కరెంట్ అఫైర్స్ (జూన్ 24-30) బిట్ బ్యాంక్
1. ప్రపంచంలో బహిష్కృతులు(Expatriates) నివసిస్తున్న అత్యంత ఖరీదైన నగరం ఏది ?
1) లువాండా
2) హాంకాంగ్
3) టోక్యో
4) ముంబయి
- View Answer
- సమాధానం: 1
వివరణ: మెర్సర్ సంస్థ ఇటీవల 23వ జీవన వ్యయ సర్వే నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలో బహిష్కృతుల అత్యంత ఖరీదైన నగరం అంగోలా రాజధాని లువాండా. ఆ తర్వాతి స్థానాల్లో హాంకాంగ్, టోక్యో ఉన్నాయి. ఈ జాబితాలో ముంబయి 57వ స్థానంలో ఉంది.
- సమాధానం: 1
2. ప్రపంచంలో తొలిసారిగా వర్చ్యుల్ ట్రాక్‌పై నడిచే రైలుని ప్రవేశపెట్టిన దేశం ఏది ?
1) కెనడా
2) ఆస్ట్రేలియా
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ వర్చ్యుల్ ట్రాక్‌పై రైలు రబ్బర్ టైర్ల సహాయంతో 70 కి.మీ. వేగంతో నడుస్తుంది.
- సమాధానం: 3
3. జపాన్ ప్రభుత్వం ప్రదానం చేసే వాతావరణ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) కిమ్ ఇల్ టాన్
2) శ్రీహరి చంద్రఘాట్గీ
3) కె.చంద్రశేఖర్‌రావు
4) జైమ్స్ కిటాని
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ పురస్కారానికి ప్రముఖ భారతీయ వ్యవసాయ, మైక్రో బయాలజిస్ట్ శ్రీహరి చంద్రఘాట్గీ ఎంపికయ్యారు.
- సమాధానం: 2
4. రిలయన్స్ డిఫెన్స్ ఇటీవల ఏ కంపెనీతో ఆయుధాల తయారీ ఒప్పందం కుదుర్చుకుంది ?
1) బోయింగ్
2) రాఫెల్
3) యుగో ఇమ్పొర్ట్
4) టైకొనాఎక్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్.. సెర్బియాకు చెందిన యుగో ఇమ్పొర్ట్తో వచ్చే 10 ఏళ్ల కాలానికి రూ.20,000 కోట్ల విలువగల ఆయుధాల తయారీ ఒప్పందం చేసుకుంది.
- సమాధానం: 3
5. ప్రపంచ ఎయిర్‌లైన్స్ పురస్కారాలలో 2017 సంవత్సరానికి గాను ఉత్తమ ఎయిర్‌లైన్స్‌గా ఎంపికైన సంస్థ ఏది ?
1) ఇండియన్ ఎయిర్వేస్
2) సింగపూర్ ఎయిర్‌లైన్స్
3) ANA ఆల్ నిప్పన్ ఎయిర్‌లైన్స్
4) ఖతార్ ఎయిర్‌లైన్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఖతార్ ఎయిర్‌లైన్స్ వరుసగా నాలుగోసారి ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ రెండో స్థానంలో, ANA ఆల్ నిప్పన్ ఎయిర్‌లైన్స్ మూడో స్థానంలో ఉన్నాయి.
- సమాధానం: 4
6. ఇటీవల ఐరాస విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏ సంవత్సరం లోపు భారత్ చైనా జనాభాను అధిగమిస్తుంది ?
1) 2020
2) 2024
3) 2026
4) 2030
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐరాస ప్రపంచ జనాభా - 2017 నివేదిక ప్రకారం 2023లోపు ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకుంటుంది. 2024లోపు భారత్ చైనాను అధిగమించి.. జనాభాలో తొలి స్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతం చైనా జనాభా 1.41 బిలియన్లు కాగా భారత్ జనాభా 1.34 బిలియన్లు.
యునెటైడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఈ నివేదికను తయారు చేసింది.
- సమాధానం: 2
7. అంతర్జాతీయ బయోలాజికల్ కన్వెన్షన్ - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) శాన్ డియాగో
2) శాన్ ఫ్రాన్స్సిస్కో
3) పారిస్
4) లండన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాలోని శాన్ డియాగోలో ఈ సమావేశాలు జరిగాయి.
- సమాధానం: 1
8. ప్రపంచంలో డేటా ఎంబసీని ఏర్పాటు చేస్తున్న తొలి దేశం ఏది ?
1) ఎస్తోనియా
2) లక్సంబర్గ్
3) జిబొటి
4) తువాలు
- View Answer
- సమాధానం: 1
9. దేశంలో తొలిసారి డీజిల్‌ను ఇంటివద్దకు తెచ్చే సదుపాయాన్ని ఏ నగరంలో ప్రారంభించారు ?
1) ముంబయి
2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 4
10. ప్రతిష్టాత్మక క్వీన్ యంగ్ లీడర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) డేవిడ్ రోజుర్
2) అంకిత్ కవత్రా
3) గుర్మీత్ చద్దా
4) సతీష్ చంద్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్, కామిక్ రిలీఫ్, రాయల్ కామన్ వైల్ సొసైటీ సంయుక్తంగా 2014లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశాయి. కామన్వెల్త్ దేశాలకు చెందిన 18-29 సంవత్సరాల వయసు గల యువకులకు సమాజంలో అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
ఫీడింగ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అంకిత్ కవత్రా పేదల ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
- సమాధానం: 2
11. అంతర్జాతీయ డబ్లిన్ సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) ఆగస్ట క్యాతీ
2) జాన్ ఆస్టీన్
3) జార్జ్ విలియట్
4) జోస్ ఎడ్వర్డో అగువాలూసా
- View Answer
- సమాధానం: 4
వివరణ: జోస్ ఎడ్వర్డో అగువాలూసా రాసిన A General theory of oblivion నకు గాను అంతర్జాతీయ సాహిత్య పురస్కారం లభించింది. ఈ అవార్డు కింద లక్ష పౌండ్ల నగదు బహుమతి లభిస్తుంది.
- సమాధానం: 4
12. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన తీవ్రవాద వ్యతిరేక సంస్థకు తొలి డెరైక్టర్ గా ఎవరు ఎంపికయ్యారు ?
1) సెర్గియో రొమానో
2) వ్లాదిమిర్ వోర్నోకోన్
3) స్టాఫన్ డి మిస్తురా
4) ఫిలిపో ఓల్డ్ని
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐరాస తీవ్రవాద వ్యతిరేక సంస్థకు తొలి డెరైక్టర్‌గా రష్యాకు చెందిన వ్లాదిమిర్ వోర్నోకోన్ను ఐరాస జనరల్ సెక్రెటరీ ఆంటోనియో గుటర్రస్ నియమించారు.
- సమాధానం: 2
13. ఇటీవల ఏ దేశం కుటుంబ పన్ను ప్రవేశపెట్టింది ?
1) ఫ్రాన్స్
2) గ్రీసు
3) సౌదీ అరేబియా
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సౌదీ అరేబియాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులపై ఆధారపడి అక్కడే ఉంటున్న వారిపై ఆ దేశ ప్రభుత్వం పన్ను విధించే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉద్యోగిపై ఆధారపడిన ఒక్కో వ్యక్తి ఏడాదికి 100 రియాల్‌లను ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పన్ను ఏటా వంద రియాల్ల చొప్పున పెరుగుతుంది.
- సమాధానం: 3
14. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 160 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసిన బ్యాంకు ఏది ?
1) ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు
2) ఆసియా అభివృద్ధి బ్యాంకు
3) బ్యాంకు ఆఫ్ బరోడా
4) బ్యాంకు ఆఫ్ అమెరికా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసియాన్ ఇన్ఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి 160 మిలియన్ డాలర్లు, ప్రపంచ బ్యాంకు నుంచి 240 మిలియన్ డాలర్ల రుణం పొందింది.
- సమాధానం: 1
15. భారత్ ఏ దేశం నుంచి సంరక్ష 5 డ్రోన్స్‌ను కొనుగోలు చేయనుంది ?
1) ఇజ్రాయెల్
2) కెనడా
3) ఆస్ట్రేలియా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమెరికా నుంచి భారత్ 22 మానవ రహిత సంరక్షక -5 డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం అయ్యే వ్యయం 2 - 3 బిలియన్ డాలర్లు.
- సమాధానం: 4
16. ప్రతిష్టాత్మక బిజు పట్నాయక్ సాంకేతిక నైపుణ్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) లలిత్ మోహన్
2) సిద్ధార్థ్ రెడ్డి
3) రామచంద్ర మెహంతి
4) రామకృష్ణ అవత్స
- View Answer
- సమాధానం: 1
17. ఇస్రో ఏ రాకెట్ ద్వారా కార్టోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది ?
1) పీఎస్ఎల్వీ - సీ 38
2) పీఎస్ఎల్వీ - సీ 37
3) పీఎస్ఎల్వీ - సీ 28
4) జీఎస్ఎల్వీ - మార్క్ 3 డీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 712 కేజీల బరువు గల కార్టోశాట్ - 2సీ ఉపగ్రహాన్ని ఇస్రో పీఎస్ఎల్వీ సీ 38 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపింది. కార్టోశాట్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.
- సమాధానం: 1
18. ప్రపంచంలో అతి తేలికైన ఉపగ్రహాన్ని ఎవరు తయారు చేశారు ?
1) రాఘవ నందిని
2) డేవిడ్ ధోరో
3) రిఫత్ షారూఖ్
4) కవితా దేవి
- View Answer
- సమాధానం: 3
వివరణ: తమిళనాడుకు చెందిన రిఫత్ షారూఖ్ అనే యువకుడు 64 గ్రాముల అతి తేలికైన ఉపగ్రహాన్ని తయారు చేశాడు. దీనికి కలామ్‌శాట్ అని పేరు పెట్టారు. నాసా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది.
- సమాధానం: 3
19. wwe లో పోటీపడనున్న తొలి భారతీయ మహిళ ఎవరు ?
1) కవితా దేవి
2) రేణుకా దేవి
3) రామ లక్ష్మీ
4) సరితా పాండే
- View Answer
- సమాధానం: 1
వివరణ: World Wrestling Entertainment మహిళల కోసం ప్రత్యేకంగాజరపనున్న యంగ్ క్లాసిక్ టోర్నమెంట్‌కు హర్యానాకు చెందిన ప్రముఖ పవర్ లిఫ్టర్ కవితా దేవి ఎంపికైంది. ఆమె ఈ ఏడాది ఏప్రిల్‌లో wwe ట్రయ్అవుట్లో పాల్గొంది.
- సమాధానం: 1
20. షాంఘై ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్ - 2017లో ఉత్తమ యాక్షన్ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది ?
1) కుంపూ యోగా
2) డే విత్ అవుట్ నైట్
3) రూసా ఎ లేడి
4) సుల్తాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 20వ షాంఘై చిత్రోత్సవంలో ఉత్తమ యాక్షన్ చిత్రంగా సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం ఎంపికైంది.
- సమాధానం: 4
21. ఐక్యరాజ్య సమితి నుంచి ప్రజాసేవ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) మమతా బెనర్జీ
2) అమిత్ షా
3) నితీశ్ కుమార్
4) నవీన్ పట్నాయక్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ పురస్కారాన్ని పొందారు. ఆ రాష్ట్రంలో కన్యాశ్రీ ప్రకల్ప అనే పథకం ద్వారా బాల్య వివహాలను అడ్డుకోవటం, ఆడపిల్లల చదువుకునేందుకు సహకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది.
- సమాధానం: 1
22. సాహిత్య అకాడమీ ప్రదానం చేసే బాలసాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) అమీనాయక్
2) రొజీనా లుట్రా
3) విన్సీ క్యూద్రోస్
4) రామచంద్రగుహ
- View Answer
- సమాధానం: 3
వివరణ: కొంకణి భాషలో రాసిన jaduche petul పుస్తకానికి గాను విన్సీ కూద్యోస్కు ఈ పురస్కారం దక్కింది.అమీనాయక్ రాసిన కొంకణి పద్య సంకలనం mog dot com కుయువ పురస్కారం లభించింది.
- సమాధానం: 3
23. 7వ ఆసియా పురస్కారాలలో సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
1) రేఖా పాండే
2) నిషాదత్
3) ఆద్యా మహమ్మద్
4) సమీనా బేగమ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: లెమన్ గ్రూప్ కంపెనీకి చెందిన ఫాల్ సాగూ ఆసియా పురస్కారాలను ప్రారంభించారు. 14 విభాగాల్లో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. గతంలో రతన్ టాటా, అమితాబ్ బచ్చన్, మహమ్మద్ యూసఫ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇంటెల్కేప్ సీఈవో నిషాదత్ ఈ ఏడాది సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.
- సమాధానం: 2
24. కార్నెగీ మెడల్ ఆఫ్ ఫిలాంత్రోపి పురస్కారం - 2017నకు ఎంపికైంది ఎవరు ?
1) రత న్ టాటా
2) రాహుల్ బజాజ్
3) అనిల్ అంబాని
4) అజీమ్ ప్రేమ్‌జీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: కార్నెగీ మెడల్ ఆఫ్ ఫిలాంత్రోపిదాతృత్వంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం.
- సమాధానం: 4
25. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల ఏ దేశానికి టెస్టు హోదా ఇచ్చింది ?
1) కెనడా
2) ఎస్తోనియా
3) అఫ్గనిస్తాన్
4) స్కాట్లాండ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐసీసీ కొత్తగా ఐర్లాండ్, అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్లకు టెస్ట్ హోదా ఇచ్చింది. దీంతో ప్రపంచ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడే దేశాల సంఖ్య 12కి చేరింది.
- సమాధానం: 3
26. మహిళల కోసం 181 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) మణిపూర్
3) నాగాలాండ్
4) మిజోరం
- View Answer
- సమాధానం: 2
27. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రపంచ డ్రగ్స్ రిపోర్ట్ ప్రకారం డ్రగ్స్ బానిసల సంఖ్య ఎంత ?
1) 29.5 మిలియన్లు
2) 35 మిలియన్లు
3) 70 మిలియన్లు
4) లక్ష మిలియన్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: UNDOC (United Nations Office on Drugs and Crime) సంస్థ ప్రపంచ డ్రగ్స్ రిపోర్ట్‌ను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం 29.5 మిలియన్ మంది డ్రగ్స్ లేదా ఓపీయంకు బానిసలయ్యారు.
- సమాధానం: 1
28. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ - 2017 విజేత ఎవరు ?
1) చెన్ లాంగ్
2) పారుపల్లి కశ్యప్
3) గ్రెగొరి ద్విమెతెవ్
4) కిదాంబి శ్రీకాంత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌లో చెన్ లాంగ్‌ను ఓడించి కిదాంబి శ్రీకాంత్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 4
29. ప్రపంచ నావికుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 10
2) జూన్ 15
3) జూన్ 20
4) జూన్ 25
- View Answer
- సమాధానం: 4
30. ప్రతిష్టాత్మక మిస్ ఇండియా - 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) సనాదువా
2) ప్రియాంకా కుమారి
3) మానుషి చిల్లర్
4) భగవతి సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 54వ ఫెమినా మిస్ ఇండియా 2017లో హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. జమ్ము కశ్మీర్‌కు చెందిన సనాదువా తొలి రన్నరప్‌గా నిలిచింది.
- సమాధానం: 3
31. నాసా ఇటీవల ఏ గ్రహంపై అతిపురాతన సరస్సుని కనుగొంది ?
1) అంగారక గ్రహం
2) శని
3) బుధుడు
4) శుక్రుడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: నాసాకు చెందిన ఆపర్చ్యునిటీ రోవర్.. అంగారక గ్రహంపై అతిపురాతన సరస్సుని కనుగొంది.
- సమాధానం: 1
32. ఇటీవల ఏ రాష్ట్ర పోలీసు శాఖకు పాస్‌పోర్ట్ సేవాదివస్ పురస్కారం లభించింది ?
1) తమిళనాడు
2) గోవా
3) తెలంగాణ
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
వివరణ: పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో పాటిస్తున్న ప్రక్రియకు గాను తెలంగాణ పోలీసు శాఖ ఈ పురస్కారానికి ఎంపికైంది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ దేశవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచింది.
- సమాధానం: 3
33. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
1) నందిని సిద్ధారెడ్డి
2) దేశపతి శ్రీనివాస్
3) ప్రాణ్య రెడ్డి
4) ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణ సారస్వత పరిషత్‌కు 24 ఏళ్లుగా డాక్టర్ సి నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల ఆయన మరణించటంతో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షుడిగా ఎంపిక్యయారు.
- సమాధానం: 4
34. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతాన్ని మెడకిల్ అండ్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నారు ?
1) తిరుపతి
2) విజయవాడ
3) అరకు
4) అన్నవరం
- View Answer
- సమాధానం: 3
35. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన నేతన్నకు చేయూత పథకం ద్వారా ఎంత మంది నేత కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది ?
1) 30 వేలు
2) 20 వేలు
3) 15 వేలు
4) 10 వేలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: నేతన్నకు చేయూత పథకాన్ని మంత్రి కె . తారకరామారావుయాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించారు. 18 ఏళ్లు నిండి చేనేత వృత్తిపై ఆధారపడిన ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. కార్మికుడు తన వాటాగా వేతనంలో 8 శాతం చెల్లిస్తే.. ప్రభుత్వం 10 శాతం చెల్లిస్తుంది.
- సమాధానం: 1
36. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రదానం చేసే బాలసాహిత్య పురస్కారం(తెలుగు) 2017నకు ఎవరు ఎంపికయ్యారు ?
1) వాసుదేవ్ రెడ్డి
2) సతీశ్ చంద్రవర్దన్
3) సునీల్ వర్మ
4) వాసాల నర్సయ్య
- View Answer
- సమాధానం: 4
వివరణ: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్దికి చెందిన వాసాల నర్సయ్య 45 ఏళ్లుగా బాల సాహిత్యంలో చూపుతున్న ప్రతిభకు గుర్తింపుగా 2017 సంవత్సరానికి గాను ఆయనకు బాలసాహిత్య పురస్కారం లభించింది.
- సమాధానం: 4
37. నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
1) సీసీఎంబీ, హైదరాబాద్
2)ఐఐఎస్సీ బెంగళూరు
3) ఐఐటీ, ఢిల్లీ
4) ఐఐటీ, మద్రాస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బయోటెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు అవకాశం కల్పించటం కోసం అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లోని సీసీఎంబీలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం నీతి ఆయోగ్ ఏడాదికి గరిష్టంగా పది కోట్ల రూపాయల వంతున ఐదేళ్ల పాటు అందిస్తుంది.
- సమాధానం: 1
38. దేశంలోని పట్టణాల్లో ప్రవేశపెట్టిన సంస్కరణల అమలులో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గోవా
4) మిజోరం
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2016-17 పట్టణ సంస్కరణలలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. అమృత్ పథకంలో భాగంగా ఈ - గవర్నెన్స్, ఆడిటింగ్, ఇంధన, నీటి ఆడిట్ వంటి ఆంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. ఇందులో తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 2
39. దేశంలో తొలిసారిగా మహిళా ఖైదీలు నిర్వహించే పెట్రోల్ బంక్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) కాకినాడ
2) విశాఖపట్నం
3) హైదరాబాద్
4) తిరుపతి
- View Answer
- సమాధానం: 3
వివరణ: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మహిళా ఖైదీల నిర్వహణలో పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు.
- సమాధానం: 3
40. ఏ ప్రాంతంలో మొక్క జొన్న పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు ?
1) తిరుపతి
2) చాగల్లు
3) భీమిలి
4) విజయరాయి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో మొక్కజొన్న పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 4
41. జాతీయ విద్యా విధాన డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) డా. రాధాకృష్ణ
2) కృష్ణస్వామి కస్తూరి రంగన్
3) ప్రొ. సయ్యద్ హసన్నెన్
4) ప్రొ. పొదిలి అప్పారావు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇస్రో మాజీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జాతీయ విద్యా విధాన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించింది.
1986లో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. దీనిని 1992లో సవరించారు. ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రవేశపెట్టడం కోసం నూతన కమిటీని కస్తూరి రంగన్ నాయకత్వంలో ఏర్పాటు చేశారు.
- సమాధానం: 2
42. అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 26
2) జూన్ 23
3) జూన్ 20
4) జూన్ 17
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఏటా జూన్ 26న అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగ, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1987 డిసెంబర్ 7న తీర్మానించింది.
- సమాధానం: 1
43. జాతీయ గణాంక (Statistics) దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 20
2) జూన్ 23
3) జూన్ 27
4) జూన్ 29
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రొ. ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకొని ఏటా జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 4
44. అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మే 1
2) మే 30
3) జూన్ 15
4) జూన్ 29
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఏటా 29న అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి 2016 జూన్ 14న తీర్మానించింది. ఉష్ణమండలం(Tropics)లో ఉండే సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 4
45. ISSF జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) తేజస్విని
2) యశస్విని సింగ్
3) రామాంబిక అయ్యర్
4) శతరూప భట్టాచార్య
- View Answer
- సమాధానం: 2
వివరణ: ISSF జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల విభాగంలో ఛండీగడ్‌కు చెందిన యశస్విని సింగ్ దేశ్వాల్ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
- సమాధానం: 2
46. బాడి బిల్డింగ్‌లో మిస్‌వరల్డ్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) అంకితా దాస్
2) అదితి చౌదరి
3) భూమిక శర్మ
4) అన్కుష శర్మ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇటలీలోని వెనిస్ నగరంలో జరిగిన బాడి బిల్డింగ్ పోటీల్లో భూమిక శర్మ మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 3
47. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మానవ అక్రమ రవాణా జరిగే దేశం ఏది ?
1) తైవాన్
2) చైనా
3) శ్రీలంక
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
48. అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కల్పించే ప్రమాద బీమా ఎంత ?
1) రూ. 3 లక్షలు
2) రూ. 5 లక్షలు
3) రూ. 8 లక్షలు
4) రూ. 20 లక్షలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమర్నాథ్ యాత్రికులకు ఉన్న రూ. లక్ష ప్రమాద బీమాను ఇటీవల రూ. 3 లక్షలకు పెంచారు. అమరనాథ్ క్షేత్రం సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది.
- సమాధానం: 1
49. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ ఇండియాకు రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) దీపికా పదుకొన్
2) ప్రియాంక చోప్రా
3) అనుష్క శర్మ
4) లక్ష్మీ రాయ్
- View Answer
- సమాధానం: 2
50. ప్రతిష్టాత్మక Aegon Ilkley Challenger trophy డబుల్స్ టైటిల్ విజేతలు ఎవరు ?
1) బ్రయాన్ సోదరులు
2) మైక్ సోదరులు
3) లియాండర్ పేస్, ఆదిల్ షమ్స్ద్దీన్
4) డేవిడ్ కాప్రి అండ్ కాప్రి
- View Answer
- సమాధానం: 3