కరెంట్ అఫైర్స్ (జూన్ 24 - 30) బిట్ బ్యాంక్
1. తెలంగాణ వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) దేవీప్రసాద్
2) ఎర్రోళ్ల శ్రీనివాస్
3) సంపత్ కుమార్
4) జస్టిస్ ఎం.ఎస్.జైశ్వాల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్ నియమితులయ్యారు. ఆయన ఐదేళ్లు లేదా 67 ఏళ్లు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగుతారు. జైశ్వాల్ 1956 ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో జన్మించారు.
- సమాధానం: 4
2. థాంప్సన్ రాయటర్స్ ఫౌండేషన్ సర్వే ప్రకారం మహిళలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 1
2) 3
3) 5
4) 7
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహిళలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారత్ ప్రథమ స్థానం లో నిలిచింది. థాంప్సన్ రాయటర్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అఫ్గానిస్థాన్, సిరియా వంటి కల్లోలిత ప్రాంతాల్లో కన్నా భారత్ లోని మహిళల పరిస్థితి దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది. మహిళలకు ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 దేశాల్లో అమెరికా ఉంది.
- సమాధానం: 1
3. ఇటీవల జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్ లో రికార్డు నమోదు చేసి స్వర్ణం సాధించిన భారత షూటర్ ఎవరు ?
1) సౌరభ్ చౌదరీ
2) మను భాకర్
3) అనిష్ భన్వాలా
4) అన్మోల్ జైన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 జూన్ 26 న జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ సౌరభ్ చౌదరీ (16) స్వర్ణ పతకం సాధించి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 10 మీ. ఎయిర్ ఫిస్టల్ విభాగంలో 243.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఇప్పటివరకు చైనా షూటర్ వాంగ్ (242.5) పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫ్రీస్టయిల్ పోటీ ఫైనల్లో భారత యువ షూటర్ మను బాకర్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకుంది.
- సమాధానం: 1
4. భారత దేశ తొలి ట్రైబల్ క్వీన్ గా గుర్తింపు పొందిన పల్లవి దరువా ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
1) ఛత్తీస్ గఢ్
2) మధ్యప్రదేశ్
3) ఒడిశా
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారతదేశ తొలి ట్రైబల్ క్వీన్‌గా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన పల్లవి దరువా చరిత్ర సృష్టించారు. ఆది రాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందిని ఓడించి ఆమె కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గిరిజన వేషధారణ, ఆభరణాల ప్రదర్శన, అద్భుత ప్రతిభ, సంస్కృతిని ప్రదర్శించడంలో నైపుణ్యం, ఫొటోజెనిక్ ఫేస్, బెస్ట్ స్కిన్, బెస్ట్ పర్సనాలిటీ వంటి ఏడు విభాగాల్లో పల్లవి విజేతగా నిలిచారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైన్, ఒడిశా ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్, టూరిజం శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
- సమాధానం: 3
5. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైన జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్.. ఇంతకు ముందు ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు?
1) ఢిల్లీ
2) అహ్మదాబాద్
3) ఛత్తీస్ గఢ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చత్తీస్ఘడ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ నియమితులయ్యారు. రాదాకృష్ణన్ కు ముందు జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
- సమాధానం: 3
6. కేంద్రీయ పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) జస్టిస్ రమేశ్ రంగనాథన్
2) జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి
3) జస్టిస్ సుభాష్ భమ్రే
4) జస్టిస్ ఎన్వీ రమణ
- View Answer
- సమాధానం: 2
వివరణ: పట్నా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) కేంద్రీయ పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) చైర్మన్‌గా నియమించింది. ఈయన ఐదేళ్లపాటు లేదా 68 ఏళ్లు వచ్చే దాకా (ఏది ముందయితే అది) పదవిలో కొనసాగుతారు.
- సమాధానం: 2
7. కింది వారిలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత ప్రతినిధి ఎవరు ?
1) ఈనం గంభీర్
2) మాధురి గుప్తా
3) నిక్కీ హేలీ
4) ఇంద్రా నూయి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత ప్రతినిధి, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ 2018 జూన్ 27న ప్రధాని నరేంద్ర మోదీతో న్యూడిల్లీలో సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటంతో పాటు పలు రంగాల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిక్కీ హేలీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థితో సమావేశమయ్యారు.
- సమాధానం: 3
8. జీవం పుట్టుక రహస్యాన్ని ఛేదించే లక్ష్యంతో ప్రయోగించిన ‘‘హయబుసా - 2’’ కింది వాటిలోని ఏ సంస్థ ప్రాజెక్ట్ ?
1) ఇస్రో
2) నాసా
3) రాస్ కాస్మోస్
4) జాక్సా
- View Answer
- సమాధానం: 4
వివరణ: జీవం పుట్టుక గుట్టును తేల్చే ప్రయత్నాల్లో భాగంగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) ప్రయోగించిన ‘హయబుసా-2’ అన్వేషిణి మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణం అనంతరం భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలోని ర్యుగు (Ryugu) గ్రహశకలాన్ని చేరుకుంది.
- సమాధానం: 4
9. కింది వాటిలోని ఏ ప్రాంతంలో కబీర్ దాస్ స్మారక కేంద్రం ఉంది ?
1) కోల్ కత్తా
2) ఆగ్రా
3) మగ్‌హర్
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రముఖ కవి కబీర్దాస్ 500వ వర్ధంతిని పురస్కరించుకొని 2018 జూన్ 28న ఉత్తరప్రదేశ్ లోని మగ్హర్లో గల కబీర్దాస్ స్మారక స్థలం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాదర్ సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ‘నిర్వాణ్స్థల్’ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. కబీర్దాస్ పేరిట రూ.24 కోట్లతో నిర్మించే పరిశోధన సంస్థకు ప్రధాని శంకుస్థాపన చేశారు. కబీర్బోధను, తత్వాన్ని గురించి ప్రచారం చేయడానికి ఉద్దేశించిన అకాడమీకి పునాది వేశారు.
- సమాధానం: 3
10. పీడబ్ల్యూసీ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం 2017తో పోలిస్తే 2018లో మార్కెట్ విలువ భారీగా పెరిగిన సంస్థల్లో తొలి స్థానంలో ఉన్న సంస్థ ఏది ?
1) అమెజాన్
2) మైక్రోసాఫ్ట్
3) యాపిల్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 100 సంస్థల మార్కెట్ వలువ 20 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.1360 లక్షల కోట్లు) స్థాయికి చేరిందని పీడబ్ల్యుసీ సర్వేలో తేలింది. ఈ మేరకు పీడబ్ల్యుసీ 2018 జూన్ 28న గ్లోబల్ టాప్ 100 ర్యాంకుల్ని ప్రకటించింది. మార్కెట్ విలువ భారీగా పెరిగిన సంస్థగా అమెజాన్ తొలి స్థానంలో నిలిచింది. 2017తో పోలిస్తే సంస్థ విలువ 66% పెరిగి, 278 బిలియన్ డాలర్లకు చేరింది. చైనాకు చెందిన టెన్సెంట్ విలువ 82% పెరిగి 224 బిలియన్ డాలర్లకు, అలీబాబా విలువ 76% పెరిగి 201 బి.డాలర్లు చేరడంతో, రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
- సమాధానం: 1
11. ఒడిశాలోని బాలాసోర్ తర్వాత దేశంలో రెండో క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
1) వరంగల్
2) నాగాయలంక
3) సియాచిన్
4) తిరువనంతపురం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గొల్లలమోద దగ్గర సముద్ర తీరంలోని 154 హెక్టార్లలో డీఆర్డీఓ ఏర్పాటుచేసే క్షిపణి పరీక్ష కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒడిశాలోని బాలాసోర్ తర్వాత దేశంలో రెండో క్షిపణి పరీక్ష కేంద్రంగా నాగాయలంక నిలువనుంది.
- సమాధానం: 2
12. ఇటీవల కన్నుమూసిన చెల్లపిల్ల సత్యనారాయణ రావు (సీఎస్ రావు) కు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది ?
1) ప్రముఖ ఆర్థిక నిపుణులు
2) ప్రముఖ క్రీడాకారులు
3) ప్రముఖ సాహితీవేత్త
4) ప్రముఖ పాత్రికేయులు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్ ఐఏఎస్ చెల్లపిల్ల సత్యనారాయణరావు (సీఎస్ రావు) 2018 జూన్ 28న హైదరాబాద్‌లో మృతి చెందారు. 1967 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఆర్థికశాఖ, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలో సీఎంవో ముఖ్య కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. 2014- 2016 జూన్ దాకా ఏపీ ఆర్థికశాఖ సలహాదారుగా పనిచేశారు.
- సమాధానం: 1
13. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 29
2) జూన్ 27
3) జూన్ 30
4) జూన్ 25
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతీయ గణాంక సంస్థ వ్యవస్థాపకుడు పి.సి.మహలనోబిస్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ 2007 నుంచి ఏటా జూన్ 29ను నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా పాటిస్తున్నారు.
Theme : Quality Assurance in Official Statistics
- సమాధానం: 1
14. వీడియో గేమ్స్ కూడా కొకై న్, జూదం లాంటివే అని ప్రజలు వీటికి బానిసలుగా మారే ప్రమాదముందని ఇటీవల ఏ సంస్థ హెచ్చరించింది ?
1) ఐరాస
2) ప్రపంచ బ్యాంక్
3) ఇస్రో
4) డబ్ల్యూహెచ్ఓ
- View Answer
- సమాధానం: 4
వివరణ: వీడియో గేమ్స్ కూడా కొకై న్, జూదం లాంటివే అని ప్రజలు వీటికి బానిసలుగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఈ మేరకు అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐసీడీ) 11వ సంచికను జూన్ 18న విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణుల్ని సంప్రదించిన తర్వాత ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ‘వీడియో గేమ్ డిజార్డర్’ను ఈ జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో మానసిక ఆరోగ్య విభాగం డెరైక్టర్ శేఖర్ సక్సేనా తెలిపారు.
- సమాధానం: 4
15. 25వ ప్రపంచ మైనింగ్ సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) ఆస్తానా
2) న్యూఢిల్లీ
3) కాట్మాండు
4) ఢాకా
- View Answer
- సమాధానం: 1
వివరణ: కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో 25వ ప్రపంచ మైనింగ్ సదస్సు జూన్ 19 నుంచి జూన్ 22 వరకు జరిగింది. ఈ సదస్సులో 50 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు పాల్గొనగా భారత్ నుంచి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌తో పాటు కోల్ ఇండియా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, ఎన్ఎండీసీ వంటి మైనింగ్ సంస్థల నుంచి సుమారు 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తదుపరి కోల్ మైనింగ్ కాంగ్రెస్‌ను 2021లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహిస్తారు.
- సమాధానం: 1
16. ఫోర్బ్స్ టాప్ 100 బిలియనీర్ల జాబితా 2018లో తొలి స్థానంలో నిలిచింది ఎవరు ?
1) బిల్ గేట్స్
2) జెఫ్ బెజోస్
3) వారెన్ బఫెట్
4) ముఖేశ్ అంబానీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫోర్బ్స్ 2018 ప్రపంచ కుబేరుడిగా 141.9 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బిజోస్ నిలిచాడు. అలాగే అమెరికాలోని అతిపెద్ద కంపెనీల్లో 177.87 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెజాన్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు టాప్ 100 బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ జూన్ 18న విడుదల చేసింది. జూన్ 1 నుంచి బిజోస్ సంపద దాదాపు 5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ జాబితాలో 92.9 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రెండో స్థానం, 82.2 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో నిలిచారు.
- సమాధానం: 2
17. భారత్ లో జరిగే ఎన్ఆర్ఐ వివాహాలను ఎన్ని రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇటీవల ప్రకటించింది ?
1) నెల రోజుల్లో
2) 15 రోజుల్లో
3) 7 రోజుల్లో
4) 20 రోజుల్లో
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్‌లో జరిగే ఎన్ఆర్ఐ వివాహాలను ఏడు రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ జూన్ 14న తెలిపింది. వారంలో రిజిస్టర్ చేసుకోకపోతే పాస్‌పోర్టులు, వీసాలు జారీ చేసే అవకాశం ఉండదని పేర్కొంది.
- సమాధానం: 3
18. గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నివేదిక 2018 ప్రకారం వలస సంపన్నుల దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) రెండో స్థానంలో
2) పదో స్థానంలో
3) మూడో స్థానంలో
4) ఏడో స్థానంలో
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్వదేశాల నుంచి విదేశాలకు వలస వెళుతున్న సంపన్నుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆఫ్రో ఆసియా బ్యాంకు ‘గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ’ పేరుతో జూన్ 16న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. వలస వెళ్లే సంపన్నులు అత్యధికంగా ఆస్ట్రేలియాకు వెళుతుండగా తర్వాతి స్థానాల్లో అమెరికా, కెనడా, న్యూజిలాండ్, అరబ్ దేశాలు ఉన్నాయి.
- సమాధానం: 1
19. కింది వారిలో ఎవరిని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి (పీఐవో) గా పరిగణిస్తూ కేంద్ర సమాచార కమిషన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ?
1) గ్రామ సర్పంచ్
2) పార్లమెంట్ సభ్యుడు
3) జెడ్పీ చైర్మన్
4) మార్కెట్ కమిటీ చైర్మన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పార్లమెంటు సభ్యుడిని కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి (పీఐవో)గా పరిగణిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జూన్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటు సభ్యుడి స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల (ఎంపీల్యాడ్స్) పథకం అమలు స్థితి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, సంబంధిత సమాచారం సదరు ఎంపీ ఇవ్వాలని పేర్కొంది.
- సమాధానం: 2
20. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు ?
1) రాజీవ్ కుమార్
2) అమితాబ్ కాంత్
3) అరవింద్ పనగరియా
4) నందన్ నీలేకని
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ నాలుగో పాలక మండలి సమావేశం జూన్ 17న జరిగింది. నీతి ఆయోగ్ చైర్మన్, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొన్నారు. ‘నవభారతం 2022’ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి ఎజెండా పత్రాన్ని నెలరోజుల్లో సిద్ధం చేయనున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
- సమాధానం: 1
21. విశ్వవిద్యాలయాల్లో ఎన్నేళ్లకోసారి స్నాతకోత్సవాలు నిర్వహించాలని ఎంహెచ్ఆర్డీ శాఖ ఇటీవల ఆదేశించింది ?
1) 4 ఏళ్లు
2) ఏడాదికోసారి
3) 2 ఏళ్లు
4) 3 ఏళ్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: విశ్వవిద్యాలయాల్లో ఏటా స్నాతకోత్సవాలు నిర్వహించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జూన్ 17న ఆదేశించింది. దేశంలోని కొన్ని వర్సిటీలు స్నాతకోత్సవాలను వాయిదా వేయడంపై కేంద్రం ఈ మేరకు స్పందించింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఐఐటీ స్నాతకోత్సవానికి విద్యార్థులంతా ధరించే ప్రత్యేకమైన గౌనుకు బదులుగా కుర్తా పైజామా, విద్యార్థినులు సల్వార్ కమీజ్ లేదా తెలుపు రంగు చీర ధరించాలని ఆదేశించింది. అలాగే స్నాతకోత్సవం సమయంలో చేసే ప్రతిజ్ఞను ఇంగ్లిష్ తో పాటు సంస్కృతంలో చేసే వెసులుబాటు కల్పించింది.
- సమాధానం: 2
22. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన రాష్ట్రాల ఉమ్మడి జల యాజమాన్య సూచీలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది ?
1) గుజరాత్
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రాలకు ఉమ్మడి జల యాజమాన్య సూచీ (సీడబ్ల్యూఎంఐ)లను కేటాయిస్తూ నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. భూగర్భ జలనిర్వహణ, జల వనరుల పరిరక్షణ, వ్యవసాయం, తాగునీరు, విధానాల రూపకల్పన- అమలు వంటి 28 అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఈ ర్యాంకులు కేటాయించారు. ఇందులో అత్యంత సమర్థంగా నీటి నిర్వహణ చేపట్టిన గుజరాత్ ప్రథమ స్థానం దక్కించుకోగా, ఏపీ- మూడు, తెలంగాణ- ఎనిమిదో స్థానాలను దక్కించుకున్నాయి.
- సమాధానం: 1
23. కింది వాటిలోని ఏ దేశం భారత్ కు ఆరు అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఆమోదం తెలిపింది ?
1) రష్యా
2) అమెరికా
3) జపాన్
4) చైనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్ కు ఆరు అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం జూన్ 13న ఆమోదం తెలిపింది. ఈ మేరకు 930 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఆరు ‘ఏహెచ్-64ఈ’ హెలికాప్టర్లను పెంటగాన్ డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజెన్సీ అందిస్తుంది. ఒప్పందంలో భాగంగా ఫైర్ కంట్రోల్ రాడార్లు, హెల్ఫూర్ లాంగ్బౌ మిస్సైళ్లు, నైట్ విజన్ సెన్సార్లు, ఇంట్రిగల్ నావిగేషన్ సిస్టమ్స్ కూడా భారత్‌కు అందుతాయి. ప్రస్తుతం అమెరికా సైన్యం వినియోగిస్తున్న ఏహెచ్-64ఈ హెలికాప్టర్లు బహుముఖ దాడులు చేయగలవు.
- సమాధానం: 2
24. తెలంగాణలో రెండో విడతలో భాగంగా ఎన్ని జిల్లాల్లో చిన్నారుల సంరక్షణ కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది ?
1) 10
2) 31
3) 21
4) 17
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణలో 21 జిల్లాలో డిస్టిక్ట్ ్రచైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల (డీసీపీయు)ను నెలకొల్పేందుకు ప్రభుత్వం జూన్ 17న ఆమోదం తెలిపింది. బాలల హక్కులను పరిరక్షించడంతోపాటు వారు లైంగిక వేధింపులకు గురికాకుండా చేయడానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పది జిల్లాల్లో డిస్టిక్ట్ ్రచైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు (డీసీపీయు) ఉన్నాయి.
- సమాధానం: 3
25. కాప్ - కనెక్ట్ అనే యాప్ ఏ రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించినది ?
1) ఏపీ పోలీస్
2) తెలంగాణ పోలీస్
3) గుజరాత్ పోలీస్
4) తమిళనాడు పోలీస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పోలీస్ శాఖలో సమాచార మార్పిడి కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘కాప్-కనెక్ట్’ అనే మొబైల్ యాప్‌ను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి జూన్ 18న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా అప్పటికప్పుడు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆదేశాలు, సూచనలు, సందేశాల వంటి వాటిని డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు 63 వేల మంది ఒకేసారి చూడవచ్చు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 638 పోలీస్టేషన్లకు ఒకేసారి ఆదేశాలు జారీ చేయడంతోపాటు వెయి్య మందితో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడవచ్చు. దీనిని సిబ్బంది ఫోన్ నంబర్ల ఆధారంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా వాడుకలోకి తీసుకురానున్నారు.
- సమాధానం: 2
26. 2018-19లో భారత వృద్ధిరేటు ఎంత శాతంగా నమోదు కానుందని ఫిచ్ అంచనా వేసింది ?
1) 7 శాతం
2) 7.4 శాతం
3) 8 శాతం
4) 7.6 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ జూన్ 13న అంచనా వేసింది. 2018-19లో భారత్ వృద్ధి 7.3 శాతం, 2019-20లో 7.5 శాతంగా ఉండొచ్చని మే 11న వేసిన అంచనాలను ఈ మేరకు ఫిచ్ సవరించింది.
- సమాధానం: 2
27. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందడానికి కేవలం 10 ఏళ్ల కాలమే ఉందని ఇటీవల ఏ బ్యాంక్ తన నివేదికలో అభిప్రాయపడింది ?
1) ఐసీఐసీఐ
2) హెచ్డీఎఫ్సీ
3) ఎస్బీఐ
4) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందడానికి కేవలం పదేళ్ల కాలమే ఉందని ఎస్బీఐ జూన్ 13న ఓ నివేదికలో అభిప్రాయపడింది. ఇందుకోసం దేశం విద్యపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పదేళ్ల కాలంలో దీన్ని సాధించలేకపోతే భారత్ ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంలో ఉండే అవకాశం ఉందని, దేశాభివృద్ధి కోసం విధాన నిర్ణేతలు మేల్కోవాలని స్పష్టం చేసింది.
- సమాధానం: 3
28. జమ్ము కశ్మీర్ లో ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన సయ్యద్ షుజాత్ బుఖారి ఏ పత్రిక ఎడిటర్ ?
1) రైజింగ్ కశ్మీర్
2) ద మింట్
3) తెహల్కా
4) ఇండియా టుడే
- View Answer
- సమాధానం: 1
వివరణ: జమ్మూకశ్మీర్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారి(53) జూన్ 14న హత్యకు గురయ్యారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఉన్న పత్రిక కార్యాలయం వద్ద ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. శ్రీనగర్ కు చెందిన షుజాత్ బుఖారి రైజింగ్ కశ్మీర్ అనే ఇంగ్లిష్ దినపత్రికతో పాటు బులంద్ కశ్మీర్ అనే ఉర్దూ పత్రికను స్థాపించి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
- సమాధానం: 1
29. 2018 సెప్టెంబర్ 7 నుంచి జరిగే హిందూ కాంగ్రెస్ సదస్సుకి ఎవరు చైర్మన్ గా వ్యవహించనున్నారు ?
1) వెంకయ్య నాయుడు
2) మోహన్ భగవత్
3) శ్రీ ప్రకాశ్ కొఠారి
4) రవిశంకర్ ప్రసాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరిగే ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్‌సీ) సదస్సుకు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన ప్రొఫెసర్ డా. శ్రీప్రకాశ్ కొఠారి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అమెరికాలోని చికాగోలో సెప్టెంబర్ 7 నుంచి మూడ్రోజులపాటు ఈ సదుస్సును నిర్వహిస్తారు. స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న చికాగోలో చేసిన చారిత్రక ప్రసంగానికి 125 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా చికాగోలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.
- సమాధానం: 3
30. జనరల్ మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) దీప్తి అనుంకర్
2) నారా బ్రాహ్మణి
3) దివ్య సూర్యదేవర
4) ఇంద్రా నూయి 30. (3) వివరణ:
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెరికాలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ (జీఎం) సంస్థకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఎన్ఆర్ఐ దివ్య సూర్యదేవర నియమితులయ్యారు. దీంతో ఆటో ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా ఈ పదవి చేపట్టనున్న మహిళగా రికార్డు సృష్టించారు. చెన్నైకి చెందిన 39 ఏళ్ల దివ్య ప్రస్తుతం జీఎం కార్పొరేట్ ఫైనాన్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
- సమాధానం: 3
31. కింది వారిలో రాజధాని పత్రికను నడిపిన వారు ఎవరు ?
1) ఆదిరాజు వెంకటేశ్వరరావు
2) సి. నారాయణ రెడ్డి
3) కాళోజి
4) ప్రొఫెసర్ జయశంకర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆదిరాజు వెంకటేశ్వర రావు అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో కన్నుమూశారు. 60 ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన ఆదిరాజు జనతా, రాజధాని పత్రికలను నడిపారు. అలాగే ఆంధ్రభూమి, గోల్కొండ, ఆంధ్రజ్యోతి, ఉదయం, దక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికల్లో హైదరాబాద్, ఢిల్లీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ 4వ రాష్ట్ర అవతరణ వేడుకలో ఉత్తమ పాత్రికేయుని అవార్డును అందుకున్నారు.
- సమాధానం: 1
32. జియో 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు - 2018లో ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు ?
1) ప్రభాస్
2) విజయ్ దేవరకొండ
3) వెంకటేశ్
4) మహేశ్ బాబు
- View Answer
- సమాధానం: 2
వివరణ: జియో 65వ సౌత్ ఫిలింఫేర్ అవార్డులను ఇటీవల హైదరాబాద్‌లో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కైకాల సత్యనారాయణకు అందచేశారు. ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ దక్కించుకోగా ఉత్తమ దర్శకుడి అవార్డు రాజమౌళి (బాహుబలి: ది కన్‌క్లూజన్)కి లభించింది. అలాగే ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), ఉత్తమ నటిగా సాయి పల్లవి (ఫిదా) ఎంపికయ్యారు.
- సమాధానం: 2
33. రుణాల చెల్లింపులపై ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదిరిందని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది ?
1) గ్రీస్
2) బ్రిటన్
3) స్కాట్లాండ్
4) ఐర్లాండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 8 ఏళ్లుగా బెయిలవుట్ ప్యాకేజీలపై నెగ్గుకొస్తున్న గ్రీస్ సంక్షోభం నుంచి గట్టెక్కనుంది. ఈ మేరకు రుణాల చెల్లింపుపై గ్రీస్‌తో ఒప్పందం కుదిరిందని యూరోపియన్ యూనియన్ తెలిపింది. దీంతో రుణాల చెల్లింపు గడువును 10 ఏళ్లు పొడిగించడంతో పాటు మరో 15 బిలియన్ యూరోలు గ్రీస్‌కు అందనున్నాయి. ఒప్పంద షరతుల కింద 2019లో పింఛన్లలో కోత విధించడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని తగ్గించేందుకు గ్రీస్ అంగీకరించింది. 2010 నుంచి గ్రీస్ 273.7 బిలియన్ యూరోల మేర నిధులను బెయిలవుట్ కింద పొందింది. ఈ సంక్షోభం ధాటికి గ్రీస్‌లో 4 ప్రభుత్వాలు మారాయి. ఎకానమీ 25% క్షీణించింది. నిరుద్యోగిత 20% పెరిగింది.
- సమాధానం: 1
34. కింది వాటిలో ఏ దేశంలో మహిళల డ్రైవింగ్ పై ఉన్న నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసి లెసైన్సులను అందజేశారు ?
1) వెనుజులా
2) సౌదీ అరేబియా
3) ఇరాన్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో మహిళలు జూన్ 24న వాహనాలతో రోడ్లపైకొచ్చారు. కార్లతో సందడి చేస్తూ, సంబరాలు చేసుకున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా కొనసాగిన నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఇటీవల ఎత్తివేశాడు. 2018 జూన్ 24 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో మహిళలు రోడ్లపై వాహనాలతో కన్పించారు.
- సమాధానం: 2
35. ప్రపంచ ఆహార సదస్సు - 2018 ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) బెర్లిన్
2) న్యూఢిల్లీ
3) బీజింగ్
4) కొలంబియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ప్రపంచ ఆహార సదస్సు-2018ను జూన్ 26న నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ కేశవులు, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్ పాల్గొన్నారు.
- సమాధానం: 1
36. అమెరికా 2017లో తీసుకొచ్చిన వలసల చట్టం నిషేధిత దేశాల జాబితాలో లేని దేశం?
1) ఇరాక్
2) లిబియా
3) ఉత్తర కొరియా
4) సిరియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: పలు ముస్లిం దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ 2017లో ట్రంప్ ప్రభుత్వం వలసల నియంత్రణ చట్టం తీసుకొచ్చింది. చాడ్, ఇరాన్, ఇరాక్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమెన్ పౌరుల రాకపై నిషేధం విధించింది. అనంతరం ఈ జాబితా నుంచి చాడ్, ఇరాక్ లను తొలగించింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను ఇటీవల తిరస్కరించిన ఆ దేశ సుప్రీం కోర్టు చట్టాన్ని ఆమోదిస్తూ జూన్ 26న తీర్పునిచ్చింది. వలసల్ని నియంత్రించేందుకు అధ్యక్షుడికి తగిన అధికారముందని తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు.
- సమాధానం: 1
37. కొరియా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ?
1) 1949 - 1957
2) 1950 - 1953
3) 1914 - 1918
4) 1947 - 1962
- View Answer
- సమాధానం: 2
వివరణ: కొరియా యుద్ధం 1950 నుంచి 1953 వరకు జరిగింది. ఈ యుద్ధం వల్ల దూరమైన కుటుంబాలు తిరిగి కలుసుకోవడానికి ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇరు దేశాలు జూన్ 22న సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరువైపులా 100 మందిని ఎంపిక చేసి ఆగస్టులో కలుసుకోవడానికి అనుమతిస్తామని ప్రకటనలో పేర్కొన్నాయి.
- సమాధానం: 2
38. కింది వారిలో జమ్ము కశ్మీర్ గవర్నర్ ఎవరు ?
1) నరసింహన్
2) విద్యాసాగర్
3) ఎన్ఎన్ వోహ్రా
4) కిరణ్ బేడీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: జమ్మూకశ్మీర్‌లో ఎనిమిదోసారి గవర్నర్ పాలన ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జూన్ 20న ఆమోదం తెలపడంతో జమ్మూకాశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 కింద గవర్నర్ పాలనను అమలు చేస్తున్నట్లు ఎన్ఎన్ వోహ్రా ప్రకటించారు. పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి జూన్ 19న బీజేపీ వైదొలగడంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని రాష్ట్రపతికి వోహ్రా సిఫారసు చేశారు.
- సమాధానం: 3
39. యూఐడీఏ ప్రస్తుత సీఈవో ఎవరు ?
1) నందన్ నీలేకని
2) ఆనంద్ దేశ పాండే
3) జే సత్యనారాయణ
4) అజయ్ భూషణ్ పాండే
- View Answer
- సమాధానం: 4
వివరణ: యూఐడీఏ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రస్తుత సీఈవో అజయ్ భూషణ్. చైర్మన్ జే సత్యనారాయణ. సభ్యుడు - ఆనంద్ దేశ్ పాండే. దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 18,000 చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈవో అజయ్ భూషణ్ పాండే జూన్ 20న తెలిపారు.
- సమాధానం: 4
40. ఇటీవల జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎన్నవది?
1) రెండవది
2) మూడవది
3) మొదటిది
4) నాలుగవది
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ డెహ్రాడూన్ లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ) క్యాంపస్‌లో 50 వేల మందికిపైగా ఔత్సాహికులతో కలసి యోగాసనాలు వేశారు. ఐరాస గుర్తింపుతో 2015లో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
- సమాధానం: 4
41. కాస్ట్ ఆఫ్ లివింగ్ - 2018 నివేదిక ప్రకారం భారత్ లో అత్యంత ఖరీదైన నగరం ఏది ?
1) హైదరాబాద్
2) ముంబయి
3) న్యూఢిల్లీ
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 2
వివరణ: విదేశాల నుంచి భారత్ కు వచ్చే వారికి దేశంలో అత్యధిక జీవన వ్యయం అయ్యే నగరంగా ముంబై నిలిచింది. అలాగే ప్రపంచ స్థాయిలో చూస్తే 55వ స్థానంలో ఉంది. ఈ మేరకు ప్రపంచస్థాయి నగరాల్లో జీవన వ్యయంపై కాస్ట్ ఆఫ్ లివింగ్-2018 పేరుతో మెర్సర్ సంస్థ నిర్వహించిన సర్వేలో జూన్ 26న ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ అగ్రస్థానంలో నిలిచింది.
- సమాధానం: 2
42. భారత్ లో పాస్‌పోర్ట్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది ?
1) జూన్ 22, 1967
2) జూన్ 24, 1967
3) జూన్ 27, 1967
4) జూన్ 29, 1967
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్ లో 1967 జూన్ 24న పాస్ పోర్ట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దీనిని పురస్కరించుకొని ఏటా జూన్ 24న పాస్ పోర్ట్ సేవా దివస్ ని నిర్వహిస్తారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.
- సమాధానం: 2
43. ఇటీవల ఏ దేశం నుంచి దిగుమతి అయ్యే పప్పులు, స్టీల్, ఐరన్ వంటి 29 ఉత్పత్తులపై 50 శాతం దిగుమతి సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ?
1) జపాన్
2) రష్యా
3) అమెరికా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెరికా నుంచి దిగుమతి అయ్యే పప్పులు, స్టీల్, ఐరన్ లాంటి 29 ఉత్పత్తులపై 50 శాతం దిగుమతి సుంకంను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం జూన్ 21న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెంచిన సుంకాలు ఆగస్ట్ 4 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అమెరికా దిగుమతి చేసుకొనే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై మార్చి 9న ఆ దేశం టారిఫ్‌లను పెంచడంతో 41 మిలియన్ డాలర్ల విలువ మేర (రూ.1,600 కోట్లు) భారత ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా ఉత్పత్తులపై సుంకంను పెంచింది. కస్టమ్స్ డ్యూటీని పెంచాలనుకుంటున్న 30 ఉత్పత్తుల జాబితాను గత వారమే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు భారత్ సమర్పించింది.
- సమాధానం: 3
44. టెక్నాలజీ పయనీర్స్ - 2018 జాబితాను ఇటీవల ఏ సంస్థ ప్రకటించింది ?
1) ప్రపంచ ఆర్థిక ఫోరమ్
2) ప్రపంచ బ్యాంక్
3) యునిసెఫ్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నవకల్పనలకు ప్రాధాన్యత ఇచ్చే ఆరంభ స్థాయి కంపెనీలతో డబ్ల్యూఈఎఫ్ ప్రతి ఏడాది టెక్నాలజీ పయనీర్స్ జాబితాను రూపొందిస్తుంది. 2018 కి గాను రూపొందించిన జాబితాలో అహ్మదాబాద్‌కు చెందిన మై క్రాప్ టెక్నాలజీస్, న్యూఢిల్లీకి చెందిన సోషల్ కాప్స్ స్టార్టప్‌లకు స్థానం దక్కింది. ఈ మేరకు 61 సంస్థలతో గుర్తించిన ‘టెక్నాలజీ పయనీర్స్-2018’ను జూన్ 21న విడుదల చేసింది. ఇందులో 25 శాతానికి పైగా మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు అని టెక్నాలజీ పయనీర్స్ హెడ్ ఫుల్వియా మోన్టెస్స్రర్ పేర్కొన్నారు. పయనీర్స్ జాబితాలో చోటు సాధించిన స్టార్టప్ నిర్వాహకులతో 2018 సెప్టెంబర్‌లో చైనాలోని తియాన్జిన్లో సదస్సుని నిర్వహించన్నట్లు తెలిపారు.
- సమాధానం: 1
45. గాలిలో తేమను నీటిగా మార్చడంతో పాటు నీటిలో లవణాలు చేర్చే యంత్రాన్ని ఇటీవల ఏ సంస్థ ఆవిష్కరించింది ?
1) ఇక్రిశాట్
2) ఐఎండీ
3) ఐఐసీటీ
4) సీసీఎంబీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: గాలిలోని తేమను నీటిగా మార్చడంతో పాటు నీటిలో లవణాలు చేర్చే యంత్రంను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ యంత్రాన్ని మేఘదూత్ పేరుతో జూన్ 22న విడుదల చేశారు. ఇది రోజుకు దాదాపు 9 యూనిట్ల విద్యుత్ ద్వారా వెయి్య లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుంది. గాలిలో 45 శాతం తేమ ఉన్నా నీటిని వేరు చేయడంతో పాటు తేమశాతం ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో రోజుకు 1,400 లీటర్ల వరకు నీటిని ఉత్పత్తి చేస్తుంది.
- సమాధానం: 3
46. గ్యారీ వెబెర్ టెన్నిస్ ఓపెన్ టైటిల్ - 2018 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?
1) రాఫెల్ నాదల్
2) బోర్నా కోరిచ్
3) రోజర్ ఫెడరర్
4) జకోవిచ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్రొయేషియాకు చెందిన 21 ఏళ్ల బోర్నా కోరిచ్ గ్యారీ వెబెర్ టెన్నిస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నాడు. జూన్ 24న జరిగిన ఫైనల్లో కోరిచ్ రోజర్ ఫెడరర్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.
- సమాధానం: 2
47. ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్ ను ఇటీవల ఏ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు ?
1) మిషిగాన్ యూనివర్సిటీ
2) కేంబ్రిడ్‌జ యూనివర్సిటీ
3) మసాచుసెట్స్ యూనివర్సిటీ
4) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్ను అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. 0.3 మిల్లీమీటర్ల మందం ఉన్న ఈ కంప్యూటర్ బియ్యపు గింజ కంటే చాలా చిన్నది. ఇందులో ర్యామ్, కాంతి విద్యుత్ ఘటాలతో పాటు ప్రాసెసర్లు, వెర్లైస్ ట్రాన్స్మీటర్లు, రిసీవర్లను అమర్చారు. ‘మిషిగాన్ మైక్రో మోట్’గా పిలుస్తున్న ఈ చిన్న కంప్యూటర్ను ఒకసారి స్విచాఫ్ చేస్తే అంతకు ముందు చేసిన ప్రొగ్రామింగ్, డేటా అంతా అదృశ్యమవుతుంది. దీనిని కేన్సర్ కణతుల పరిశీలన, చికిత్సలో ఉపయోగించొచ్చని పరిశోధకులు వెల్లడించారు.
- సమాధానం: 1
48. కింది వారిలో ఏ బాలీవుడ్ నటి ఆత్మకథ ‘‘అన్ఫినిష్డ్’’ పేరుతో రానుంది ?
1) ఐశ్వర్యా రాయ్
2) దీపికా పదుకోన్
3) ప్రియాంకా చోప్రా
4) కరీనా కపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘అన్ఫినిష్డ్’ పేరుతో తన ఆత్మకథ ను రాయనుంది. 2019లో మార్కెట్లోకి రాబోతున్న ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్ ప్రచురిస్తోంది. ఇందులో తన జీవితంలో సేకరించిన వ్యాసాలు, కథలు, ఎదుర్కొన్న సమస్యలు, పరిశీలించిన సంఘటనల గురించి ప్రియాంక వివరించనుంది. ఇప్పటికే బాలీవుడ్లో రిషి కపూర్, ట్వింకిల్ ఖన్నా, నసీరుద్దీన్ షా తమ జీవిత విశేషాలతో ఆత్మకథలు రాసుకున్నారు.
- సమాధానం: 3
49. కాగ్ ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం ఆదాయ వృద్ధిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్
4) హరియాణా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆదాయాభివృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014 నుంచి 2018 మే వరకు స్వీయ ఆదాయం (స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ)లో 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో ముందంజలో ఉంది. ఈ మేరకు కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్ జూన్ 25న ఈ గణాంకాలను వెల్లడించింది. వృద్ధి రేటు 2015-16లో 13.7 శాతం, 2016-17లో 21.1 శాతం, 2017-18లో 16.8 శాతంగా ఉంది. జాబితాలో 14.2 శాతంతో హరియాణా, 13.9 శాతంతో మహారాష్ట్ర, 12.4 శాతంతో ఒడిశా, 10.3 శాతంతో పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ 10 శాతంలోపు వృద్ధిరేటు సాధించాయి.
- సమాధానం: 1
50. బ్రాండ్ జెడ్ రూపొందించిన గ్లోబల్ బ్రాండ్స్ - 2018 జాబితాలో తొలి స్థానంలో నిలిచిన బ్రాండ్ ఏది ?
1) గూగుల్
2) యాపిల్
3) అమెజాన్
4) మైక్రోసాఫ్ట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బ్రాండ్ జెడ్ రూపొందించిన గ్లోబల్ బ్రాండ్స్ - 2018 జాబితాలో గూగుల్ తొలి స్థానంలో, యూపిల్ రెండో స్థానంలో, అమెజాన్ మూడో స్థానంలో, మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానంలో నిలిచాయి. అత్యంత విలువైన టాప్ - 100 బ్రాండ్స్ తో ఈ జాబితాను విడుదల దేశారు. ఇందులో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 60వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 1