కరెంట్ అఫైర్స్(2018, నవంబరు 15-21) బిట్ బ్యాంక్
1. 38వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) కోల్‌కతా
2) ముంబై
3) న్యూఢిల్లీ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
2. త్రివర్ణ పతాకావిష్కరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.75 నాణేన్ని ఎవరి గౌరవార్థం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది?
1) పండిట్ జవహర్లాల్ నెహ్రూ
2) నేతాజీ సుభాష్ చంద్ర బోస్
3) మహాత్మా గాంధీ
4) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
- View Answer
- సమాధానం: 2
3. రసగుల్లాకు భౌగోళిక గుర్తింపు-GI ట్యాగ్ లభించి ఏడాది పూర్తై సందర్భంగా రసగుల్లా దినాన్ని నిర్వహించిన రాష్ట్రం ఏది?
1. ఉత్తరప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్
3. మహారాష్ట్ర
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
4. వయోవృద్ధి అధ్యయన శాస్త్రం, వృద్ధాప్య వ్యాధులకు సంబంధించిన ఔషధాలపై 4వ అంతర్జాతీయ సదస్సు (ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ జరెంటాలజీ అండ్ జెరియాట్రిక్ మెడిసిన్) ఎక్కడ ప్రారంభమైంది?
1) కోల్‌కతా
2) న్యూఢిల్లీ
3) చెన్నై
4) ముంబై
- View Answer
- సమాధానం: 2
5. 6వ ఇండియన్ సోషల్ వర్క్ కాంగ్రెస్ (ఐఎస్డబ్ల్యూసీ) ఎక్కడ జరిగింది?
1) ఇండోర్
2) న్యూ ఢిల్లీ
3) నాగ్‌పూర్
4) కొచ్చి
- View Answer
- సమాధానం: 2
6. ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంత పోలీసులు తమ సిబ్బంది వృత్తిగత శిక్షణ కోసం నిపుణ్(NIPUN) పేరుతో ఇ-లెర్నింగ్ పోర్టల్‌ను ప్రారంభించారు?
1) చండీగఢ్
2) ఢిల్లీ
3) మహారాష్ట్ర
4) పాండిచ్చేరి
- View Answer
- సమాధానం: 2
7. బహిరంగ చర్చల్లో పాల్గొనడం, 2019 సార్వత్రిక ఎన్నికల పౌర సన్నద్ధతకు యువతను ప్రోత్సహించేందుకు ట్విట్టర్ ఇండియా ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి?
1) #పవర్ఆఫ్18
2) #ఓట్ఫర్నేషన్
3) #ఛేంజ్ఇన్2019
4) #న్యూఇండియాఇన్2019
- View Answer
- సమాధానం: 1
8. కేంద్ర, రాష్ట్రాల స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ 26వ సదస్సు ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, ఢిల్లీ
2) ధర్మశాల, హిమాచల్‌ప్రదేశ్
3) ఇండోర్, మధ్యప్రదేశ్
4) పూణె, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
9. నోంగ్క్రెమ్ నృత్యోత్సవం ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) సిక్కిం
3) మేఘాలయ
4) బీహార్
- View Answer
- సమాధానం: 3
10. పాడిరైతులకు బీమా కల్పించడానికి ‘గో సమృద్ధి ప్లస్ స్కీం’ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఉత్తరప్రదేశ్
3) రాజస్థాన్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
11.శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్ పేరుతో రామాయణ సర్క్యూట్లో నడిచే 800 సీట్ల ప్రత్యేక పర్యాటక రైలు, 2018 నవంబర్ 16న ఏ నగరంలో ప్రారంభమైంది?
1) భద్రాచలం
2) రామేశ్వరం
3) వారణాసి
4) న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
12. KOOL అనే ఆన్లైన్ ఓపెన్ లెర్నింగ్ ట్రైనింగ్ ప్లాట్ఫార్మ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) కర్ణాటక
2) కేరళ
3) జమ్మూకశ్మీర్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
13. 2018 నవంబర్ 17- 25 వరకు జరిగిన 14వ బాలల నాటకోత్సవం జెష్నే బచ్పన్ ఎక్కడ నిర్వహించారు?
1) ముంబై
2) న్యూ ఢిల్లీ
3) కోల్‌కత
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
14. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది?
1) బెంగళూరు
2) చెన్నై
3) ముంబై
4) కోల్‌కత
- View Answer
- సమాధానం: 3
15.శ్రీ విశ్వకర్మ నైపుణ్యాభివృద్ధి విశ్వ విద్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు?
1) మైసూరు, కర్ణాటక
2) కాన్పూర్, ఉత్తరప్రదేశ్
3) జైపూర్, రాజస్థాన్
4) పల్వల్, హరియాణా
- View Answer
- సమాధానం: 3
16. మహిళా పోలీస్ జాతీయ సదస్సు (NCWP) ఎక్కడ జరిగింది?
1) భోపాల్, మధ్యప్రదేశ్
2) ముంబై, మహారాష్ట్ర
3) పూణె, మహారాష్ట్ర
4) రాంచీ, జార్ఖండ్
- View Answer
- సమాధానం: 4
17. 2019 భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడి పేరేమిటి?
1) సిరిల్ రామఫోస
2) మార్క్ ఫెర్గూసన్
3) నిక్ గోంజాలేస్
4) డేనియల్ క్యాస్టెల్లనో
- View Answer
- సమాధానం: 1
18. భారత్-తైవాన్ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సభ ఎక్కడ జరిగింది?
1) న్యూ ఢిల్లీ, భారత్
2) తైపీ, తైవాన్
3) ముంబై, భారత్
4) ఛాంగువా, తైవాన్
- View Answer
- సమాధానం: 2
19. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏ దేశంపై 9 ఏళ్ల తర్వాత ఆయుధాల నిషేధాలు, ప్రయాణ నిషేధాలు, ఆస్తుల స్తంభన లక్ష్యంగా ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి ఏకగ్రీవంగా అంగీకరించింది?
1) ఇథియోపియా
2) ఎరిట్రియా
3) సోమాలియా
4) సూడాన్
- View Answer
- సమాధానం: 2
20. 33వ ఆసియాన్(అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్) సదస్సు ఎక్కడ జరిగింది?
1) మలేషియా
2) సింగపూర్
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 2
21. 13వ తూర్పు ఆసియా సదస్సు(EAS) ఎక్కడ జరిగింది?
1) సింగపూర్
2) వియత్నాం
3) ఇండోనేషియా
4)మకావ్
- View Answer
- సమాధానం: 1
22. వరల్డ్ కస్టమ్స్ ఆర్గైనైజేషన్ ప్రాంతీయ సమావేశం ఎక్కడ జరిగింది?
1) పూణె, మహారాష్ట్ర
2) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
3) జైపూర్, రాజస్థాన్
4) పాట్నా, బీహార్
- View Answer
- సమాధానం: 3
23. ఐసిస్(ISIS) దురాగతాలను అడ్డుకునేందుకు భారత్, ఏ దేశంతో పరస్పర చట్టపరమైన సహకారం, రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకుంది?
1) మొరాకో
2) టర్కీ
3) ఆఫ్గనిస్తాన్
4) ఇరాక్
- View Answer
- సమాధానం: 1
24. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో బాబినా సైనిక కేంద్రం వద్ద ఏ దేశంతో కలిసి భారత్ ఉమ్మడి సైనిక కార్యక్రమం ఇంద్రను నిర్వహించింది?
1) జర్మనీ
2) ఫ్రాన్స్
3) అమెరికా
4) రష్యా
- View Answer
- సమాధానం: 4
25. హైస్పీడ్ రైల్ లైన్‌ను ప్రారంభించిన మొదటి ఆఫ్రికా దేశం?
1) నైజీరియా
2) మొరాకో
3) కెన్యా
4) మారిషస్
- View Answer
- సమాధానం: 2
26. జైపూర్‌లో 12 రోజుల ఉమ్మడి సైనిక కార్యక్రమం వజ్ర ప్రహార్‌ను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది?
1) రష్యా
2) ఫ్రాన్స్
3) అమెరికా
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
27. పర్యావరణ మార్పుపై ఆఅఐఇ (బ్రెజిల్ దక్షిణాఫ్రికా, భారత్, చైనా) మంత్రుల 27వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) కేప్‌టౌన్
2) రియో డి జెనిరో
3) బీజింగ్
4) న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
28. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎన్ని కోట్ల రూపాయలను చలామణిలోకి తీసుకొచ్చింది?
1) రూ.12 వేల కోట్లు
2) రూ.50 వేల కోట్లు
3) రూ. 65 వేల కోట్లు
4) రూ. 15 వేల కోట్లు
- View Answer
- సమాధానం: 1
29. బటన్సతో పని చేసే నేమ్డ్ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అనే మొదటి ఇంటెరాక్టివ్ కార్డ్‌ను ప్రారంభించిన బ్యాంక్ ఏది?
1) యాక్సిస్ బ్యాంక్
2) ఐసీఐసీఐ బ్యాంక్
3) ఇండస్ఇండ్ బ్యాంక్
4) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
30. అక్టోబర్ 2018లో భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల మొత్తం అక్టోబర్ 2016 నుంచి మూడు రెట్లు పెరిగింది. ఆ మొత్తం ఎంత?
1) 244.81 కోట్లు
2) 534.78 కోట్లు
3) 789.12 కోట్లు
4)199.66 కోట్లు
- View Answer
- సమాధానం: 1
31. ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి రిటైల్ పెట్టుబడిదారులకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరు?
1) ఎన్ఎస్ఈ గోబిడ్(NSE goBID)
2) ఎన్ఎస్ఈ జిసెక్ (NSE gSEC)
3) ఎన్ఎస్ఈ బెసైక్ (NSEBuySec)
4) ఎన్ఎస్ఈ సెక్యూరిటీస్ (NSE Securities)
- View Answer
- సమాధానం: 1
32. అంకుర సంస్థల కార్యకలాపాలు, వాటి నిర్వహణ కోసం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ఎయిర్‌బస్ బిస్లాబ్తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది?
1) తెలంగాణ
2) మహారాష్ట్ర
3) పంజాబ్
4)కేరళ
- View Answer
- సమాధానం: 4
33. శ్రీ హరికోట నుంచి భారత ప్రయోగ వాహనం ఎఔగకజు GSLV-Mk III D2 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పెద్ద ఉపగ్రహం పేరేమిటి?
1) జీశాట్-28
2) జీశాట్-29
3) జీశాట్-26
4) జీశాట్-24
- View Answer
- సమాధానం: 2
34. అంతర్జాతీయ శక్తి సంస్థ (IEA) అనే పేరుతో వరల్డ్ ఎనర్జీ ఔట్లుక్ 2018 నివేదిక ప్రకారం 2030 నాటికి చమురు తర్వాత బొగ్గు స్థానే ప్రపంచంలో రెండో అతిపెద్ద శక్తి వనరు కానున్నది ఏది?
1) పెట్రోల్
2) సహజ వాయువు
3) ఉదజని (హైడ్రోజన్)
4) డీజిల్
- View Answer
- సమాధానం: 2
35. 2018 నవంబర్ 16, నాగపట్నం జిల్లాలో గజ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఇది ఏ రాష్ట్రంలో సంభవించింది?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
36. దేశంలో మొదటిసారిగా ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రిని ఎక్కడ ప్రారంభించారు?
1) నీలగిరి, తమిళనాడు
2) మధుర, ఉత్తరప్రదేశ్
3) కూర్గ్, కర్ణాటక
4) వైయనాడ్, కేరళ
- View Answer
- సమాధానం: 3
37. ఏ పదాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2018 పదంగా పేర్కొంది?
1) పోస్ట్ ట్రూత్
2) టాక్సిక్
3) టెక్నో
4) కమ్యూనల్
- View Answer
- సమాధానం: 2
38.అలహాబాదు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసింది ఎవరు?
1) జస్టిస్ హరీశ్ దేశాయ్
2) జస్టిస్ గోవింద్ మాథుర్
3) జస్టిస్ విజయ్ చౌహాన్
4) జస్టిస్ లీలా చందర్
- View Answer
- సమాధానం: 2
39. ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జలాజ్ శ్రీవాత్సవ
2) మణిశర్మ
3) జాదవ్ సిన్హా
4) రూహీ కపూర్
- View Answer
- సమాధానం: 1
40. బ్రిటిష్ ప్రధాని థెరిసా మే నియమించిన నూతన బ్రెగ్జిట్ సెక్రెటరీ ఎవరు?
1) డొమినిక్ రబాబ్
2) స్టీఫెన్ బార్క్లే
3) షెల్లీ జోనాస్
4) మార్థా కలింగ్
- View Answer
- సమాధానం: 2
41.రెండేళ్ల పూర్తి కాలానికి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
1) అజయ్ దేవంత్
2) సంజయ్ కుమార్ మిశ్రా
3) రిషీ కన్వర్
4) ప్రవీన్ మిట్టల్
- View Answer
- సమాధానం: 2
42. ఇండియన్ యారోస్ 1 లీగ్ సైడ్‌గా ఆవిర్భవించి, జాతీయ జట్టు క్యాంపులను నిర్వహించేందుకు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది?
1) ఒడిశా
2) ఉత్తరప్రదేశ్
3) కేరళ
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
43. రెండేళ్ల ఉపసంహరణ తర్వాత కామన్వెల్త్కు తిరిగి వచ్చిన దేశమేది?
1) మారిషస్
2) మాల్దీవులు
3) థాయ్‌లాండ్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
44. భారత్‌లో జాతీయ ముద్రణ దినాన్ని (నేషనల్ ప్రెస్ డే) ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 16
2) నవంబర్ 15
3) నవంబర్ 14
4) నవంబర్ 13
- View Answer
- సమాధానం: 1
45. 2018 నవంబర్ 19న నిర్వహించిన వరల్డ్ టాయ్‌లెట్ డే 2018 నేపథ్యం ఏమిటి?
1) ప్రకృతి పిలిచినప్పుడు
2) పరిశుభ్రత, శుద్ధీకరణ
3) బహిరంగ మలవిసర్జనకు స్వస్తి
4) పారిశుధ్యం ప్రాముఖ్యత, అమలు
- View Answer
- సమాధానం: 1
46. ఇన్ఫోసిస్ ప్రైజ్ 2018- హ్యుమానిటీస్ కేటగిరిలో ఎంపికైన ప్రొఫెసర్ పేరేమిటి?
1) నవకాంత్ భట్
2) కవితా సింగ్
3) రూప్ మాలిక్
4) నళిని అనంతరామన్
- View Answer
- సమాధానం: 2
47. భారతీయ శాస్త్రీయ సంగీతం సుసంపన్నత, ప్రచారం కోసం పాటుపడినందుకు గాను న్యూఢిల్లీలోని కామాని ఆడిటోరియంలో ‘సుమిత్ర చరత్ రామ్ జీవిత సాఫల్య పురస్కారం’ ఎవరికి ప్రదానం చేశారు?
1) ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్
2) కిషోరీ అమోంకర్
3) గిరిజా దేవి
4) ఉలాస్ కశాల్కర్
- View Answer
- సమాధానం: 1
48. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత ఐఎండీ బిజినెస్ స్కూల్ గ్లోబల్ యాన్యువల్ టాలెంట్ ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 78
2) 53
3) 45
4) 18
- View Answer
- సమాధానం: 2
49. ఇంటెక్స్ సౌత్ ఏసియా నాలుగో ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) ఖాట్మండు, నేపాల్
2) ఢాకా, బంగ్లాదేశ్
3) న్యూఢిల్లీ, భారత్
4) కొలంబో, శ్రీలంక
- View Answer
- సమాధానం: 4
50. ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్ (APEC) సమావేశం 2018 ఎక్కడ జరిగింది?
1) పోర్ట్ మోర్స్‌బై, పాపువా, న్యూ గినియా
2) మనీలా, ఫిలిప్పీన్స్
3) జకార్త్తా. ఇండోనేషియా
4) ఉలాన్‌బతార్ మంగోలియా
- View Answer
- సమాధానం: 1