కరెంట్ అఫైర్స్ నవంబర్ (16 - 23) బిట్ బ్యాంక్
1. కింది వాటిలో ఏ రాష్ట్రం డాటా సెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నాస్కామ్తో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: డాటా సెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. నాస్కామ్తో కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పబ్లిక్ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రూ.40 కోట్లతో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. నాస్కామ్ ప్రస్తుత చైర్మన్ రమన్ రాయ్.
- సమాధానం: 3
2. ఫోర్బ్స్ పత్రిక ఇటీవల విడుదల చేసిన ఆసియా టాప్ - 50 సంపన్న కుటుంబాలు - 2017 జాబితాలో తొలి స్థానంలో నిలిచింది ఎవరు ?
1) ముకేశ్ అంబానీ కుటుంబం
2) లీ కుటుంబం
3) క్వాక్ కుటుంబం
4) నందన్ నీలేకని కుటుంబం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫోర్బ్స్ పత్రిక ఇటీవల విడుదల చేసిన ఆసియా టాప్ - 50 సంపన్న కుటుంబాలు - 2017 జాబితాలో ముకేశ్ అంబానీ కుటుంబం 44.8 బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానంలో నిలిచింది. శాంసంగ్ కంపెనీని స్థాపించిన లీ కుటుంబం 40. 8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది.
- సమాధానం: 1
3. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’’ కార్యక్రమం కింది ఇటీవల ఏ రాష్ట్రం మణిపూర్, నాగాలాండ్‌తో భాగస్వామిగా మారింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతని పురస్కరించుకొని దేశంలో ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2015లో ఈ దినోత్సవాలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని రాష్ట్రాల మధ్య భిన్నత్వంలో ఏకత్వం భావాన్ని మరింతగా విస్తృతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇటీవల ఈ కార్యక్రమం కింద మధ్యప్రదేశ్.. మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలతో భాగస్వామిగా చేరింది. దీనికింద ఆయా రాష్ట్రాల్లో జరిగే ఉత్సవాలు, వివిధ కార్యక్రమాల్లో ఇతర రాష్ట్రాల అధికారులు, విద్యార్థులు పాల్గొంటారు.
- సమాధానం: 3
4. భారత నౌకాదళానికి చెందిన INS సర్వేక్షక్ నౌక ఇటీవల ఏ దేశ నౌకాదళంతో కలిసి హైడ్రోగ్రాఫిక్ సర్వేలో పాల్గొంది ?
1) శ్రీలంక
2) టాంజానియా
3) ఇరాన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: INS సర్వేక్షక్.. దక్షిణ నావల్ కమాండ్‌కు చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక. ఇటీవల ఈ షిప్.. టాంజినాయోలోని దార్ ఎస్ సలామ్‌లో ఆ దేశ నౌకాదళంతో కలిసి హైడ్రోగ్రాఫిక్ సర్వేలో పాల్గొంది. హిందూ మహా సముద్రం పరిధిలోని దేశాల నౌకా దళాలతో స్నేహపూర్వక సంబంధాల బలోపేతం కోసం భారత్ ఈ కార్యక్రమంలో పాల్గొంది.
- సమాధానం: 2
5. ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్.. ఇటీవల భారత సావరిన్ రుణ రేటింగ్‌ను ఎంతకు పెంచింది ?
1) బీఏఏ 1
2) బీఏఏ 2
3) బీఏఏ 3
4) బీఏఏ 4
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత సావరిన్ రుణ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్.. ఇటీవల బీఏఏ 2 నుంచి బీఏఏ 3 కి పెంచింది. అలాగే భారత్ పట్ల భవిష్యత్ అంచనాను కూడా మెరుగుపరుస్తు సానుకూలం నుంచి స్టేబుల్‌కు మార్చింది. మూడీస్ తాజా ప్రకటనతో భారత్.. ఇటలీ, ఫిలిప్పీన్స్ వంటి దేశాల సరసన చేరింది. రేటింగ్ మార్పు వల్ల భారత్‌కు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి.
- సమాధానం: 3
6. టీబీని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ఇటీవల ఏ నగరంలో తొలి గ్లోబల్ మినిస్టియ్రల్ కాన్ఫరెన్స్ జరిగింది ?
1) మాస్కో
2) పారిస్
3) న్యూఢిల్లీ
4) లండన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: టీబీని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో తొలి గ్లోబల్ మినిస్టియ్రల్ కాన్ఫరెన్స్ రష్యాలోని మాస్కోలో నవంబర్ 16, 17 తేదీల్లో జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కాన్ఫరెన్సను నిర్వహించింది. భారత్ తరపున ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. భారత్‌ను 2025 నాటికి టీబీ రహిత దేశంగా మారుస్తామని ఆయన మరోసారి ప్రకటించారు.
Theme : Ending TB in the Sustainable Development Era: A Multisectoral Response.
- సమాధానం: 1
7. రగ్బీ ప్రపంచ కప్ - 2023కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ?
1) ఫ్రాన్స
2) జర్మనీ
3) స్పెయిన్
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: రగ్బీ ప్రపంచ కప్ - 2023కు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రపంచ రగ్బీ బోర్డ్ ఇటీవల ప్రకటించింది.
- సమాధానం: 1
8. మిస్ వరల్డ్ - 2017 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) ఆండ్రియా మెజా
2) స్టెఫనీ హిల్
3) మానుషి చిల్లర్
4) అరోరే కిచెనిన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్‌లోని హరియాణాకు చెందిన 20 ఏళ్ల మిస్ ఇండియా మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ - 2017 టైటిల్‌ను సాధించింది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. అలాగే మానుషి చిల్లర్ సాధించిన కిరీటంతో భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యా రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రా ప్రపంచ సుందరి కిరిటాలని గెలుచుకున్నారు.
- సమాధానం: 3
9. ఇటీవల ఏ ఇస్లామిక్ దేశం యోగాను క్రీడగా గుర్తిస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది ?
1) యూఏఈ
2) కువైట్
3) బహ్రెయిన్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సౌదీ అరేబియా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖ ఇటీవల యోగాను క్రీడగా గుర్తిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా సౌదీ పౌరులకు యోగా చేయడానికి, యోగాలో శిక్షణ ఇవ్వడానికి అనుమతి లభించింది.
- సమాధానం: 4
10. జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ - 2017లో 74 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) సుజీత్ మాన్
2) సుశీల్ కుమార్
3) సచిన్ రాథి
4) ప్రవీణ్ రాణా
- View Answer
- సమాధానం: 2
వివరణ: రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్.. ఇండోర్‌లో జరిగిన జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. మహిళల 62 కేజీల విభాగంలో సాక్షి మలిక్, 59 కేజీల విభాగంలో గీతా ఫోగట్ పసిడి పతకాన్ని గెలుచుకున్నారు.
- సమాధానం: 2
11. DSC Prize for South Asian Literature - 2017ను ఎవరు గెలుచుకున్నారు ?
1) అనుక్ అరుద్ ప్రగాసం
2) హెచ్ఎం నఖ్వీ
3) షెహాన్ కరుణతిలక
4) జీత్ థాయిల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: శ్రీలంకకు చెంది రచయిత అనుక్ అరుద్ ప్రగాసం.. . DSC Prize for South Asian Literature - 2017ను గెలుచుకున్నారు. శ్రీలంక సైన్యం, తమిళ టైగర్స్ మధ్య చిక్కుకున్న వ్యక్తి జీవిత ఇతి వృత్తాన్నితెలుపుతూ రాసిన ‘‘The Story of a Brief Marriage’’ పుస్తకానికి గాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. దక్షిణాసియాలోని పరిస్థితులు, దేశాలపై రచించిన పుస్తకాలకు ఈ అవార్డుని ప్రకటిస్తారు.
- సమాధానం: 1
12. IMBAX-2017 పేరుతో భారత్ ఇటీవల ఏ దేశంతో కలిసి సంయుక్త సైనిక్య విన్యాసాలు నిర్వహించింది ?
1) బంగ్లాదేశ్
2) మలేషియా
3) ఆఫ్గనిస్తాన్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్, మయన్మార్ దేశాల తొలి సంయుక్త సైనిక్య విన్యాసాలు IMBAX-2017 పేరుతో మేఘాలయాలో జరిగాయి. ఐరాస శాంతి నిర్వాహక కార్యక్రమాల్లో భారత్, మయన్మార్ల మధ్య ఇవి తొలి సైనిక విన్యాసాలు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల బలోపేతంకోసంనిర్వహించిన ఈ కార్యక్రమం ఆరు రోజుల పాటు కొనసాగింది.
- సమాధానం: 4
13. ఇందిరా గాంధి శాంతి పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) ప్రణబ్ ముఖర్జీ
2) మన్మోహన్ సింగ్
3) అటల్ బిహారీ వాజ్ పేయి
4) వెంకయ్య నాయుడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఇందిరా గాంధీ శాంతి పురస్కారం - 2017కు ఎంపికయ్యారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించి శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి ద్వారా భారత్‌ను ప్రపంచంలో ఓ స్థాయిలో నిలబెట్టినందుకుగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టు ప్రకటించింది. అవార్డు గ్రహీతను ఎంపిక చేసే అంతర్జాతీయ న్యాయ నిర్ణేతల మండలికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు.
- సమాధానం: 2
14. ప్రపంచ టైలెట్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) నవంబర్ 19
2) నవంబర్ 21
3) నవంబర్ 20
4) నవంబర్ 18
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ప్రపంచ పారిశుద్ధ్య సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ప్రపంచ టైలెట్ ఆర్గనైజేషన్ 2001లో ప్రపంచ టైలెట్ డేని ఏర్పాటు చేసింది. 12 ఏళ్ల తర్వాత ఐరాస ఈ దినోత్సవాన్ని గుర్తిస్తు 2013లో తీర్మానించింది.
2017 Theme : Wastewater
- సమాధానం: 1
15. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి ఆధారంగా తలసరి ఆదాయానికి సంబంధించి భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?
1) 130
2) 140
3) 156
4) 126
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తాజా గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి ఆధారంగా తలసరి ఆదాయానికి సంబంధించి భారత్ 7,170 డాలర్ల ఆదాయంతో 126వ ర్యాంకులో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో 1,24,930 డాలర్ల తలసరి ఆదాయంతో ఖతార్ ప్రపంచ దేశాల్లో తొలిస్థానంలో నిలిచింది. 1,14,430 డాలర్లతో మకావూ, 1,09,190 డాలర్లతో లగ్జెంబర్గ్ మూడో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 4
16. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ ప్రభుత్వాలు ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 4
2) 2
3) 1
4) 3
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఇటీవల ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ ప్రభుత్వాలు ఉన్న జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్, ఇండోనేషియా ప్రభుత్వాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 4
17. అండర్-19 ఆసియా యూత్ క్రికెట్ ట్రోఫీ-2017ను ఏ దేశం గెలుచుకుంది ?
1) పాకిస్తాన్
2) బంగ్లాదేశ్
3) ఆఫ్గనిస్తాన్
4) భారత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన అండర్ -19 ఆసియా యూత్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఆప్గనిస్తాన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
- సమాధానం: 3
18. ఇటీవల యూనిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్‌గా ఎంపికైనతొలి దక్షిణాది సినీ నటి ఎవరు ?
1) కాజల్ అగర్వాల్
2) సమంత
3) త్రిష
4) కీర్తి సురేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దక్షిణాదికి చెందిన సినీ నటి త్రిష యూనిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్‌గా ఎంపికయ్యారు. బాలల హక్కులు, వారి సమస్యలపై ఆమె ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలు తదితర సమస్యలపై పోరాటంలో త్రిష భాగస్వాములవుతారు.
- సమాధానం: 3
19. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఐదో న్యాయమూర్తిగా తిరిగి ఎన్నికై న భారత జస్టిస్ ఎవరు ?
1) దల్వీర్ భండారి
2) విక్రమ్ జిత్ సేన్
3) ప్రఫుల్ల చంద్ర పంత్
4) ఎం వై ఇగ్బాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారి మరోసారి ఎన్నికయ్యారు. బ్రిటన్ అభ్యర్థి క్రిస్టోఫర్ గ్రీన్ వుడ్ పోటీ నుంచి తప్పుకోవడంతో.. ఐరాస సాధారణ సభ, భద్రతా మండలిలు భండారీకి పూర్తి మద్దతు ప్రకటించారు. ఐరాస సాధారణ సభలో మొత్తం 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలో మొత్తం 15 ఓట్లను భండారి దక్కించుకున్నారు. ఆయన మరో 9 ఏళ్ల కాలానికి ఐసీజే న్యాయమూర్తిగా ఉంటారు.
- సమాధానం: 1
20. ఇంటర్నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (IMD) వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్-2017లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 59
2) 25
3) 51
4) 85
- View Answer
- సమాధానం: 3
వివరణ: IMD స్విట్జర్లాండ్‌లో ఉంది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన వరల్డ్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్‌లో భారత్ 51వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ తొలి స్థానంలో నిలిచింది.
- సమాధానం: 3
21. దేశంలో 50 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు ?
1) అరవింద్ మోదీ
2) సుశీల్ చంద్రా
3) గోపాల్ ముఖర్జీ
4) రాజేంద్ర కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఆరుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా చట్టాలను పునర్ వ్యవస్థీకరించడం, ముసాయిదా రూపకల్పన చేయడం ఈ కమిటీ కర్తవ్యం. సీబీడీటీ సభ్యులు(లెజిస్లేషన్) అరవింద్ మోదీ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీ 6 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
- సమాధానం: 1
22. ఇటీవల భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి బ్రహ్మోస్‌ను ఏ యుద్ధం విమానం నుంచి విజయవంతంగా పరీక్షించింది ?
1) దస్సాల్ట్ మిరేజ్-2000
2) మికోయాన్ మిగ్-29
3) హెచ్ఏఎల్ తేజాస్
4) సుఖోయ్-30
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇంతకముందే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ఇటీవల సుఖోయ్ - 30 యుద్ధ విమానం నుంచి తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. దీంతో.. బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు సమర్థతను చాటుకుంది.
- సమాధానం: 4
23. ఇటీవల ఏ రాష్ట్రం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించేందుకు ‘‘దిషారీ’’ అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ‘‘దిషారీ’’ అనే పేరుతో విద్యా సంబంధిత మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ యాప్ ద్వారా స్టడీ మెటిరీయల్‌ను అందిస్తుంది.
- సమాధానం: 4
24. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుడిపై పరిశోధనల కోసం 2019లో చేపట్టనున్న మిషన్ పేరు ఏమిటి ?
1) తపాస్ - ఎల్ 1
2) సూరజ్ - ఎల్ 1
3) భాస్కర్ - ఎల్ 1
4) ఆదిత్య - ఎల్ 1
- View Answer
- సమాధానం: 4
వివరణ: సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన తొలి ప్రాజెక్టు ఆదిత్య ఎల్ - 1. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ని 2019లో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ఇటీవల ప్రకటించారు.
- సమాధానం: 4
25. ఆరోగ్యకర ఆహార అలవాట్లను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 2018ని ఏ పంటల నామ సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని ఇటీవల కోరింది ?
1) వరి
2) ఓట్స్
3) తృణ ధాన్యాలు
4) వేరు శనగ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆరోగ్యకర ఆహార అలవాట్లను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 2018ని తృణ ధాన్యాల(జొన్నలు, రాగులు, గోధుమలు, సజ్జలు) నామ సంవత్సరంగా ప్రకటించాలని కోరింది. వినియోగదారులు, విధాన రూపకర్తలు, పరిశ్రమలు - పరిశోధన రంగాల్లో అవగాహన పెంచేందుకు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.
- సమాధానం: 3
26. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15వ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది ?
1) ఆర్టికల్ 290
2) ఆర్టికల్ 280
3) ఆర్టికల్ 270
4) ఆర్టికల్ 260
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం 15వ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 14వ ఫైనాన్స్ కమిషన్ అమల్లో ఉంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి 14వ కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు.
- సమాధానం: 2
27. 37 ఏళ్ల పాటు జింబాబ్వేను పరిపాలించి ఇటీవల అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వారు ఎవరు ?
1) రాబర్ట్ ముగాబే
2) ఎమ్మర్సన్ నన్ గాగ్వా
3) మోర్గాన్ స్వాన్ గిరాయ్
4) గ్రేస్ ముగాబే
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1980 నుంచి 2017 నవంబర్ వరకు జింబాబ్వేను పరిపాలించిన రాబర్ట్ ముగాబే ఇటీవల అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పదవి నుంచి దిగిపోవాలంటు పెరుగుతున్న ఒత్తిడి, ఆయన్ని అభిశంసించే ప్రక్రియకు జింబాబ్వే పార్లమెంట్ ప్రారంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతకముందు... అధికార జాను - పీఎఫ్ పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి ఎమర్సన్‌ను.. ముగాబే తొలగించడంతో దేశంలో అత్యవసర స్థితి ఏర్పడింది. ఎమర్సన్‌కు అండగా నిలిచిన ఆ దేశ సైన్యం ముగాబే, ఆయన భార్యను గృహ నిర్బంధంలోకి తీసుకుంది.
- సమాధానం: 1
28. ఫ్రీడం ఆన్ ది నెట్ - 2017 నివేదిక ప్రకారం ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 21
2) 41
3) 50
4) 75
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫ్రీడమ్ ఆన్ ది నెట్ సర్వేను ఫ్రీడం హౌస్ అనే సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారత్ 41వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 87 శాతం ఇంటర్నెట్ సేవలను వినియోగించే 65 దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఈ సంస్థ అధ్యయనం చేసింది.
- సమాధానం: 2
29. తెలంగాణలోని ఏ జిల్లాలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్ ఏర్పాటు కానుంది ?
1) వరంగల్
2) నల్గొండ
3) నిజామాబాద్
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం, పతంజలి మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. లక్కంపల్లిలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ లో పసుపు, మిర్చి, మక్కలు, సోయా తదితర సుగంధ ద్రవ్యాలు, తృణ ధాన్యాల్ని సేకరించి శుద్ధి చేస్తారు.
- సమాధానం: 3
30. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇటీవల అనుమతలు ఇచ్చిన జాతీయ హరిత ట్రిబ్యునల్.. నిర్మాణాల పర్యవేక్షణకు ఎన్ని కమిటీలు ఏర్పాటు చేసింది ?
1) ఒక కమిటీ
2) రెండు కమిటీలు
3) మూడు కమిటీలు
4) నాలుగు కమిటీలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తు దాఖలైన పిటిషన్లపై విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. పర్యావరణ నిబంధనలకు లోబడి నిర్మాణం చేయవచ్చని తీర్పు వెలువరించింది. కొండవీటి వాగు, దాని ఉప వాగులు, ఇతర వరద కాలువల పరీవాహక ప్రాంతంలో నీటి సంరక్షణ దిశగా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు జరిపే నిర్మాణాల పర్యవేక్షణకు రెండు పర్యావరణ కమిటీలను ఏర్పాటు చేసింది.
- సమాధానం: 2
31. ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమావేశం - 2017 ఇటీవల ఎక్కడ జరిగింది ?
1) తిరుపతి
2) విజయవాడ
3) కాకినాడ
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 4
వివరణ: విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమావేశానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం రంగంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేస్తామని బిల్ గేట్స్ ప్రకటించారు.
- సమాధానం: 4
32. 2018 ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక వరల్గ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సు ఏ నగరంలో జరగనుంది ?
1) హైదరాబాద్
2) విశాఖపట్నం
3) బెంగళూరు
4) చెన్నై
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రతిష్టాత్మక వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌కు హైదరాబాద్ వేదిక అవుతుంది. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు హెచ్ఐసీసీలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
- సమాధానం: 1
33. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కారులందరికీ 50 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 1
వివరణ: నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మత్య్యకారులకు 50 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు.
- సమాధానం: 1
34. 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) బెంగళూరు
2) చెన్నై
3) హైదరాబాద్
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 3
వివరణ: 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు నవంబర్ 8 నుంచి నవంబర్ 14 వరకు హైదరాబాద్‌లో జరిగాయి. చిల్డన్ ్రఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రోత్సవాలను నిర్వహించాయి. గోల్డెన్ ఎలిఫాంట్ పేరుతో ఏటా బాలల చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తారు.
- సమాధానం: 3
35. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ నగరంలో ప్రత్యేకంగా సైక్లింగ్ పార్క్‌ను ఏర్పాటు చేసింది ?
1) వరంగల్
2) కరీంనగర్
3) హైదరాబాద్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: హైదరాబాద్ కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక సైక్లింగ్ పార్కుని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని కేటీఆర్ తెలిపారు.
- సమాధానం: 3
36. 5వ ప్రపంచ సైబర్ స్పేస్ సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) బెంగళూరు
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకీ తీవ్రం అవుతున్న సైబర్ ముప్పుని ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో ఇటీవల గ్లోబల్ కాన్ఫరెన్స ఆన్ సైబర్ స్పేస్ సదస్సు జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొన్నారు.
- సమాధానం: 2
37. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన దీన్ దయాళ్ స్పర్శ యోజన పథకం ద్వారా తపాలా బిళ్లలను సేకరించే విద్యార్థులకు ఎన్ని వేల రూపాయల ఉపకార వేతనాన్ని అందిస్తారు ?
1) రూ. 6వేలు
2) రూ. 8 వేలు
3) రూ. 10 వేలు
4) రూ. 12 వేలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: పోస్టాఫీసుల వైపు విద్యార్థులను మళ్లించేందుకు, వారిలో తపాలా బిళ్లల సేకరణ అలవాటను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీన్ దయాళ్ స్పర్శ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను ఎంపిక చేసి వారికి 6 వేల రూపాయల ఉపకార వేతనం అందిస్తుంది. దీన్ని ప్రతి మూడు నెలలకు 1500 రూపాయల చొప్పున తపాలాశాఖ చెల్లిస్తుంది.
- సమాధానం: 1
38. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి ?
1) UMANG
2) COMEON
3) GOVERNING
4) BHIM
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం UMANG (Unified mobile application for new age governance) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఈ యాప్ 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.
- సమాధానం: 1
39. సీఎంఎఫ్ఆర్ఐ సంస్థ ఇస్రోతో కలిసి ఇటీవల ప్రారంభించిన ‘‘సముద్ర’’ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ?
1) ఖనిజ సంపదను గుర్తించడం
2) మత్య్స సంపద లభ్యతను గుర్తించడం
3) సముద్ర వ్యర్థాలను తొలగించడం
4) సునామీలను ముందే గుర్తించడం
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర సముద్ర మత్స్య సంపద పరిశోధన సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)తో కలిసి సముద్ర జలాల్లో పెద్ద ఎత్తున చేపలు లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు సముద్ర ప్రాజెక్టును ప్రారంభించింది.
- సమాధానం: 2
40.ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2017 పురస్కారానికి ఎంపికై న బాలీవుడ్ నటుడు ఎవరు ?
1) సల్మాన్ ఖాన్
2) రణ్ బీర్ కపూర్
3) అమితాబ్ బచ్చన్
4) అమీర్ ఖాన్
- View Answer
- సమాధానం: 3
41. భారత్‌లో తొలి సోషల్ మీడియా సదస్సు, సోషల్ మీడియా అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో తొలి సోషల్ మీడియా సదస్సు, సోషల్ మీడియా అవార్డుల ప్రదానోత్సవం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో దగ్గుబాటి రానాకు సౌత్ ఇండియా సోషల్ మీడియా బెస్ట్ హీరో అవార్డు, దీపికా పదుకునేకు సోషల్ మీడియా బెస్ట్ హోరోయిన్ అవార్డులు ప్రదానం చేశారు.
- సమాధానం: 2
42. పురుషుల టెన్నిస్ సీజన్లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ - 2017 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) గ్రిగోర్ దిమిత్రోవ్
2) డేవిడ్ గాఫిన్
3) రాఫెన్ నాదల్
4) రోజర్ ఫెదరర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: లండన్‌లో జరిగిన వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్ గ్రిగోర్ దిమిత్రోవ్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో దిమిత్రోవ్ బెల్జియంకు చెందిన డేవిడ్ గాఫిన్ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. తద్వారా 1998లో అలెక్స్ కొరెత్యా(స్పెయిన్) తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా దిమిత్రోవ్ గుర్తింపు పొందాడు.
- సమాధానం: 1
43. ఫోర్బ్స్ పత్రిక ఇటీవల విడుదల చేసిన సంగీతంలో అత్యధికం ఆర్జిస్తున్న మహిళల జాబితా - 2017లో తొలి స్థానంలో ఎవరు ఉన్నారు ?
1) అడిలె
2) మడోన్నా
3) రిహానా
4) బియాన్సె
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫోర్బ్స్ పత్రిక ఇటీవల సంగీతంలో ఎక్కువ ఆర్జిస్తున్న మహిళల జాబితా - 2017ను విడుదల చేసింది. ఇందులో అమెరికాకు చెందిన గాయని, గేయ రచయిత బియాన్సె 105 మిలియన్ డాలర్లతో తొలిస్థానంలో నిలిచారు. 69 మిలియన్ డాలర్లతో బ్రిటన్ గాయని అడిలె రెండో స్థానంలో నిలిచారు.
- సమాధానం: 4
44. బ్రిటీష్ ఇండియాలో వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేసిన తొలి మహిళా డాక్టర్ ఎవరు ?
1) రుఖ్మాబాయి రౌత్
2) భక్తీ యాదవ్
3) శివరామకష్ణ పద్మావతి
4) సృజనా దేవి
- View Answer
- సమాధానం: 1
వివరణ: రుఖ్మాబాయి రౌత్.. బ్రిటిష్ ఇండియాలో మెడిసిన్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన తొలి మహిళా డాక్టర్. ఇటీవల నవంబర్ 22న ఆమె 153వ జయంతిని పురస్కరించుకొని గూగుల్.. ఆమె చిత్రంతో ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.
- సమాధానం: 1
45. నానాటికీ కరిగిపోతున్న మంచు పలకల వల్ల భారత్‌లోని ఏ నగరాలకు ముప్పు పొంచి ఉందని ఇటీవల అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది ?
1) ముంబై
2) మంగళూరు
3) 1, 2
4) చెన్నై, విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 3
వివరణ: నానాటికీ కరిగిపోతున్న మంచు పలకల వల్ల తీరప్రాంత నగరాలైన ముంబై, మంగళూరుకు ముప్పు పొంచి ఉందని నాసా హెచ్చరించింది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని.. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 100 ఏళ్లలో మంగళూరు సముద్ర మట్టం 15.98 మీటర్లు, ముంబై సముద్ర మట్టం 15.25 సెంటీమీటర్లు పెరుగుతుందని తెలిపింది.
- సమాధానం: 3
46. ఇటీవల భారత నౌకా దళంలో చేరిన న్యూక్లియర్ సబ్ మెరైన్ ఏది ?
1) ఐఎన్ఎస్ అరిహంత్
2) ఐఎన్ఎస్ అరిధామన్
3) ఐఎన్ఎస్ విక్రాంత్
4) ఐఎన్ఎస్ విరాట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధామన్ నవంబర్ 19న విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డులో జల ప్రవేశం చేసింది. ఇది భారత్ న్యూక్లియర్ సబ్ మెరైన్ శ్రేణిలో రెండోది. మొదటిది ఐఎన్ఎస్ అరిహంత్. ఇది 2016లో నావికాదళంలో చేరింది. ఐఎన్ఎస్ అరిధామన్.. అరిహంత్ కంటే రెట్టింపు సామర్థ్యం కలిగి ఉంది. దీని బరువు 6 వేల టన్నులు. టెస్ట్ డెప్త్ 400 మీటర్లు.
- సమాధానం: 2
47. డాంగ్‌ఫెంగ్-41 పేరుతో ఒకేసారి 10 అణ్వాయుధాలని మోసుకుపోయే ఖండాతర క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేస్తోంది ?
1) భారత్
2) చైనా
3) అమెరికా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకేలా.. ఒకేసారి 10 అణ్వాయుధాలని మోసుకుపోయే ఖండాతార క్షిపణి 2018లో చైనా అమ్ముల పొదిలోకి చేరుతుంది. ఈ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నట్లు చైనా 2012లో ప్రకటించింది.
- సమాధానం: 2
48. స్పైక్ యాంటీ టాంక్ క్షిపణుల కోసం భారత్ ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఇటీవల నిర్ణయించింది ?
1) రష్యా
2) జపాన్
3) అమెరికా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయాలని భావించిన స్పైక్ యాంటి ట్యాంక్ క్షిపణుల ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించింది. దేశీయ పరిజ్ఞానంతో ఈ తరహా క్షిపణులను తయారు చేసే బాధ్యతను డీఆర్డీవోకు అప్పగించింది.
- సమాధానం: 4
49. తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉంది ?
1) అన్నాడీఎంకే
2) డీఎంకే
3) బీజేపీ
4) కాంగ్రెస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే చిహ్నం రెండాకుల గుర్తును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి కేటాయిస్తు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ గుర్తు కోసం ఆ పార్టీ బహిష్కృతన నేతలు శశికళ, దినకరన్ తీవ్రంగా ప్రయత్నించారు.
- సమాధానం: 1
50. దేశంలోనే తొలిసారిగా ఇటీవల ఏ నగరంలో భౌగోళిక సమాచార వ్యవస్థ మ్యాపింగ్ సర్వే - 2017ను ప్రారంభించారు ?
1) ముంబై
2) కోల్ కతా
3) చెన్నై
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలోనే తొలిసారిగా చెన్నైలో భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) మ్యాపింగ్ సర్వే - 2017ను నవంబర్ 21న ప్రారంభించారు. రెండు డ్రోన్లతో 120 రోజుల్లో నగరంలోని రహదారులు మొదలు వీధి దీపాల వరకు అన్ని వివరాలను ఈ సర్వేలో నమోదు చేస్తారు.
- సమాధానం: 3