కరెంట్ అఫైర్స్(జనవరి - 3rd వీక్) బిట్ బ్యాంక్
1. ‘గ్లోబల్ సోషల్ మొబిలిటీ సూచీ 2020: సమానత్వం, అవకాశాలు, కొత్త ఆర్థిక అత్యవసరం’ అనే నివేదిక 1వ ఎడిషన్‌ను ఏ సంస్థ విడుదల చేసింది?
1) ప్రపంచ బ్యాంక్
2) ఐఎంఎఫ్
3) ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్
4) వరల్డ్ ఎకనామిక్ ఫోరం
- View Answer
- సమాధానం: 4
2. కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎం.డి.), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఎవరు నియమితులయ్యారు?
1) బిమల్ ప్రసాద్ శర్మ
2) లింగం వెంకట్ ప్రభాకర్
3) వెంకటాచలం రామకృష్ణ అయ్యర్
4) ఎస్.రఘునాథ్
- View Answer
- సమాధానం: 2
3. జెడ్–మోర్ సొరంగం నిర్మాణానికి ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం రూ.2379కోట్లు కేటాయించింది?
1) లడఖ్
2) జమ్మూ–కశ్మీర్
3) ఉత్తరప్రదేశ్
4) అస్సాం
- View Answer
- సమాధానం: 2
4. 2025నాటికి 5 యూనిట్ల ఎస్–400 వైమానిక రక్షణ వ్యవస్థలను భారత్‌కు ఏ దేశం సరఫరా చేయనుంది?
1) రష్యా
2) జపాన్
3) యునైటెడ్ స్టేట్స్
4) చైనా
- View Answer
- సమాధానం: 1
5. న్యూఢిల్లీలోని పాఠశాల విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించిన కార్యక్రమం పేరు ఏమిటి?
1) పరీక్షా పే చర్చా
2) స్కిల్ ఇండియా మిషన్
3) బేటీ బచావో బేటీ పడావో
4) స్టాండప్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
6. ఆస్ట్రేలియా అతున్నత పౌర గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా హానర్’ పొందినవారు?
1) మల్లికా శ్రీనివాసన్
2) కిరణ్ మజుందార్–షా
3) శోభన భారతియా
4) సావిత్రి జిందాల్
- View Answer
- సమాధానం: 2
7. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం ‘గ్లోబల్ సోషల్ మొబిలిటీ సూచీ 2020: సమానత్వం, అవకాశాలు, కొత్త ఆర్థిక అత్యవసరంలో భారత్ ర్యాంక్?
1) 70
2) 74
3) 76
4) 78
- View Answer
- సమాధానం: 3
8. ఉల్క లోపల చిక్కుకున్న (5 నుంచి 7 బిలియన్ సంవత్సరాల క్రితం) భూమిపై ఇప్పటివరకు లభించిన పురాతన ఘనపదార్థమైన స్టార్‌డస్ట్‌ను శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు?
1) రష్యా
2) ఫ్రాన్స్
3) ఆస్ట్రేలియా
4) ఇజ్రాయల్
- View Answer
- సమాధానం: 3
9. ఐఐఎం–అహ్మదాబాద్ నిర్వహించిన క్రిషి మంథన్, ఆహారం, అగ్రి–బిజినెస్, రూరల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఆఫ్ ఆసియా మొదటి ఎడిషన్‌కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది?
1) కొలకత్తా, పశ్చిమ బెంగాల్
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) ముంబై, మహారాష్ట్ర
4) అహ్మదాబాద్, గుజరాత్
- View Answer
- సమాధానం: 4
10. 585 స్టేషన్లలో ‘డోర్‌స్టెప్ బ్యాంకింగ్’ కోసం భారత రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్‌తో ఏ బ్యాంక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) ఇండియన్ బ్యాంక్
3) కెనరా బ్యాంక్
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
11. ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020’ నివేదిక ప్రకారం 2019–20 సంవత్సరానికి భారత జి.డి.పి. ఎంత?
1) 5.9%
2) 5.7%
3) 5.3%
4) 5.1%
- View Answer
- సమాధానం: 2
12. రష్యా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) వ్లాదిమిర్ బులావిన్
2) దిమిత్రి కొజాక్
3) మిఖాయిల్ వ్లాదిమిరోవిచ్ మిషుస్టిన్
4) అంటోన్ సిలునోవ్
- View Answer
- సమాధానం: 3
13. ఇంగ్లండ్, వేల్స్ కోర్టులకు క్వీన్స్ న్యాయవాదిగా ఎవరిని నియమించారు?
1) అనుపమ్ లాల్ దాస్
2) అపరాజిత సింగ్
3) గోపాల్ శంకర్నారాయణన్
4) హరీశ్ సాల్వే
- View Answer
- సమాధానం: 4
14. మూడేళ్ల కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రజనీష్ కుమార్
2) చల్లా శ్రీనావాసులు శెట్టి
3) దినేశ్ కుమార్ ఖారా
4) పి.కె. గుప్తా
- View Answer
- సమాధానం: 2
15. ఇటీవల ‘జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (ఎస్ఎల్బిఎం) కె–4’ను భారతదేశం ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది?
1) ముంబై, మహారాష్ట్ర
2) బెంగళూరు, కర్ణాటక
3) కొచ్చి, కేరళ
4) విశాఖపట్నం, ఆం్రధప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
16. ‘జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (ఎస్ఎల్బిఎం) కె–4’ స్ట్రైక్ రేంజ్ ఎంత?
1) 4,500 కి.మీ.
2) 4,000 కి.మీ.
3) 3,500 కి.మీ.
4) 2,000 కి.మీ.
- View Answer
- సమాధానం: 3
17. ఇంధనాల పరిరక్షణ గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఏ ప్రచారాన్ని ప్రారంభించారు?
1) శ్రమ్ యోగి
2) సమ్మాన్
3) సాక్షమ్
4) సంసాద్ ఆదర్శ్
- View Answer
- సమాధానం: 3
18. పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో జాక్వెలిన్ విలియమ్స్ మొదటి మహిళా మూడో అంపైర్‌గా చేసింది. ఈమె ఏ దేశానికి చెందింది?
1) ఇంగ్లండ్
2) జమైకా
3) ఆస్ట్రేలియా
4) వెస్టీండీస్
- View Answer
- సమాధానం: 2
19. ఈ దశాబ్దంలో ‘2020 ప్రపంచ సవాళ్లు’లో 13 ఆరోగ్య సవాళ్లను ఏ సంస్థ విడుదల చేసింది?
1) ప్రపంచ ఆరోగ్య సంస్థ
2) ఐక్యరాజ్యసమితి
3) ప్రపంచ వాణిజ్య సంస్థ
4) వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు
- View Answer
- సమాధానం: 1
20. సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఎస్సీఐ–ఎఫ్ఎఫ్ఐ 2020, 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) చెన్నై, తమిళనాడు
2) కొలకత్తా, పశ్చిమ బెంగాల్
3) పనాజీ, గోవా
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
21. చెల్లింపులు వేగంగా, సురక్షితంగా చేయడానికి డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ టెక్నాలజీ (డీఎల్టీ) ఆధారిత ‘వజ్రా ప్లాట్‌ఫాం’ను ప్రారంభించిన సంస్థ ఏది?
1) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్
2) డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
3) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
22. భారత తపాలా శాఖ చుని గోస్వామి స్మారక స్టాంప్‌ను విడుదలచేసింది. ఈయన ఏ క్రీడకు సంబంధించినవారు?
1) ఫుట్‌బాల్
2) క్రికెట్
3) హాకీ
4) చెస్
- View Answer
- సమాధానం: 1
23. తన చిన్న కథల సేకరణ– ‘చెక్‌బుక్’కు సరస్వతి సమ్మన్ 2019 పొందిన రచయిత?
1) సల్మాన్ రష్దీ
2) చేతన్ భగత్
3) వాస్దేవ్ మోహి
4) అనితా దేశాయ్
- View Answer
- సమాధానం: 3
24. 23 ఏళ్ల బ్రూ–రియాంగ్ శరణార్థుల సంక్షోభానికి స్వస్తి పలకాలని బ్రూ శరణార్ధుల శాశ్వత పరిష్కారం కోసం కేంద్రప్రభుత్వం, రెండు రాష్ట్రాలు, బ్రూ తెగ ప్రతినిధులు మధ్య చతుర్భుజి (క్వాడ్రిపారై్టట్) ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ రెండు రాష్ట్రాలు ఏవి?
1) అస్సాం, త్రిపుర
2) పశ్చిమ బెంగాల్, అస్సాం
3) మేఘాలయ, మిజోరాం
4) త్రిపుర, మిజోరాం
- View Answer
- సమాధానం: 4
25. ఇటీవల ‘మాగ్ బిహు పండుగ’ను జరుపుకున్న రాష్ట్రం ఏది?
1) పశ్చిమ బెంగాల్
2) అస్సాం
3) ఒడిశా
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
26. బెంగళూరులో బ్లాక్‌చైన్ టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)ను ఏ సంస్థ ఏర్పాటుచేయనుంది?
1) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్
2) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
3) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
4) నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్
- View Answer
- సమాధానం: 4
27. 12వ నేషనల్ ట్రైబల్ యూత్ ఎక్సే్ఛంజ్ కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది?
1) ఢిల్లీ
2) పుదుచ్చేరి
3) మహారాష్ట్ర
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
28. న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన–2020, 28వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) ‘ఇండిజీనస్ వాయిసస్: మ్యాపింగ్ ఇండియాస్ ట్రైబల్ లిటరేచర్’
2) ‘గాంధీ: దిరైటర్స్ రైటర్’
3) ‘బుక్స్ ఫర్ రీడర్స్ విత్ స్పెషల్ నీడ్స్’
4) ‘టువర్డ్స్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా’
- View Answer
- సమాధానం: 2
29. మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నీతిఆయోగ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) అస్సాం
2) ఉత్తరప్రదేశ్
3) జమ్మూ–కశ్మీర్
4) లడఖ్
- View Answer
- సమాధానం: 4
30. దాదాపు 250 ఎపిఐలతో భారతదేశపు అతిపెద్ద అప్లికేషన్ ప్రోగామింగ్ ఇంటర్ఫేస్ బ్యాంకింగ్ పోర్టల్‌ను ఏ బ్యాంక్ ఆవిష్కరించింది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) ఆక్సిస్ బ్యాంక్
3) ఐసీఐసీఐ బ్యాంక్
4) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
31. శ్రీలంక భద్రతా దళాల పరికరాల కొనుగోలు కోసం భారతదేశం ఎన్ని మిలియన్ డాలర్లు అందివ్వనుంది?
1) 20 మిలియన్ డాలర్లు
2) 40 మిలియన్ డాలర్లు
3) 30 మిలియన్ డాలర్లు
4) 50 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
32. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవార్డుల–2019, 16వ ఎడిషన్‌లో ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు ఎంపికైన క్రీడాకారుడు?
1) ఎం.ఎస్. థోని
2) రోహిత శర్మ
3) విరాట్ కోహ్లి
4) శిఖర్ ధావన్
- View Answer
- సమాధానం: 3
33. కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వీసీఓఎఎస్)గా ఎవరు నియమితులయ్యారు?
1) సతీందర్ కుమార్ సైని
2) అభయ్ కృష్ణ
3) దేవ్‌రాజ్ అన్బు
4) చెరీష్ మాథ్సన్
- View Answer
- సమాధానం: 1
34. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవార్డుల–2019, 16వ ఎడిషన్‌లో తొలిసారిగా అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ఏ భారత క్రికెటర్ ఎంపికయ్యాడు?
1) ఎం.ఎస్. థోని
2) రోహిత్ శర్మ
3) విరాట్ కోహ్లి
4) శిఖర్ ధావన్
- View Answer
- సమాధానం: 2
35. జాతీయ నీటి విధానాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన 11మంది సభ్యుల కమిటీకి చైర్మన్‌గా ఎవరిని నియమించారు?
1) డా.మిహిర్ షా
2) శశి శేఖర్
3) రమేశ్ చంద్ర పండా
4) తుషార్ షా
- View Answer
- సమాధానం: 1
36. అస్సాం లోతట్టు నీటి రవాణా ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం 88 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని ఏ బ్యాంక్‌తో చేసుకుంది?
1) ఆసియా ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
2) ప్రపంచ బ్యాంక్
3) ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్
4) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
37. అంతరించిపోతున్న ఆర్కిడ్ జాతులను గుర్తించడానికి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ‘రెడ్ లిస్టింగ్’ను భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) అస్సాం
3) కేరళ
4) అరుణాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
38. ‘2020 దృక్పథంలో: ప్రపంచ ఆర్థిక పోకడలు, బంగారంపై వాటి ప్రభావం’ అనే ప్రపంచ బంగారం కౌన్సిల్ నివేదికలో ఆర్బీఐ ర్యాంక్?
1) 3
2) 6
3) 5
4) 4
- View Answer
- సమాధానం: 2
39. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ (డబ్ల్యూఎఫ్ఈఎస్) 2020, 10వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) ‘రీథింకింగ్ గ్లోబల్ కనజ్మషన్, ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్’
2) ‘ఎంబరేసింగ్ ది ఫ్యూచర్, వెలకమింగ్ డిసరప్సన్’
3) ‘డ్రైవింగ్ ది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్’
4) ‘స్మార్ట్ ఎనర్జీ ప్రొడక్ట్స్ అండ్ టెక్నాలజీస్’
- View Answer
- సమాధానం: 1
40. కింది ఏ రంగంలో సహకారం కోసం భారతదేశం, బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1) రక్షణ రంగం
2) సమాచార, ప్రసార
3) పరిశోధన, అభివృద్ధి
4) ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ
- View Answer
- సమాధానం: 2
41. మూడు రాజధానుల ఏర్పాటు కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, పరిపాలన వికేంద్రీకరణకు ఉద్దేశించిన ‘ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు–2020’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది?
1) మహారాష్ట్ర
2) పశ్చిమ బెంగాల్
3) గుజరాత్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
42. జల్ శక్తి మంత్రిత్వ శాఖ విడుదలచేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నీటి విభాగాలలో 2019 సామర్థ్య లక్ష్యాల ఆ«ధారంగా ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం అగ్రస్థానంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్
2) గుజరాత్
3) ఢిల్లీ
4) అస్సాం
- View Answer
- సమాధానం: 2
43. 10వ ఎడిషన్ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2020, క్లైమేట్ ఇన్నోవేషన్స్ ఎక్సే్ఛంజ్ ‘సీఎల్ఐఎక్స్’ (CLIX) 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) జెనీవా, స్విట్జర్లాండ్
2) అబుదాబి, యూఏఈ
3) న్యూఢిల్లీ, భారత్
4) వాషింగ్టన్ డి.సి., యూఎస్ఎ
- View Answer
- సమాధానం: 2
44. ఏటా ఆర్మీ డే ఏ రోజున జరుపుకుంటారు?
1) జనవరి 15
2) జనవరి 16
3) జనవరి 17
4) జనవరి 18
- View Answer
- సమాధానం: 1
45. ఉత్తర ఈశాన్య థియేటర్లో ఇటీవల భారత సైన్యం నిర్వహించిన అతిపెద్ద వాయు మార్గ వ్యాయామం ఏది?
1) అజయ్ వారియర్
2) వింగ్డ్ రైడర్
3) శత్రుజిత్
4) హిమాలయన్ వారియర్
- View Answer
- సమాధానం: 2
46. జాతీయ యువజనోత్సవం (ఎన్వైఎఫ్) 2020, 23వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) ‘యూత్ ఫర్ డిజిటల్ ఇండియా’
2) ‘ఫిట్ యూత్, ఫిట్ ఇండియా’
3) ‘సంకల్ప్ సే సిద్ధి’
4) ‘సెలబ్రేటింగ్ డైవర్సిటీ’
- View Answer
- సమాధానం: 2
47. రైజినా డైలాగ్ 2020, 5వ ఎడిషన్ సందర్భంగా భారత్‌తో ‘గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ గురించి చర్చలు జరిపిన దేశం?
1) చైనా
2) ఇండోనేషియా
3) డెన్మార్క్
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
48. అతున్యత నాణ్యతతో కూడిన టీవీ టెలీకం, బ్రాడ్‌కాస్టింగ్ ప్రసార సేవలను అందించడానికి దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏ భారతీయ సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించారు?
1) జీశాట్–30
2) జీశాట్–31
3) జీశాట్–32
4) జీశాట్–33
- View Answer
- సమాధానం: 1
49. సముద్ర పర్యావరణ వ్యవస్థల సవాళ్లు, అవకాశాలపై అంతర్జాతీయ సింపోజియం 3వ ఎడిషన్‌ను ఇటీవల నిర్వహించిన భారతీయ నగరం ఏది?
1) కొచ్చి, కేరళ
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
50. ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు–2020’ ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్ న్యాయ రాజధాని ఏది అవుతుంది?
1) కర్నూలు
2) విశాఖపట్నం
3) అమరావతి
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 1