసరమా కాదా అని సంప్రదింపులు జరిపారు.
3. గోవా ఒక్క రాష్ట్రంలోనే యూసీసీని అమలు చేస్తున్నారు.
1) 1, 2, 3
2) 1, 2
3) 2, 3
4) 1, 2
- View Answer
- సమాధానం: 1
11. అధిక ఉష్ణోగ్రతలు కార్మికుల ఉత్పాదకతపై ప్రభావం చూపుతున్నాయని వెల్లడించిన నివేదిక ఏది?
1) ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
2) వరల్డ్ ఎకనామిక్ ఫోరం
3) యూఎన్ఎఫ్సీసీసీ
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
12. ఈ కింది వాటిలో 100కుపైగా దేశాలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ఎగుమతి చేయడం ప్రారంభించిన దేశం ఏది?
1) బంగ్లాదేశ్
2) రష్యా
3) ఫ్రాన్స్
4) భారత్
- View Answer
- సమాధానం: 4
13. సంజయ్ మిత్రా కమిటీని కేంద్ర ప్రభుత్వ దేనికోసం నియమించింది?
1. జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన
2. రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఆస్తుల పంపకం, సమస్యలను తీర్చడం
3. బ్యాంకుల విలీనానికి సలహాలు సూచనలు ఇవ్వడం
1) 1, 2, 3
2) 1, 2
3) 2, 3
4) 1, 3
- View Answer
- సమాధానం: 2
14. ఈ కింది వాటిలో దూరదర్శన్‌కు సంబంధించి సరైనది ఏది?
1. 2019 సెప్టెంబరు 15 నాటికి దూరదర్శన్ ఏర్పడి 60 ఏళ్లు పూర్తవుతుంది.
2. ప్రారంభంలో టెలివిజన్ సెట్లకు సిగ్నల్స్ అందించిన దూరదర్శన్ 1965లో సర్వీస్ ప్రొవైడర్‌గా మారింది.
3. 1976 ఏప్రిల్ 1 నుంచి సమాచార బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో ప్రత్యేక విభాగంగా మారింది.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 3 మాత్రమే
4) 1, 2, 3
- View Answer
- సమాధానం: 4
15. భారత చమురు, గ్యాస్ రంగాలలో ఏ దేశం అతి పెద్ద పెట్టుబడిదారిగా ఉంది?
1) ఇరాన్
2) దక్షిణ కొరియా
3) రష్యా
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
16. కింది వాటిలో సరైనవి?
1. పులిక్కళీ కేరళ రాష్ట్రానికి చెందిన జానపద కళ
2. ఏటా ఓనం పండుగ సమయంలో ఈ కళను ప్రదర్శిస్తారు.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1, 2 మాత్రమే
3) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
17. ది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్)ను ప్రారంభించింది ఎవరు?
1) టెలికం విభాగం
2) సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం
3) మానవ వనరుల మంత్రిత్వ శాఖ
4) హోం మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 1
18. ఇటీవల వార్తల్లో నిలిచిన లునార్ రికనైసెన్స్ ఆర్బిటర్ దేనికి సంబంధించినది?
1) అమెరికాకు చెందిన లునార్ క్రాఫ్ట్
2) ఇండియాకు చెందిన లునార్ క్యాలెండర్
3) శ్రీలంకకు చెందిన లునార్ క్రాఫ్ట్
4) జపాన్‌కు చెందిన లునార్ క్రాఫ్ట్
- View Answer
- సమాధానం: 1
19. ఇంటర్ –క్రెడిటర్ ఒప్పందాల గురించి ఈ కింది ప్రకటనలను పరిశీలించండి.
1. రుణదాతలు–బ్యాంకులు,ఎన్బీఎఫ్సీలు భీమాసంస్థలు పునర్నినిర్మాణ కంపెనీల మధ్య ఒప్పందాలు.
2. ఒత్తిడితో కూడిన రుణాల పరిష్కారానికి అందరూ కలిసి పనిచేయడం.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1, 2
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 4
20. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 74వ సెషన్ గురించి∙ఈ కింది వాటిలో సరైనవి?
1. గడిచిన 73 ఏళ్లలో మరియా ఫెర్నాండా ఎస్పినోజా యూఎన్జీఏకు నాల్గో మహిళా అధ్యక్షురాలు.
2. యూఎన్జీఏ 74వ సెషన్లో కొత్త అధ్యక్షుడిగా నైజీరియాకు చెందిన ప్రొఫెసర్ టిజ్జానీ ముహమ్మద్ బాండే 2019 సెప్టెంబరు 17న ఎన్నికయ్యారు. ఏడాదిపాటు బాండే అధ్యక్షులుగా కొనసాగనున్నారు.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1 , 2
4) ఏదికాదు
- View Answer
- సమాధానం: 3
21. ‘ద వ్యాలీ ఆఫ్ ప్లవర్స్’ జాతీయ పార్కు ఎక్కడ ఉంది?
1) ఆంధ్రప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) తమిళనాడు
4) జమ్మూకశ్మీర్
- View Answer
- సమాధానం: 2
22. ఇటీవల జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫారుక్ అబ్దుల్లాను ఏ కారణంతో అదుపులోకి తీసుకున్నారు.
ఎ. 1978 ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) ఎటువంటి అధికారిక చార్జ్ లేకుండా, విచారణ లేకుండా సంబంధిత వ్యక్తులను నిర్భంధించడానికి అనుమతిస్తుంది.
బి. ఇతర రాష్ట్రాల్లో ఉపయోగించే జాతీయ భద్రతా చట్టాన్ని పోలి ఉంటుంది.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 1
23. ఆసియా సొసైటీ గేమ్ చేంజర్ అవార్డు–2019కి సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏది?
1. 2012 నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తుకు నాయకత్వం వహించిన ఐపీఎస్ అధికారి ఛాయా శర్మ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
2. ఆసియా సొసైటీని భారత ప్రభుతం ఏర్పాటు చేసింది.
3. ఆసియా సొసైటీ ప్రజలు, నాయకులు సంస్థల మధ్య, ఆసియా, అమెరికాల పరస్పర భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.
1) 1, 2 మాత్రమే
2) 2 మాత్రమే
3) 3 మాత్రమే
4) 1 మాత్రమే
- View Answer
- సమాధానం: 1
24. కింది వాటిలో ఎమ్జీఎన్ఆర్ఈజీఏ కు సంబంధించి సరికానిది.
1. ఎమ్జీఎన్ఆర్ఈజీఏ కార్మికుడి ఒకరోజు వేతనం జాతీయ సగటున రూ.178. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన రూ.375 కంటే కూడా ఇది సగం తక్కువ.
2. గణాంకాల మంత్రిత్వ శాఖ మరియు లేబర్ బ్యూరో సీపీఐ–ఆర్, సీపీఐ–ఏఎల్ వినియోగదారుల వేతనాలను నవీక రించలేదు.
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1 , 2
4) ఏదికాదు
- View Answer
- సమాధానం: 1
25. ఈ కిందివాటిలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1839–1924 ఎలైట్ గ్రివెన్సెస్, ఎకనామిక్ అండ్ సబల్ట్రన్ డిస్కంటెంట్ సంక్లిష్టసమ్మేళనం.
1. మొదటి రంపా తిరుగుబాటు 1839 –1848
2. రెండో తిరుగుబాటు 1857–58
3. మూడో తిరుగుబాటు 1861–62
4. నాల్గో తిరుగుబాటు 1879
5. ఐదో తిరుగుబాటు 1880
1) 1, 2 మాత్రమే
2) 2, 3
3) 3, 4
4) 5 మాత్రమే
- View Answer
- సమాధానం: 4
26. హెడ్ ఆన్ జనరేషన్ టెక్నాలజీ (హెచ్ఓజీ) దేనిలో ఉపయోగిస్తారు?
1) స్పేస్ టెక్నాలజీ
2) ఇండియన్ రైల్వే
3) ఫుడ్ ప్రాసెసింగ్
4) లెదర్ టెక్నాలజీ
- View Answer
- సమాధానం: 2
27. ఖండేరీ అంటే ఏమిటి?
1) ఉపరితలం నుంచి ఎయిర్ క్షిపణి
2) ఎయిర్ టు ఎయిర్
3) స్కార్పిన్ సబ్‌మెరైన్
4) ఢిల్లీలోని 7 స్టార్ హోటల్
- View Answer
- సమాధానం: 3
28. భారతప్రభుత్వం ప్రకటించిన 2014 నాటికి అన్ని గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి పైప్‌లైన్ ద్వారా నీటిని అందించే కార్యక్రమం ఏది?
1) గ్రామీణ నీటి పథకం
2) పంచాయితిరాజ్ సంస్థలు
3) రుర్బన్ మిషన్
4) జల్ జీవన్ మిషన్
- View Answer
- సమాధానం: 4
29. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ద డిసేబిలిటీ అడ్ జస్ట్డ్ లైఫ్ ఇయర్ నివేదిక ఇచ్చింది ఎవరు?
1) ద ల్యాన్సంట్ చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ ఆఫ్ ఇండియా
2) నీతి ఆయోగ్
3) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
4) పై వాటిలో ఏది కాదు
- View Answer
- సమాధానం: 1
30. కింది వాటిలో భారతదేశంలో తయారీ కానిది ఏది?
1) ఈ–టాయిస్
2) ఈ–సిగరెట్స్
3) ఈ–పోస్ మెషిన్
4) ఈ–అంబరిల్లా
- View Answer
- సమాధానం: 2
31. కింది వాటిలో పర్వతారోహకుల గురించి సరైనది ఏది?
1. నిర్మల్పుర్జా–నేపాలి పర్వతారోహకులు
2. జెర్జీకుకుజెకా–పోలీష్ పర్వతారోహకులు
1) 1 మాత్రమే
2) 2మాత్రమే
3) 1, 2
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 3
32. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వెయిటింగ్ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు?
1) ఆంధ్రప్రదేశ్
2) బిహార్
3) చత్తీస్ గఢ్
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
33. భారత ఆర్థిక గణాంకాలపై ఏటా సెప్టెంబర్ 15న ఆర్బీఐ వార్షిక హ్యాండ్ బుక్‌ను ప్రచురిస్తుంది. మొదటిసారి సీఎస్ఓ కూడా దీనిలో పాల్గొని ఏ డేటాను వెల్లడించింది.
1. దేశంలోని కుటుంబ రంగంలోని ఫైనాన్షియల్ ఆస్తులు, రుణాల్లో మార్పులు
2. ఎంఎస్ఎంఈల ఫైనాన్షియల్ ఆస్తులు, రుణాల్లో మార్పులు
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1, 2
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 3
34. భైరవకోన రాక్ కట్ టెంపుల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) కర్ణాటక
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 1
35.పోలీసింగ్, ఫోరెన్సిక్ సైన్స్ పురోగతికోసం అంకింతం చేసిన మొదటి జాతీయ పోలీస్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ముంబై
2) హైదరాబాద్
3) గ్రేటర్ నోయిడా
4) డెహ్రాడూన్
- View Answer
- సమాధానం: 3
36. గూగుల్ రీసెర్చ్ ఇండియా ఏఐ ల్యాబ్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1) ఆంధ్రప్రదేశ్–అమరావతి
2) కర్ణాటక–బెంగళూరు
3) తమిళనాడు –చెన్నై
4) తెలంగాణ–హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
37. ఆర్టి్టఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇయర్ 2020ను ప్రకటించిన రాష్ట్రం?
1) కర్ణాటక
2) పశ్చిమ బెంగాల్
3) రాజస్థాన్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
38. గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల సిలబస్‌లో ట్రిపుల్ తలాక్ లా ను పాఠ్యాంశంగా చేర్చిన భారతీయ యూనివర్సిటీ ఏది?
1) మహాత్మాగాంధీ యూనివర్సిటీ
2) జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ
3) అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ
4) మహాత్మా జ్యోతిబా పూలే రోహిల్ ఖండ్ యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: 4
39. నాగాలాండ్ స్థానిక నివాసుల రిజిస్టర్ ప్రధాన లక్ష్యం ఏమిటి?
1) నాగాలాండ్ ప్రజలందరిని నమోదు చేయడం
2) అనర్హులైన వారికి స్వదేశీ నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా నిరోధించడం
3) నాగాలాండ్ ప్రజలు ఏవైనా ఈశాన్యరాష్ట్రాలు ప్రయాణించేందుకు షెన్జెన్ అనుమతినివ్వడం.
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
40. హిమన్ష్ అనేది ఒక?
1) న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్
2) హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ స్టేషన్
3) వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2