కరెంట్ అఫైర్స్ (ఫిబ్రవరి 1 - 7) బిట్ బ్యాంక్
1. తెలంగాణ చేనేత ప్రచారకర్తగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) రకుల్ ప్రీత్ సింగ్
2) సమంత
3) సానియా మిర్జా
4) ఇలియానా
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలంగాణలోని ఇక్కత్ సహా ఇతర చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం సమంత కృషి చేస్తారు.
- సమాధానం: 2
2. 2016-17 ఆర్థిక సర్వే ప్రకారం ఆరోగ్య సూచీలో తొలిస్థానంలో ఉన్న రాష్ట్రం ?
1) కేరళ
2)తమిళనాడు
3)మహారాష్ట్ర
4)ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆయుర్ధాయం, మాతా శిశు మరణాల ప్రాతిపదికన ఆరోగ్య సూచీలను రూపొందించారు. దీని ప్రకారం జాతీయ స్థాయి ఆరోగ్య సూచీ 0.6 శాతంగా నమోదైంది. ఈ జాబితాలో కేరళ తొలి స్థానంలో నిలవగా తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 1
3. సెయింట్ పీటర్స్ బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరమ్ సమావేశానికి ఏ దేశాన్ని అతిథిగా ఆహ్వానించారు ?
1) కెనడా
2) చైనా
3) భారత్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
4. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఇటీవల యునిసెఫ్ ప్రారంభించిన ప్రాజెక్టు వ్యయం ఎంత ?
1) రూ.10 కోట్లు
2) 1 బిలియన్ డాలర్లు
3) 2 బిలియన్ డాలర్లు
4) 3.3 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, అంతర్యుద్ధాలు తదితర పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా అనాథలైన 48 మిలియన్ల చిన్నారుల సంరక్షణ కోసం 3.3 బిలియన్ డాలర్ల వ్యయంతో యునిసెఫ్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో 1.4 మిలియన్ డాలర్లను సిరియాలోని శరణార్థుల శిబిరంలో ఉన్న అనాథ పిల్లల రక్షణకు ఉపయోగిస్తారు.
- సమాధానం: 4
5. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) ఓంటారియో
2) టొరంటో
3) రోటర్ డ్యామ్
4) ఫ్లోరిడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: టెస్లా మోటర్స్, సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ సంయుక్తంగా ప్రపంచంలోనే పెద్దదైన బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో 396 స్టాక్ యూనిట్లను అమర్చారు. ఇది శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తుంది.
- సమాధానం: 1
6. జాతీయ వ్యవస్థాపకత అవార్డుల్లో ఉత్తమ ఐటీ స్టార్టప్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది ?
1) సర్వేయర్
2) ఇలిమా టెక్నో
3) ల్యూసిడైస్
4) జునో
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్పెన్యుర్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ వ్యవస్థాపకత అవార్డులు-2016 ప్రదానోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించారు.
- సమాధానం: 3
7. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ గవర్నెన్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రం ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణతో పాటు రాజస్థాన్ కూడా ఈ గవర్నెన్స్ అవార్డుకు ఎంపికైంది. సీఎస్ఐ-నిహిలెంట్ సంస్థలు సంయుక్తంగా ఏటా ఈ అవార్డును అందజేస్తాయి.
- సమాధానం: 1
8. స్వచ్ఛ భారత్ అభియాన్ సౌహార్ధ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) ప్రియాంక చోప్రా
2) దీపికా పదుకొన్
3) అనుష్క శర్మ
4) ఆసిన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ భారత్ అభియాన్ మహిళా రాయబారిగా అనుష్క శర్మను నియమించింది. ఆమె అమితాబ్ బచ్చన్‌తో కలిసి జాతీయ ఆరోగ్య, శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- సమాధానం: 3
9. ఇండియా నూతన ఆవిష్కరణ ఇండెక్స్‌ను తయారు చేసిన సంస్థ ఏది ?
1) నీతి ఆయోగ్
2) అసోచామ్
3) ఫిక్కీ
4) ల్యూసిడ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఆవిష్కరణలను పరిగణలోకి తీసుకొని ఇండియా నూతన ఆవిష్కరణ ఇండెక్స్‌ను నీతి అయోగ్ తయారు చేసింది. ఇందుకోసం డిపార్టమెంట్ ఆఫ్ ఇండస్టీరియల్ పాలసీ అండ్ ప్రమోషన్, కాన్ఫడరేషన్ ఆప్ ఇండియన్ ఇండస్ట్రీస్ సహకారం అందించాయి.
- సమాధానం: 1
10. 31వ సూరజ్ కుంద్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) హైదరాబాద్
2) ఫరీదాబాద్
3) పాటియాలా
4) చండీగఢ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ మేళా జరిగిన ప్రాంతంలో జార్ఖండ్ వీరుడు బీర్సాముండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 1-15 వరకూ ఈ మేళా జరిగింది.
- సమాధానం: 2
11. మహిళా సాధికారత కోసం ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేయనున్న భారతీయ గాయకురాలు ఎవరు ?
1) సునిధి చౌహాన్
2) ఆశా భోంస్లే
3) సుచిత్ర
4) నితి మోహన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన Music to Inspire - Artists United Against Human Trafficking ప్రాజెక్టులో నితి మోహన్ భాగస్వామిగా చేరారు.
- సమాధానం: 4
12. అమెరికా తరహాలో ఇటీవల ఏ దేశం 5 ముస్లిం దేశాల ప్రజలకు వీసాలు నిరాకరించింది ?
1) సౌదీ అరేబియా
2) కువైట్
3) ఆజర్ బైజాన్
4) బెల్జియం
- View Answer
- సమాధానం: 2
వివరణ: భద్రతా కారణాలతో కువైట్.. సిరియా, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల ప్రజలకు వీసాలు నిరాకరించింది.
- సమాధానం: 2
13. ఆసియా అత్యుత్తమ బ్రాండ్-2016కు ఎంపికైన భారతీయ వైమానిక సంస్థ ఏది ?
1) ఇండిగో
2) గో ఎయిర్
3) ట్రూ జెట్
4) స్పైస్ జెట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సింగపూర్ యూఆర్ఎస్ మీడియా గ్రూప్ ప్రదానం చేసే ఆసియా వన్ పురస్కారాలలో భాగంగా ఆసియా అత్యుత్తమ బ్రాండ్-2016గా స్పైస్ జెట్ ఎంపికైంది. గ్లోబల్ ఆసియాన్ ఆఫ్ ది ఇయర్ 2016 అవార్డు స్పైస్ జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అజయ్ సింగ్‌కు దక్కింది.
- సమాధానం: 4
14. జూనియర్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో ఉన్న క్రీడాకారుడు ఎవరు ?
1) లక్ష్యసెన్
2) చిరాగ్ సేన్
3) బాయ్ హోళి
4) హంగ్ లి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్యసేన్ ఈ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్నాడు.
- సమాధానం: 1
15. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 8
2) ఫిబ్రవరి 6
3) ఫిబ్రవరి 4
4) ఫిబ్రవరి 2
- View Answer
- సమాధానం: 4
వివరణ: వరదలు, కరువు, తుపానుల ప్రభావాన్ని చిత్తడి నేలలు తగ్గిస్తాయి. అందుకే వీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 2న చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2017 థీమ్- విప్తత్తు నిర్వహణ కోసం చిత్తడి నేలలు.
- సమాధానం: 4
16. అంతర్జాతీయ నాటకోత్సవాలు ఎక్కడ నిర్వహించారు ?
1) బీజింగ్
2) న్యూఢిల్లీ
3) లాసా
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారతీయ రంగ్ మహోత్సవ్ పేరుతో అంతర్జాతీయ నాటకోత్సవాలను 21 రోజుల పాటు న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో 16 రాష్ట్రాల కళారూపాలు, 12 దేశాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు.
- సమాధానం: 2
17. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం ఇండియన్ రైల్వే ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) బ్రెజిల్
2) సింగపూర్
3) ఇటలీ
4) అమెరికా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇటలీ ప్రభుత్వ సంస్థ ఎఫ్ఎస్ గ్రూప్‌తో ఇండియన్ రైల్వే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రైల్వేలో భద్రతా ప్రమాణాల పెంపు కోసం ఆ సంస్థ సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది.
- సమాధానం: 3
18. బ్రాండ్ ఫైనాన్స్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్500 జాబితాలో తొలిస్థానంలో ఉన్న సంస్థ ఏది ?
1) అమెజాన్
2) ఆపిల్
3) గూగుల్
4) మైక్రోసాఫ్ట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న గూగుల్ గతేడాది కంటే 24 శాతం వృద్ధి నమోదు చేసింది. రెండో స్థానంలో ఉన్న ఆపిల్ బ్రాండ్ విలువ 27 శాతం తగ్గి 107 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉంది. ఆ తర్వాతి స్థానంలో అమెజాన్, ఏటి అండ్ టి, మైక్రోసాఫ్ట్‌లు ఉన్నాయి.
- సమాధానం: 3
19. ఏ పండు చిన్న పిల్లల మరణానికి కారణం అవుతుందని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు ?
1) లీచిపండు
2) బేరిపండు
3) ఫిరంగి పండు
4) జుజుబి పండు
- View Answer
- సమాధానం: 1
వివరణ: లీచి పండు hypoglycin A, methylene cyclopropyl - glycine ఉంటాయని అమెరికా, భారతీయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పండు తిని రాత్రి వేళ భోజనం చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి 70 mg/dl కంటే తగ్గి ప్రాణం పోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీని వల్ల పిల్లల్లో ఎక్కువగా మరణాలు సంభవిస్తాయి.
- సమాధానం: 1
20. ప్రపంచ రెజ్లింగ్ కప్ 2017 పోటీలు ఎక్కడ నిర్వహించారు ?
1) బుడా పెస్ట్
2) కేర్మన్ షా
3) బుకా రెస్ట్
4) వియన్నా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇరాన్‌లోని కెర్మెన్ షాలో ఈ పోటీలు నిర్వహించారు.
- సమాధానం: 2
21. ఐరాస సాధారణ సభ జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్లో ఇటీవల సభ్యునిగా నియమితులైన భారతీయుడు ఎవరు ?
1) శశిథరూర్
2) అతుల్ ఖరే
3) సుబ్రమణ్య జై శంకర్
4) గోపినాథన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐరాస జాయింట్ ఇన్స్పెక్షన్ యునిట్ లో సభ్యునిగా గోపీనాథన్ తిరిగి నియమితులయ్యారు. ఈయన 5 ఏళ్లపాటు ఈ బాధ్యతల్లో ఉంటారు. ఇతనితో పాటు సుఖయ్ ఫ్రోమ్ జాక్సన్(గాంబియా), నికొలయై లో జిన్స్కి (రష్యా), జీన్ వెస్లీ కాజియావ్ (హైతి) సభ్యులుగా నియమితులయ్యారు.
- సమాధానం: 4
22. ఇంటిగ్రేటెడ్ అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్వైల్లెంస్ సిస్టంను ఎక్కడ ప్రారంభించారు ?
1) ముంబయి
2) కొచ్చిన్
3) విశాఖపట్నం
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 1
వివరణ: నౌకశ్రయ రక్షణ, నౌకల భద్రత కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
23. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 1
2) ఫిబ్రవరి 2
3) ఫిబ్రవరి 4
4) ఫిబ్రవరి 6
- View Answer
- సమాధానం: 3
వివరణ: క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ మార్గాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్సలను తెలియజేసే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
2017 థీమ్ - We Can, I Can
- సమాధానం: 3
24. ఇటీవల విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి సూచీల్లో తొలి స్థానంలో ఉన్న జిల్లా ఏది ?
1) పశ్చిమ గోదావరి
2) కృష్ణా
3) నెల్లూరు
4) చిత్తూరు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవన స్థితిగతులపై సెస్ మానవాభివృద్ధి సూచీని విడుదల చేసింది. ఇందులో నెలవారీ తలసరి ఆదాయం, శిశు మరణాలు, 15 ఏళ్ల లోపు పిల్లల అక్షరాస్యత, 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో పాఠశాల హాజరు, నిరుద్యోగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
- సమాధానం: 2
25. 91వ భారతీయ యూనివర్సిటీల అసోసియేషన్ సదస్సుని ఎక్కడ నిర్వహించారు ?
1) అనంతపురం
2) విశాఖపట్నం
3) విజయవాడ
4) తిరుపతి
- View Answer
- సమాధానం: 4
వివరణ: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ సదస్సు జరిగింది.
- సమాధానం: 4
26. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18 ఆర్థిక బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు ఎన్ని నిధులు కేటాయించారు ?
1) రూ.1,729 కోట్లు
2) రూ.3,406 కోట్లు
3) రూ.5,135 కోట్లు
4) రూ.2,680 కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ నిధుల్లో తెలంగాణకు రూ.1,729 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 3,406 కోట్లు కేటాయించారు. 106 కి.మీ. పొడవైన విజయవాడ-అమరావతి-గుంటూరు రైల్వే మార్గానికి రూ.2,680 కోట్లు కేటాయించారు.
- సమాధానం: 3
27. 14వ బయో ఏసియా సదస్సుని ఎక్కడ నిర్వహించారు ?
1) హైదరాబాద్
2) విశాఖపట్నం
3) తిరుపతి
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ సదస్సు ద్వారా తుర్కపల్లి పారిశ్రామిక వాడలోని జీనోం వ్యాలీకి రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- సమాధానం: 1
28. బ్రటిన్ దేశపు అత్యున్నత పురస్కారం "కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్" కు ఎవరు ఎంపికయ్యారు ?
1) సచిన్ టెండూల్కర్
2) ఆండిముర్రే
3) అలెస్టర్ కుక్
4) రికీ పాంటింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఇంగ్లండ్ యువరాజు చార్లెస్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కళలు, సైన్స్, ధార్మిక కార్యక్రమాలు, ప్రజా సేవ వంటి విభాగాల్లో ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
- సమాధానం: 3
29. 2017లో ఆసియా మహిళల బాస్కెట్ బాల్ కప్‌ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు ?
1) చైనా
2) భారత్
3) మయన్మార్
4) థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: FIBA మహిళల బాస్కెట్ బాల్ కప్ టోర్నమెంట్‌ను 2017 జూలై 23 నుంచి 29 వరకూ బెంగళూరులో నిర్వహించనున్నారు.
- సమాధానం: 2
30. ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న దేశం ఏది ?
1) మలేషియా
2) భారత్
3) హాంకాంగ్
4) తైవాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: హాంకాంగ్‌లో జరిగిన ఆసియాన్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో మలేషియా జట్టుని ఓడించి భారత్ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది.
- సమాధానం: 2
31. సాహిత్య మానిషా పుస్తక రచయిత ఎవరు ?
1) బిషమ్ సాని
2) నిర్మల్ వర్మ
3) గోపాల్ దాస్ నీరజ్
4) పాధాని పట్నాయక్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ సాహితీవేత్త పాధాని పట్నాయక్ 2010లో కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. వందలాది పుస్తకాలు రచించిన ఆయన 2017 ఫిబ్రవరి 4వ తేదీన మరణించారు.
- సమాధానం: 4
32. 2020 నాటికి మార్స్ మీదకు మానవ రహిత నౌకను పంపుతామని ఇటీవల ఏ దేశం ప్రకటించింది ?
1) జపాన్
2) రష్యా
3) యూఏఈ
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మార్స్ మీదకు పంపే మానవ రహిత నౌకను యూఏఈ తయారు చేయనుంది. దీన్ని 2020లో జపాన్ స్పేస్ సెంటర్ నుంచి పంపుతామని యూఏఈ ప్రకటించింది.
- సమాధానం: 3
33. ఏ నూతన ఫంగస్ వ్యాధి వల్ల గోధుమ పంటకు విపరీతమైన నష్టం వాటిల్లనుందని ప్రపంచ ఆహార సంస్థ ఇటీవల ప్రకటించింది ?
1) పసుపు తెగులు
2) ఎర్ర తెగులు
3) బూడిద తెగులు
4) ఆకుపచ్చ తెగులు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ ఆహార సంస్థ ఇటీవల ఫంగస్ ద్వారా వచ్చే పసుపు తెగులును కనుగొంది. ఇది ఆఫ్రికా, ఆసియా, యూరప్ దేశాల్లో గోధుమ పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆహార సంస్థ ప్రకటించింది.
- సమాధానం: 1
34. ఇటీవల ఏ దేశంతో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్త నౌకా విన్యాసాలు నిర్వహించింది ?
1) శ్రీలంక
2) వియత్నాం
3) తైవాన్
4) యూఏఈ
- View Answer
- సమాధానం: 4
వివరణ: యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత్ ఆ దేశంతో కలిసి నౌకా విన్యాసాలు నిర్వహించింది. యూఏఈలో జరిగిన విన్యాసాలలో భారత్ తరపున ఐసీజీఎస్ సముద్ర పావక్ పాల్గొంది.
- సమాధానం: 4
35. ప్రతిష్టాత్మక జెనసిస్ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) జరినా
2) నెక్ చాంద్
3) అనిష్ కపూర్
4) సతీష్ గుజ్రాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: యూదులకు చేసిన సేవలకు గుర్తింపుగా భారత సంతతికి చెందిన అనిష్ కపూర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. జెనెసిస్ పురస్కారాన్ని 2012లో ప్రారంభించారు. దీని కింద 1 మిలియన్ డాలర్ల నగదు బహుమతి అందిస్తారు.
- సమాధానం: 3
36. జవహార్ లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్, రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల కనుగొన్న ఏ చెట్లలో ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు ?
1) Nuero Calyx Calycinus
2) Calendula officinalis
3) Ocimum basilicum
4) Thymus Vulgaris
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేరళలోని చొలనైక్కన్ తెగ ప్రజలు గాయాలు, ఇతర రకాల వ్యాధులకు Nuero Calyx Calycinusనుమందుగా వాడతారు.
- సమాధానం: 1
37. 2018 ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు ?
1) సింగపూర్
2) థాయ్‌లాండ్
3) భారత్
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: వచ్చే నాలుగు సంవత్సరాలు ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ పోటీలు భారత్‌లోనే జరుగుతాయని బిలియర్డ్ అండ్ స్నూకర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BSFI) 2017 ఫిబ్రవరి 6న ప్రకటించింది.
- సమాధానం: 3
38. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న దేశం ?
1) భారత్
2) చైనా
3) రష్యా
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ చేపల ఉత్పత్తిలో చైనా తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో భారత్ ఉంది. 2015-16లో భారత చేపల ఉత్పత్తి 107.95 లక్షల టన్నులు కాగా సముద్ర జలాల ద్వారా 4.412 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల దిగుబడి లభిస్తుందని మత్స్య శాఖ ప్రకటించింది.
- సమాధానం: 2
39. బ్రాడ్‌కాస్టింగ్ ఇంజినీరింగ్ సొసైటీ జీవన సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) రమేశ్ నాయుడు
2) శంకర్ దేవ్
3) రాజు యాదవ్
4) ఎస్‌ఎల్‌కే ప్రసాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బ్రాడ్‌కాస్టింగ్ ఇంజినీరింగ్ సొసైటీని 1987లో ప్రారంభించారు. దీని కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- సమాధానం: 4
40. కింది వాటిలో ఏ సంఘం దక్షిణ భారత దేశ ఉత్తమ సహకార సంఘంగా ఎంపికైంది ?
1) ముల్కనూరు మహిళా సహకార డైరీ
2) కరీంనగర్ సహకార డైరీ
3) సేలం సహకార డైరీ
4) మైసూర్ సహకారం సంఘం
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామం ముల్కనూరు. ఈ గ్రామంలో మహిళలంతా కలిసి సహకార డైరీని ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు.
- సమాధానం: 1
41. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతంలో కాకతీయ హ బ్ని ప్రారంభించింది ?
1) వరంగల్
2) ఖమ్మం
3) నిజామాబాద్
4) జగిత్యాల
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్వయం ఉపాధి కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్‌లో కాకతీయ హబ్‌ని ప్రారంభించింది.
- సమాధానం: 3
42. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ టెర్రెస్టీరియల్ అండ్ శాటిలైట్ బ్రాడ్ కాస్టింగ్ ను ఎక్కడ నిర్వహించారు ?
1) బీజింగ్
2) పారిస్
3) లండన్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. 25 దేశాల నుంచి 300కు పైగా కంపెనీలు దీనికి హాజరయ్యాయి. టెలివిజన్, టెలికం, రేడియో, మీడియా రంగాల అభివృద్ధిపై ఈ సమావేశాల్లో చర్చించారు.
- సమాధానం: 4
43. ప్రపంచంలో అత్యధిక సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశం ?
1) జర్మనీ
2) చైనా
3) అమెరికా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సౌర విద్యుత్ ఉత్పత్తిలో జర్మనీని వెనక్కి నెట్టి చైనా తొలి స్థానానికి చేరుకుంది. 2016లో చైనా 66.2 బిలియన్ కిలోవాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.
- సమాధానం: 2
44. ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ - 2017ను ఎక్కడ నిర్వహించనున్నారు ?
1) మాస్కో
2) పారిస్
3) లండన్
4) ఇస్తాంబుల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ టోర్నీలో రష్యా అథ్లెట్లు పాల్గొనకుండా IAAF నిషేధం విధించింది. ఆ దేశ క్రీడాకారులు డోపింగ్ టెస్టుల్లో దొరికిపోవడంతో ఐఏఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 3
45. 81వ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) ముంబయి
2) హైదరాబాద్
3) కోల్కత్తా
4) పాట్నా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ టోర్నీ ఫిబ్రవరి 7న పాట్నాలో జరిగింది. మహిళల సింగిల్స్ టైటిల్‌ను రితుపర్ణ దాస్ గెలుచుకుంది. ఉమెన్ డబుల్స్ టైటిల్‌ను అపర్ణ బాలన్, ప్రజాకత సావంత్ ద్వయం గెలుచుకుంది.
- సమాధానం: 4
46. 17వ బిమ్స్‌స్టెక్ సీనియర్ అఫీషియల్స్ సమావేశం ఎక్కడ జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) ఖాట్మాండు
3) ఢాకా
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: బిమ్స్స్టెక్ను 1997లో ఏర్పాటు చేశారు. ఇందులో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, మరియు శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్నాయి.
Bimstec- Bay of Bengal Initiative for Multi Sectoral Technical and Economic Cooperation
- సమాధానం: 2
47. ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది ?
1) గుజరాత్
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 ఫిబ్రవరి 8న గుజరాత్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలను ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 17,250 చౌక ధరల దుకాణాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
- సమాధానం: 1
48. ప్రతిష్టాత్మక బీసీ రాయ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) డా. నాగేశ్వరరావు
2) డా. అజయ్ చంద్ర
3) డా. పి.రఘురామ్
4) డా.రమేశ్ రెడ్డి
- View Answer
- సమాధానం: 3
వివరణ: అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రఘురామ్ బీసీ రాయ్ పురస్కారానికి ఎంపికయ్యారు. బిదన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం 1976లో బీసీ రాయ్ పురస్కారాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది.
- సమాధానం: 3
49. కేంద్ర ఆర్థిక సర్వే 2016-17 ప్రకారం అంతర్ రాష్ట్ర వలసలు ఎంతకు పెరిగాయి ?
1) 90 లక్షలు
2) 70 లక్షలు
3) 50 లక్షలు
4) 40 లక్షలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆర్థిక సర్వే ప్రకారం 2001-11 మధ్య 50-65 లక్షల మంది ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. 2011-2016 మధ్య ఈ సంఖ్య 90 లక్షలకు చేరింది. 2015-16లో బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అత్యధిక శాతం మంది ఢిల్లీకి వలస వెళ్లారు.
- సమాధానం: 1
50. కేంద్ర ఆర్థిక బడ్జెట్ 2017-18లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి కేటాయించిన నిధులు ?
1) రూ.10,000 కోట్లు
2) రూ.15,000 కోట్లు
3) రూ.20,000 కోట్లు
4) రూ.23,000 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ బడ్జెట్లో ప్రధాని మంత్రి ఆవాస్ యోజన పథకానికి రూ.23 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2019 నాటికి కోటి ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
- సమాధానం: 4