కరెంట్ అఫైర్స్(నవంబరు17-23, 2020)
జాతీయం
1. పీఎం-కుసుమ్ (PM-KUSUM)నుప్రారంభించిన మంత్రిత్వశాఖ?
1) వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
2) నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
3) మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 2
2. ైజెనాచార్య శ్రీ విజయ్ వల్లభ సురిష్వర్ జీ మహారాజ్ 151వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ’శాంతి విగ్రహం’(Statue of Peace)ను ఎక్కడ ఆవిష్కరించారు?
1) వారణాసి, ఉత్తర ప్రదేశ్
2) పట్నా, బిహార్
3) పాలి, రాజస్థాన్
4) కెవాడియా, గుజరాత్
- View Answer
- సమాధానం: 3
3. ఆసియాలో తొలి సౌర విద్యుత్తుతో నడిచే వస్త్ర మిల్లు- జై భవానీ మహిళల సహకార వస్త్ర మిల్లు, ఎక్కడ ఏర్పాటు అవుతుంది?
1) బెంగళూరు, కర్ణాటక
2) కాన్పూర్, ఉత్తర ప్రదేశ్
3) సూరత్, గుజరాత్
4) పర్భాని, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
4. యువతలో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఐబిఎం ఇండియా(IBM, India), సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (SPI), ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ITDC), ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ & టివి అకాడమీ (LVPA ) లతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది?
1) కర్ణాటక
2) మహారాష్ట్ర
3) కేరళ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
5.మత్స్యకారులకు మద్దతు, సహాయం కోసం ఏ రాష్ట్ర తీర భద్రతా పోలీసులు ‘‘కడలు యాప్’’ను ప్రారంభించారు?
1) మహారాష్ట్ర
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
6. రిజి్ట్రార్ జనరల్ & సెన్సస్ కమిషనర్ కార్యాలయంవార్షిక నివేదిక ప్రకారం జనన ఉత్తమ లింగ నిష్పత్తిని నమోదు చేసిన రాష్ట్రం?
1) మణిపూర్
2) అసోం
3) అరుణాచల్ ప్రదేశ్
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 3
7. భారత్లోఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ (FSSM) సేవలకు ISO 9001: 2015 సర్టిఫికేషన్ పొందిన తొలి నగరం?
1) ముంబై, మహారాష్ట్ర
2) భువనేశ్వర్, ఒడిశా
3) హైదరాబాద్, తెలంగాణ
4) భోపాల్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
8. మహిళల అవసరాలకు లింగ-నిర్దేశిత స్థలాలతో పట్టణ ప్రణాళికను కలిగి ఉన్న మొదటి భారతీయ నగరం?
1) ముంబై, మహారాష్ట్ర
2) జైపూర్, రాజస్థాన్
3) హైదరాబాద్, తెలంగాణ
4) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
9. వరల్డ్ టాయ్‌లెట్ డే- (2020 నవంబర్ 19) సందర్భంగా సఫాయ్ మిత్రా సురాక్ష ఛాలెంజ్‌ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
1) జల్ శక్తి మంత్రిత్వ శాఖ
2) పర్యావరణ, అటవి, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ
3) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4 గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
10. ఏ పండుగ కోసంతపాలా విభాగం తన కొత్త కాన్సెప్ట్ ’మై స్టాంప్’ కింద ప్రత్యేక కవర్, స్టాంప్‌ను ఆవిష్కరించింది?
1) దీపావళి
2) భాయ్ దూజ్
3) ఛత్ పూజ
4) క్రిస్మస్
- View Answer
- సమాధానం: 3
11. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ ఆధ్వర్యంలో స్వావలంబన కోసం రోడ్‌మ్యాప్ విడుదల చేసిన మొదటి రాష్ట్రం?
1) మహారాష్ట్ర
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
12. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల నుండి దేశంలోని ఏ ప్రదేశానికి అయినా 41 నోటిఫైడ్ పండ్లు, కూరగాయలకు 50% వాయు రవాణా రాయితీని ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏ పధకం కింద ప్రకటించింది?
1) మెగా ఫుడ్ పార్కులు
2) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆగ్రో- ప్రాసెసింగ్ క్లస్టర్స్
3) ఆపరేషన్ గ్రీన్ టాప్ టు టోటల్
4) క్రియేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజస్
- View Answer
- సమాధానం: 3
అంతర్జాతీయం
13. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అత్యవసర వినియోగ జాబితా (EUL)లో చేర్చిన తొలి పోలియో వ్యాక్సిన్ nOPV2 (నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2) ఏ దేశానికి చెందింది?
1) రష్యా
2) చైనా
3) భారత్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 4
14. వియత్నాం ఆతిథ్యమిచ్చిన37 వ ఆసియాన్ వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందం ‘‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం -RCEP ’’ పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి?
1) 10
2) 12
3) 13
4) 15
- View Answer
- సమాధానం: 4
15. రష్యా నిర్వహించిన 8 వ బ్రిక్స్(BRICS)సైన్స, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (STI)) మంత్రివర్గ సమావేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినది?
1) ఎస్ జైశంకర్
2) ప్రకాశ్ జవ్దేకర్
3) హర్ష్ వర్ధన్
4) ధర్మేంద్ర ప్రధాన్
- View Answer
- సమాధానం: 3
16. DF-26B ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (IRBM),DF-21D యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించిన దేశం?
1) తైవాన్
2) చైనా
3) దక్షిణ కొరియా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
17. భారతీయ కస్టమ్స్, ఇంటర్‌పోల్, ప్రపంచ కస్టమ్స్ సంస్థలు సంయుక్తంగా, UAE గమ్యంగా అక్రమంగా తరలిస్తున్న 18 టన్నుల ఎర్ర గంధపు చెక్కనుఅడ్డుకున్న ఆపరేషన్ పేరు?
1) ఆపరేషన్ శాండల్
2) ఆపరేషన్ రెడ్
3) ఆపరేషన్ ఎర్త్
4) ఆపరేషన్ థండర్
- View Answer
- సమాధానం: 4
18. దక్షిణ చైనా సముద్రం,పసిఫిక్ ద్వీప దేశాలపై పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఏ రెండు దేశాలు ‘‘పరస్పర ప్రాప్యత ఒప్పందం’’(“Reciprocal Access Agreement) - రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి?
1) భారత్- ఆస్ట్రేలియా
2) భారత్ - జపాన్
3) జపాన్ - ఆస్ట్రేలియా
4) జపాన్ - దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 3
19. ఏ రెండు ఆఫ్రికన్ దేశాలు తమ తొలిఉమ్మడి సైనిక కసరత్తులు ప్రారంభించాయి?
1) సుడాన్ - ఛడ్
2) నైగర్ - అల్జీరియా
3) లిబియా - ఛడ్
4) ఈజిప్టు - సుడాన్
- View Answer
- సమాధానం: 4
20. నవంబర్ 17, 2020 న జరిగిన 12వ బ్రిక్స్ సమ్మిట్‌ను నిర్వహించినది?
1) బ్రెజిల్
2) రష్యా
3) భారత్
4) చైనా
- View Answer
- సమాధానం: 2
21. G 20 గ్లోబల్ స్మార్ట్ సిటీస్ అలయన్స అభివృద్ధి చేసిన స్మార్ట్ సిటీల కోసం కొత్త గ్లోబల్ పాలసీ రోడ్‌మ్యాప్‌ను ప్రారంభించేందుకు ప్రపంచ ఆర్థిక ఫోరం ఎంపిక చేసిన 36 నగరాల జాబితాలో ఎన్ని భారతీయ నగరాలను చేర్చారు?
1) నాలుగు
2) ఐదు
3) మూడు
4) ఏడు
- View Answer
- సమాధానం: 1
22. COVID- -19 వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటానికి వ్యాక్సిన్ కాన్ఫిడెన్స ప్రాజెక్ట్ సహకారంతో ఐక్యరాజ్యసమితి ఏ కార్యక్రమాన్ని చేపట్టింది?
1) టీం హలో
2) కోవిడ్ వారియర్స్
3) టీం హాలో
4) టీం ఎల్లో
- View Answer
- సమాధానం: 3
23. గోవా నావల్ ఎయిర్‌బేస్‌లోని ఐఎన్ఎస్ హన్సా వద్ద భారత నావికాదళానికి 9 వ పోసిడాన్ 8 ఐ (Poseidon 8I)సముద్ర నిఘా విమానాలను ఏ దేశం అందించింది?
1) ఫ్రాన్స
2) రష్యా
3) జపాన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
24. 194 దేశాలపై అవినీతి నిరోధక ప్రామాణిక అమరిక సంస్థ TRACE విడుదల చేసిన ‘‘“The 2020 TRACE Bribery Risk Matrix” ’’ లో భారత్ ర్యాంక్?
1) 84
2) 98
3) 105
4) 77
- View Answer
- సమాధానం: 4
25. Ship-Launched Raytheon SM-3 Block IIA తో మాక్ ICBMను తొలిసారిగా నాశనం చేసినదేశం ?
1) అమెరికా
2) రష్యా
3) జపాన్
4) భారత్
- View Answer
- సమాధానం: 1
ఆర్థికం
26. 2019-20 సంవత్సరానికి మర్కండైజ్ ఎక్స్‌పోర్‌ట్స ఫ్రమ్ ఇండియా స్కీమ్ (MEIS) ప్రయోజనాల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించిన మొత్తం?
1) రూ.10,555 కోట్లు
2) రూ. 39,097 కోట్లు
3) రూ. 25,454 కోట్లు
4) రూ. 5,970 కోట్లు
- View Answer
- సమాధానం: 2
27. సైబర్ మోసాల నుండి వ్యక్తులను రక్షించడానికి ’మూబంద్ రఖో’ ప్రచారాన్ని ప్రారంభించిన బ్యాంక్?
1) ICICI బ్యాంక్
2) IDFC బ్యాంక్
3) Yes బ్యాంక్
4) HDFC బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
28. ఆస్తి నిర్వహణపై సలహా సేవలను అందించడానికి ప్రభుత్వ పెట్టుబడుల కార్యక్రమాన్ని నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఆసియా అభివృద్ధి బ్యాంకు
2) ప్రపంచ బ్యాంకు
3) ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
4) అంతర్జాతీయ ద్రవ్య నిధి
- View Answer
- సమాధానం: 2
29. RBI రెగ్యులేటరీ శాండ్బాక్స్ తొలిదశపరీక్షలో ఎన్ని సంస్థలు తమ ఉత్పత్తులను పరీక్షించడం ప్రారంభించాయి?
1) రెండు
2) మూడు
3) నాలుగు
4) ఐదు
- View Answer
- సమాధానం: 1
30. CASA (కరెంట్ అకౌంట్, సేవింగ్స అకౌంట్) మొబిలైజేషన్ క్యాంపైన్‌ను ప్రారంభించిన బ్యాంక్?
1) సిండికేట్ బ్యాంక్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) కర్ణాటక బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
31. గోల్డ్‌మన్ సాచ్స్ తాజా సవరణకు అనుగుణంగా 2021 ఆర్థిక సంవత్సరానికి భారత్ అంచనా వృద్ధి?
1) -10.3%
2) -14.8%
3) -13%
4) -15.7%
- View Answer
- సమాధానం: 1
32. ఇంటిగ్రేటెడ్ క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయిన హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) ను అమలు చేయడానికి ఇండియన్ రైల్వే(IR) ఏ కంపెనీని నియమించింది?
1) రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెంటర్
2) రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
3) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
4) ఇన్ఫోసిస్
- View Answer
- సమాధానం: 2
33. భారతదేశపు మొదటి100 మెగావాట్ల కన్వర్జెన్స ప్రాజెక్ట్ అమలుపై చర్చించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) మధ్యప్రదేశ్
4) గోవా
- View Answer
- సమాధానం: 4
34. 15 వ ఆర్థిక కమిషన్ చైర్మన్ NK సింగ్ సూచించినట్లు 2024 నాటికి ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని 0.95% నుండి జిడిపిలో ఎంత శాతానికి పెంచాలి?
1) 3.2%
2) 1.4%
3) 4.1%
4) 2.5%
- View Answer
- సమాధానం: 4
35. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో అత్యధిక స్థాయి 4+ ట్రాన్సిషన్ కార్బన్ అక్రిడిటేషన్ పొందిన తొలి విమానాశ్రయంగా నిలిచిన అంతర్జాతీయ విమానాశ్రయం ఏది?
1) చాంగి విమానాశ్రయం, సింగపూర్
2) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ
3) హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
4) వెల్లింగ్టన్ విమానాశ్రయం, న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 2
36. HIV నివారణ 2020 కోసం గ్లోబల్ ప్రివెన్షన్ కూటమి (GPC) మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన సంస్థ / సంస్థలు ఏవి?
1) HIV/AIDS పై ఐక్యరాజ్యసమితి కార్యక్రమం
2) ప్రపంచ ఆరోగ్య సంస్థ
3) ఐక్యరాజ్యసమితి జనాభా నిధి
4) 1 & 3
- View Answer
- సమాధానం: 4
37. జాతీయ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ నుండి భారతదేశపు తొలిహై-స్పీడ్ రైల్ కారిడార్ లేదా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్-’ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్’ నిర్మాణ కాంట్రాక్టును ఏ కంపెనీ దక్కించుకుంది?
1) బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్
2) L&T (లార్సెన్ & టుబ్రో)
3) రాయల్ ట్రాక్
4) ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 2
38. మెర్కామ్ కమ్యూనికేషన్స ఇండియా నివేదిక ప్రకారం 2019 లో ఇదే కాలంతో పోల్చితే Q2FY21 లో భారత సౌర సామర్థ్యం ఏ శాతానికి తగ్గింది?
1) 65%
2) 70%
3) 75%
4) 80%
- View Answer
- సమాధానం: 4
39. ది మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 2020-మార్చి 2021) భారతదేశ GDP అంచనా?
1) -9.6%
2) -10.6%
3) -11.6%
4) -8.9%
- View Answer
- సమాధానం: 2
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
40. 2020 నవంబర్‌లో ’రామ్సర్ సైట్’లో చేర్చిన లోనార్ లేక్, సుర్ సరోవర్(కీతం లేక్) అనే రెండు సరస్సులు ఎక్కడ ఉన్నాయి?
1) ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్
2) కర్ణాటక, తమిళనాడు
3) తమిళనాడు, కేరళ
4) మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
41. ఒడిశాలోని చాందీపూర్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో DRDO ఇటీవల పరీక్షించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థ పరిధి?
1) 5- 10 కి.మీ
2) 15- 20 కి.మీ
3) 25- 30 కి.మీ
4) 35- 40 కి.మీ
- View Answer
- సమాధానం: 3
42. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స పరిశోధకులు భారత్‌లోని పశ్చిమ కనుమలు, ద్వీపకల్ప దిగువ, పొడి ప్రాంతాలు నుండి ఎన్ని కొత్త జాతి వైన్ పాములను కనుగొన్నారు?
1) 2
2) 4
3) 5
4) 3
- View Answer
- సమాధానం: 3
43. SpaceX నాసా కోసం మొట్టమొదటి పూర్తి స్థాయి టాక్సీ విమానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS )ఎంత మంది వ్యోమగాములను పంపింది?
1) 5
2) 4
3) 3
4) 7
- View Answer
- సమాధానం: 2
44. నవంబర్ 2020, నాటికి భారత్‌లో (దక్షిణ ఆసియాలో అత్యధికం) ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి?
1) 35
2) 31
3) 41
4) 50
- View Answer
- సమాధానం: 3
45. 2021 లో COP 26 (ఐక్యరాజ్యసమితి (UN) వాతావరణ సమావేశం)ఎక్కడ జరగనుంది?
1) రోమ్, ఇటలీ
2) గ్లాస్గో, యునెటైడ్ కింగ్డమ్
3) మాడ్రిడ్, స్పెయిన్
4) శాంటియాగో, చిలీ
- View Answer
- సమాధానం: 2
46. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, చాందీపూర్, ఒడిశా నుండి విజయవంతంగా పరీక్షించిన ఎయిర్ క్షిపణి వ్యవస్థకు క్విక్ రియాక్షన్ సర్ఫేస్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ
2) భారత్ ఎలక్టాన్రిక్స్ లిమిటెడ్
3) భారత్ డైనమిక్స్ లిమిటెడ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:4
47. గగన్‌యాన్ మిషన్ కోసం భారత తొలి లాంచ్ హార్డ్‌వేర్ (బూస్టర్ సెగ్మెంట్ ’ఎస్ -200’) ను ఇస్రోకు ఏ కంపెనీ పంపిణీ చేసింది?
1) భారత్ డైనమిక్స్ లిమిటెడ్
2) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
3) లార్సెన్ & టుబ్రో (L&T)
4) అఫ్కాన్స ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
48. అంతర్జాతీయ సంబంధాలలో సహకార పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
2) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
3) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్
4) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్
- View Answer
- సమాధానం: 2
49. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారంప్రపంచంలోనే అతిపెద్ద చమురు దీపాల ప్రదర్శన అయిన అయోధ్య దీపోత్సవ్ 2020 లో ఎన్ని దీపాలు (సుమారు) వెలిగించారు, ?
1) 6 లక్షలు
2) 20 లక్షలు
3) 15 లక్షలు
4) 5 లక్షలు
- View Answer
- సమాధానం: 1
నియామకాలు
50.రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ తొలిఛైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ ప్రసాద్ కనుంగో
2) పవన్ కుమార్ జైన్
3) రమేష్ దేబబ్రత పాత్రా
4) సేనాపతి గోపాలకృష్ణన్
- View Answer
- సమాధానం: 4
51. మైయా సాండు ఏ తూర్పు యూరోపియన్ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు?
1) చెక్ రిపబ్లిక్
2) మోల్డోవా
3) బల్గేరియా
4) స్లోవేకియా
- View Answer
- సమాధానం: 2
52. కేంద్ర ఎన్నికల సంఘం(ECI) సోను సూద్‌ను ఏ రాష్ట్రానికి రాష్ట్ర చిహ్నం (State Icon) గా పేర్కొంది?
1) మహారాష్ట్ర
2) ఢిల్లీ
3) పంజాబ్
4) హరియాణ
- View Answer
- సమాధానం: 3
53. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (IPU)) ఎక్స్టర్నల్ ఆడిటర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) రాజీవ్ మెహ్రీషి
2) గిరీష్ చంద్ర ముర్ము
3) మనోజ్ సిన్హా
4) ఓం బిర్లా
- View Answer
- సమాధానం: 2
54. టర్కీలోని ఇంటర్సిటీ ఇస్తాంబుల్ పార్క్‌లో జరిగిన ఫార్ములా 1 DHL టర్కిష్ గ్రాండ్ పీ2020, విజేత?
1) లూయిస్ హామిల్టన్
2) మైఖేల్ షూమేకర్
3) వాల్టెరి బాటాస్
4) చార్లెస్ లెక్లర్క్
- View Answer
- సమాధానం: 1
55. ఐక్యరాజ్యసమితి స్పోర్ట్స్ ్రఫర్ క్లైమేట్ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ కోసం అంగీకారం తెలిపిన తొలి ప్రీమియర్ లీగ్ క్లబ్‌గా నిలిచిన ఫుట్‌బాల్ క్లబ్?
1) ఆర్సెనల్
2) బార్సిలోనా
3) రియల్ మాడ్రిడ్
4) లివర్‌పూల్
- View Answer
- సమాధానం: 1
56. టీమ్ ఇండియా కొత్త కిట్ స్పాన్సర్,వాణిజ్య భాగస్వామిగా ఉండేందుకు బీసీసీఐ (BCCI) తో భాగస్వామ్యం కలిగినస్పోర్ట్స కంపెనీ?
1) పేటీఎమ్ ఫస్ట్‌గేమ్
2) డ్రీం 11
3) ఎంపిఎల్ స్పోర్ట్స
4) మైప్లేయింగ్ 11
- View Answer
- సమాధానం: 3
57. యువజన వ్యవహారాలు,క్రీడా మంత్రిత్వ శాఖద్వారా 2020-21 నుండి వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఎన్ని ప్రైవేట్ స్పోర్ట్స అకాడమీలకు ఖెలో ఇండియా పథకం నిధులు లభిస్తాయి?
1) 200
2) 100
3) 250
4) 500
- View Answer
- సమాధానం: 4
58. ఫిఫా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు తొలిసారిగా భారత్ ఏ సంవత్సరంలో ఆతిథ్యం ఇవ్వనుంది?
1) 2021
2) 2024
3) 2023
4) 2022
- View Answer
- సమాధానం: 4
59. ఆరుఇయర్ ఎండ్ నంబర్ వన్ ట్రోఫీలను గెలుచుకుని పీట్ సంప్రాస్ రికార్డును సమం చేసిన టెన్నిస్ ప్లేయర్?
1) డొమినిక్ థీమ్
2) రాఫెల్ నాదల్
3) నోవాక్ జొకోవిక్
4) రోజర్ ఫెదరర్
- View Answer
- సమాధానం: 3
ముఖ్యమైన తేదీలు
60. ప్రతి విద్యార్థికి విద్య అందుబాటులో ఉందని నిర్ధారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఏ రోజును అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా పాటిస్తారు?
1) నవంబర్ 17
2) అక్టోబర్ 5
3) నవంబర్ 15
4) నవంబర్ 16
- View Answer
- సమాధానం: 1
61. భారత్లోప్రకృతివైద్య దినోత్సవం(నేచురోపతీ డే) ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 18
2) నవంబర్ 15
3) నవంబర్ 16
4) నవంబర్ 17
- View Answer
- సమాధానం: 1
62. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 19 న జరుపుకునే యునెటైడ్ నేషన్స వరల్డ్ టాయిలెట్ డే- ఈ యేడాది థీమ్?
1) ప్రకృతి పిలిచినప్పుడు(When Nature Calls)
2) మురుగునీరు
3) సుస్థిర పారిశుధ్యం, వాతావరణ మార్పు
4) మరుగుదొడ్లు & ఉద్యోగాలు
- View Answer
- సమాధానం: 3
63.ప్రపంచవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపక దినోత్సవం (WED) ఎప్పుడు పాటిస్తారు?
1) నవంబర్ 15
2) నవంబర్ 16
3) నవంబర్ 17
4) నవంబర్ 19
- View Answer
- సమాధానం: 4
64.ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 19 న జరుపుకునే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం,ఈ యేడాదిథీమ్?
1) పురుషులు, అబ్బాయిలకు తేడా
2) పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్
3) పురుషులు,అబ్బాయిలు వారి వైవిధ్యాల్ని ఆస్వాదించడం
4) పురుషులు, అబ్బాయిలకు మెరుగైన ఆరోగ్యం
- View Answer
- సమాధానం: 4
65. ఐక్యరాజ్యసమితి ప్రపంచ బాలల దినోత్సవం ఎప్పుడు?
1) నవంబర్ 14
2) సెప్టెంబర్ 15
3) అక్టోబర్ 5
4) నవంబర్ 20
- View Answer
- సమాధానం: 4
66.నవజాత శిశువులకు, ప్రతిచోటా,ప్రతి ఆరోగ్య సదుపాయంలో నాణ్యత, సమానత్వం, గౌరవం‘ అనే ఇతివృత్తంతో భారత్‌లో ఏటా జాతీయ నవజాత శిశువుల వారోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
1) నవంబర్ 15 నుండి నవంబర్ 21 వరకు
2) నవంబర్ 1 నుండి నవంబర్ 7 వరకు
3) నవంబర్ 8 నుండి నవంబర్ 14 వరకు
4) నవంబర్ 22 నుండి నవంబర్ 28 వరకు
- View Answer
- సమాధానం: 1
67.ఐక్యరాజ్యసమితి ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 19
2) నవంబర్ 20
3) నవంబర్ 21
4) నవంబర్ 22
- View Answer
- సమాధానం: 3
68. ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 19
2) నవంబర్ 20
3) నవంబర్ 21
4) నవంబర్ 22
- View Answer
- సమాధానం: 3
69. నేషనల్ క్యాడెట్ కార్ప్స్రైజింగ్ డే ను ఎప్పుడు పాటించారు?
1) నవంబర్ 19
2) నవంబర్ 20
3) నవంబర్ 21
4) నవంబర్ 22
- View Answer
- సమాధానం: 4
అవార్డులు, పురస్కారాలు
70.అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి 2020ని ఎవరు గెలుచుకున్నారు?
1) గ్రేటా థన్‌బర్గ్
2) సదాత్ రహ్మాన్
3) ఆవా ముర్టో
4) ఖుసి చిందాలియా
- View Answer
- సమాధానం: 2
71. ‘‘ప్రొఫెసర్ఎన్ భదూరి మెమోరియల్ లెక్చర్ అవార్డు 2020 ’’ఎవరికి లభించింది?
1) ధర్మేంద్ర మిశ్రా
2) శ్యామ్ ప్రసాద్ గుప్తా
3) డాక్టర్. సుశాంత కర్
4) మనీషా గుప్తా
- View Answer
- సమాధానం: 3
72. ‘‘రిపోర్టింగ్ ఇండియా: మై సెవెన్టీ ఇయర్ జర్నీ యాజ్ ఎ జర్నలిస్ట్’’ పుస్తక రచయిత?
1) జయశ్రీ కలతిల్
2) ప్రేమ్ ప్రకాశ్
3) రజత్ శర్మ
4) చిన్మయ్ తుంబే
- View Answer
- సమాధానం: 2
73. తన తొలి నవల ‘‘షగ్గీ బైన్’’కు బుకర్ ప్రైజ్ 2020 అందుకున్నది?
1) జేమ్స్ కెల్మాన్
2) మరీకే లూకాస్ రిజ్నెవెల్డ్
3) మార్గరెట్ ఆట్ఉడ్
4) డగ్లస్ స్టూవర్ట్
- View Answer
- సమాధానం: 4
74. 2020 AESC (అసోసియేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ అండ్ లీడర్షిప్ కన్సల్టెంట్స్) జీవిత సాఫల్య పురస్కారాన్ని గెలుచుకున్న తొలి ఆసియా వాసి?
1) డాక్టర్. నంద్ కిషోర్ తివారీ
2) డాక్టర్. శ్యామ్ కిషోర్ గుప్తా
3) డాక్టర్. బిష్ అగర్వాల్
4) డాక్టర్. జోనో ప్రెట్స్ రొమేరో
- View Answer
- సమాధానం: 3
75. ’ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన రచయిత’ గా గుర్తింపుతోపాటు ’గ్రాండ్ మాస్టర్ ఆఫ్ రైటింగ్’ బిరుదు అందుకున్నది?
1) సదాత్ రహ్మాన్
2) అభిజితా గుప్తా
3) రాఖీ
4) ఆర్తి కిరణ్
- View Answer
- సమాధానం: 2
76. బ్లూమ్స్బరీ ఇండియా ప్రచురితమై నవంబర్ 2020లో విడుదలైన ‘‘బలూచిస్తాన్: బ్రూయిస్డ్, బ్యాటర్డ్ అండ్ బ్లడీడ్’’ పుస్తక రచయిత?
1) రోషాన్ ఖట్టక్
2) ఫ్రాన్సిస్కా మారినో
3) హుస్సేన్ హక్కానీ
4) సర్బ్ప్రీత్ సింగ్
- View Answer
- సమాధానం: 2