కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 8 - 14) బిట్ బ్యాంక్
1. యుద్ధ్ అభ్యాస్- 2017 పేరుతో ఇటీవల ఏ రెండు దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించాయి ?
1) భారత్, అమెరికా
2) భారత్, రష్యా
3) భారత్, జపాన్
4) భారత్, శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, అమెరికా సంయుక్తంగా యుద్ధ్ అభ్యాస్- 2017 పేరుతో సెప్టెంబర్ 14 నుంచి 27 వరకు సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అమెరికాలోని వాషింగ్టన్ లూయి స్మెక్కార్బేలో ఈ విన్యాసాలు జరిగాయి. ఈ సారి నిర్వహించిన సైనిక విన్యాసాలు 13వ ఎడిషన్.
- సమాధానం: 1
2. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో అతిపెద్ద ఫుల్ ఫిల్మెంట్ సెంటర్నుఎక్కడ ప్రారంభించింది ?
1) బెంగళూరు
2) కోల్కత్తా
3) ముంబయి
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ భారత్‌లో అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. శంషాబాద్ విమానాశ్రయంలో దీన్ని ఏర్పాటు చేసింది. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్లను ప్రాసెస్ చేసి.. వస్తువులను డెలివర్ చేసేవే ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు.
- సమాధానం: 4
3. ఏ సంవత్సరం లోగా భారత్‌ను తట్టు రహిత దేశంగా మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది ?
1) 2020
2) 2022
3) 2024
4) 2026
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్‌తో పాటు ఆగ్నేయాసియాలోని బంగ్లాదేశ్, మయన్మార్, తైమూర్, ఇండోనేషియా దేశాలను 2022 నాటికి తట్టు రహిత దేశాలుగా మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా దేశాల్లో తట్టు నిర్మూలన కోసం చేపట్టే కార్యక్రమాలకు మొత్తంగా 800 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని లెక్క కట్టింది.
- సమాధానం: 2
4. చౌక ధరల దుకాణాల్లో రేషన్ నిల్వలు, లొకేషన్ వివరాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ - రేషన్ ఆప్‌ని ఎవరు రూపొందించారు ?
1) సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
2) నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్
3) మైక్రోసాఫ్ట్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల లొకేషన్, రేషన్ నిల్వలు సమాచారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ - రేషన్ ఆప్‌ని ఆవిష్కరించింది. దీన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్- ఎన్ఐసీ దీన్ని రూపొందించింది.
- సమాధానం: 2
5. ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే దేశంలో తొలి ఆహార భద్రత సంస్థను ఎక్కడ ఏర్పాటు చేసింది ?
1) హైదరాబాద్
2) ఛండీగడ్
3) బెంగళూరు
4) మనేసర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేస్లే ఇండియా సంయుక్తంగా దేశంలో తొలి నేస్లే ఫుడ్‌సేఫ్టీ ఇనిస్టిట్యూట్‌ని మనేసర్‌లో ఏర్పాటు చేశాయి. నేస్లే రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ , నెస్లే రీసర్చ్ సెంటర్ ఇన్ లాసన్నే స్విట్జర్లాండ్ సంస్థలతో కలిసి ఇది పనిచేస్తుంది. భారత్‌లో ఆహార భద్రత వాతవరణాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది.
- సమాధానం: 4
6. భారత దేశంలో తొలి హైపర్‌లూప్ ప్రాజెక్టుని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలోనే తొలి హైపర్‌లూప్ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించనున్నారు. రాష్ట్రంలోని విజయవాడ - అమరావతి మధ్య దీన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పొర్టేషన్ టెక్నాలజీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పూర్తయితే విజయవాడ నుంచి అమరావతికి 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
- సమాధానం: 3
7. తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరానికి కాళోజీ నారాయణరావు అవార్డుని ఎవరికి ప్రకటించింది ?
1) సీతారాం
2) అంద్శై
3) చంద్రబోస్
4) సుద్దాల అశోక్ తేజ
- View Answer
- సమాధానం: 1
వివరణ: సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కాళోజి నారాయణరావు పురస్కారాన్ని కవి సీతారాంకు అందజేసింది. అవార్డు కింద రూ.1,01,116 నగదు అందించింది. కాళోజీ అవార్డుని 2016లో ప్రముఖ రచయిత, గాయకుడు గోరేటి వెంకన్న, 2015లో రచయిత అమ్మంగి వేణుగోపాల్ అందుకున్నారు.
- సమాధానం: 1
8. ప్రధాన మంత్రి ముద్రా యోజనలో భాగంగా ఎన్ని ఉద్యోగాలు కల్పించడం జరిగిందని థింక్ టేంక్ స్కోచ్ నివేదిక వెల్లడించింది ?
1) 5.5 కోట్లు
2) 4.5 కోట్లు
3) 3.5 కోట్లు
4) 2.5 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: చిన్న వ్యాపారులకు రుణ సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజనను 2015 ఏప్రిల్ 8న ప్రారంభించింది. ఈ పథకం అమలుపై థింక్ టేంక్ స్కోచ్ ఇటీవల నివేదిక విడుదల చేసింది. పథకం కింద ఇప్పటి వరకు రూ.3.42 లక్షల కోట్ల రుణాలను అందజేసినట్లు పేర్కొంది. వీటి ద్వారా 5.5 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని వెల్లడించింది.
- సమాధానం: 1
9. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5.5 లక్షల గ్రామాలకు 2019 మార్చి నాటికి ఎంత స్పీడ్‌తో కూడిన వైఫై కనెక్షన్లను ఏర్పాటు చేయనుంది ?
1) 1 జీబీపీఎస్
2) 100 ఎంబీపీఎస్
3) 500 ఎంబీపీఎస్
4) 50 ఎంబీపీఎస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2019 నాటికి దేశంలోని 5.5 లక్షల గ్రామాల్లో 1 జీబీపీఎస్ వేగంతో కూడిన వైఫై సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 3 వేల 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. 2017 సెప్టెంబర్ 6 నాటికి దేశంలోని 33,430 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
- సమాధానం: 1
10. ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) సంజయ్ దత్
2) ఎస్ ఎస్ రాజమౌళి
3) కీరవాణి
4) కరణ్ జోహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2006లో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుని స్థాపించింది. మొదటి అవార్డుని దేవ్ ఆనంద్కి అందజేసింది. 2017 సంవత్సరానికి ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ అవార్డుకి ఎంపికయ్యారు. సినిమా రంగానికి విశేష సేవలు చేసిన వారికి ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తారు.
- సమాధానం: 2
11. 2018 విద్యా సంవత్సరంలో కనీసం 70 లక్షల మంది విద్యార్థులను బడుల్లో చేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమం పేరు ఏమిటి ?
1) చలో స్కూల్
2) రోడ్ టూ స్కూల్
3) స్కూల్ చలో అభియాన్
4) పడే హమారే దేశ్కే బచ్చే
- View Answer
- సమాధానం: 3
వివరణ: వచ్చే విద్యా సంవత్సరం స్కూల్ చలో అభియాన్‌ను చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బడికి దూరంగా ఉన్న, మధ్యలో చదువులు మానేసిన కనీసం 70 నుంచి 80 లక్షల మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తారు.
- సమాధానం: 3
12. భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన మూడో తరం నాగ్ క్షిపణిని తయారు చేసింది ఎవరు ?
1) డీఆర్డీవో
2) హెచ్ఏఎల్
3) బీహెచ్ఈఎల్
4) నేషన ల్ డిఫెన్స్ అకాడమీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: మూడో తరం యాంటీ - ట్యాంక్ గెడైడ్ మిసైల్ - ఏటీజీఎం నాగ్‌ను రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా సుమారు 3 బిలియన్ డాలర్ల వ్యయంతో వీటిని అభివృద్ధి చేశారు. ఇటీవల ఈ క్షిపణిని రాజస్తాన్ ఎడారిలో విజయవంతంగా పరీక్షించారు. 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది నాశనం చేయగలదు.
- సమాధానం: 1
13. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్ ఎవరు ?
1) బెన్ స్టోక్స్
2) జేమ్స్ ఆండర్సన్
3) స్టువర్ట్ బ్రాడ్
4) మాంటి పనేసర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన తొలి ఇంగ్లీష్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్టు క్రికెట్లో ఈ ఘనతను అందుకున్న ఆరో బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో టెస్ట్ సీరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్ ఓపెన్ర్ బ్రాత్ వెయిట్‌ను అవుట్ చేసి ఈ రికార్డుని అందుకున్నాడు.
- సమాధానం: 2
14. ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానామిక్ యూనియన్ ఇటీవల టెన్జింగ్ నార్గే, ఎడ్ముండ్ హిల్లరీ పేర్లను ఏ గ్రహంపై పర్వతాలకు పెట్టింది ?
1) సేటర్న్
2) ప్లూటో
3) మెర్క్యురీ
4) జూపిటర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్, నేపాల్‌కు చెందిన టెన్జింగ్ నార్గే, న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్ముండ్ హిల్లరీ 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి భద్రంగా తిరిగొచ్చిన తొలి వ్యక్తులుగా రికార్డు సృష్టించారు. వీరి గౌరవార్థం ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానామిక్ యూనియన్ ప్లూటో గ్రహంపై ఉన్న రెండు పర్వతాలకు టెన్జింగ్ మాంట్స్, హిల్లరీ మాంట్స్ పేర్లు పెట్టింది. వీరితో పాటు మరో 12 మంది పేర్లను ప్లూటో గ్రహంపై ఉన్న ఇతర పర్వతాలకు పెట్టారు. ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానామిక్ యూనియన్ను 1919లో స్థాపించారు.
- సమాధానం: 2
15. దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థకు మహారత్న హోదా ఇవ్వాలని ఇటీవల నిర్ణయించారు ?
1) భారత్ పెట్రోలియం కార్పొరేషన్
2) హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్
3) గోవా షిప్‌యార్డు
4) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రస్తుతం నవరత్న హోదాతో ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు మహారత్న హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీంతో.. ఈ హోదా పొందిన 8వ సంస్థగా బీపీసీఎల్ నిలవనుంది. ఇంతకముందు బీహెచ్ఈఎల్, కోల్ఇండియా, గెయిల్, ఐవోసీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సెయిల్ సంస్థలకు మహారత్న హోదా దక్కింది. ఏదైనా సంస్థ మహారత్న హోదా పొందాలంటే.. నవరత్న హోదాతో పాటు 3 ఏళ్ల సగటు టర్నోవర్ రూ.25 వేల కోట్లు ఉండాలి. అలాగే 3 ఏళ్ల సగటు ఆదాయం రూ. 5 వేల కోట్లు ఉండాలి. స్టాక్‌ఎక్సేంజ్‌లో నమోదై ఉండాలి.
- సమాధానం: 1
16. ఏ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గాలి నుంచి అతి చవకై న, స్వచ్ఛమైన మీథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నారు ?
1) కార్డిఫ్ యూనివర్సిటీ
2) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
3) ఢిల్లీ యూనివర్సిటీ
4) కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గాలిలోని ఆక్సిజన్ ద్వారా మీథేన్ నుంచి మీథనాల్ను ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నారు. ఈ విధానం ద్వారా ఎలాంటి కాలుష్య కారకాలు ఉత్పత్తి కావు. మీథనాల్ వాహనాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం.
- సమాధానం: 1
17. సౌత్ ఆసియాన్ బాస్కెట్ బాల్ అండర్- 16 టైటిల్‌ను ఏ దేశం గెలుచుకుంది ?
1) భారత్
2) భూటాన్
3) శ్రీలంక
4) నేపాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2వ సౌత్ ఆసియాన్ బాస్కెట్ బాల్అండర్- 16 చాంపియన్షిప్ని నేపాల్‌లో నిర్వహించారు. ఈ టోర్నీ ఫైనల్లో భూటాన్ ఓడించి భారత్ విజేతగా నిలిచింది. దీంతో.. మలేషియాలో జరగనున్న ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ అండర్ - 16కు అర్హత సాధించింది.
- సమాధానం: 1
18. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానం ముసాయిదాను ఏ దేశం ప్రవేశపెట్టింది ?
1) దక్షిణ కొరియా
2) జపాన్
3) అమెరికా
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
వివరణ: వరస క్షిపణి పరీక్షలు, అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తు ఆందోళన కలిగిస్తున్న ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాలంటూ ఐరాసలో అమెరికా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఐరాస ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో.. ఉత్తర కొరియా ఇంధన దిగుమతులు, వస్త్రాల ఎగుమతి, విదేశీ లేబర్ కాంట్రాక్ట్‌లు, విదేశాలతో జాయింట్ ప్రాజెక్టులపై నిషేధం విధించినట్లయింది.
- సమాధానం: 3
19. భారత్ ఎప్పటిలోగా దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ?
1) 2020
2) 2025
3) 2030
4) 2035
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2025 లోగా దేశంలో క్షయ వ్యాధిని(టీబీ)ని పూర్తిగా నిర్మూలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని చేరడంలో సహాయ సహకారాలను అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ టీబీ రిపోర్ట్ ప్రకారం 2015లో భారత్‌లో 28 లక్షల టీబీ కేసులు నమోదయ్యాయి.
- సమాధానం: 2
20. భారత్- ఆఫ్గనిస్తాన్ 2వ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) కాబుల్
3) ముంబయి
4) కాందహార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్- ఆఫ్గనిస్తాన్ 2వ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇందులో భాగంగా ఆఫ్గనిస్తాన్‌లో రక్షణ వ్యవస్థ పటిష్టతతో పాటు కొత్తగా 116 అత్యున్నత స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
- సమాధానం: 1
21. భారత మహిళా నావికులు ‘నావికా సాగర్ పరిక్రమ‘ పేరుతో ఏ నౌకతో ప్రపంచ యాత్ర చేపట్టారు ?
1) ఐఎన్ఎ విరాట్
2) ఐఎన్ఎస్ తరిణి
3) ఐఎన్ఎస్ భరిణి
4) ఐఎన్ఎస్ మంథని
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత మహిళా నావికలు నావికా సాగర్ పరిక్రమ పేరుతో గోవాలోని పణాజీ నుంచి ప్రపంచ యాత్ర ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ తరిణి లో 165 రోజుల పాటు ఈ సాహస యాత్ర సాగుతుంది. మహిళా నావికులు - లెఫ్టినెంట్ కమాండర్ జోషి, లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జమ్వాల్, లెఫ్టినెంట్ కమాండర్ స్వాతి, లెఫ్టినెంట్ కమాండర్ బోయపాటి ఐశ్వర్య, లెఫ్టినెంట్ కమాండర్ విజయా దేవి, లెఫ్టినెంట్ కమాండర్ పాయల్ గుప్తా.
- సమాధానం: 2
22. గ్లోబల్ ఫైనాన్సియల్ సెంటర్స్ ఇండెక్స్ - 2017 నివేదికలో తొలి స్థానంలో ఏ నగరం ఉంది ?
1) లండన్
2) న్యూయార్క్
3) సింగపూర్
4) హాంగ్‌కాంగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జెడ్, ఝెన్, చైనా డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ గ్లోబల్ ఫైనాన్సియల్ సెంటర్స్ ఇండెక్స్ - 2017ను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా 92 ఆర్థిక నగరాలతో ఈ జాబితాను తయారు చేసింది. ఇందులో లండన్ తొలి స్థానంలో, రెండో స్థానంలో న్యూయార్క్, మూడో స్థానంలో సింగపూర్, నాలుగో స్థానంలో హాంగ్‌కాంగ్ ఉన్నాయి. ఈ జాబితాలో భారత నగరం ముంబై 60వ స్థానంలో ఉంది.
- సమాధానం: 1
23. పట్టుపురుగులు, పట్టు రంగంపై పరిశోధన, అభివృద్ధి కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) స్పెయిన్
2) బెలారస్
3) జపాన్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పట్టు పురుగులు, పట్టు పరిశ్రమలపై పరిశోధన, అభివృద్ధి కోసం భారత్ జపాన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌కు చెందిన సెంట్రల్ సిల్క్ బోర్డ్.. జపాన్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆగ్రో బయోలాజికల్ సంస్థలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లోని వాతావరణ పరిస్థితులకు తగిన Psolific bivoltine hybrids of silkwormను అభివృద్ధి చేస్తారు.
- సమాధానం: 3
24. ఇటీవల భారత్‌లో పర్యటించిన బెలారస్ దేశ అధ్యక్షుడు ఎవరు ?
1) ఏజీ ల్యూకాశెంకో
2) మికోలా స్టాట్కెవిచ్
3) రూవెన్రివిలిన్
4) బెంజామిన్నెతన్యాహూ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఏజీ ల్యూకాశెంకో 23 ఏళ్లుగా బెలారస్ దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీ, చమురు, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, క్రీడల రంగాల్లో 10 ఒప్పందాలు కుదిరాయి.
- సమాధానం: 1
25. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ తొలిసారి ప్రవేశపెట్టిన జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికై న క్రీడాకారుడు ఎవరు ?
1) పుల్లెల గోపీచంద్
2) పీవీ సింధు
3) ప్రకాశ్ పడుకోన్
4) సైనా నెహ్వాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ - బాయ్ 2017లో తొలిసారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రారంభించింది. తొలి అవార్డుని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్‌కు ప్రకటించింది. ఆయన 1980లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించారు. 1972లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, 1982లో పద్మశ్రీ అందుకున్నారు.
- సమాధానం: 3
26. మార్కోని సొసైటీ అందించే ప్రతిష్టాత్మక పాల్ బెరన్ యంగ్ స్కాలర్షిప్ పురస్కారం - 2017కు ఎవరిని ఎంపిక చేశారు ?
1) సాహిల్దోషి
2) మానస మెండు
3) రమేశ్‌వర్మ
4) ఆనంద తీర్థ సురేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మార్కోని సొసైటీ అందించే ప్రతిష్టాత్మక పాల్ బెరన్ యంగ్ స్కాలర్షిప్ పురస్కారానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఆనంద తీర్థ సురేశ్ ఎంపికయ్యారు. బేసిక్ ఫోన్లలోను వేగంగా సమాచారాన్ని తెలుసుకునే సాంకేతిక విధానాన్ని రూపొందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. దీని కింద 4 వేల అమెరికన్ డాలర్ల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు. రేడియోను కనుగొన్న శాస్త్రవేత్త మార్కోని జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
- సమాధానం: 4
27. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 6
2) సెప్టెంబర్ 7
3) సెప్టెంబర్ 8
4) సెప్టెంబర్ 9
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2018 Theme : Literacy in digital world.
ఈ ఏడాది 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యత కోసం కృషి చేసిన వారికి పారిస్ లోని యునెస్కో కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తారు. 1966లో యునెస్కో తొలిసారి ఏటా సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది.
- సమాధానం: 3
28. నదుల అనుసంధానం కోసం ఏ రాష్ట్రానికి వచ్చే రెండేళ్లలో 60 వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
వివరణ: మహారాష్ట్రలో నీటి ఎద్దడిని ఎదుర్కునేందుకు ఆ రాష్ట్రానికి వచ్చే రెండేళ్లలో 60 వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ నిధులతో నదుల అనుసంధానం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
- సమాధానం: 4
29. యూఎస్ ఓపెన్ - 2017లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) రాఫెల్ నాదల్
2) కెవిన్ ఆండర్సన్
3) రోజర్ ఫెదరర్
4) నోవాక్ జకోవిచ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూఎస్ ఓపెన్ - 2017 పురుషుల సింగిల్స్ ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ఆండర్సన్ను ఓడించి స్పెయిన్ దిగ్గజం రాఫెన్ నాదల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నాదల్ కెరీర్లో ఇది 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికాకు చెందిన మాడిసన్ కీవ్‌ను ఓడించి అమెరికాకే చెందిన స్లోన్ స్టీఫెన్‌స దక్కించుకుంది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను జామీ ముర్రే, మార్టినా హింగీస్ జంట గెలుచుకుంది.
- సమాధానం: 1
30. తెలంగాణలోని ఏ పట్టణంలో నేషనల్ రూర్బన్ మిషన్ కింద మోడల్ కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నారు ?
1) అసిఫాబాద్
2) వరంగల్
3) సూర్యాపేట్
4) మంచిర్యాల
- View Answer
- సమాధానం: 1
వివరణ: పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, రద్దీ నియంత్రణ కోసం నేషనల్ రూర్బన్ మిషన్ కింద తెలంగాణలోని ఆసిఫాబాద్ లో రూ. 2.3 కోట్ల కేంద్ర నిధులతో మోడల్ మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. మూడు నెలల్లో మార్కెట్‌ను అందుబాటులోకి తేనున్నారు.
- సమాధానం: 1
31. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఇటీవల విడుదల చేసిన హ్యూమన్ కేపటిల్ ఇండెక్స్ - 2017లో భారత్ ఏ స్థానంలో ఉంది ?
1) 130
2) 103
3) 113
4) 123
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ ఎకనమిక్ ఫోరమ్ ఏటా హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. ఈ ఏడాదిగాను 130 దేశాలతో విడుదల చేసిన నివేదికలో భారత్ 103వ స్థానంలో ఉంది. గతేడాది ఇదే నివేదికలో భారత్ 105వ స్థానంలో ఉంది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక(70), నేపాల్(98), మయన్మార్ (89) స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో నార్వే తొలి స్థానంలో, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, డెన్మార్క్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 2
32. 2028 ఒలింపిక్స్ ఏ నగరంలో జరగనున్నాయి ?
1) బ్రెజిల్
2) న్యూఢిల్లీ
3) లాస్ ఏంజెల్స్
4) పారిస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2028 ఒలింపిక్స్‌కు ఆతిథ్య నగరంగా లాస్ ఏంజెల్స్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఖరారు చేసింది. అలాగే 2024 ఒలింపిక్స్ పారిస్‌లో, 2020 ఒలింపిక్స్ టోక్యోలో జరగనున్నాయి.
- సమాధానం: 3
33. ఇటీవల ఏ దేశం చక్మా, హజోంగ్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వనున్నట్లు ప్రకటించింది ?
1) భారత్
2) బంగ్లాదేశ్
3) మయన్మార్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1960ల్లో తూర్పు పాకిస్తాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వలస వచ్చిన చక్మా, హజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థానికుల హక్కులకు, ప్రయోజనాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం దేశంలో వీరి సంఖ్య లక్ష వరకు ఉంటుంది. చక్మాలు బౌద్ధులు కాగా హజోంగ్ లు హిందువులు.
- సమాధానం: 1
34. దేశంలో మొదటి అత్యాధునిక హోమియోపతి వైరాలజీ ల్యాబ్ ఎక్కడ ఏర్పాటైంది ?
1) బెంగళూరు
2) కేరళ
3) కోల్కత్తా
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కోల్‌కత్తాలోని డాక్టర్ అంజలి చటర్జీ హోమియోపతి రీజనల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో దేశంలో మొదటి హోమియోపతి వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. వైరల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు కొత్త ఔషధాలు, కొత్త సాంకేతిక విధానాలపై ఇందులో పరిశోధన జరిపి కొత్త ఆవిష్కరణలు చేస్తారు.
- సమాధానం: 3
35. ఎవరి జ్ఞాపకార్థం భారతీయ రిజర్వు బ్యాంక్ వంద రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేసింది ?
1) ఎంజీ రామచంద్రన్
2) జయలలిత
3) ఎన్టీ రామారావు
4) జయశంకర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతరత్న అవార్డీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతిని పురస్కరించుకొని త్వరలో వంద రూపాయల నాణేలను కేంద్ర ప్రభుత్వం ముద్రించనుంది. వాటిపై ఎంజీఆర్ ముఖ చిత్రంతో పాటు డాక్టర్ ఎంజీఆర్ బర్త్ సెంటినరీ అని రాసి ఉంటుంది. ఎంజీ రామచంద్రన్ తమిళనాడులోని అధికార పార్టీ అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) పార్టీ వ్యవస్థాపకులు.
- సమాధానం: 1
36. మహా సముద్రాల ప్రత్యేక రాయబారిగా ఐరాస ఎవరిని నియమించింది ?
1) జీయన్ మైఖెల్ కౌస్టీయ్
2) ఏడ్రియన్ గ్రేనియర్
3) బోయన్ స్లాట్
4) పీటర్ థామ్సన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవి నుంచి ఇటీవల దిగిపోయిన పీటర్ థామ్స్న్ను మహా సముద్రాల తొలి ప్రత్యేక రాయబారిగా ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియా గుటెరస్ నియమించారు. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన తొలి యూఎన్ ఓషన్స కాన్ఫరెన్సలో పీటర్ థామ్సన్ కీలక పాత్ర పోషించారు. ఈ సమావేశంలో 193 ఐరాస సభ్య దేశాలు మహా సముద్రాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానించాయి.
- సమాధానం: 4
37. సింగపూర్ అధ్యక్షురాలిగా ఎన్నికై న తొలి మహిళ ఎవరు ?
1) హలీమా యాకూబ్
2) లిమ్ హీ హ్వా
3) అమీ ఖోర్
4) ఇంద్రాని రాజాహ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సింగపూర్ అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన హలీమా యాకూబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నలుగురు ప్రత్యర్థులు అర్హత ప్రమాణాలు అందుకోవడంలో విఫలం కావడం వల్ల వారి నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఓటింగ్ లేకుండా ఆమె ఎన్నికయ్యారు.
- సమాధానం: 1
38. 36వ జాతీయ క్రీడలు ఏ నగరంలో జరగనున్నారుు ?
1) గోవా
2) బెంగళూరు
3) భువనేశ్వర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 36వ జాతీయ క్రీడలను గోవాలో నిర్వహించాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్‌లో ఈ క్రీడలు జరుగుతాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను 1924లో ఏర్పాటు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో ఇండియన్ ఒలింపిక్ క్రీడలను నిర్వహించారు. అప్పటి నుంచి 1940 వరకు ఏటా ఈ క్రీడలను నిర్వహించారు. 1940 నుంచి పేరు మార్చి జాతీయ క్రీడలుగా నిర్వహిస్తున్నారు.
ఒలింపిక్స్ నిబంధనలకు అనుగుణంగా దేశంలో తొలి ఆధునిక జాతీయ క్రీడలను 1985లో నిర్వహించారు.
- సమాధానం: 1
39. జాతీయ హిందీ దివస్‌ను ఏ రోజున నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 11
2) సెప్టెంబర్ 12
3) సెప్టెంబర్ 13
4) సెప్టెంబర్ 14
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగ అసెంబ్లీ హిందీని పరిపాలన భాషగా అడాప్ట్ చేసుకుంది. భారత రాజ్యాంగం దీన్ని ఆమోదించింది. దీంతో ఏటా సెప్టెంబర్ 14న జాతీయ హిందీ దివస్ గా నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 1
40. వాతావరణ హిత వనరుల వినియోగాన్ని ప్రమోట్ చేసేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఇటీవల ప్రారంభించిన కేంపెయిన్ ఏది ?
1) వుడ్ ఈజ్ గుడ్
2) స్టీల్ ఈజ్ గుడ్
3) ప్లాస్టిక్ ఈజ్ గుడ్
4) ఐరన్ ఈజ్ గుడ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పర్యావరణం, అటవీ పరిరక్షణ కోసం న్యూఢిల్లీలో Sustainable land scapes and forest ecosystems : theory to practice పేరుతో సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి హర్షవర్దన్.. వుడ్ ఈజ్ గుడ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. స్టీల్, ప్లాస్టిక్ ఉత్పత్తుల వల్ల కాలుష్యం ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా చెక్క, కలపతో చేసిన వస్తవులను వినియోగించాలన్నది ఈ క్యాంపెయన్ ముఖ్య ఉద్దేశం.
- సమాధానం: 1
41. వెనిస్ చిత్రోత్సవంలో గోల్డెన్ లైవ్ అవార్డుని పొందిన చిత్రం ఏది ?
1) లా లా ల్యాండ్
2) ది మూన్ లైట్
3) ది షేప్ ఆఫ్ వాటర్
4) కింగ్ కాంగ్ రిటర్నస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 74వ వెనిస్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ది షేప్ ఆప్ వాటర్ చిత్రం గోల్డెన్ లైవ్ అవార్డుని దక్కించుకుంది. అమెరికాకు చెందిన దర్శకుడు గుల్లెర్మో డెల్ టోరో చిత్రానికి దర్శకత్వం వహించారు. ఉత్తమ నటుడు పురస్కారాన్ని కమెల్ ఎల్ భాషా, ఉత్తమ నటి అవార్డుని చార్ లోటె రాంప్లింగ్(బ్రిటన్) దక్కించుకున్నారు.
- సమాధానం: 3
42. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్యను పెంచుకునేందుకు ఆస్ట్రేలియా ఎవరిని ప్రచాకర్తగా నియమించింది ?
1) పరిణీతి చోప్రా
2) ప్రియాంకా చోప్రా
3) దీపికా పడుకోన్
4) కత్రినా కై ఫ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతీయ పర్యాటకలను తమ దేశానికి ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను ప్రచారకర్తగా నియమించుకుంది. ఆమె ఫ్రెండ్ ఆఫ్ ఆస్ట్రేలియా కాన్సెప్ట్ ను ప్రచారం చేస్తుంది.
- సమాధానం: 1
43. కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ - 2017లో బెస్ట్ లిఫ్టర్ అవార్డుని దక్కించుకున్న అథ్లెట్ ఎవరు ?
1) పర్దీప్ సింగ్
2) సతీశ్ కుమార్
3) ధర్మేంద్ర సింగ్
4) రాగల వెంకట రాహుల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ - 2017 పోటీలు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగాయి. ఈ పోటీల్లో సీనియర్ పురుషులు, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ రాగల వెంకట రాహుల్ బెల్ట్ లిఫ్టర్ అవార్డుని దక్కించుకున్నాడు. మీరాబాయి చానుకి సీనియర్ మహిళల కేటగిరీలో, దీపికా లాథెర్ కు యూత్ బాలుర విభాగంలో అవార్డులు లభించాయి. ఈ టోర్నీలో భారత లిఫ్టర్లు 34 రికార్డులు నెలకొల్పారు.
- సమాధానం: 4
44. అంతర్జాతీయ ఇన్నోవేషన్ ఫెయిర్- 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) ఢిల్లీ
2) బీజింగ్
3) విశాఖపట్నం
4) కొలంబో
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు విశాఖపట్నంలో అంతర్జాతీయ ఇన్నవేషన్ ఫెయిర్ - 2017ను నిర్వహించారు. ఆసియాన్ అండ్ పసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్సఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్నోవేటర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఫెయిర్ ను నిర్వహించాయి.
- సమాధానం: 3
45. దేశంలో పాల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1) ఉత్తరప్రదేశ్
2) రాజస్తాన్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల విడుదల చేసిన 2016-17 పాల ఉత్పత్తి గణాంకాల ప్రకారం దేశంలో పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో రాజస్తాన్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
- సమాధానం: 1
46. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రాసెస్డ్ ఆలివ్ టీ తయారీని భారత్ లోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1) ఢిల్లీ
2) పంజాబ్
3) రాజస్తాన్
4) అస్సాం
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాజస్తాన్‌లో ఉత్పత్తి అయ్యే ఆలివ్ ఆకుల నుంచి ఆలివ్ టీ తయారీని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రారంభించారు. ఈ తరహా టీని తయారు చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. Olitia గా పిలిచే ఈ టీ తయారీ కోసం ఒలిటియా ఫుడ్స్ ఫ్రైవేట్ లిమిటెడ్, రాజస్తాన్ ప్రభుత్వం మధ్య 2016లో జరిగిన రాజస్తాన్ అగ్రిటెక్ మీట్ లో ఒప్పందం కుదిరింది.
- సమాధానం: 3
47. అడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తమ సాహస పర్యాటక రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎంపికైంది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రతిష్టాత్మక అడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ సాహస పర్యాటక రాష్ట్రంగా ప్రకటించింది. సాహస క్రీడలు, సాహసోపేతమైన ప్రయాణం, వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నందుకు గాను రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది.
- సమాధానం: 2
48. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స - 2018లో తొలి స్థానంలో ఉన్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది ?
1) యునెటైడ్ కింగ్డమ్
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) కెనడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ - 2018లో యూకేలోని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ తొలి స్థానంలో ఉంది. అదే దేశంలోని కేంబ్రిడ్జ్ యూనివర్సీటీ రెండో స్థానంలో, అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,102 యూనివర్సిటీలకు ర్యాంకింగ్స ఇవ్వగా భారత్‌లోని 42 యూనివర్సిటీలు, సాంకేతిక విద్యాసంస్థలు ఇందులో ర్యాంకు పొందాయి. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ సెన్సైస్ 25-300 మధ్య ర్యాంకులో ఉంది.
- సమాధానం: 1
49. సుందర్బన్ అడవుల్లో జీవ వైవిధ్య సమాచారంతో కూడిన తొలి నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది ?
1) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) మెటరోలాజిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
3) వైడ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
4) ఇండియన్ యానిమల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండియన్ సుందర్బన్ అడవుల్లోని జీవ వైవిధ్యం సమాచారంతో కూడిన తొలి జాబితాను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించింది. పశ్చిమబెంగాల్ లోని 9,630 చదరపు కిలోమీటర్ల మేర ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో 2,626 జంతు జాతులు ఉన్నాయి. వీటిలో బెంగాల్ పులి, గ్యాంగ్ టిక్ డాల్ఫిన్, గ్రే అండ్ మార్ష్ మంగూస్, వైల్డ్ రీసస్ కోతి తదితర జంతువులు ఉన్నాయి. భారత్‌లో జంతువుల సమాచార సేకరణ, క్రోడీకరణ కోసం 1916లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
50. ఇటీవల ఏ రాష్ట్రం అంతరించిపోతున్న మూషిక జింకల సంరక్షణకు చర్యలు చేపట్టి వాటిని తిరిగి అడవిలో వదిలిపెట్టింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అంతరించిపోతున్న మూషిక జింకల సంరక్షణకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక పద్ధతుల ద్వారా వాటి సంఖ్యను పెంచి ఇటీవల 8 మూషిక జింకలను నల్లమల అడవుల్లో వదిలి పెట్టింది.
- సమాధానం: 1