కరెంట్ అఫైర్స్ మార్చి (16 – 23) బిట్ బ్యాంక్
1. తెలంగాణ ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది?
1) రూ. 1,74,453.83 కోట్లు
2) రూ.1,49,646 కోట్లు
3) రూ. 1,94,500 కోట్లు
4) రూ.1.20,550 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన చివరి పూర్తి స్థాయి బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం.. అన్నదాతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం రూ.1,74,453.83 లక్షల కోట్ల బడ్జెట్ లో 26 శాతం నిధులను వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయించింది. 2017-18 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్ రూ.1,49,646 కోట్లు.
- సమాధానం: 1
2. దేశంలోనే తొలిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఎన్ని వేల రూపాయల సాయం అందించనుంది?
1) రూ.6,000
2) రూ.4,000
3) రూ.5,000
4) రూ.3,000
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు బడ్జెట్ లో పథకం అమలు కోసం రూ.12,000 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఒక పంటకు ఎకరానికి రూ.4 వేలు అందించనుంది. ఖరీఫ్, రబీ రెండు పంటలకు కలిపి రైతుకు ఎకరానికి రూ.8 వేలు అందుతుంది.
- సమాధానం: 2
3. తెలంగాణ ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో ప్రకటించిన రైతు బీమా పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది?
1) రూ.500 కోట్లు
2) రూ.1000 కోట్లు
3) రూ.700 కోట్లు
4) రూ.100 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కొత్త బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదంలో చనిపోయినా కూడా ఆయా రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 72 లక్షల మంది రైతుల తరపున ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తుంది.
- సమాధానం: 1
4. 2018-19 తెలంగాణ బడ్జెట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర అప్పులు మొత్తం ఎంతకు చేరనున్నాయి?
1) రూ.93,115 కోట్లు
2) రూ.1,27,829 కోట్లు
3) రూ.1,51,133 కోట్లు
4) రూ.1,80,238 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2018-19 వార్షిక బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తెలంగాణ రాష్ట్ర అప్పులు మొత్తం రూ.1,80,238 కోట్లకు చేరనుంది. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.1,51,133 కోట్ల అప్పులు చేసినట్లు వెల్లడించింది.
- సమాధానం: 4
5. 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీడీపీ) ఎన్ని కోట్లుగా నమోదైంది ?
1) రూ.4,97,513 కోట్లు
2) రూ.5,49,479 కోట్లు
3) రూ.6,45,567 కోట్లు
4) రూ.7,35,312 కోట్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఆ సంవత్సరానికి రాష్ట్ర స్థూల 10.4 శాతం వృద్ధితో రూ.5,49,479 కోట్లుగా నమోదైంది. అంతకముందు ఏడాది ఇది రూ.4,97,513 కోట్లుగా ఉంది.
- సమాధానం: 2
6. 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ?
1) రూ.1,75,534
2) రూ.1,25,891
3) రూ.1,12,764
4) రూ. 62,770
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,75,534 గా నమోదైంది. 2017-17తో పోలిస్తే ఇది 13.4 శాతం ఎక్కువ. అంతకముందు ఏడాది తలసరి ఆదాయం రూ.1,54,734 గా ఉంది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.3,68,747 తో తొలి స్థానంలో ఉండగా, రూ.3,15,745తో హైదరాబాద్ రెండోస్థానంలో ఉంది. 31 జిల్లాల్లో నాగర్ కర్నూల్ రూ.82,694తో అన్ని జిల్లాల కన్నా వెనకబడి ఉంది.
- సమాధానం: 1
7. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు ఎన్ని మిల్లీమీటర్ల మేర పెరిగినట్లు 2017-18 తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది ?
1) 5.2 మిల్లీమీటర్లు
2) 9.02 మిల్లీమీటర్లు
3) 15 మిల్లీ మీటర్లు
4) 12 మిల్లీమీటర్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: నాలుగు దశల్లో జరిగిన మిషన్ కాకతీయ పనుల్లో 26,302 చెరువుల పునరుద్ధరణ పూర్తయిందని తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2017-18 పేర్కొంది. ఈ చెరువుల ద్వారా 20.08 లక్షల ఎకరాల ఆయకట్టకు లబ్ధి చేకూరిందని వెల్లడించింది. 9.02 మిల్లీమీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగినట్లు తేలింది.
- సమాధానం: 2
8. 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో సామాజిక పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య ఎంత?
1) 18 లక్షలు
2) 43 లక్షలు
3) 38.87 లక్షలు
4) 50 లక్షలు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 11 శాతం మంది.. అంటే 38.87 లక్షల మందికి ఆసరా పింఛన్ల ద్వారా లబ్ధి కలుగుతోంది.
- సమాధానం: 3
9. 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది?
1) 9.8 శాతం
2) 8.8 శాతం
3) 6.8 శాతం
4) 5.8 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం వ్యవసాయం అనుబంధ రంగాల్లో 9.8 శాతం వృద్ధి నమోదైంది. 2017-18 సంవత్సరానికి గాను రెండో ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 31.87 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. గత సంవత్సరం మొత్తం 101.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే.. ఈ ఏడాది 95.01 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందని సామాజిక ఆర్థిక సర్వేఅంచనా వేసింది.
- సమాధానం: 1
10. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2017-18 ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర వృద్ధి రేటు ఎంత?
1) 9 శాతం
2) 8 శాతం
3) 7 శాతం
4) 12 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆర్థిక రంగ అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో 9 శాతం వృద్ధి నమోదైనట్లు సామాజిక ఆర్థిక సర్వే చెబుతోంది. రాష్ట్ర స్థూల విలువ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.6,61,052 కోట్లని పేర్కొంది. అందులో రూ.97,885 కోట్లతో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 14.8 శాతంగా కాగా, రూ.4,32,520 కోట్లతో సేవా రంగం 65.4 శాతం వాటా సాధించింది. పరిశ్రమల రంగం రూ.1,30,647 కోట్లతో 19.8 శాతం వాటా నమోదు చేసుకుంది.
- సమాధానం: 1
11. ఐరాసకు చెందిన సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ – 2018లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 96
2) 156
3) 133
4) 145
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐరాసకు చెందిన సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ – 2018లో భారత్ 133వ స్థానంలో నిలిచింది. 156 దేశాలతో కూడిన జాబితాలో ఫిన్లాండ్ తొలి స్థానంలో, నార్వే రెండో స్థానంలో, డెన్మార్ మూడో స్థానంలో నిలిచాయి. బురుండి చివరి స్థానంలో ఉంది. గతంలో భారత్ ర్యాంకు 122గా ఉంది.
- సమాధానం: 3
12. అంతరిస్తున్న జంతుజాతుల వీర్యం, కణాలను భద్రపరిచేందుకు ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఫ్రోజెన్ జూ పేరుతో పరిశోధన శాలని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) బెంగళూరు
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతరిస్తున్న జంతు జాతుల వీర్యం, కణాలను భద్రపరిచి.. ఆ జాతులను రక్షించేందుకు ఆసియాలోనే మొట్టమొదటి ఫ్రోజెన్ జూ ల్యాబోరేటరీని ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభించారు. హైదరాబాద్ లోని లేబరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేజర్డ్ స్పీసెస్(లాకోన్స్)లో దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 29 జంతుజాతుల వీర్యాన్ని, కణజాలలను ఇందులో భద్రపరిచారు.
- సమాధానం: 2
13. మొబైల్ తయారీ సంస్థ వివో.. భారత్ మార్కెట్ లో బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరిని నియమించుకుంది ?
1) షారూక్ ఖాన్
2) అమితాబ్ బచ్చన్
3) సురేశ్ రైనా
4) అమీర్ ఖాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: చైనా మొబైల్ ఫోన్ల కంపెనీ వివో.. భారత మార్కెట్ లో తన బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ను నియమించుకుంది. ఈయన కొత్తగా విడుదల చేయబోయే ఉత్పత్తులకు ప్రచారం చేస్తారు.
- సమాధానం: 4
14. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?
1) రోజర్ ఫెడరర్
2) రాఫెల్ నాదల్
3) మార్టిన్ డెల్ పొట్రో
4) నొవాక్ జకోవిచ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో.. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ను ఓడించి అర్జెంటీనా స్టార్ జువాన్ మార్టిన్ డెల్ పొట్రో టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఫెడరర్ తో 25 సార్లు ముఖాముఖి పోరులో డెల్ పొట్రోకిది ఏడో విజయం.
- సమాధానం: 3
15. రష్యా అధ్యక్షుడిగా వ్లాద్ మీర్ పుతిన్ ఇటీవల మరోసారి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం ఇది ఎన్నోసారి ?
1) ఒకటి
2) రెండు
3) మూడు
4) నాలుగు
- View Answer
- సమాధానం: 4
వివరణ: రష్యా అధ్యక్షునిగా వ్లాద్ మీర్ పుతిన్ వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. ఆయన మరో ఆరేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఈ ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా 76.67 శాతం ఓట్లు పోలయ్యాయి. ఫలితాల అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. బతికినంత కాలం పదవిలోనే ఉండాలనే ఆకాంక్ష తనకు లేదని అన్నారు.
- సమాధానం: 4
16. దేశంలోనే ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామిగా ఉన్న సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది?
1) అనంతపురం
2) చిత్తూరు
3) కృష్ణా
4) గుంటూరు
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోనే ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామిగా ఉన్న సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ నిర్మాణానికి మార్చి 21న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. సత్యవేడు మండలం మాదన్నపాలెం గ్రామంలో 600 ఎకరాల్లో ఏర్పాటవుతోన్న ఈ ప్లాంట్ లో సంస్థ రూ.3200 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా 15 వేల మందికి ఉపాధి లభించనుంది.
- సమాధానం: 2
17. భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశ సహకారంతో తయారు చేశారు?
1) రష్యా
2) జపాన్
3) అమెరికా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానం జోడించి.. రష్యా సహకారంతో డీఆర్ డీవో దీన్ని తయారు చేసింది. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నదుల పేరు మీదే బ్రహ్మోస్ పేరు ఏర్పడింది. బ్రహ్మోస్ 2006 నుంచి భారత నేవీ, ఆర్మీకి సేవలందిస్తోంది. గతంలో ఇది 2.8 మాక్ వేగంతో ప్రయాణించేది. ప్రస్తుతం దీని వేగాన్ని 5.0 మాక్(6125.220 కిలోమీటరు/ గంటకు) కు పెంచారు.
1 మాక్ = 1225.044 కిలోమీటర్లు/గంటకు.
- సమాధానం: 1
18. 6వ ఎడిషన్ విస్డన్ ఇండియా ఆల్ మాంక్ – 2018 అవార్డుల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు?
1) కేఎల్ రాహుల్
2) అజింక్యా రహానే
3) మనీష్ పాండే
4) బూమ్రా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 6వ ఎడిషన్ విస్డన్ ఇండియా ఆల్ మాంక్ – 2018 అవార్డుల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ కి ప్రకటించారు.
- సమాధానం: 1
19. దేశపు తొలి క్లోనింగ్ అస్సామీ గేదెదూడ ను ఇటీవల ఏ రాష్ట్రంలో సృష్టించారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) హర్యానా
3) అస్సాం
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశపు మొట్టమొదటి క్లోనింగ్ అస్సామీ గేదె దూడను శాస్త్రవేత్తలు సృష్టించినట్లు గేదెల పరిశోధన కేంద్ర సంస్థ(సీఐఆర్ బీ) తెలిపింది. 2017 డిసెంబర్ 22న సాధారణ ప్రసవం ద్వారా ఈ దూడ పుట్టిందని వెల్లడించింది. దీనికి సచ్ గౌరవ్ అని పేరు పెట్టారు. దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో మాత్రమే అస్సామీ గేదెలు కనబడుతాయి.
- సమాధానం: 2
20. 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయి ?
1) త్రిపుర
2) మణిపూర్
3) మిజోరం
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఉన్న మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరగాల్సిన ఈ సమావేశాలు... పలు కారణాలతో మణిపూర్ కి తరలి వెళ్లాయి. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగాయి.
- సమాధానం: 2
21. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఇటీవల విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్షిషన్ ఇండెక్స్ – 2018లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది?
1) 55
2) 69
3) 78
4) 47
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ ఆర్థిక ఫోరమ్ 114 దేశాల ర్యాంకింగ్స్ తో విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్షిషన్ ఇండెక్స్ – 2018లో భారత్ 78వ స్థానంలో నిలిచింది. ఇంధన భద్రత, పర్యావరణ సుస్థిరత తదితర అంశాల్లో దేశాలు తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా ఈ ర్యాంకులు కేటాయించారు.
- సమాధానం: 3
22. రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ లో భారత అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) పీఎస్ రాఘవన్
2) సంగీతా బహదూర్
3) పంకజ్ షరన్
4) ప్రభాత్ ప్రకాశ్ శుక్లా
- View Answer
- సమాధానం: 2
వివరణ: విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న 1987 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన అధికారిణి సంగీతా బహదూర్.. రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ లో భారత అంబాసిడర్ గా నియమితులయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా లో భారత అంబాసిడర్ గా అతుల్ ఎం. గాట్ సర్వే నియమితులయ్యారు.
- సమాధానం: 2
23. లాస్ఏంజిల్స్ లో జరిగిన బెస్ట్ ఆఫ్ ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం అవార్డు పొందిన షార్ట్ ఫిల్మ్ ఏది?
1) దేఖ్ ఇండియన్ సర్కస్
2) ద మిస్డ్ క్లాస్
3) బ్లాక్ మిర్రర్
4) శూన్యత
- View Answer
- సమాధానం: 4
వివరణ: లాస్ఏంజిల్స్ లో జరిగిన బెస్ట్ ఆఫ్ ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో శూన్యత చిత్రం.. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డు పొందింది. 22 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాకు చింతన్ సర్దా దర్శకత్వం వహించారు.
- సమాధానం: 4
24. భారత్ – ఫ్రాన్స్ సంయుక్త నావికా విన్యాసాలు – వరుణ 2018లో తొలి దఫా విన్యాసాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయి ?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) తమిళనాడు
4) గోవా
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్ – ఫ్రాన్స్ సంయుక్త నావికా విన్యాసాలు – వరుణ 2018లో తొలి దఫా విన్యాసాలు మార్చి 19 నుంచి 24 వరకు గోవాలో జరిగాయి. గోవా తీరం వెంట ఉన్న అరేబియన్ సముద్రంలో ఈ విన్యాసాలు జరిగాయి. తర్వాతి రెండు దఫాల విన్యాసాలు చెన్నైలో జరుగుతాయి. భారత్, ఫ్రాన్స్ 1993 నుంచి సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.
- సమాధానం: 4
25. నాబకలేబరా వేడుకలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
1) కర్ణాటక
2) ఒడిశా
3) అస్సాం
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
వివరణ: నాబకలేబరా వేడుకలను ఒడిశాలో నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. రూ. 10, రూ.వెయ్యి విలువతో కూడిన స్మారక నాణేలను విడుదల చేశారు. ఒడిశాలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా.. జగన్నాథ స్వామి, బాలభద్ర, సుభద్ర, సుదర్శన్ ల పాత విగ్రహాల స్థానంలో కొత్త వాటిని ప్రతిష్టిస్తారు. ప్రతి 8, 12, 19 ఏళ్లకోసారి ఈ వేడుకలను నిర్వహిస్తారు.
- సమాధానం: 2
26. బిహార్ గవర్నర్ గా ఉన్న సత్య పాల్ మాలిక్ కి.. ఏ రాష్ట్రానికి గవర్నర్ గా అదనపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది ?
1) పశ్చిమ బెంగాల్
2) జార్ఖండ్
3) తెలంగాణ
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
వివరణ: బిహార్ గవర్నర్ గా ఉన్న సత్య పాల్ మాలిక్.. ఇటీవల ఒడిశా గవర్నర్ గాను నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన అదనపు బాధ్యతలు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా గవర్నర్ గా డాక్టర్ ఎస్ సీ జమీర్ ఐదేళ్ల పదవీ కాలం ముగియటంతో.. సత్యపాల్ కి అదనపు బాధ్యతలు అప్పగించారు.
- సమాధానం: 4
27. ఉపగ్రహాల ద్వారా భూమి పరిశీలనకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు యూరోపియన్ యూనియన్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) భారత్
2) కెనడా
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం:1
వివరణ: ఉపగ్రహాల ద్వారా భూ పరిశీలన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్, యూరోపియన్ యూనియన్ ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా రెండుదేశాలకు చెందిన ఉపగ్రహాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వీలు కలుగుతుంది.
- సమాధానం:1
28. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 20
2) మార్చి 22
3) మార్చి 18
4) మార్చి 16
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం(వరల్డ్ స్పేరో డే)ని ఏటా మార్చి 20న నిర్వహిస్తారు. నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇకో సిస్ యాక్షన్ ఫౌండేషన్, ఇతర సంస్థల సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నాయి. ఆధునిక కట్టడాలు, సెల్ ఫోన్ టవర్ల రెడియేషన్, పురుగు మందుల వల్ల పిచ్చుకల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
29. అంతర్జాతీయ సంతోష దినోత్సవం – 2018 ఇతివృత్తం ఏంటి?
1) షేర్ హ్యాపినెస్
2) యాంగ్రీ బర్డ్స్ హాపీ ప్లానెట్
3) రీక్లెయిమ్ హ్యాపినెస్
4) హ్యాపీ హీరోస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని ఏటా మార్చి 20న నిర్వహిస్తారు. ప్రజల జీవితాల్లో సంతోషం ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 156 దేశాల ర్యాంకింగ్స్ తో విడుదల చేసిన ప్రపంచ సంతోష సూచీలో భారత్ 133వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 1
30. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ల తొలి సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) భారత్
2) జర్మనీ
3) అర్జెంటీనా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ల తొలి సమావేశం ఇటీవల అర్జెంటీనాలోని బూనో ఎయిర్స్ లో జరిగింది. జీ20 సభ్య దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
- సమాధానం: 3
31. మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే – 2018 ప్రకారం దేశంలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) కోల్ కత్తా
4) చెన్నై
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్-2018’ పేరుతో మెర్సర్ ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వియన్నా నగరం తొలి స్థానంలో ఉండగా... దేశంలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. నేరాల శాతం తక్కువగా ఉండటం, ఏ కాలంలోనైనా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రేటింగ్ ఇస్తారు. హైదరాబాద్ తో పాటూ పుణె కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
- సమాధానం: 1
32. ప్రపంచ నీటి దినోత్సవం – 2018 ఇతివృత్తం?
1) వై వేస్ట్ వాటర్?
2) నేచర్ ఆఫ్ వాటర్
3) వాటర్ ఈజ్ లైఫ్
4) సేవ్ వాటర్ ఫర్ టుమారో
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏటా మార్చి 22న నిర్వహిస్తారు. జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. 1993 నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
Theme: Nature of water
- సమాధానం: 2
33. విద్యార్థులు, ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య రథాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్య రథాన్ని ప్రారంభించింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ... వరల్డ్ ఆన్ వీల్స్ – ఆంధ్రప్రదేశ్ నైపుణ్య రథం పేరిట ఈ మొబైల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది.
- సమాధానం: 2
34. ప్రతిష్టాత్మక ఎబెల్ ప్రైజ్ – 2018ని గెలుపొందిన రాబర్ట్ లాంగ్ లాండ్స్.. ఏ దేశానికి చెందినవారు ?
1) కెనడా
2) అమెరికా
3) బ్రెజిల్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: కెనడాకు చెందిన ప్రఖ్యాత మ్యాథమెటీషియన్ రాబర్ట్ లాంగ్ లాండ్స్.. ప్రతిష్టాత్మక ఎబెల్ ప్రైజ్ – 2018ని దక్కించుకున్నారు. రిప్రెజంటేషన్ థియరీని నంబర్ థియరీతో కలిపే ప్రక్రియను కనుగొన్నందుకు గాను ఆయన ఈ పురస్కారాన్ని గెలుపొందారు. నార్వేయిన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది.
- సమాధానం: 1
35. ఇటీవల ఏ రాష్ట్రం జాక్ ఫ్రూట్(పనస పండు) ని రాష్ట్ర ఫలంగా ప్రకటించింది ?
1) ఒడిశా
2) నాగాలాండ్
3) కేరళ
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేరళ ప్రభుత్వం జాక్ ఫ్రూట్ (పనస పండుని) రాష్ట్ర ఫలంగా ప్రకటించింది. కేరళ పనసకి దేశవ్యాప్తంగా మార్కెటింగ్ ని విస్తృతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 3
36. పాత్రికేయులకు ప్రదానం చేసే జీకే రెడ్డి స్మారక అవార్డు – 2017ని ఇటీవల ఎవరికి అందజేశారు?
1) కేకే కట్యాల్
2) జి సతీశ్ రెడ్డి
3) టి సుబ్బిరామిరెడ్డి
4) కరణ్ థాపర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ జర్నలిస్ట్, టీవీ వ్యాఖ్యాత కరణ్ థాపర్.. జీకే రెడ్డి స్మారక అవార్డు-2017 ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు.
- సమాధానం: 4
37. భూమిపై మిగిలిన ఒకేఒక తెల్లని మగ ఖడ్గమృగం సుడాన్.. ఇటీవల ఏ దేశంలో కన్నుమూసింది ?
1) సుడాన్
2) కెన్యా
3) ఈజిప్ట్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
వివరణ: భూమిపై మిగిలిన ఒకేఒక తెల్లని మగ ఖడ్గమృగం "సుడాన్" ఇటీవల కన్నుమూసింది. కెన్యాలోని ఓఐ పెజెతా కన్జర్వెన్సీలో మరణించింది. వయోభారం, కాలికి సోకిన ఇన్ఫెక్షన్ కారణంగానే సూడాన్ మరణించింది.
- సమాధానం: 2
38. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొంది.. ఇటీవల కుప్పకూలిన సహజసిద్ధంగా ఏర్పడిన ఐస్ బ్రిడ్జ్ ఏ దేశంలో ఉండేది ?
1) యూఎస్ఏ
2) స్విట్జర్లాండ్
3) అర్జెంటీనా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: అర్జెంటీనాలో యునెస్కో వారసత్వ సంపదగా భాసిల్లుతున్న ఐస్ బ్రిడ్జి ఇటీవల కుప్పకూలింది. పెంటగోనియాలోని లాస్ గ్లేసియర్ జాతీయ పార్కులో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ఐస్ బ్రిడ్జి.. భారీ తుపాను ధాటికి కూలిపోయింది.
- సమాధానం: 3
39. తమిళనాడులో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పార్టీని స్థాపించినవారు ఎవరు?
1) టీటీవీ దినకరన్
2) కమల్ హాసన్
3) పన్నీర్ సెల్వం
4) పళనిస్వామి
- View Answer
- సమాధానం:1
వివరణ: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. పైన నలుపు, మధ్యలో తెలుపు, కిందిభాగంలో ఎరుపు, మధ్యలో జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
- సమాధానం:1
40. ఇటీవల న్యూఢిల్లీలో రైజింగ్ ఇండియా సదస్సుని ఏ సంస్థ నిర్వహించింది?
1) టైమ్స్ గ్రూప్
2) రిలయెన్స్ ఇండస్ట్రీస్
3) న్యూస్ 18
4) టాటా గ్రూప్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ‘న్యూస్ 18’ గ్రూప్ ఢిల్లీలో మార్చి 16న నిర్వహించిన రైజింగ్ ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. రైజింగ్ ఇండియా అంటే ఆర్థిక వ్యవస్థ, జీడీపీ, విదేశీ పెట్టుబడులు మొదలైనవి మాత్రమే కాదని.. రైజింగ్ ఇండియా అంటే 125 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
- సమాధానం: 3
41. కృషి ఉన్నతి మేళా – 2018ని ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు?
1) ఢిల్లీ
2) హైదరాబాద్
3) భువనేశ్వర్
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఢిల్లీలో మార్చి 16-18 వరకు జరిగిన వ్యవసాయ సదస్సు ‘కృషి ఉన్నతి మేళా-2018’ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. మార్చి 17న ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. పంట పెట్టుబడి కంటే మద్దతు ధర కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేందుకు.. పంట పండించడానికి అయ్యే అన్ని ప్రధాన ఖర్చులనూ పెట్టుబడి కింద లెక్కలోకి తీసుకుంటామని మోదీ భరోసానిచ్చారు. మద్దతు ధర పెట్టుబడి కంటే కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా చూస్తామని 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
- సమాధానం: 1
42. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇటీవల వెల్లడించిన 2015-16 గణాంకాల ప్రకారం చిన్నారులపై ఎక్కువ నేరాలు నమోదైన రాష్ట్రం ఏది ?
1) బిహార్
2) ఉత్తరాఖండ్
3) ఉత్తరప్రదేశ్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశవ్యాప్తంగా 2015 నుంచి 2016 వరకు చిన్నారులపై నేరాలు 11 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక విడుదల చేసింది. 2015లో దేశవ్యాప్తంగా 94,172 నేరాలు నమోదుకాగా 2016 నాటికి ఈ సంఖ్య 1,06,958కు చేరుకుందని పేర్కొంది. ఈ నివేదికను క్రై అనే ఎన్జీవో సంస్థ డెరైక్టర్ కోమల్ గనోత్రా విశ్లేషించారు. చిన్నారులపై నేరాల్లో 15 శాతంతో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా, మహారాష్ట్ర(14 శాతం), మధ్యప్రదేశ్(13 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయని ఆయన తెలిపారు.
- సమాధానం: 3
43. స్టాక్‌హోమ్‌కు చెందిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆయుధాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1) భారత్
2) సౌదీ అరేబియా
3) దక్షిణ కొరియా
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశ రక్షణకు అవసరమైన ఆయుధాల దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2008-12, 2013-17 మధ్యకాలంలో భారత్ ఆయుధాల దిగుమతి 24 శాతం పెరిగనట్లు స్టాక్‌హోమ్‌కు చెందిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రీ) వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా గత ఐదేళ్ల దిగుమతులను పరిశీలిస్తే భారత్ వాటా 12 శాతంగా ఉంది. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా నుంచి భారత్ ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.
- సమాధానం: 1
44. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ – 2018 ప్రకారం దేశంలో జీవించడానికి అత్యంత చౌకైన నగరం ఏది ?
1) హైదరాబాద్
2) పూణె
3) బెంగళూరు
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్‌లో జీవించడానికి అత్యంత చౌకైన మెట్రో నగరంగా బెంగళూరు గుర్తింపు పొందింది. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) విడుదల చేసిన గ్లోబల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్-2018లో బెంగళూరు ప్రపంచంలోనే ఐదో చౌకైన నగరంగా నిలిచింది. ఈ సర్వేను ప్రపంచంలోని 139 మహానగరాలపై నిర్వహించారు.
- సమాధానం: 3
45. కల్యాణలక్ష్మీ పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతకు పెంచింది ?
1) రూ.2,00,116
2) రూ.1,00,116
3) రూ.75,116
4) రూ.50,116
- View Answer
- సమాధానం: 2
వివరణ: కల్యాణలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.75,116గా ఉన్న మొత్తాన్ని రూ.1,00,116కు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
- సమాధానం: 2
46. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనాల ప్రకారం 2018-19లో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది ?
1) 7.3 శాతం
2) 7 శాతం
3) 8 శాతం
4) 9 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఆర్థిక సంవత్సరం (2018-19)లో 7.3 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. తదుపరి ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇది 7.5 శాతానికి పుంజుకుంటుందని అంచనా వెల్లడించింది.
- సమాధానం: 1
47. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాన్ని ఏ దేశం అభివృద్ధి చేస్తోంది?
1) చైనా
2) అమెరికా
3) జపాన్
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, బీజింగ్ నుంచి న్యూయార్క్ కు రెండు గంటల్లోనే చేరుకోగల విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. దీనిని పరీక్షించేందుకు ధ్వని వాయు సొరంగం (హైపర్సోనిక్ విండ్ టన్నెల్)ను చైనా నిర్మిస్తోందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. కొత్త విమానం ధ్వని వేగానికి 25 రెట్ల అధిక వేగం (మ్యాక్ 25)తో ప్రయాణించగలదు. సాధారణ లెక్కల్లో చెప్పాలంటే గంటకు ఏకంగా 30,625 కిలోమీటర్ల వేగంతో ఇది ఆకాశంలో దూసుకుపోగలదు.
- సమాధానం: 1
48. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఫుట్ బాల్ టోర్నీ – 2018 విజేత ఎవరు ?
1) చెన్నైయిన్ ఎఫ్ సీ
2) బెంగళూరు ఎఫ్ సీ
3) అట్లెటికో డి కోల్ కతా
4) కేరళ బ్లాస్టర్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భారత క్రికెటర్ ధోని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సీ రెండోసారి విజేతగా నిలిచింది. మార్చి 17న జరిగిన ఫైనల్లో చెన్నయిన్ 3-2 గోల్స్ తేడాతో బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. బ్రెజిలియన్ ఆటగాళ్లు మెల్సన్ అల్వెస్ రెండు గోల్స్, రాఫెల్ ఆగస్టో ఒక గోల్ చేసి చెన్నైయిన్‌ను గెలిపించారు.
- సమాధానం: 1
49. ఇరానీ క్రికెట్ కప్ – 2018ని గెలుచుకున్న విదర్భ జట్టు కెప్టెన్ ఎవరు?
1) గణేశ్ సతీశ్
2) రజ్నీశ్ గుర్బాణీ
3) ఫాయిజ్ ఫజల్
4) వసీం జాఫర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తొలిసారి రంజీ ట్రోఫీ సాధించిన విదర్భ జట్టు ఇరానీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన విదర్భ ఆ తర్వాత ప్రత్యర్థిని 390 పరుగులకే ఆలౌట్ చేసి 410 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులు చేసిన వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
- సమాధానం: 2
50. దేశంలో అత్యంత సంపన్న ఎంపీగా గుర్తింపు పొందిన వారు ఎవరు?
1) జయాబచ్చన్
2) రవీంద్ర కిశోర్ సిన్హా
3) కొండా విశ్వేశ్వర్ రెడ్డి
4) సుజనా చౌదరి
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా జయాబచ్చన్ నిలవనున్నారు. ప్రముఖ నటి, సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలైన జయాబచ్చన్ యూపీ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మార్చి 12న సమర్పించిన ప్రమాణపత్రంలో ఆస్తుల విలువను రూ.1000 కోట్లుగా పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా భాజాపాకు చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా గుర్తింపు పొందారు. ఆయన 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యే నాటికి ఆస్తుల విలువను రూ.800 కోట్లుగా ప్రకటించారు.
- సమాధానం: 1