కరెంట్ అఫైర్స్ (జూన్ 16 - 23) బిట్ బ్యాంక్
1. పధాని నరేంద్ర మోదీ జూన్ 15న బన్సాగర్ కాలువని ప్రారంభించారు. ఈ కాలువ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) ఉత్తరప్రదేశ్
2) గుజరాత్
3) హర్యానా
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
వివరణ: 171 కిలోమీటర్ల మేర ఉన్న బన్సాగర్ కాలువని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించాయి. దీని ద్వారా 1.70 లక్షల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. మిర్జాపూర్, అలహాబాద్ రైతులకు దీని వల్ల అధిక ప్రయోజనం కలుగుతుంది.
-
2. 2వ జాతీయ పర్యాటక సమావేశం ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) రాజస్థాన్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2వ జాతీయ పర్యాటక సమావేశం ఇటీవల రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం అనేక పర్యాటక ప్రాజెక్టులను చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
-
3. కింది వాటిలోని ఏ దేశం జూలై 18న నెల్సన్ మండేలా 100వ జయంతిని ఘనంగా నిర్వహించింది ?
1) భారత్
2) దక్షిణాఫ్రికా
3) అమెరికా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జాతి వివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడు, నల్లజాతి సూరీడుగా పేరెన్నికగన్న నెల్సన్ మండేలా.. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజా స్వామ్యంలో ఎన్నికై న మొట్టమొదటి నాయకుడు.. మండేలా. ఆయన 100వ జయంతిని దక్షిణాఫ్రికా ఇటీవల ఘనంగా నిర్వహించింది.
-
4. ఇజ్రాయెల్ పై వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ అమెరికా ఇటీవల ఐరాస మానవ హక్కుల కమిషన్ నుంచి వైదొలింగింది. ఈ స్థానంలో యూఎన్ హెచ్ఆర్సీలో కొత్తగా చేరిన దేశం ఏది ?
1) ఐస్లాండ్
2) ఐర్లాండ్
3) కెన్యా
4) నెదర్లాండ్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇజ్రాయెల్ పై రాజకీయ వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ అమెరికా ఇటీవల ఐరాస మానవ హక్కుల కమిషన్ నుంచి వైదొలిగింది. దీంతో యూఎన్ హెచ్ఆర్సీలో ఐస్లాండ్ కొత్త సభ్య దేశంగా చేరింది.
-
5. "Notes of a Dream: The Authorized Biography of A.R. Rahman'' పుస్తక రచయిత ఎవరు ?
1) క్రిష్ణ త్రిలోక్
2) సుధా మూర్తి
3) బషరత్ పీర్
4) త్రిటి ఉమ్రిగర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘‘Notes of a Dream: The Authorized Biography of A.R. Rahman’’ పుస్తకాన్ని క్రిష్ణ తిలోక్ రచించారు. 2018 ఆగస్టులో విడుదల చేయనున్న ఈ పుస్తకంలో ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జీవిత చరిత్రను వివరించారు.
-
6. 23వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (EUFF) ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) ఫ్రాన్స్
2) భారత్
3) జర్మనీ
4) యునెటైడ్ కింగ్ డమ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 23వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్(EUFF) జూన్ 18న ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ దేశవ్యాప్తంగా 11 నగరాల్లో ఆగస్టు 31 వరకు జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ లోని దేశాల చిత్రాలను ను ఈ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తారు.
-
7. ఫోర్బ్స్ 2018 గ్లోబల్ 2000 కంపెనీల జాబితాలో టాప్ - 100 లో స్థానం పొందిన ఏకై క భారత సంస్థ ఏది ?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) జీఎంఆర్
3) టీసీఎస్
4) రిలయన్స్ ఇండస్ట్రీస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2018 గ్లోబల్ 2000 కంపెనీల జాబితాను ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో మొత్తం 58 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. టాప్ - 100లో చోటు దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 83వ స్థానంలో నిలిచింది.
-
8. పిడుగుపాటుని ముందుగానే గుర్తించి బాధితులను తగ్గించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అమెరికాలోని అర్త్ నెట్వర్క్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) తెలంగాణ
2) ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పిడుగుపాటుని ముందుగానే గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా బాధితులను తగ్గించాలనే లక్ష్యంతో ఒడిశా ప్రభుత్వం ఇటీవల అమెరికాలోని అర్త్ నెట్వర్క్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ సంస్థ రాష్ట్రంలో పిడుగులు ఎక్కువగా పడే ప్రాంతాలను గుర్తించి అక్కడ సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తుంది. అవి పిడుగుపాటు ఏర్పడటానికి అవకాశాన్ని 45 నిమిషాల ముందే గుర్తిస్తాయి.
-
9. తన ఆర్థిక విధానాలపై ప్రజల వ్యతిరేకత కారణంగా ఇటీవల జార్జియా ప్రధాన మంత్రిగా పదవి నుంచి వైదొలిగిన వారు ఎవరు ?
1) జియోర్జి క్విరిక్షావిలి
2) అహ్మద్ తన్లీమ్
3) బిడ్జినా ఇనాన్షిలి
4) సన్ డ్రామ్ క్యూన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2015 డిసెంబర్ లో జార్జియా 50వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జియోర్జి క్విరిక్షావిలి.. ఇటీవల పదవికి రాజీనామా చేశారు. తన ఆర్థిక విధానాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
10. అంతరిక్షంలో ఎక్కువ సమయం ఉన్న అమెరికా వ్యోమగామిగా, అత్యధిక స్పేస్ వాక్స్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించినది ఎవరు?
1) పెగ్గీ విట్సన్
2) బర్బరా మోర్గాన్
3) స్పెఫనీ విల్సన్
4) ఇలీన్ కొల్లీన్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్.. అంతరిక్షంలో ఎక్కువ సమయం ఉన్న అమెరికా వ్యోమగామిగా, అలాగే ఎక్కువ స్పెస్ వాక్స్ చేసిన అమెరికా మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. ఆమె మొత్తంగా 665 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. అలాగే 60 గంటల, 21 నిమిషాల సమయంతో 10 స్పేస్ వాక్స్ చేశారు. పెగ్గీ విట్సన్ జూన్ 15న నాసా అ్ట్రానాట్ గా రిటైర్మెంట్ తీసుకున్నారు.
-
11. బెల్లందూర్ సరస్సు ఏ నగరంలో ఉంది ?
1) హైదరాబాద్
2) విశాఖపట్నం
3) బెంగళూరు
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
వివరణ: బెల్లందూరు సరస్సు బెంగళూరులో ఉన్న అతిపెద్ద చెరువు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తనిఖీ కమిటీ ఇటీవల ఈ చెరువుని పరిశీలించింది. ప్రభుత్వ విభాగాలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తంచని కారణంగా... ఈ చెరువు అతిపెద్ద సెప్టిక్ ట్యాంక్ లా మారిందని ఈ కమిటీ పేర్కొంది. చెరువుని సంరంక్షించడంలో కర్ణాటక ప్రభుత్వం సైతం వైఫల్యం చెందిందని అభిప్రాయపడింది.
-
12. కేంద్ర ప్రభుత్వం జూన్ లో వెల్లడించిన వివరాల ప్రకారం 2018 మేలో భారత ఎగుమతుల విలువ ఎంతగా నమోదైంది ?
1) 20 బిలియన్ డాలర్లు
2) 10 బిలియన్ డాలర్లు
3) 15 బిలియన్ డాలర్లు
4) 28.86 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జూన్ లో వెల్లడించిన వివరాల ప్రకారం 2018 మే నెలలో భారత ఎగుమతుల విలువ 28.86 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 20.18 శాతం అధికం. అలాగే 2018 మేలో దిగుమతుల విలువ 43.48 బిలియన్ డాలర్లుగా ఉంది. 2017 మేలో ఎగుమతులు విలువ 24.01 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
-
13. నీతి ఆయోగ్ జూన్ 15న విడుదల చేసిన మిశ్రమ నీటి యాజమాన్య సూచీ (Composite water management index) లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) గుజరాత్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: నీతి ఆయోగ్ జూన్ 15న కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ను విడుదల చేసింది. ఇందులో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. జార్ఖండ్ చివరి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది.
-
14. కింది వాటిలోని ఏ రాకెట్ ని డీఆర్డీవో గెడైడ్ మిసైల్ గా అభివృద్ధి చేసి ఇటీవల తొలి దశ పరీక్షలు నిర్వహించింది ?
1) పినాక
2) ఆకాశ్
3) పృథ్వి
4) త్రిశూల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన పినాక రాకెట్ ను డీఆర్డీవో ఇటీవల గెడైడ్ మిసైల్ గా అభివృద్ధి చేసింది. లక్ష్యాలను మరింత కచ్చితంగా ఛేదించేందుకు, పరిధిని మరింతగా పెంచేందుకు దీనిని చేపట్టింది. అభివృద్ధి చేసిన క్షిపణి కేవలం 44 సెకండ్లలో 12 రాకెట్లను ధ్వంసం చేయగలదు. పినాకా మార్క్ 2 గా పిలుస్తోన్న ఈ క్షిపణి ప్రాథమిక పరీక్షలు ఇటీవల విజయవంతంగా పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో ఈ క్షిపణిని భారత సైన్యంలో ప్రవేశపెడతారు.
-
15. కింది వారిలో ఎవరు ఇటీవల ప్రధాని ఆర్థిక సలహాదారు పదవికి రాజీనామా చేశారు ?
1) అరవింద్ సుబ్రమణియన్
2) నృపేంద్ర మిశ్రా
3) అజిత్ దోవల్
4) పీకే మిశ్రా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాని ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తన పదవికి రాజీనామా చేశారు. 2014 అక్టోబర్ 16న 3 ఏళ్ల పదవీ కాలానికి ఆయన ప్రధాని ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. 2017లో ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు పొడగించారు. పదవీకాలం పూర్తికాకముందే ఆయన ఇటీవల రాజీనామా చేశారు.
-
16. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) జూన్ 19
2) జూన్ 21
3) జూన్ 23
4) జూన్ 17
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2015 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐరాస ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుగుతుంది. ఇటీవల 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డెహ్రాడూన్ లో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అలాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ లో తొలిసారిగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
2018 Theme: Yoga for peace
-
17. 2019లో జరగనున్న క్రికెట్ తొలి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ లో ఎన్ని జట్లు పాల్గొంటాయి ?
1) 11
2) 9
3) 5
4) 7
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్రికెట్ తొలి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ 2019 జూలై 15 నుంచి 2021, ఏప్రిల్ 30 వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ ను వెస్టిండీస్ తో ఆడనుంది. మొత్తంగా టాప్ - 9 టెస్ట్ జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి.
-
18. మహిళల వన్డే క్రికెట్ లో ఇటీవల అత్యధిక వ్యక్తిగత స్కోర్ 232 పరుగులు నమోదు చేసిన అమేలియా కెర్ ఏ దేశం జట్టు క్రీడాకారిణి ?
1) భారత్
2) వెస్టిండీస్
3) ఆస్ట్ర్రేలియా
4) న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ అమేలి కెర్.. ఇటీవల ఐర్లాండ్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో 232 పరుగులు సాధించింది. తద్వారా మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును నమోదు చేసింది. ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియన్ ప్లేయర్ బెలిండా క్లార్క్ (229) పేరిట ఉండేది.
-
19. 2018 జూన్ 17,18 తేదీల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏ నగరంలో జరిగింది ?
1) కాట్మాండు
2) న్యూఢిల్లీ
3) బీజింగ్
4) లండన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నేపాల్ రాజధాని కాట్మాండులో జూన్ 17, 18 తేదీల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సమావేశం జరిగింది. నేపాల్ ఫెడరేషన్ ఆఫ్ కంప్యూటర్ అసోసియేషన్ ఈ సమావేశం నిర్వహించింది. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ఒకే వేదికిపైకి తెచ్చి అత్యాధునిక సాంకేతికతను వినియోగంలోకి తేవాలన్నది ఈ సమావేశం లక్ష్యం.
Theme : Sustainable development goals for smart society.
-
20. ఫ్రెంచ్ ఓపెన్ - 2018 మహిళల సింగిల్స్ విజేత ఎవరు ?
1) సిమోనా హలెప్
2) స్టోన్ స్టీఫెన్స్
3) సెరెనా విలియమ్స్
4) మారియా షరపోవా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫ్రెంచ్ ఓపెన్ - 2018 మహిళల సింగిల్స్ టైటిల్ ను రొమేనియా క్రీడాకారిణి సిమోనా హాలెప్ సొంతం చేసుకుంది. ఫైనల్లో అమెరికాకు చెందిన స్టోన్ స్టీఫెన్స్ ను ఓడించి హాలెప్ విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ ను రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ రన్నరప్ గా నిలిచాడు.
-
21. నార్వే చెస్ టోర్నమెంట్ - 2018 విజేత ఎవరు ?
1) విశ్వనాథన్ ఆనంద్
2) వ్లాదిమిర్ క్రామ్నిక్
3) ఫాబియానో కరెనా
4) మాగ్నస్ కార్లసన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: నార్వేలోని స్టవేంజర్ లో జరిగిన నార్వే చెస్ టోర్నమెంట్ - 2018 టైటిల్ ను ఇటలీకి చెందిన ఫాబియానో కరెనా గెలుచుకున్నాడు. భారత్‌కు చెందిన విశ్వనాథన్ ఆనంద్ నార్వే చెస్ టోర్నమెంట్లో ఉమ్మడిగా 2వ స్థానంలో నిలిచాడు.
-
22. కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొంటూకింది వాటిలోని ఏ సంస్థ ఇటీవల నివేదిక విడుదల చేసింది ?
1) యూఎన్ఓ
2) నాటో
3) ప్రపంచ బ్యాంక్
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
- View Answer
- సమాధానం: 1
వివరణ: కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొంటూ ఐక్యరాజ్య సమితి ఇటీవల నివేదిక విడుదల చేసింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. అది ‘అవాస్తవమైన.. వివాదాస్పద.. ప్రేరేపిత..’ నివేదికగా పేర్కొంది. విశ్వసనీయతను దిగజార్చుకునేలా ఐక్యరాజ్య సమితి వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదిస్తోందంటూ మండిపడింది. నివేదికలో ఐక్యరాజ్య సమితి ‘ఆజాద్ జమ్మూ, కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్’ అని ప్రస్తావించడాన్ని భారత్ ఆక్షేపించింది. భారత ప్రాదేశిక భాగాన్ని తప్పుగా వివరించడం ఆమోద యోగ్యం కాదని ఖండించింది.
-
23. ఇంగ్లండ్ లోని కియో సూపర్ లీగ్ లో ఆడనున్న మొదటి భారత మహిళా క్రికెటర్ గా గుర్తింపు పొందిన వారు ఎవరు ?
1) మిథాలీ రాజ్
2) స్మృతి మందాన
3) హర్మన్ ప్రీత్ కౌర్
4) జులన్ గోస్వామి
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత క్రికెట్ మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మందానా ఇంగ్లాండ్‌లోని కియా సూపర్‌లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 2018 జూలై నుంచి ఆరంభం కానున్న ఈ లీగ్‌లో స్మృతి వెస్టర్న్ స్టార్మ్ తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మృతి ఇదివరకు బిగ్‌బాష్ లీగ్‌లో ఆడింది.
-
24. ఇటీవల వార్తల్లో నిలిచిన తుషార్ అరొథె కింది వాటిలోని ఏ జట్టుకి కోచ్ గా వ్యవహరించారు ?
1) భారత మహిళా క్రికెట్ జట్టు
2) భారత పురుషుల క్రికెట్ జట్టు
3) భారత మహిళా హాకీ జట్టు
4) భారత పురుషుల హాకీ జట్టు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ తుషార్ అరొథె పై మహిళా క్రికెటర్లు ఇటీవల బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. జట్టు వ్యవహారాల్లో అతను అతిగా జోక్యం చేసుకుంటున్నాడని జట్టు సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తుషార్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన, సీనియర్ సభ్యులతో సత్సంబంధాలు లేకపోవడం వంటి కారణాలతో తుషార్ రాజీనామా చేశారు.
-
25. కింది వాటిలోని ఏ రాష్ట్రం అన్నపూర్ణ పేరుతో రూ.5 కే భోజనం అందించే పథకాన్ని అమలు చేస్తోంది ?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తమిళనాడు
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
వివరణ: హైదరాబాద్ మహానగరపాలక సంస్థతో పాటు వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో అమలవుతున్న రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి తెలంగాణ మునిసిపల్ శాఖ 2018 జూన్ 14న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 72 మునిసిపాలిటీల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
-
26.ఇటీవల కన్నుమూసిన ఆదిరాజు వెంకటేశ్వరరావు కింది వాటిలోని ఏ రంగానికి చెందిన వారు ?
1) పాత్రికేయం
2) క్రీడలు
3) సినిమా
4) వ్యాపారం
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ పోరాట యోధుడు, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు జూన్ 15న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, పండితాపురం గ్రామానికి చెందిన ఆదిరాజు 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆదిరాజు పలు తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. జనతా, రాజధాని పత్రికలను నడిపారు.
-
27. కింది వారిలో గోవా ముఖ్యమంత్రి ఎవరు ?
1) శివరాజ్ సింగ్ చౌహాన్
2) మనోహర్ పారికర్
3) నితీశ్ కుమార్
4) మురళీధర్ రావు
- View Answer
- సమాధానం: 2
వివరణ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ 2018 జూన్ 15 నుంచి తన అధికార బాధ్యతల నిర్వహణను పునఃప్రారంభించారు. మూడు నెలల పాటు అమెరికాలో వైద్యచికిత్సలు చేయించుకున్న అనంతరం ఆయన జూన్ 14న తిరిగి వచ్చారు.
-
28. కింది వారిలో ఇటీవల ఎవరు యాపిల్ డిజైన్ అవార్డు - 2018కి ఎంపికయ్యారు ?
1) అశోక్ కుమార్ రాజు
2) నాదర్ కెన్
3) రాజా విజయరామన్
4) సందీప్ పాటిల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: చెన్నైకి చెందిన రాజావిజయరామన్కు యాపిల్ డిజైన్ అవార్డు లభించింది. విజయరామన్రూపొందించిన Calzy 3 యాప్‌కు గాను యాపిల్వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2018లో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
-
29. తెలుగు, తమిళంతో పాటు 6 ప్రాంతీయ భాషలు, ఇంగ్లీష్ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కింది వాటిలోని ఏ సంస్థ కార్యక్రమాన్ని చేపట్టనుంది ?
1) యాపిల్
2) అమెజాన్
3) ట్వీటర్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలుగు, తమిళంతో పాటు 6 ప్రాంతీయ భాషలు, ఇంగ్లీష్ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ ఓ కార్యక్రమం చేపట్టనుంది. నకిలీ వార్తల కట్టడి, అసత్య సమాచారానికి అడ్డుకట్ట తదితర అంశాలపై దీని ద్వారా అవగాహన కల్పించనుంది. ‘‘ద గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్ ఇండియా ట్రైనింగ్ నెట్వర్క్’’ పేరిట ఈ కార్యక్రమం చేపడతామని, దీని ద్వారా ఏడాది కాలంలో 8,000 మంది జర్నలిస్టులకు శిక్షణ ఇస్తామని గూగుల్ వెల్లడించింది. దీని కోసం దేశవ్యాప్తంగా భిన్న నగరాల నుంచి 200 మంది జర్నలిస్టులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని, వీరు సెమినార్ ద్వారా మిగతావారికి అవగాహన కల్పిస్తారని పేర్కొంది.
-
30. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు - 2017కి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
1) శోభన
2) దీపికారెడ్డి
3) మీనాక్షి శ్రీనివాసన్
4) మైథిలి ప్రకాశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు-2017కి ఎంపికయ్యారు. కూచిపూడి నృత్యానికి ఆమె చేసిన సేవకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం వద్ద ఆమె కూచిపూడిలో మెళకువలు నేర్చుకున్నారు.
-
31. మెహబూబా ముఫ్తీ కింది వాటిలోని ఏ పార్టీకి చెందినవారు ?
1) బీజేపీ
2) ఎస్పీ
3) జేకేఎన్సీ
4) పీడీపీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: మెహబూబా ముఫ్తీ జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ డెమెక్రాటిక్ పార్టీకి చెందినవారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ కూటమి పాలన ముగిసింది. ప్రభుత్వం నుంచి తాము వైదొలుగుతున్నామని బీజేపీ ప్రకటించడంతో.. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ 2018 జూన్ 19న సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. జమ్ము అండ్ కశ్మీర్ ప్రస్తుత గవర్నర్ - ఎన్.ఎన్. వోహ్రా
-
32. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి KRMB అంటే?
1) Kerala river management board
2) Karnataka river management board
3) Krishna river management board
4) Krishna river maha baleshwar
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి KRMB అంటే Krishna river management board. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి నిర్వహణ బాధ్యత కృష్ణా నదీ యాజమాన్య మండలి (KRMB) చేతికే వెళ్లింది. ఇందుకోసం కేఆర్ఎంబీ చైర్మన్సారథ్యంలో కమిటీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న కేంద్ర జల వనరుల శాఖ ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీకి 2018 జూన్19న తెలియజేసింది.
-
33. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రైతుబంధు సామాజిక బీమా పథకం ఎన్ని ఏళ్ల వయసు వారికి వర్తిస్తుంది ?
1) 18 - 59 ఏళ్లు
2) 21 - 59 ఏళ్లు
3) 21 - 65 ఏళ్లు
4) 25 - 70 ఏళ్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 జూన్19న రైతు బంధు సామాజిక బీమా అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీచేసింది. దీని ప్రకారం 2018 ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులందరికీ జీవిత బీమా వర్తిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
-
34. ఇటీవల విడుదలైన స్మాల్ ఆర్మ్స్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాల కలిగిన పౌరులు ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) పాకిస్తాన్
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: అత్యధికంగా ఆయుధాలు గల దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో, భారత్ ద్వితీయ స్థానంలో ఉన్నట్లు ‘స్మాల్ ఆర్మ్స్ సర్వే’ పేరుతో చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. ఈ సర్వే యొక్క నివేదికను ఐక్యరాజ్యసమితి సదస్సులో ఆవిష్కరించారు. ప్రపంచంలో 100 కోట్లకు పైగా తుపాకులున్నాయని, వీటిలో 85.7 కోట్లు పౌరుల చేతుల్లోనే ఉన్నాయని వెల్లడించింది. ఆయుధాలు కలిగి ఉన్న పౌరుల్లో 46% అమెరికన్లేనని, ఆ దేశ పౌరుల వద్ద 39.3 కోట్ల తుపాకులున్నాయని తెలిపింది. భారత్‌లో పౌరుల వద్ద 7.1 కోట్ల ఆయుధాలున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. చైనా (4.97 కోట్లు), పాకిస్థాన్(4.39 కోట్లు), రష్యా(1.76 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-
35. ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థల (IMF) కు సంబంధించిన నిబంధనలను సమీక్షించేందుకు ఐఆర్డీఏ ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది ?
1) టీఎస్ విజయన్
2) చందా కొచ్చర్
3) సురేష్ మాథుర్
4) శశిథరూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థల (IMF) కు సంబంధించిన నిబంధనను సమీక్షించేందుకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్డెవలప్మెంట్ అథారిటీ (IRDAI) 10 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సురేష్ మాథుర్ నేతృత్వం వహించనున్నారు.
-
36. కింది వాటిలో ఏ రాష్ట్రం రైతుల కోసం ఇటీవల ‘‘రైతు సేవా’’ పేరుతో ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ట్రంలో సాగుకు సంబంధించిన సమస్త సమాచారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ‘రైతు సేవా’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు భూమి చదును నుంచి వరి కోత యంత్రాల వరకు ఏది అవసరమైనా యాప్ ద్వారా అద్దెకు సమకూర్చుకోవచ్చు. ప్రయోగాత్మకంగా రబీ సీజన్లో ఈ యాప్‌ను ఉభయగోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో పరీక్షించి చూశారు. ఖరీఫ్ సీజన్ నుంచి పూర్తి స్థాయిలో యాప్‌ను రైతులకు వ్యవసాయశాఖ అందుబాటులోకి తెచ్చింది.
-
37. మిస్ ఇండియా - 2018గా ఇటీవల ఎవరు గెలుపొందారు ?
1) శ్రేయరావు
2) మీనాక్షి చౌధరి
3) అనుక్రీతి
4) మానుషి ఛిల్లర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ముంబైలో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీలో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుక్రీతి విజేతగా నిలిచారు. మిస్‌వరల్డ్ 2017 మానుషి ఛిల్లర్ అనుక్రీతికి అందాల కిరీటం బహూకరించారు. పోటీలలో రెండో స్థానంలో మీనాక్షి చౌధరి (హర్యానా), మూడో స్థానంలో శ్రేయారావు (ఆంధ్రప్రదేశ్) నిలిచారు. అనుక్రీతి మిస్‌వరల్డ్ 2018 పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
-
38. ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 20
2) జూన్ 18
3) జూన్ 16
4) జూన్ 22
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచవ్యాప్తంగా జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఐరాస 2000 సంవత్సరం డిసెంబర్ 4న ప్రత్యేక తీర్మానం ద్వారా వరల్డ్ రెఫ్యూజీ డే ని ప్రారంభించింది.
2018 Theme : Now More Than Ever, We Need to Stand with Refugees
-
39. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ సంస్థ కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది ?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) రాయ్‌పూర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ సంస్థ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. ఈ సంస్థ 19వ జాతీయ సమావేశం 2018 జూన్ 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. రెండ్రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
-
40. సరకు రవాణాలో భారత్ పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు నేపాల్ ఇటీవల ఏ దేశంతో రైలు మార్గానికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) బంగ్లాదేశ్
2) పాకిస్తాన్
3) మయన్మార్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: టిబెట్ ఖాట్మండ్‌ను అనుసంధానిస్తూ వ్యూహాత్మక రైలు మార్గాన్ని నిర్మించాలని చైనా, నేపాల్ దేశాలు నిర్ణయించుకున్నాయి. నేపాల్ ప్రధాని కె.పి.శర్మ 5 రోజుల చైనా పర్యటన సందర్భంగా 2018 జూన్ 21న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధానమంత్రి లీ కెకియాంగ్‌తో చర్చలు జరిపారు. అనంతరం టిబెట్ ఖాట్మండ్ రైల్వే మార్గానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. సరకు రవాణాలో భారత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా 2016లో ఓలి చైనాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
-
41. భారత తొలి రోబోటిక్ టెలిస్కోప్ ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ?
1) వరంగల్
2) లద్ధాఖ్
3) సియాచిన్
4) షిమ్లా
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత తొలి రోబోటిక్ టెలిస్కోపు తన సేవలను ప్రారంభించింది. ఇండియన్ ఆస్టోన్రోమికల్ అబ్జర్వేటరీ(ఐఏవో) అనే టెలిస్కోపును లద్దాఖ్‌లో ఏర్పాటు చేశారు. ఇది 2018 జూన్ 12న తొలిసారిగా రాత్రివేళ ఆకాశాన్ని వీక్షించిందని ఈ కేంద్రం అధిపతి జి.సి.అనుపమ వెల్లడించారు. సమీపంలోని దేదీప్యమాన ఖగోళ వస్తువులతో కూడిన ‘మెస్సియర్ క్యాటలాగ్’ నుంచి కొన్ని లక్ష్యాలను ఎంపిక చేసి, వాటిపైకి ఈ టెలిస్కోపు దృష్టిని మళ్లించినట్లు తెలిపారు.
-
42. మంగోలియా ఏ దేశ సహాయంతో తమ దేశంలో తొలి చమురు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది ?
1) సౌదీ అరేబియా
2) భారత్
3) ఇరాన్
4) చైనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: మంగోలియా తమ దేశంలో తొలి చుమురు శుద్ధి కర్మాగారానికి జూన్ 22న శంకుస్థాపన చేసింది. భారత్ అందిస్తోన్న రూ.6.7 వేల కోట్ల రుణ సాయంతో ఈ కర్మాగార నిర్మాణాన్ని చేపట్టింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భారత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం మంగోలియా ప్రధానమంత్రి ఉఖ్నాగిన్ ఖర్సొఖ్.
-
43. జాతీయ మహిళా కమిషన్ సలహాదారుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) త్రిపురాన వెంకటరత్నం
2) ఆర్ కే రోజా
3) నన్నపనేని రాజకుమారి
4) జీవితా రాజశేఖర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ మహిళ కమిషన్ సలహాదారుగా తెలంగాణ మహిళ కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం నియమితులయ్యారు. 2018 జూన్ 22న ఆమె బాధ్యతలు చేపట్టారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ.
-
44. కలామ్స్ వేకప్ కాల్ పుస్తక రచయిత ఎవరు ?
1) యనమల రామకృష్ణుడు
2) ఐఆర్ కృష్ణారావు
3) అజేయ కల్లాం
4) కడియం శ్రీహరి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం రాసిన ‘కలామ్స్ వేకప్ కాల్’(ఇంగ్లీష్), ‘మేలుకొలుపు’(తెలుగు) పుస్తకాలను విశాఖపట్టణంలో 2018 జూన్ 22న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ఈఏఎస్ శర్మ అవిష్కరించారు. రాష్ట్రానికి రాజధాని నగరాన్ని నిర్మించడానికి వేల ఎకరాలు అవసరం లేదని, జపాన్ రాజధాని టోక్యో వంటి ప్రపంచస్థాయి నగరాలు కూడా చిన్నవేనని ఈ సందర్భంగా అజేయకల్లాం అన్నారు.
-
45. కింది వాటిలోని ఏ రాష్ట్రం ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘించి మొదట సారి పట్టుబడిన వారికి రూ.5000 జరిమానా విధిస్తూ నిబంధనలను అమల్లోకి తెచ్చింది ?
1) తెలంగాణ
2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 2018 జూన్ 23 నుంచి అమల్లోకి వచ్చింది. నిషేధాన్ని ఉల్లంఘించి తొలిసారి పట్టుబడినవారికి రూ.5000, రెండోసారి దొరికితే రూ.10,000 జరిమానా విధిస్తారు. మూడోసారి దొరికితే రూ.25,000 జరిమానాతో పాటు 3 నెలల జైలుశిక్ష విధించడానికి నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి.
-
46. పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారత ప్లేయర్ గా ఇటీవల రికార్డు నెలకొల్పిన ప్రజ్ఞానంద ఏ రాష్ట్రానికి చెందినవాడు ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ చెస్చరిత్రలో పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన రెండో ప్లేయర్‌గా, భారత్ తరఫున గ్రాండ్‌మాస్టర్ అయిన పిన్న వయస్కుడిగా చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. ఇటలీలో జరిగిన గ్రెడైన్ ఓపెన్‌లో 12 ఏళ్ల 10 నెలల 14 రోజుల వయస్సులో ఈ హోదా సాధించాడు. దీంతో ఇప్పటిదాకా పరిమార్జన్నేగి (డిల్లీ, 13 ఏళ్ల 4 నెలల 22 రోజుల) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచంలో పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్ అయిన రికార్డు సెర్గీ కర్జాకిన్ (రష్యా, 12 ఏళ్ల 7 నెలలు) పేరిట ఉంది.
-
47. రెసెప్ తయి్యప్ ఎర్డోగన్ ఏ దేశానికి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ?
1) టర్కీ
2) తుర్క్మెనిస్తాన్
3) ఆఫ్గనిస్తాన్
4) సిరియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: రెసెప్ తయి్యప్ ఎర్డోగన్ టర్కీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. దేశాధ్యక్ష పదవికి 2018 జూన్ 24న నిర్వహించిన ఎన్నికల్లో ఆయన పార్టీ ‘జస్టిస్ అండ్ డెవప్మెంట్ పార్టీ (ఏకేపీ)’ విజయం సాధించింది. పార్లమెంటులో మొత్తం 600 స్థానాలకుగాను ఈ పార్టీ 293 సీట్లు గెలుచుకుంది. ఏకేపీ మిత్రపక్షం ‘నేషనలిస్ట్ మూవ్మెంట్ పార్టీ(ఎంహెచ్పీ)’ 50 స్థానాలు దక్కించుకుంది. దీంతో ఏకేపీ-ఎంహెచ్పీ కూటమికి పార్లమెంటులో స్పష్టమైన ఆధిక్యం లభించింది.
-