కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి (1 - 7) బిట్ బ్యాంక్
1. స్కార్పిన్ తరగతికి చెందిన ఆరు జలాంతర్గాములను అందుబాటులోకి తేవాలన్న ప్రణాళికలో ఇటీవల భారత నేవీ ప్రారంభించిన మూడో సబ్‌మెరైన్ ఏది ?
1) ఐఎన్ఎస్ కరీమ్
2) ఐఎన్ఎస్ కరంజ్
3) ఐఎన్ఎస్ కిల్తాన్
4) ఐఎన్ఎస్ కుక్రి
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత నావికాదళంలో స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ ఇటీవల జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబా భార్య రీనా లాంబా ముంబైలో ఐఎన్ఎస్కరంజ్ను ప్రారంభించారు. ఫ్రెంచ్నౌకా తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో ఆరు స్కార్పిన్ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్‌గావ్‌డాక్ లిమిటెడ్‌లో నిర్మిస్తున్నారు. తాజాగా ఐఎన్ఎస్ కరంజ్‌తో నేవీలో మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది. మొదటిది ఐఎన్ఎస్ కల్వరి, రెండోది ఐఎన్ఎస్ కాంధారి.
- సమాధానం: 2
2. 19వ భారత అంతర్జాతీయ వాచ్ అండ్ క్లాక్ ఫెయిర్ ‘‘సమయ భారతి 2018’’ ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) ముంబై
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) అమృత్ సర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 19వ భారత అంతర్జాతీయ వాచ్ అండ్ క్లాక్ ఫెయిర్ - ‘‘సమయ భారతి 2018’’ ఇటీవల ముంబైలో జరిగింది. వాచ్ అండ్ క్లాక్ మ్యాగజైన్ ‘‘ట్రేడ్ పోస్ట్’’ ఈ ఫెయిర్ నిర్వహించింది.
- సమాధానం: 1
3. గ్లోబల్ ప్రజాస్వామ్య సూచీ 2018లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?
1) 50
2) 65
3) 30
4) 42
- View Answer
- సమాధానం: 4
వివరణ: గ్లోబల్ ప్రజాస్వామ్య సూచీని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(EIU) వెలువరిస్తుంది. ఇటీవల విడుదల చేసిన 2018 ర్యాంకింగ్స్‌లో భారత్ 42వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో నార్వే తొలి స్థానంలో ఉంది.
- సమాధానం: 4
4. ఎలెవన్ ఈవెన్ స్పోర్ట్స జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) మానవ్ ఠక్కర్
2) కమ్లేశ్ మెహతా
3) శరత్ కమల్
4) ఆంటోని అమల్ రాజ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఎలెవన్ ఈవెన్ స్పోర్ట్స జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆంటోని అమల్ రాజ్‌ను ఓడించి శరత్ కమల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
5. స్వచ్ఛంద సంస్థ గ్రీన్ పీస్ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరం ఏది ?
1) ఫరీదాబాద్
2) హైదరాబాద్
3) ఢిల్లీ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్వచ్ఛంద సంస్థ గ్రీన్ పీస్ ఇండియా - Airpocalypse II పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో దేశంలోని నగరాల్లో వాతావరణ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో వివరించింది. దీని ప్రకారం ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అతి ఎక్కువగా ఉండగా.. కర్ణాటకలోని హస్సన్ నగరంలో అతి తక్కువ కాలుష్యం ఉంది.
- సమాధానం: 3
6. ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం ‘‘లీజియన్ ఆఫ్ హానర్’’ - 2018ని ఇటీవల ఎవరు అందుకున్నారు ?
1) సౌమిత్ర చటర్జీ
2) అమితాబ్ బచ్చన్
3) చిరంజీవి
4) అనిల్ కపూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సౌమిత్ర చటర్జీ ప్రముఖ బెంగాలీ నటుడు. ఆయన ఇటీవల ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం ‘‘లీజియన్ ఆఫ్ హానర్’’ - 2018 అవార్డుని అందుకున్నారు.
- సమాధానం: 1
7. ప్రపంచ స్టీల్ అసోసియేషన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉక్కు ఉత్పత్తిలో భారత్, అమెరికాను అధిగమించి ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) మొదటి స్థానం
2) రెండో స్థానం
3) మూడో స్థానం
4) నాలుగో స్థానం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ స్టీల్ అసోసియేషన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018లో భారత్ ఉక్కు ఉత్పత్తిలో అమెరికాను అధిగమించి మూడో స్థానంలో నిలిచింది. చైనా 831.7 టన్నుల ఉక్కు ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. జపాన్ రెండో స్థానంలో ఉంది.
- సమాధానం: 3
8. అండర్ -19 కూచ్ బెహర్ క్రికెట్ ట్రోఫీ 2017-18 ని ఏ జట్టు గెలుచుకుంది ?
1) విదర్భ
2) ముంబై
3) హైదరాబాద్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కూచ్ బెహార్ 2017-18 ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్‌ను ఓడించి విదర్భ జట్టు తొలిసారి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. విదర్భ జట్టు ఇటీవలే తొలిసారి రంజీ ట్రోఫీని కూడా గెలుచుకుంది.
- సమాధానం: 1
9. యాష్ గబట్ ఒప్పందం(Ashgabat agreement)లో భారత్ ఇటీవల ఎన్నో సభ్య దేశంగా చేరింది ?
1) 8వ దేశంగా
2) 10వ దేశంగా
3) 4వ దేశంగా
4) 5వ దేశంగా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఒమన్ దేశాల మీదుగా అంతర్జాతీయ రవాణా, ట్రాన్సిట్ కారిడార్ కోసం ఉద్దేశించిందే యాష్ గబట్ ఒప్పందం. 2011 ఏప్రిల్‌లో ఈ ఒప్పందంపై సభ్య దేశాలు సంతకాలు చేశాయి. భారత్ ఇటీవల 8వ సభ్య దేశంగా ఈ ఒప్పందంలో చేరింది. ఇతర సభ్య దేశాలు-ఒమన్, ఇరాన్, తుర్కెమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్. ఈ ఒప్పందం ద్వారా మధ్య ఆసియా, పర్సియన్ గల్ఫ్ మధ్య సరుకు రవాణాకు వీలు కలుగుతుంది.
- సమాధానం: 1
10. ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ - 2018లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న బాక్సర్ ఎవరు ?
1) ఎల్ సరితా దేవి
2) మేరి కోమ్
3) లావ్ లినా బోర్గోహెయిన్
4) విలావ్ బసుమతారి
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ - 2018లో 48 కేజీల విభాగంలో మేరీ కోమ్ స్వర్ణాన్ని గెలుచుకుంది. మేరీ కోమ్ ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ టైటిల్ సాధించింది.
- సమాధానం: 2
11. 7వ ఇండియా ఎనర్జీ కాంగ్రెస్ ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) కోల్ కత్తా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 7వ ఇండియా ఎనర్జీ కాంగ్రెస్ న్యూఢిల్లీలో జరిగింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇంధన రంగంలో వస్తోన్న మార్పులపై ఈ సమావేశంలో చర్చించారు.
Theme: "Energy 4.0- Energy Transition towards 2030''
- సమాధానం: 2
12. విద్యార్థుల పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఉద్దేశించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తక రచయిత ఎవరు ?
1) నరేంద్ర మోదీ
2) సుష్మా స్వరాజ్
3) ప్రకాశ్ జవదేకర్
4) వెంకయ్య నాయుడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి పరీక్షల్లో మెరుగ్గా రాణించేందుకు సూచనలు, సలహాలతో ప్రధాని నరేంద్ర మోదీ ఎగ్జామ్ వారియర్స్ పేరుతో పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఇటీవల కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.
- సమాధానం: 1
13. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ప్రదీప్ కుమార్ సిన్హా
2) ధన్ రాజ్ పిళ్లై
3) నీలమ్ కపూర్
4) రాజీవ్ త్రివేది
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు చెందిన సీనియర్ అధికారి నీలమ్ కపూర్ ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
- సమాధానం: 3
14. మహారాష్ట్ర మరత్వాడాలోని ఏ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది ?
1) లాతూర్
2) నాందేడ్
3) ఔరంగబాద్
4) పర్భాహాని
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహారాష్ట్ర మరత్వాడాలోని లాతూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అత్యంత కరువు ప్రాంతమైన లాతూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ అనేక మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. అలాగే ఆ ప్రాంతం వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగం వైపు మళ్లేందుకు వీలు కలుగుతుంది.
- సమాధానం: 1
15. ఘోడాజారి వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) అస్సాం
2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
వివరణ: చాందీపూర్ జిల్లాలో ఘోడాజారి వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీ ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో 159 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.
- సమాధానం: 2
16. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రతిష్టాత్మక ఇసాన్ డోగ్రామాకి ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ ప్రైజ్‌కు ఎంపికై న తొలి భారతీయుడు ఎవరు ?
1) దినేశ్ అరోరా
2) వికే సారస్వత్
3) వినోద్ పాల్
4) రాజీవ్ కుమార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కుటుంబ ఆరోగ్య రంగంలో సేవలకు గాను నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రతిష్టాత్మక ఇసాన్ డోగ్రామాకి ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ ప్రైజ్(Ihsan Dogramaci Family Health Foundation Prize)కు ఎంపికయ్యారు. తద్వారా ఈ అవార్డు అందుకోనున్న తొల భారతీయుడిగా గుర్తింపు పొందారు.
- సమాధానం: 3
17. కేంద్ర బడ్జెట్ 2018-19లో ప్రకటించిన జాతీయ ఆరోగ్య పథకం ద్వారా ఏటా ఒక్కో కుటుంబానికి ఎన్ని లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందించనున్నారు ?
1) రూ. 5 లక్షలు
2) రూ. 2.5 లక్షలు
3) రూ. 1 లక్ష
4) రూ. 3 లక్షలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2న ప్రవేశపెట్టిన బడ్జెట్-2018-19లో పేద ప్రజల ఆరోగ్యం కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించింది. "నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్" పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా ఏటా ఒక్కో కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకంగా దీన్ని అభివర్ణించారు. దీని ద్వారా దేశంలో సుమారు 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
- సమాధానం: 1
18. సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు - 2018ని ఇటీవల ఎవరికి ప్రకటించారు ?
1) నంద్ భరద్వాజ
2) రహమత్ తరికేరి
3) సింగ్ సంధు
4) శేష్ ఆనంద్ మధుకర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మాగాహి రచయిత శేష్ ఆనంద్ మధుకర్ ఇటీవల సాహిత్య అకాడమీ నుంచి భాషా సమ్మాన్ అవార్డుని అందుకున్నారు. మాగాహిని మగధి అని కూడా పిలుస్తారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ భాష వాడుకలో ఉంది. సాహిత్య అకాడమీ గుర్తింపు పొందిన 24 ప్రాంతీయ భాషలు కాకుండా వీటి స్థాయిలోనే వాడుకలో ఉన్న ఇతర భాషల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రచయితలకు భాషా సమ్మాన్ అవార్డుని అందజేస్తారు.
- సమాధానం: 4
19. దేశంలో తొలిసారిగా ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఇటీవల ఏ నగరంలో జరిగాయి ?
1) ముంబై
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8 వరకు తొలి ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగాయి. ఈ గేమ్స్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 16 విభాగాల్లో అండర్ -17 విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. 29 రాష్ట్రాల నుంచి 5 వేల మందికిపైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుకుమార్ ఈ పోటీల్లో తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు.
- సమాధానం: 2
20. జియో స్పాషియల్ వరల్డ్ ఎక్సలెన్స్ అవార్డు - 2018ని ఏ రాష్ట్రం గెలుచుకుంది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జియో స్పాషియల్ వరల్డ్ ఎక్స్‌లెన్స్ అవార్డు-2018ని ఒడిశా రాష్ట్రం గెలుచుకుంది. I3Ms వెబ్బేస్డ్ సాఫ్ట్ వేర్ ద్వారా.. ఖనిజాల ఉత్పత్తి, రవాణా, విలువను రియల్ టైమ్ విధానంలో తెలుసుకునేందుకు ఐటీ అప్లికేషన్ రూపొందించినందుకు గాను ఒడిశా ఈ అవార్డుని గెలుచుకుంది.
- సమాధానం: 3
21. ప్రపంచ తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 5
2) జనవరి 31
3) ఫిబ్రవరి 7
4) ఫిబ్రవరి 2
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1971 ఫిబ్రవరి 2న తడి నేలల ఒడంబడికపై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. అనంతరం 1997లో తొలిసారి తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ మానవాళి, భూమి రక్షణలో తడి నేలల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
2018 Theme: Wetlands for a Sustainable Urban Future
- సమాధానం: 4
22. 15వ ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టవల్‌లో డాక్యుమెంటరీ, షార్ట్ అండ్ యానిమేషన్ఫిల్మ్సవిభాగంలో జీవిత సాఫల్య పురస్కారం పొందిన ప్రముఖ డెరైక్టర్ ఎవరు ?
1) శ్యాం బెనగల్
2) గౌహార్ రజా
3) కబీర్ ఖాన్
4) అన్వర్ జమాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 15వ ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టవల్‌లో సీనియర్ డెరైక్టర్ శ్యాం బెనగల్.. జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు. డాక్యుమెంటరీ, షార్ట్ అండ్ యానిమేషన్ చిత్రాల రూపకల్పనలో కృషికి గాను ఆయన ఈ అవార్డుకి ఎంపికయ్యారు. పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతి అందజేశారు.
- సమాధానం: 1
23. ఇటీవల నోబెల్ ప్రైజ్ సీరీస్ ఇండియా - 2018 కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1) గోవా
2) కర్ణాటక
3) తెలంగాణ
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నోబెల్ ప్రైజ్ సీరీస్ ఇండియా 2వ ఎడిషన్ కార్యక్రమాన్ని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. గోవాతో పాటు ముంబై, న్యూఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారంతో నోబెల్ మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఐదుగురు నోబెల్ అవార్డు గ్రహీతలు.. విద్యార్థులు, మేధావులతో సమావేశమయ్యారు.
- సమాధానం: 1
24. ఇటీవల ఏ దేశం.. సూక్ష్మ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టగల అతి చిన్న రాకెట్ ను ప్రయోగించింది ?
1) రష్యా
2) అమెరికా
3) భారత్
4) జపాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: జపాన్ అంతరిక్ష సంస్థ (JAXA) ప్రపంచంలోనే అతి చిన్న రాకెట్(SS-520)ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ట్రైకామ్-1ఆర్ సూక్ష్మ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
- సమాధానం: 4
25. ఐసీసీ అండర్ -19 ప్రపంచ కప్ - 2018 ఫైనల్లో భారత్ ఏ జట్టుని ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది ?
1) పాకిస్తాన్
2) ఆస్ట్రేలియా
3) ఇంగ్లండ్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూజిలాండ్‌లో జరిగిన ఐసీసీ అండర్ -19 ప్రపంచ కప్ - 2018లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో టీం ఇండియా ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి నాలుగోసారి టైటిల్ గెలుచుకుంది. భారత్ ఇంతక ముందు 2000, 2008, 2012లో అండర్ - 19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారం గెలుచుకున్నాడు.
- సమాధానం: 2
26. వరల్డ్ క్యాన్సర్ డేని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 1
2) ఫిబ్రవరి 7
3) ఫిబ్రవరి 4
4) ఫిబ్రవరి 2
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఏటా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేని నిర్వహిస్తారు. క్యాన్సర్ వ్యాధి, చికిత్స, నివారణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ డేని నిర్వహిస్తారు.
2018 Theme : We can. I can
- సమాధానం: 3
27. ట్రాన్స్ జండర్ల హక్కుల రక్షణ కోసం దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనుంది ?
1) హర్యానా
2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ట్రాన్స్ జండర్ల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం ట్రాన్స్ జండర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనికి 5 కోట్ల రూపాయలు కేటాయించింది. తద్వారా ఈ తరహా బోర్డు ఏర్పాటు చేయనున్న దేశంలోని తొలిరాష్ట్రంగా గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
28. హిస్సాబ్ కితాబ్ పుస్తక రచయిత ఎవరు ?
1) ట్వింకిల్ ఖన్నా
2) శిల్పా శెట్టి
3) సోహా అలీ ఖాన్
4) అంజనా సుఖాని
- View Answer
- సమాధానం: 4
వివరణ: సలామ్ ఏ ఇష్క్, గోల్ మాల్ రిటర్న్స్,అల్లా కే బందే చిత్రాల్లో నటించిన అంజనా సుఖాని.. హిస్సాబ్ కితాబ్ పుస్తకాన్ని రచించారు. కుటుంబ నిర్వహణలో వ్యయాలకు సంబంధించిన అంశాలతో ఈ పుస్తకాన్ని రచించారు.
- సమాధానం: 4
29. కేంద్ర ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం.. వస్తు సేవల ఎగుమతుల్లో ఏ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది ?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) తమిళనాడు
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర ఆర్థిక సర్వే 2017-18లో పొందుపరిచారు. దీని ప్రకారం వస్తు సేవల ఎగుమతుల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. మొత్తం జాతీయ ఎగుమతుల్లో ఈ రాష్ట్రం వాటా 16 శాతంగా నమోదైందని ఆర్థిక సర్వే పేర్కొంది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారుు. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది.
- సమాధానం: 1
30. ఇండియా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 - 2018 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) తై జూయింగ్
2) పీవీ సింధు
3) కరోలినా మారిన్
4) బీవెన్ జాంగ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 - 2018 ఫైనల్లో అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుని ఓడించి టైటిల్ గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను చైనీస్ ప్లేయర్ షీ యుగి గెలుచుకున్నాడు.
- సమాధానం: 4
31. ఇటీవల ఏ రాష్ట్రం ఎక్యూట్ ఎన్సిఫాలిటిస్ సిండ్రోమ్, జపనీస్ ఎన్సిపాలిటీస్ వ్యాధి నివారణ కోసం యునిసెఫ్‌తో కలిసి ఇంటి ఇంటి కార్యక్రమం నిర్వహించింది ?
1) హర్యానా
2) ఉత్తరప్రదేశ్
3) బిహార్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎక్యూట్ ఎన్సిఫాలిటిస్ సిండ్రోమ్, జపనీస్ ఎన్సిపాలిటీస్ వ్యాధి నివారణ కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యునిసెఫ్‌తో కలిసి డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించింది. దస్తక్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమ నినాదం - దర్వాజా ఖట్ ఖటావో.. ఎక్యూట్ ఎన్సిఫాలిటిస్ సిండ్రోమ్, జపనీస్ ఎన్సిపాలిటీస్ కో భగావో
- సమాధానం: 2
32. ఇటీవల ఏ దేశం తేయాకుల ఉత్పత్తిని ప్రారంభించిన 154 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ గుర్తింపు పొందింది ?
1) మయన్మార్
2) శ్రీలంక
3) నేపాల్
4) టర్కీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: నేపాల్ తేయాకుల సాగుని ప్రారంభించిన 154 ఏళ్ల తర్వాత ఇటీవల ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ గుర్తింపు పొందింది. దీంతో ఇకపై ఆ దేశంలోని టీ ఉత్పత్తి దారులు ఒకే లోగోతో ఎగుమతులు చేసే అవకాశం కలిగింది.
- సమాధానం: 3
33. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎప్పటి వరకు పెంచింది ?
1) 2019 జూన్ 30
2) 2020 మార్చి 31
3) 2018 డిసెంబర్ 31
4) 2020 జనవరి 31
- View Answer
- సమాధానం: 1
వివరణ: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 జూన్ 30 వరకు పొడగించింది. 1980 కేరళ ఐఏఎస్ కేడర్‌కు చెందిన అమితాబ్ కాంత్.. 2016లో నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు.
- సమాధానం: 1
34. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుందని కేంద్ర ఆర్థిక సర్వే 2017-18 అంచనా వేసింది ?
1) 6.5 శాతం - 7 శాతం
2) 7 శాతం - 7.5 శాతం
3) 7.5 శాతం - 8 శాతం
4) 8 శాతం - 8.25 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7 - 7.5 శాతం స్థాయిలో నమోదు కానుంది. అలాగే 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. అయితే.. ఇది 6.5 శాతంగానే ఉండొచ్చని కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల వెల్లడించింది.
- సమాధానం: 2
35. రైతుల పెట్టుబడి వ్యయానికి ఎంత శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం 2018-19 వార్షిక బడ్జెట్లో పేర్కొంది ?
1) 25 శాతం
2) 50 శాతం
3) 75 శాతం
4) 100 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న 2018-19 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ.24,42,213 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వరి, మొక్క జొన్న, సోయా బీన్, పప్పు ధాన్యాల వంటి పంటలకు కచ్చితమైన కనీస మద్దతు ధర అమలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం బడ్జెట్లో పేర్కొంది. ఆయా పంటల ఉత్పాదక వ్యయానికి 50 శాతం అదనంగా జోడించి మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించింది. పంట ఉత్పత్తుల ధరలు పడిపోయినా రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా అందేలా చర్యలు చేపడతామని పేర్కొంది.
- సమాధానం: 2
36. తెలంగాణలో రెండేళ్లకోసారి మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ?
1) జయశంకర్ భూపాలపల్లి
2) వరంగల్ రూరల్
3) కొమురం భీం అసిఫాబాద్
4) భద్రాద్రి కొత్తగూడెం
- View Answer
- సమాధానం: 1
వివరణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో రెండేళ్లకోసారి సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. ఇటీవల 2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర ఘనంగా జరిగింది.
- సమాధానం: 1
37. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఎస్పీ సింగ్
2) దినేశ్ కుమార్
3) రాజీవ్ శర్మా
4) శైలేంద్ర కుమార్ జోషి
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి ఇటీవల నియమితులయ్యారు. ఎస్పీ సింగ్ నుంచి ఆయన సీఎస్ బాధ్యతలు స్వీకరించారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు.
- సమాధానం: 4
38. భారత సైన్యం ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు ?
1) 700 కిలోమీటర్లు
2) 1500 కిలోమీటర్లు
3) 2000 కిలోమీటర్లు
4) 3000 కిలోమీటర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని బాలసోర్‌లోగల అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించిన క్షిపణ 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు. అగ్ని -1లో ఇది 18వ వర్షెన్.
- సమాధానం: 1
39. భారత సైన్యం నూతన డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్సగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అనిల్ చౌహాన్
2) రణ్ బీర్ సింగ్
3) బిపిన్ రావత్
4) అరవింద్ దుత్తా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత సైన్యం నూతన డీజీఎంఓ(డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ జనవరి 30న బాధ్యతలు స్వీకరించారు. చౌహాన్‌కు జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లలో అపార అనుభవం ఉంది.
- సమాధానం: 1
40. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 130 దేశాల ప్రముఖలకు నిర్వహించిన విందుకి ఆహ్వానం అందుకున్న భారత ఎంపీ ఎవరు ?
1) పూణం మహాజన్
2) కొండా విశ్వేశ్వర్ రెడ్డి
3) శ్రీరాములు
4) గల్లా జయదేవ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించిన విందుకు భారతదేశం నుంచి ఇద్దరు నేతలను ఆహ్వానించారు. వీరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒకరు కాగా, బళ్లారి ఎంపీ శ్రీరాములు మరొకరు.
- సమాధానం: 3
41. బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఇటీవల రెండోసారి ఎన్నికై న వారు ఎవరు ?
1) షేక్ హసీనా
2) అబ్దుల్ హమీద్
3) తారీఖ్ రహమాన్
4) ఖాలేదీ జియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బంగ్లాదేశ్ అధ్యక్షడిగా అబ్దుల్ హమీద్ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండోసారి బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
- సమాధానం: 2
42. సైప్రస్ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) ఛారీస్ జార్జియాడెస్
2) నికోస్ అనస్తాసియాడెస్
3) హార్రీస్ జార్జియాడెస్
4) స్ట్రావోస్ మాలాస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: డెమోక్రాటిక్ ర్యాలీ పార్టీకి చెందిన నికోస్ అనస్తాసియాడెస్.. ఇటీవల జరిగిన సైరస్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లతో ఆ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు.
- సమాధానం: 2
43. యూఎస్- ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ నివేదిక ప్రకారం 2017లో భారత్, అమెరికా మధ్య వ్యాపారం విలువ ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదు కానుంది ?
1) 100 బిలియన్ డాలర్లు
2) 200 బిలియన్ డాలర్లు
3) 140 బిలియన్ డాలర్లు
4) 250 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2016లో 118 బిలియన్ డాలర్లుగా నమోదైన భారత్, అమెరికా వ్యాపార విలువ 2017లో 140 బిలియన్ డాలర్లకు చేరింది.
- సమాధానం: 3
44. ఇటీవల మలేషియాలో జరిగిన మే బ్యాంక్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ - 2018 టైటిల్ విజేత ఎవరు ?
1) శివ కపూర్
2) గగన్ జీత్ భుల్లార్
3) జ్యోతి రంధవా
4) శుభాంకర్ శర్మా
- View Answer
- సమాధానం: 4
వివరణ: మలేషియాలో జరిగిన మే బ్యాంక్ చాంపియన్‌షిప్ - 2018 టైటిల్‌ను భారత ప్రొఫెషనల్ గోల్ఫర్ శుభాంకర్ శర్మా గెలుచుకున్నాడు.
- సమాధానం: 4
45. 2017 అంతర్జాతీయ ప్రయాణ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచిన ఎయిర్ పోర్ట్ ఏది ?
1) దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
2) జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్
3) లండన్ హీట్ త్రో ఎయిర్ పోర్ట్
4) హాంగ్ కాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎయిర్ పోర్ట్స కౌన్సిల్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం 2017లో అంతర్జాతీయ ప్రయాణ విభాగంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది. ఈ నివేదిక ప్రకారం దుబాయ్ విమానాశ్రయం ట్రాఫిక్ 88.2 మిలియన్లుగా ఉంది.
- సమాధానం: 1
46. రైతులకు సేంద్రీయ ఎరువులు, గో మూత్రాన్ని విక్రయించేందుకు ఏ రాష్ట్రం "గోవర్దన్ యోజన" కార్యక్రమాన్ని ప్రారంభించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) హర్యానా
3) తెలంగాణ
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గోవర్దన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రైతులకు సేంద్రీయ ఎరువులు, గో మూత్రాన్ని విక్రయిస్తుంది. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం అమలు కోసం 11 కోట్ల రూపాయలు కేటాయించింది.
- సమాధానం: 2
47. ఇటీవల ఏ రాష్ట్రం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టుని ప్రారంభించింది ?
1) పంజాబ్
2) హిమాచల్ ప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) అస్సాం
- View Answer
- సమాధానం: 2
వివరణ: సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఇటీవల జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టుని ప్రారంభించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టుని చేపట్టారు. ఈ విధానంలో పంటల ఉత్పత్తిలో ఎలాంటి ఎరువులు, క్రిమి సంహారక మందులని వినియోగించరు.
- సమాధానం: 2
48. ఇటీవల ఏ దేశం ప్రపంచంలో అతిపొడవైన జిప్ లైన్‌ను ప్రారంభించింది ?
1) జపాన్
2) ఆస్ట్రేలియా
3) ఫ్రాన్స్
4) యూఏఈ
- View Answer
- సమాధానం: 4
వివరణ: యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటీవల ప్రపంచంలోనే అతిపొడవైన జిప్ లైన్‌ను ప్రారంభించింది. యూఏఈలోని అతి ఎత్తయిన పర్వతం జెబల్ జాయిస్.. రస్ అల్ ఖైమాలో ఉంది. ఈ పర్వాత శిఖరం నుంచి 2.83 కిలోమీటర్ల మేర ఏర్పాటు జిప్ లైన్‌ను ఇటీవల ప్రారంభించారు.
- సమాధానం: 4
49. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సీఈవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) దినేశ్ శ్రీవాత్సవ
2) గరిమా సింగ్
3) నితిన్ చోప్రా
4) విక్రమ్ ఝా
- View Answer
- సమాధానం: 1
వివరణ: జి. కల్యాణ కృష్ణన్ స్థానంలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్ఎఫ్సీ) సీఈవోగా అణు శాస్త్రవేత్త దినేశ్ శ్రీవాత్సవ నియమితులయ్యారు. ఆయన ఎన్ఎఫ్సీ బోర్డు చైర్మన్ గాను వ్యవహరిస్తారు.
- సమాధానం: 1
50. తొలి పెలీసియన్ బర్డ్ ఫెస్టివల్ - 2018 ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
వివరణ: తొలి పెలీసియన్ బర్డ్ ఫెస్టివల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని అటపాక పక్షి సంరక్షణ కేంద్రంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఈ వేడుకలను నిర్వహించింది. దేశంలోని మంచి నీటి సరస్సుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సులో ఈ సంరక్షణ కేంద్ర ఉంది. ఏటా శీతాకాలంలో 5 వేలకు పైగా పెలీసియన్ పక్షులు వివిధ ప్రాంతాల నుంచి కొల్లేరు సరస్సుకి వస్తాయి.
- సమాధానం: 2