కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 22-28, 2020)
జాతీయం:
1. ఆయుష్ వ్యవస్థలను ఐసీడీఎస్‌తో అనుసంధానించడానికి ఏ మంత్రిత్వ శాఖ ఆయుష్ మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకుంది?
1) మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2) ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3) పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) సామాజిక న్యాయం, మహిళా సాధికారత మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 1
2. ప్రభుత్వ అధికారుల జ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యాలను అభివ`ద్ధి చేయడానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (ISPP)తో ఏ సంస్థ ఒప్పందం చేసుకోంది?
1) ఫైనాన్స్ కమిషన్ (ఎఫ్‌సీ)
2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)
3) జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ)
4) నీతి ఆయోగ్
- View Answer
- సమాధానం: 4
3. 2020-21 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంత ఆహార ధాన్యం ఉత్పత్తి లక్ష్యంగా నిర్ధేశించుకుంది?
1) 255 మెట్రిక్ టన్నులు
2) 310 మెట్రిక్ టన్నులు
3) 390 మెట్రిక్ టన్నులు
4) 301 మెట్రిక్ టన్నులు
- View Answer
- సమాధానం: 4
4. నైతిక ఏఐ, బ్లాక్ చైన్, సైబర్ భద్రతపై కొత్త విధానాలు ఏర్పాటు చేసిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
5. కిష్త్వార్‌లో ఎయిర్‌స్ట్రిప్‌ను ఏర్పాటు చేయడానికి భారత సైన్యంతో ఏ రాష్ట్రం/యూటీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఉత్తరాఖండ్
2) జమ్మూ&కాశ్మీర్
3) లద్దాఖ్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
6. కోవిడ్-19ను ఎదుర్కోవటానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధిని 35% నుంచి ఎంత శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది?
1) 60%
2) 40%
3) 50%
4) 75%
- View Answer
- సమాధానం: 3
7. యాదాద్రి రైల్వే స్టేషన్‌గా పేరు మార్చిన రాయదుర్గ్ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) తెలంగాణ
2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్
4) గోవా
- View Answer
- సమాధానం: 1
8. భారతదేశపు మొట్టమొదటి కోస్ట్ గార్డ్ అకాడమీ ఏ నగరంలో నిర్మిస్తున్నారు?
1) కోయంబత్తూర్
2) లక్నో
3) న్యూ ఢిల్లీ
4) మంగళూరు
- View Answer
- సమాధానం: 4
9. యూరోపియన్ యూనియన్ దేశాల సహకారంతో సుమారు 1226 కోట్ల రూపాయల విలువైన 2 ప్రధాన హరిత ప్రాజెక్టులను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) తెలంగాణ
2) కేరళ
3) గుజరాత్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
10. దేశంలో మొట్టమొదటి వైద్య పరికరాల పార్కు నిర్మాణానికి ఇటీవల ఏ రాష్ట్రం పునాది వేసింది?
1) ఉత్తర ప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్
3) ఛత్తీస్‌గఢ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
11. ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి హెర్బల్ ఇండస్ట్రీ సంస్థలతో ఏ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
3) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) ఆయుష్ మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
12. సంక్రమించని వ్యాధులకు సంబంధించిన ఎస్డీజీల పట్ల చేసిన కృషికి యూఎన్ ఇంటరాజెన్సీ టాస్క్ ఫోర్స్ (యూఎన్ఐఎటీఎఫ్) అవార్డు 2020ను గెలుచుకున్న రాష్ట్రం ఏది?
1) ఉత్తర ప్రదేశ్
2) తమిళనాడు
3) పశ్చిమ బెంగాల్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
13. రాఫెల్ పోరాట విమానంలో ప్రయాణించిన మొదటి మహిళా ఫైటర్ పైలట్ ఎవరు?
1) అవని చతుర్వేది
2) భవన కాంత్
3) శివంగి సింగ్
4) మింటీ అగర్వాల్
- View Answer
- సమాధానం: 3
14. విద్యార్థుల కోసం ‘యూ-రైజ్’ పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం/యూటీ ప్రభుత్వం ఏది?
1) జమ్మూకశ్మీర్
2) పంజాబ్
3) ఉత్తర ప్రదేశ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 3
15. విద్యార్థుల కోసం ‘యూ-రైజ్’ పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం/యూటీ ప్రభుత్వం ఏది?
1) జమ్మూకశ్మీర్
2) పంజాబ్
3) ఉత్తర ప్రదేశ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 3
16. నీతి ఆయోగ్‌తో కలిసి ఏ ఏజెన్సీ ‘సస్టైనబుల్ రికవరీపై ప్రత్యేక నివేదిక’ పోస్ట్ కోవిడ్-19ను ప్రారంభించింది?
1) అంతర్జాతీయ కార్మిక సంస్థ
2) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)
3) బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్
4) అంతర్జాతీయ శక్తి సంస్థ
- View Answer
- సమాధానం: 4
17. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది?
1) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2) రక్షణ మంత్రిత్వ శాఖ
3) రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
4) నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 3
అంతర్జాతీయం:
18. భారతదేశం మరియు ఏ దేశం మధ్య “ఎమ్సీపీ లింజ్” అనే మొదటి ప్రత్యక్ష కార్గో ఫెర్రీ నౌకను ప్రయోగించారు?
1) సీషెల్స్
2) మాల్దీవులు
3) శ్రీలంక
4) మాలి
- View Answer
- సమాధానం: 2
19. కోవిడ్-19ను ఎదుర్కోవడానికి మాల్దీవులకు భారతదేశం ఎంత మొత్తాన్ని కేటాయించింది?
1) USD 150 మిలియన్
2) USD 250 మిలియన్
3) USD 100 మిలియన్
4) USD 500 మిలియన్
- View Answer
- సమాధానం: 2
20. ఇటీవల మన కొంకణ్ రైల్వే రెండు ఆధునిక డీజిల్-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డీఎంయూసీ) రైళ్లను ఏ దేశానికి పంపింది?
1) భూటాన్
2) బంగ్లాదేశ్
3) మాల్దీవులు
4) నేపాల్
- View Answer
- సమాధానం: 4
21. కపిల్వాస్తు జిల్లాలో భారతదేశం ఏ దేశంతో కలిసి జాయిన్ సెక్యూరిటీ పెట్రోలింగ్‌ని ప్రారంభించింది?
1) భూటాన్
2) నేపాల్
3) పాకిస్తాన్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 2
22. నీటి సంరక్షణపై భారతదేశం ఏ దేశంతో నీటి భాగస్వామ్య ఫోరం నిర్వహించింది?
1) యూకే
2) యూఎస్ఏ
3) ఇజ్రాయెల్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
23. విమానాశ్రయ విస్తరణకు సంబంధించి విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ దేశంలో పనులు ప్రారంభించింది?
1) మాల్దీవులు
2) మారిషస్
3) నేపాల్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 1
24. భూకంపానంతర పునర్నిర్మాణ సహాయం కోసం భారతదేశం 96 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఏ దేశానికి ప్రకటించింది?
1) నేపాల్
2) భూటాన్
3) మారిషస్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 1
25. మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్)లో సహకారాన్ని పెంచడానికి భారత్‌తో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) డెన్మార్క్
2) ఇజ్రాయెల్
3) జర్మనీ
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
ఆర్థిక వ్యవస్థ:
26. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించటానికి బిడ్ గెలిచిన సంస్థ ఏది?
1) రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
2) టాటా ప్రాజెక్టులు
3) లార్సెన్ & టర్బో ఇన్ఫ్రాస్ట్రక్చర్
4) జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
- View Answer
- సమాధానం: 2
27. ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ఎఫ్వై-22 (2021-2022)లో భారతదేశ నామమాత్రపు జీడీపీలో పెరుగుదల ఎంత?
1) 19%
2) 21%
3) 17%
4) 15%
- View Answer
- సమాధానం: 1
28. గూగుల్ పే ప్లాట్ఫామ్లో కస్టమర్లు తమ కార్డులను ఉపయోగించుకునేలా గూగుల్‌తో ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది?
1) ఐసీఐసీఐ కార్డు
2) పీఎన్బబీ కార్డు
3) ఎస్బీఐ కార్డు
4) ఐఓబీ కార్డు
- View Answer
- సమాధానం: 3
29. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా భారతదేశంలో గ్రాంట్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఐఫండ్ ఉమెన్‌తో ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది?
1) వీసా
2) మాస్టర్ కార్డ్
3) చేజ్
4) అమెరికన్ ఎక్స్‌ప్రెస్
- View Answer
- సమాధానం: 1
30. యూఎన్సీటీఎడీ అంచనా ప్రకారం 2020లో భారత ఆర్థిక వ్యవస్థలో తగ్గుదల ఎంత?
1) 3.2%
2) 7.3%
3) 5.9%
4) 11.6%
- View Answer
- సమాధానం: 3
31. టెక్ ఇన్నోవేషన్ & స్టార్ట్-అప్ల విషయంలో సహకరించడానికి ఏ దేశంతో సెంట్రల్ ఇండియా ఐక్రియేట్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
1) ఇరాన్
2) జార్జియా
3) ఇజ్రాయెల్
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
-
32. కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ ఆధారిత చెల్లింపు కోసం “సేఫ్ పే” అనే డిజిటల్ ఫెసిలిటీని ప్రారంభించిన బ్యాంక్ ఏది?
1) ఎస్బీఐ బ్యాంక్
2) ఐసీఐసీఐ బ్యాంక్
3) ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్
4) కోటక్ మహీంద్రా బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
33. పట్టణ సహకార బ్యాంకుల (యుసీబీ)2020-2023 కోసం “టెక్నాలజీ విజన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ”ను విడుదల చేసిన సంస్థ ఏది?
1) ఫైనాన్స్ కమిషన్
2) నీతి ఆయోగ్
3) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) జాతీయ అభివృద్ధి మండలి
- View Answer
- సమాధానం: 3
34. ఏ ఐపీఎల్ బృందంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ భాగస్వామ్యమై మై టీమ్ కార్డులను ప్రారంభించింది?
1) కోల్‌కతా నైట్ రైడర్స్
2) ముంబై ఇండియన్స్
3) కింగ్స్ ఎలెవన్ పంజాబ్
4) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం:
35. భారతదేశంలో మొట్టమొదటి CRISPR పరీక్షను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
2) ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ
3) నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
4) ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ
- View Answer
- సమాధానం: 4
36. నాసా నేతృత్వంలో జరిగిన అధ్యయనం ప్రకారం గ్రీన్ హౌస్ ఉద్గారాల కారణంగా సముద్ర మట్టం సుమారు 2100 నాటికి ఎంత పెరుగుతుందని అంచనా?
1) 38 సెం.మీ.
2) 15 సెం.మీ.
3) 21 సెం.మీ.
4) 27 సెం.మీ.
- View Answer
- సమాధానం: 1
37. ఒడిశాలోని ఐటీఆర్ నుంచి అభ్యాస్ - హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ (హీట్)విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించిన సంస్థ ఏది?
1) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడీఐసీ)
2) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)
3) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)
4) నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)
- View Answer
- సమాధానం: 2
38. దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ గైడెడ్ యాంటిటాంక్ గైడెడ్ క్షిపణిని ఏ ప్రధాన బ్యాటిల్ ట్యాంక్ నుంచి DRDO విజయవంతంగా పరీక్షించింది?
1) కర్ణ
2) భీష్ముడు
3) అజయ
4) అర్జున్
- View Answer
- సమాధానం: 4
39. ఒడిశాలోని చండీపూర్ నుంచి రాత్రిపూట ప్రయోగించిన దేశీయంగా అభివృద్ధి చెందిన క్షిపణి ఏది?
1) బ్రహ్మోస్- IV
2) ప్రహార్- II
3) పృథ్వీ- II
4) శౌర్య- I
- View Answer
- సమాధానం: 3
40. రెండో ఉపగ్రహ ప్రయోగానికి మొమెంటస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థ ఏది?
1) పిక్సెల్
2) ఆస్ట్రోమ్
3) బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్
4) వెస్టా స్పేస్
- View Answer
- సమాధానం: 1
41. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ (UNU-EHS), బాండ్నిస్ ఎంట్విక్లంగ్ హిల్ఫ్ట్ విడుదల చేసిన వరల్డ్ రిస్క్ ఇండెక్స్ (WRI) 2020లో భారతదేశం ర్యాంక్ ఏమిటి?
1) 89
2) 121
3) 97
4) 66
- View Answer
- సమాధానం: 1
42. తూర్పు భారత మహాసముద్ర ప్రాంతంలో భారత నావికాదళం ఏ దేశంతో కలిసి 2 రోజుల సుదీర్ఘ పాసేజ్ ఎక్సర్సైజ్ (పాసెక్స్)ను నిర్వహించింది?
1) యునైటెడ్ కింగ్డమ్
2) ఆస్ట్రేలియా
3) జర్మనీ
4) స్పెయిన్
- View Answer
- సమాధానం: 2
43. ఐఓటీ పరికరాల కోసం “మౌషిక్” అనే స్వదేశీ మైక్రో ప్రాసెసర్‌ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) ఐఐటీ ఢిల్లీ
2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ రోపర్
4) ఐఐటీ అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 2
44. 2020 దాటి జీవవైవిధ్యంపై వర్చువల్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ డైలాగ్‌ను నిర్వహించిన దేశం ఏది?
1) ఇటలీ
2) జపాన్
3) చైనా
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 3
45. హైటెక్ ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారతదేశం ఏ దేశంతో భాగస్వామ్యం కుదుర్చకుంది?
1) ఇజ్రాయెల్
2) టర్కీ
3) యుకె
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
నియామకాలు:
46. మాలి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) ఔమర్ టాటం లై
2) బాహ్ న్డావ్
3) మౌసా మారా
4) అస్సిమి గోయితా
- View Answer
- సమాధానం: 2
47. సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సెబీ సాంకేతిక సమూహానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) పుష్ప అమన్ సింగ్
2) ఇంగ్రిడ్ శ్రీనాథ్
3) హర్ష్ కుమార్ భన్వాలా
4) షాజీ కృష్ణన్
- View Answer
- సమాధానం: 3
48. ఖుషీ చిందాలియాను భారత గ్రీన్ అంబాసిడర్‌గా నియమించిన సంస్థ ఏది?
1) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP)
2) అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)
3) ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూనీడో)
4) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డీపీ)
- View Answer
- సమాధానం: 1
49. బెలారస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు?
1) నికోలాయ్ లుకాషెంకో
2) ఇరినా అబెల్స్కయా
3) అలెగ్జాండర్ లుకాషెంకో
4) డిమిత్రి అలెక్సాండ్రోవిచ్
- View Answer
- సమాధానం: 3
50. ఇటీవల ఎసెర్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) అమితాబ్ బచ్చన్
2) సోను సూద్
3) సల్మాన్ ఖాన్
4) రణవీర్ సింగ్
- View Answer
- సమాధానం: 2
51. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్)కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు?
1) సందీప్ కృష్ణ
2) పవన్ శర్మ
3) రమేష్ టెండూల్కర్
4) రజత్ సుద్
- View Answer
- సమాధానం: 4
52. సోమాలియా కొత్త ప్రధాని ఎవరు?
1) హసన్ షేక్ మహమ్మద్
2) మహమ్మద్ హుస్సేన్ రోబుల్
3) షరీఫ్ షేక్ అహ్మద్
4) హసన్ అలీ ఖైర్
- View Answer
- సమాధానం: 2
53. యుద్ధనౌకల్లో పనిచేసే మొదటి భారతీయ మహిళా పరిశీలకురాలు ఎవరు?
1) కుముదిని త్యాగి
2) రితి సింగ్
3) పరుల్ భరద్వాజ్
4) 1 మరియు 2
- View Answer
- సమాధానం: 4
క్రీడలు:
54. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఎఎఫ్సీ) టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) అమిత్ రంజన్ దేవ్
2) సుబ్రతా దత్తా
3) గిరిజా శంకర్ ముంగలి
4) ప్రఫుల్ పటేల్
- View Answer
- సమాధానం: 3
55. ఇటాలియన్ ఓపెన్ 2020లో పురుషుల సింగిల్స్ విభాగంలో ఛాంపియన్ ఎవరు?
1) రాఫెల్ నాదల్
2) డొమినిక్ థీమ్
3) నోవాక్ జొకోవిచ్
4) డియెగో స్క్వార్ట్జ్మెన్
- View Answer
- సమాధానం: 3
56. కిందివారిలో 2019- 2020కి ఏఐఎఫ్ఎఫ్ ఉమెన్స్ ఫుట్‌బాల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది ఎవరు?
1) సంగితా బస్ఫోర్
2) అదితి చౌహాన్
3) హర్మన్‌ప్రీత్ కౌర్
4) సంజు యాదవ్
- View Answer
- సమాధానం: 4
ముఖ్యమైన తేదీలు:
57. ఏటా సెప్టెంబర్ 22న పాటించే ప్రపంచ రినో దినోత్సవ థీమ్?
1) “ఐదు ఖడ్గమృగం జాతులు ఎప్పటికీ”
2) “ఖడ్గమృగాలను కాపాడండి”
3) “ఖడ్గమృగాలతో పర్యావరణ సమతుల్యత”
4) “ఐదు ఖడ్గమృగాలు”
- View Answer
- సమాధానం: 1
58. క్యాన్సర్ బారిన పడిన రోగుల్లో జీవితం పట్ల నమ్మకం కలిగించేందుకు ఉద్ధేశించిన ప్రపంచ రోజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 22
2) సెప్టెంబర్ 23
3) సెప్టెంబర్ 24
4) సెప్టెంబర్ 29
- View Answer
- సమాధానం: 1
59. ఏటా సెప్టెంబర్ 23న పాటించే అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవ థీమ్ ఏంటి?
1) “సైన్ లాంగ్వేజ్ ఫర్ ఆల్”
2) “ విత్ సైన్ లాంగ్వేజ్, ఏవిరివన్ ఇన్‌క్లూడెడ్!”
3) “సంకేత భాషలు అందరి కోసం!”
4) “సంకేత భాషపై హక్కులు అందరివి!”
- View Answer
- సమాధానం: 3
60. సెప్టెంబర్ 24న పాటించిన 2020 ప్రపంచ సముద్ర దినోత్సవ థీమ్ ఏంటి?
1) “ఓడలు, ఓడరేవులు, ప్రజలను కలుపుతుంది”
2) “IMO 70: మా వారసత్వం - మంచి భవిష్యత్తు కోసం మంచి షిప్పింగ్”
3) “సముద్రయానంలో మహిళలను ప్రోత్సహించడం”
4) “సస్టైనబుల్ ప్లానెట్ కోసం సస్టైనబుల్ షిప్పింగ్”
- View Answer
- సమాధానం: 4
61. భారతదేశమంతటా అంత్యోదయ దివాస్‌ను ఎప్పుడు జరుపుకున్నారు?
1) సెప్టెంబర్ 30
2) సెప్టెంబర్ 25
3) సెప్టెంబర్ 28
4) సెప్టెంబర్ 22
- View Answer
- సమాధానం: 2
62. ఏటా ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం (డబ్ల్యుసీడీ) ఎప్పుడు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 26
2) సెప్టెంబర్ 25
3) సెప్టెంబర్ 24
4) సెప్టెంబర్ 27
- View Answer
- సమాధానం: 1
63.ఏటా సెప్టెంబర్ 27న జరుపుకునే 2020 ప్రపంచ పర్యాటక దినోత్సవ థీమ్ ఏంటి?
1) “పర్యాటకం, గ్రామీణాభివృద్ధి”
2) “టూరిజం అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్”
3) “టూరిజం అండ్ జాబ్స్: అందరికీ మంచి భవిష్యత్తు”
4) “అందరికీ పర్యాటకం: సార్వత్రిక ప్రాప్యతను ప్రోత్సహించడం”
- View Answer
- సమాధానం: 1
అవార్డులు అండ్ హానర్స్:
64. వైద్య విద్యలో ఐజీ నోబెల్ బహుమతి 2020 గెలుచుకున్నది ఎవరు?
1) డోనాల్డ్ ట్రంప్
2) నరేంద్ర మోదీ
3) వ్లాదిమిర్ పుతిన్
4) అందరూ
- View Answer
- సమాధానం: 4
65. “వాయిస్ ఆఫ్ డిసెంట్” పుస్తక రచయిత ఎవరు?
1) అమిత కనకర్
2) సుమేధ వర్మ
3) రోమిలా థాపర్
4) సుజాతా మాస్సే
- View Answer
- సమాధానం: 3
66. WAN-IFRA 2020 గోల్డెన్ పెన్ ఆఫ్ ఫ్రీడం అవార్డు ఎవరు గెలుచుకున్నారు?
1) జినేత్ బెడోయా
2) జమాల్ ఖాషోగ్గి
3) శ్రీనివాసన్ బాలసుబ్రమణియన్
4) విన్సెంట్ పెరోగ్నే
- View Answer
- సమాధానం: 1
67. కిందివాటిలో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో 2020 సంబంధించి అత్యంత ప్రభావవంతమైన 100 మందిలో ఉన్నది ఎవరు?
1) వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి
2) మహువా మొయిత్రా
3) ఎంఎస్ ధోని
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 4
68. క్యాన్సర్ పరిశోధన, కొత్త ఔషధాల ఆవిష్కరణకు ఇనాగ్రల్ ఏఐ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) రెజీనా బార్జిలే
2) రేమండ్ “రే” కుర్జ్వీల్
3) డెమిస్ హసాబిస్
4) జాఫ్రీ ఇ హింటన్
- View Answer
- సమాధానం: 1
69. భారతదేశపు అత్యున్నత అక్షరాస్యత పురస్కారమైన జ్ఞానపిఠ్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు?
1) సరస్వతి సమ్మన్
2) అక్కితం అచ్యుతన్ నంబూతిరి
3) సాహిత్య అకాడమీ ఫెలోషిప్
4) వ్యాస్ సమ్మన్
- View Answer
- సమాధానం: 2
70. “కిచెన్స్ ఆఫ్ కృతజ్ఞత” పుస్తక రచయిత ఎవరు?
1) మాధుర్ జాఫ్రీ
2) వికాస్ ఖన్నా
3) సంజీవ్ కపూర్
4) రణవీర్ బ్రార్
- View Answer
- సమాధానం: 2