కరెంట్ అఫైర్స్ జనవరి (8 - 15) బిట్ బ్యాంక్
1. ఇటీవల కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఆవిష్కరించిన ఖేలో ఇండియా లోగోని ఏ సంస్థ రూపొందించింది ?
1) ఓమ్నికాన్ గ్రూప్
2) ఓగ్లీవి ఇండియా
3) పబ్లిసిస్ గ్రూప్
4) ఇంటర్ పబ్లిక్ గ్రూప్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఖేలో ఇండియా లోగోని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోర్ ఇటీవల ఆవిష్కరించారు. ఓగ్లీవి ఇండియా సంస్థ ఈ లోగోని రూపొందించింది. శారీరక ధృడత్వం, పోటీతత్వాన్ని ఈ లోగో సూచిస్తుంది.
- సమాధానం: 2
2. ఈ కింది వారిలో ఏ వ్యోమగామి 1965లో నాసా ప్రయోగించిన మొట్టమొదటి మానవ సహిత మిషన్‌లో ప్రయాణించారు ?
1) జాన్ యంగ్
2) జాన్ గ్లెన్
3) జాన్ ఫింకె
4) జాన్ స్మిక్త్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అత్యధిక సార్లు అంతరిక్షయానం చేయటంతో పాటు, చంద్రుడిపై నడిచిన ప్రముఖ అమెరికా వ్యోమగామి జాన్వాట్స్ యంగ్ ఇటీవల కన్నుమూశారు. 1965లో నాసా ప్రయోగించిన మొట్టమొదటి మానవ సహిత జెమిని మిషన్‌లో ఆయన కూడా సభ్యుడే. అంతరిక్షంలోకి ఆరు సార్లు వెళ్లి వచ్చిన ఏకై క వ్యోమగామిగా జాన్ రికార్డు నెలకొల్పారు.
- సమాధానం: 1
3. మహిళలపై నేరాలను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ఇటీవల ప్రారంభించిన 24X7 హెల్ప్‌లైన్ పేరేమిటి ?
1) నారి
2) సమ్మాన్
3) సఖి
4) గుడియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జైరామ్ ఠాకూర్.. రాష్ట్రంలో మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మహిళలపై నేరాలను అరికట్టేందుకు గుడియా పేరుతో 24X7 హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల కోసం అటల్ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
4. ఇటీవల కారు ప్రమాదంలో చనిపోయిన ప్రపంచ ఛాంపియన్ సాక్షమ్ యాదవ్ ఏ క్రీడకు సంబంధించిన వారు ?
1) మిక్స్డ్ మార్షియ్ ఆర్ట్స
2) బాక్సింగ్
3) పవర్ లిఫ్టింగ్
4) రెజ్లింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పవర్ లిఫ్టింగ్‌లో వరల్డ్ చాంపియన్ అయిన సాక్షమ్ యాదవ్.. ఇటీవల కారు ప్రమాదంలో చనిపోయారు.
- సమాధానం: 3
5. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పేరిట ఏర్పాటు చేసిన తొలి అవార్డుని ఇటీవల ఎవరికి ప్రకటించారు ?
1) దేవేంద్ర ఫడ్నవిస్
2) యోగి ఆదిత్యనాథ్
3) కే చంద్రశేఖర్ రావు
4) నితీశ్ కుమార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ) వ్యవస్థాపకులు, జమ్ము అండ్ కశ్మీర్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తొలి వర్ధంతిని పురస్కరించుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరిట అవార్డుని ఏర్పాటు చేసింది. తొలి అవార్డుని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కి ప్రకటించారు. రాజకీయం, ప్రజా జీవితంలో నిజాయతీతో వ్యవహరించినందుకు గుర్తింపుగా ఈ అవార్డుని అందజేస్తారు.
- సమాధానం: 4
6. ఏ నగరంలో డిఫెన్స్ మానుఫాక్చరింగ్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ?
1) హైదరాబాద్
2) కోయంబత్తూర్
3) కోచి
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
వివరణ: తమిళనాడులోని కోయంబత్తూర్‌లో డిఫెన్స్ మానుఫాక్చరింగ్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. రక్షణ రంగంలో చిన్న పరిశ్రమలకు తోడ్పాటు అందించేందుకు ఈ కేంద్రం పనిచేస్తుంది.
- సమాధానం: 2
7. ప్రాథమిక స్థాయిలో ఏ భాష బోధనపై ఇరాన్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది ?
1) హిందీ
2) స్పానిష్
3) ఇంగ్లీష్
4) అరబిక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇంగ్లీష్ భాష తమ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రభావితం చేస్తుందని ఆరోపిస్తు.. ఇరాన్ ప్రభుత్వం ఇటీవల ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ బోధనపై నిషేధం విధించింది. ప్రాథమిక స్థాయిలో పర్షియన్ భాషల్లో బోధన విద్యార్థులకు సంస్కృతీ, సంప్రదాయాలను చేరువ చేస్తుందని ప్రకటించింది.
- సమాధానం: 3
8. 18వ అఖిల భారత విప్ల సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) కోల్‌కతా
2) న్యూఢిల్లీ
3) ఉదయ్‌పూర్
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 18వ ఆల్ ఇండియా విప్ల కాన్ఫరెన్స్ ఇటీవల రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ ఈ సదస్సుని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి 90 మందికిపైగా విప్‌లు ఈ సదస్సుకి హాజరయ్యారు.
- సమాధానం: 3
9. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - NPCI.. ఎండీ, సీఈవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఏపీ హోటా
2) రవి వెంకటేశన్
3) రాజ్ కిరణ్ రాయ్ జి
4) దిలిప్ అస్బె
- View Answer
- సమాధానం: 4
వివరణ: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా ఇటీవల దిలిప్ అస్బె నియమితులయ్యారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక ఆవిష్కరణులుగా గుర్తింపు పొందిన యూపీఐ, బీమ్, ఐఎంపీఎస్ వ్యవస్థల రూపకల్పనలో దిలీప్ అస్బె కీలక పాత్ర పోషించారు.
- సమాధానం: 4
10. భారత్‌లోని ఏ నగరం తొలిసారిగా పబ్లిక్ బస్సులు, మెట్రోలో ప్రయాణం కోసం ఒకే కార్డుని ప్రవేశపెట్టింది ?
1) ఢిల్లీ
2) కోల్‌కతా
3) బెంగళూరు
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఢిల్లీ మెట్రో, పబ్లిక్ బస్సులో ఒకే కార్డుతో ప్రయాణించే విధానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రారంభించారు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి నగరంగా ఢిల్లీ గుర్తింపు పొందింది. ఇది 2018 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది.
- సమాధానం: 1
11. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టెనేబుల్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) నితిన్ నోహ్రియా
2) సతీశ్ కే త్రిపాఠి
3) సర్వదామన్ చౌలా
4) సన్నీ వర్గీస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత సంతతికి చెందిన సింగపూర్ వ్యాపారవేత్త సన్నీ వర్గీస్.. World Business Council for Sustainable Development సంస్థ చైర్మన్‌గా ఇటీవల నియమితులయ్యారు.
- సమాధానం: 4
12. సిక్కిం పర్యాటక అభివృద్ధి కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అక్షయ్ కుమార్
2) ఏఆర్ రెహ్మాన్
3) ఫర్హాన్ అక్తర్
4) శంకర్ మహదేవన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సిక్కిం రాష్ట్ర ప్రచారకర్తగా నియమితులయ్యారు. సిక్కం పర్యాటక, వ్యాపార అంశాలలో ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారు. సిక్కిం భారత్‌లో తొలి ఆర్గానిక్ రాష్ట్రంగా గుర్తింపు సాధించింది.
- సమాధానం: 2
13. ప్రవాసీ భారతీయ దివస్‌ను ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జనవరి 8
2) జనవరి 9
3) జనవరి 10
4) జనవరి 12
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఏటా జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తారు. విదేశాల్లో ఉంటు భారత్ అభివృద్ధి కోసం తమ వంతుగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 2
14. ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం ‘‘లీజియన్ ఆఫ్ హానర్’’ - 2018 పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ?
1) సౌమిత్ర చటర్జీ
2) నసీరుద్దీన్ షా
3) పంకజ్ కపూర్
4) మిథున్ చక్రవర్తి
- View Answer
- సమాధానం: 1
వివరణ: సౌమిత్ర చటర్జీ ప్రముఖ బెంగాలీ నటుడు. ఆయన ఇటీవల ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం ‘‘లీజియన్ ఆఫ్ హానర్’’ - 2018 అవార్డుకి ఎంపికయ్యారు.
- సమాధానం: 1
15. కోల్‌కతా ఓపెన్ ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ స్నూకర్ చాంపియన్‌షిప్ - 2018 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) పంకజ్ అద్వాని
2) ఆదిత్య మెహతా
3) బ్రిజేష్ దమని
4) లక్ష్మన్ రావత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆసియన్ గేమ్స్‌లో పతకం గెలుచుకున్న ఆదిత్య మెహతా కోల్‌కతా ఓపెన్ ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ స్నూకర్ చాంపియన్‌షిప్ - 2018ని గెలుచుకున్నాడు.
- సమాధానం: 2
16. ఈ కింది వాటిలోని ఏ రాష్ట్రం ఎలక్ట్రిక్ సిగరెట్లపై నిషేధం విధించింది ?
1) బిహార్
2) మహారాష్ట్ర
3) హరియాణా
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బిహార్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ సిగరెట్ల తయారీ, పంపిణీ, అమ్మకం, ప్రదర్శన, కొనుగోళ్లు, వినియోగంపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది.
- సమాధానం: 1
17. కేంద్ర మంత్రి హర్ష వర్దన్ ఇటీవల జాతికి అంకితం చేసిన భారత ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది ?
1) పార్త్
2) షార్
3) తపస్
4) ప్రత్యూష్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్ సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్‌ను 2018, జనవరి 8న ఆవిష్కరించింది. ఇది గరిష్టంగా 6.8 పెటాప్లాప్‌ల వేగంతో పనిచేయగలదు. పెటాప్లాప్ అంటే.. సెకనుకు 1000 ట్రిలియన్ ఆపరేషన్స చేసే సామర్థ్యం. ప్రత్యూష్‌ను వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి వినియోగించనున్నట్లు పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ తెలియజేసింది. తద్వారా ఇలా వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి సూపర్ కంప్యూటర్లను వినియోగించడంలో జపాన్, యూకే, యూఎస్ఏ తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచినట్లయింది.
- సమాధానం: 4
18. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఆర్ కే సూరి
2) కే శివన్
3) దినేశ్ శర్మ
4) కిరణ్ కుమార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇస్రోలో రాక్మాన్గా గుర్తింపు పొందిన కే శివన్.. ఇటీవల ఇస్రో కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. ఏ ఎస్ కిరణ్ కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
- సమాధానం: 2
19. గణతంత్ర దినోత్సవాలు- 2018 సందర్భంగా ఏ పదార్థంతో రూపొందించిన జాతీయ పతాకాన్ని వాడొద్దని పేర్కొంటు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది ?
1) ప్లాస్టిక్
2) నైలాన్ ఫాబ్రిక్
3) కాటన్
4) పేపర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాస్టిక్తో రూపొందించిన జాతీయ పతాకాన్ని వాడొద్దని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని సూచించింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 1
20. 2018లో భారత ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ?
1) 5.6 శాతం
2) 7.3 శాతం
3) 6.5 శాతం
4) 8.3 శాతం
- View Answer
- సమాధానం:2
వివరణ: 2018లో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ మేరకు గ్లోబల్ ఎకనిమిక్స్ ప్రాస్పెక్టస్- 2018 పేరుతో ఇటీవల నివేదికను విడుదల చేసింది.
- సమాధానం:2
21. ఇటీవల విడుదలైన బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వారు ఎవరు ?
1) లారీ పేజ్
2) మార్క్ జుకెర్ బర్గ్
3) జెఫ్ బెజోస్
4) బిల్ గేట్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తుల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తొలి స్థానంలో నిలిచాడు. 105.1 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్‌ను అధిగమించాడు.
- సమాధానం: 3
22. ఆధార్ గోప్యత, భద్రత కోసం యూఐడీ ఇటీవల ప్రవేశపెట్టిన తాత్కాలిక వర్చువల్ ఐడీలో ఎన్ని అంకెలు ఉంటారుు ?
1) 15
2) 20
3) 16
4) 18
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆధార్ గోప్యత, భద్రత కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల తాత్కాలిక వర్చువల్ ఐడీని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆధార్ ఇవ్వాల్సిన చోట 16 అంకెల తాత్కాలిక వర్చువల్ ఐడీని ఇస్తే చాలు. దీని వల్ల వినియోగదారుడి పూర్తి సమాచారం వెల్లడి కాదు.
- సమాధానం: 3
23. దేశంలోనే తొలిసారిగా బొగ్గు నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు ?
1) కర్ణాటక
2) ఒడిశా
3) పశ్చిమ బెంగాల్
4) రాజస్తాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోనే తొలిసారిగా ఒడిశా రాష్ట్రంలో బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నిర్మాణం, నిర్వహణ జరుగుతుంది.
- సమాధానం: 2
24. ప్రపంచంలోనే అతిపెద్దదైన 150 మెగావాట్ల అరోరా సోలార్ - థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏ దేశం ఏర్పాటు చేయనుంది ?
1) భారత్
2) చైనా
3) ఉత్తర కొరియా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచంలోనే అతి పెద్దదైన 150 మెగావాట్ల అరోరా సోలార్ - థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 509 మిలియన్ డాలర్ల వ్యయంతో సోలార్ రిజర్వ్ కంపెనీ ఈ ప్లాంట్‌ను నిర్మించనుంది.
- సమాధానం: 4
25. పీఎస్ఎల్వీ-సీ 40 ద్వారా ఇస్రో ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన 100వ ఉపగ్రహం ఏది ?
1) కార్టోశాట్ - 2 సీరీస్
2) కార్టోశాట్ - 1 సీరీస్
3) కార్టోశాట్ - 3 సీరీస్
4) కార్టోశాట్ - 4 సీరీస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇస్రో జనవరి 12న పీఎస్ఎల్వీ- సీ40 వాహన నౌక ద్వారా కార్టోశాట్ -2 సీరీస్ ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను విజయంతంగా నింగిలోకి పంపింది.
- సమాధానం: 1
26. దేశన్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టులో పాలన సరిగా లేదంటు మీడియా ముందుకు వచ్చిన నలుగురు న్యాయమూర్తులు ఎవరు ?
1) జస్టిస్ ఆర్ కే అగర్వాల్, అరుణ్ మిశ్రా, కురియన్ జోసెఫ్, ఆదర్శ్ కుమార్ గోయల్
2) జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డె, అర్జన్ కుమార్ సిక్రి, ఎన్వీ రమణ, రంజన్ గోగోరుు
3) జస్టిస్ మదన్ బి లోకూర్, కురియన్ జోసెఫ్, రంజన్ గోగోయి, జాస్తి చలమేశ్వర్
4) జస్టిస్ ఎన్వీ రమణ, ఆదర్శ్ కుమార్, మదన్ బి లోకూర్, కురియన్ జోసెఫ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, కురియన్ జోసెఫ్, రంజన్ గోగోయి, జాస్తి చలమేశ్వర్‌లు మీడియా ముందు వచ్చారు. సుప్రీంకోర్టులో పాలన సరిగా లేదని, ప్రజా స్వామ్యానికి ఇది మంచిది కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా.
- సమాధానం: 3
27. జనవరి 12న ఎవరి జయంతిని పురస్కరించుకొని జాతీయ యువతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు ?
1) చంద్రశేఖర్ ఆజాద్
2) స్వామి వివేకానంద
3) సర్దార్ వల్లభాయ్ పటేల్
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జనవరి 12న స్వామి వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని ఏటా ఆ రోజున జాతీయ యువతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇటీవల 22వ నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలి జాతీయ యువతా దినోత్సవాన్ని 1995లో భోపాల్‌లో నిర్వహించారు.
2018 Theme : Sankalp Se Siddhi
- సమాధానం: 2
28. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి నేరుగా నియమితులైన మహిళా న్యాయవాది ఎవరు ?
1) ఇందు మల్హోత్రా
2) సుజాతా వి మనోహర్
3) రుమా పాల్
4) గ్యాన్ సుధా మిశ్రా
- View Answer
- సమాధానం: 1
వివరణ: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాని నేరుగా అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. తద్వారా ఆమె సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైన ఏడో మహిళగా గుర్తింపు పొందారు.
- సమాధానం: 1
29. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో తొలి రెండు ధనిక రాష్ట్రాలు ఏవి ?
1) తెలంగాణ, కర్ణాటక
2) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
3) ఢిల్లీ, పంజాబ్
4) గుజరాత్, రాజస్తాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-NFHS 4 ప్రకారం దేశంలో తొలి రెండు ధనిక రాష్ట్రాలుగా ఢిల్లీ, పంజాబ్ నిలిచాయి. బిహార్ అత్యంత పేద రాష్ట్రంగా నిలిచింది. అత్యధిక సంపద కలిగిన కమ్యూనిటీగా జైనులు నిలిచారు.
- సమాధానం: 3
30. శ్రీలంకలోని కంకేసంథురాయ్ హార్బర్ అభివృద్ధి కోసం భారత్ ఎంత అదనపు ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించింది ?
1) 45.27 మిలియన్ డాలర్లు
2) 55.45 మిలియన్ డాలర్లు
3) 70 మిలియన్ డాలర్లు
4) 80 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: శ్రీలంకలోని కంకేసంథురాయ్ హార్బర్ అభివృద్ధి కోసం భారత్ 45.27 మిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో చేపట్టే నిర్మాణాలతో ఈ హార్బర్ పూర్తి స్థాయి కమిర్షియల్ పోర్ట్ గా అభివృద్ధి చెందుతుంది.
- సమాధానం: 1
31. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ మానుఫాక్చరింగ్ ఇండెక్స్ - 2018 ప్రకారం తొలి స్థానంలో నిలిచిన దేశం ?
1) జర్మనీ
2) జపాన్
3) దక్షిణ కొరియా
4) చైనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ తయారీ సూచీ-2018 ప్రకారం జపాన్‌లో మానుఫాక్చరింగ్ రంగంలో అత్యుత్తమ మౌలిక వ్యవస్థలు ఉన్నారుు. ఈ సూచీలో జపాన్ తొలి స్థానంలో ఉండగా దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలిచింది. జర్మనీ, స్విట్జర్లాండ్, చైనా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ 30వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 2
32. ఇటీవల భారత్‌లో పర్యటించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎవరు ?
1) రుుగల్ అల్లాన్
2) హెషమ్ కాండిల్
3) బెంజామిన్ నెతన్యాహూ
4) మోషె షారెట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు ఇటీవల ఆరు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సైబర్ భద్రత, గ్యాస్, ఆయిల్ తదితర రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. భారత్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2017 మే నెలలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు.
- సమాధానం: 3
33. ఢిల్లీలోని తీన్‌మూర్తి చౌక్‌ని ఇటీవల తీన్‌మూర్తి-హైఫాగా మార్చారు. ఫైఫా నగరం ఏ దేశంలో ఉంది ?
1) ఇజ్రాయెల్
2) జపాన్
3) అమెరికా
4) నేపాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: హైఫా నగరంలో ఇజ్రాయెల్‌లో ఉంది. ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఢిల్లీలోని తీన్‌మూర్తి చౌక్ మెమొరియల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చౌక్ పేరుని అధిరాకింగా తీన్‌మూర్తి-హైఫా చౌక్‌గా మార్చారు. ఇజ్రాయెల్ నగరం హైఫా విముక్తి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారతీయ సైనికులకు ఇరువురు నేతలు నివాళులర్పించారు.
- సమాధానం: 1
34. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికై న వారు ఎవరు ?
1) ఘంటా చక్రపాణి
2) ఉదయ్ భాస్కర్
3) కే అరుమొళి
4) శ్యామ్ భట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూపీఎస్సీ చైర్మన్ సమక్షంలో పీఎస్సీ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రెండోసారి ఎన్నికయ్యారు. గోవాలో ఇటీవల జరిగిన పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ 20వ జాతీయ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. చక్రపాణి.. ఈ పదవిలో మరో రెండేళ్లపాటు కొనసాగుతారు.
- సమాధానం: 1
35. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పు అయిన మహిళను, శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరు ఏమిటి ?
1) ఊయల
2) అమ్మ ఒడి
3) కేసీఆర్ కిట్
4) తల్లిబిడ్డ క్షేమం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పు అయిన మహిళను, శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి (102 సేవలు)ని ఇటీవల అన్ని జిల్లాలకు విస్తరించారు. 2016 డిసెంబర్ 28న రాష్ట్రంలో అమ్మ ఒడి సేవలను 12 జిల్లాల్లో ప్రారంభించారు.
- సమాధానం: 2
36. ఎంపీ ల్యాడ్స్ పథకాన్ని ఎప్పటి వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ?
1) 2018 మార్చి 31
2) 2019 ఏప్రిల్ 1
3) 2020 మార్చి 31
4) 2021 ఏప్రిల్ 1
- View Answer
- సమాధానం: 3
వివరణ: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్)ను 14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ముగిసే తేదీ అయిన 2020, మార్చి 31 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ. 11,850 కోట్లు వెచ్చించనున్నారు.
- సమాధానం: 3
37. గండికోట- చిత్రావతి ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది ?
1) నెల్లూరు
2) కడప
3) కర్నూలు
4) ప్రకాశం
- View Answer
- సమాధానం: 2
వివరణ: కడప జిల్లాలోని లింగాల మండలం పార్నపల్లెలో ఉన్న గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జాతికి అంకితం చేశారు.
- సమాధానం: 2
38. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ నగరంలో అంతర్జాతీయ పతంగుల పండుగని నిర్వహించింది ?
1) హైదరాబాద్
2) కరీంనగర్
3) నిజాబామాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం జనవరి 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ పతంగుల పండుగని నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ పర్యాటక శాఖ ఈ వేడుకను నిర్వహించింది.
- సమాధానం: 1
39. రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2017ని ఎవరికి ప్రకటించారు ?
1) గోరెటి వెంకన్న
2) సుంకిరెడ్డి నారాయణరెడ్డి
3) అల్లం నారాయణ
4) అంద్శై
- View Answer
- సమాధానం: 2
వివరణ: రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2017కు రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఎంపికయ్యారు. ఆయన రచించిన కవితా సంపుటి తావుకి గాను ఈ అవార్డు దక్కింది.
- సమాధానం: 2
40. చట్ట విరుద్ధంగా నివశిస్తున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకుంది ?
1) బ్రిటన్
2) చైనా
3) జపాన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 1
వివరణ: చట్ట విరుద్ధంగా బ్రిటన్‌లో నివశిస్తున్న భారతీయులను వెనక్కి తిప్పి పంపేయడానికి సంబంధించిన రెండు ఒప్పందాలపై భారత్-బ్రిటన్లు లండన్‌లో 2018, జనవరి 13న సంతకాలు చేశాయి. ఉభయ దేశాల మధ్య కుదిరిన రెండు అవగాహన ఒప్పందాలపై భారత హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, బ్రిటన్ ఇమిగ్రేషన్ వ్యవహారాల మంత్రి కెరోలిన్నోక్స్ సంతకాలు చేశారు.
- సమాధానం: 1
41. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో ఇటీవల కీలక సంస్కరణలు చేసిన కేంద్రం.. ఎయిరిండియాలో ఎంత శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించింది ?
1) 100 శాతం
2) 49 శాతం
3) 75 శాతం
4) 90 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో కీలక సంస్కరణలు చేసిన కేంద్రం.. రుణ సంక్షోభంలో కూరుకున్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో 49 శాతం దాకా ఎఫ్‌డీఐలకు అనుమతించింది. సింగిల్ బ్రాండ్ రీటైల్ రంగంలో ఆటోమేటిక్ విధానంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించింది.
- సమాధానం: 2
42. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 2017-18 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) హైదరాబాద్ హంటర్స్
2) బెంగళూరు బ్లాస్టర్స్
3) చెన్నై స్మాషర్స్
4) ముంబై రాకెట్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ మూడో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో హైదరాబాద్ 4-3 స్కోరుతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించి.. తొలిసారి పీబీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 1
43. కింది వారిలో ఎవరు ఫ్రాన్స్ అత్యున్నత కల్చరల్ పురస్కారానికి ఎంపికయ్యారు ?
1) దీపికా పడుకొన్
2) మిథాలీ రాజ్
3) ఐశ్వర్య టిప్నిస్
4) దీపికా మిశ్రా
- View Answer
- సమాధానం: 3
వివరణ: న్యూఢిల్లీకి చెందిన ఐశ్వర్య టిప్నిస్ ఫ్రాన్స్ అత్యున్నత కల్చరల్ పురస్కారానికి '' Chevalier de l'Ordre des Arts et Lettres'' ఎంపికైంది. కన్జర్వేటివ్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న ఐశ్వర్య.. ఇరుదేశాల మధ్య చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడంలో చేస్తున్న కృషికిగాను ఈ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 3
44. ఇటీవల ఏ దేశం వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు పౌరసత్వం మంజూరు చేసింది ?
1) బ్రిటన్
2) ఈక్వెడార్
3) ఆస్ట్రేలియా
4) స్వీడన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: వికీలిక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఈక్వెడార్ ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది. ఐదేండ్లుగా ఆయన లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలోనే తలదాచుకుంటున్నారు. లైంగికదాడి ఆరోపణలపై స్వీడన్లో కేసు నమోదుకాగా, అసాంజే అరెస్టుకు బ్రిటన్ ప్రయత్నిస్తున్నది. దీంతో ఈక్వెడార్ ఆయనకు 2012 నుంచి రాజకీయ ఆశ్రయం కల్పించింది.
- సమాధానం: 2
45. తొలి POI పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) విశాఖపట్నం
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారత పార్లమెంటేరియన్లతో నిర్వహించిన ‘పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఓ)’ తొలి సదస్సు జనవరి 9న న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 24 దేశాలకు చెందిన 134 మంది ప్రవాస భారతీయ ప్రజా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.
- సమాధానం: 1
46. డోప్ పరీక్షల్లో విఫలమైనందుకు గాను బీసీసీఐ నుంచి 5 నెలల నిషేధానికి గురైన భారత క్రికెటర్ ఎవరు ?
1) యూసఫ్ పఠాన్
2) ఇర్ఫాన్ పఠాన్
3) సూరేశ్ రైనా
4) ఆశిష్ నెహ్రా
- View Answer
- సమాధానం: 1
వివరణ: క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడి.. ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గతేడాది నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషిద్ధ ఉత్పేర్రకం ‘టెర్బుటలైన్’ తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలోని మెడిసిన్. అయితే దీన్ని యూసుఫ్ దగ్గుమందు ద్వారా తీసుకున్నాడు.
- సమాధానం: 1
47. టర్కీలో జరిగిన స్కీయింగ్ ఆల్ఫైన్ ఎజ్డర్ 3200 కప్‌లో కాంస్యం గెలిచి ఈ పోటీల్లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకాన్ని అందించిన అంచల్ ఠాకూర్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
1) అరుణాచల్ ప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) మణిపూర్
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అంచల్ ఠాకూర్.. స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించింది. టర్కీలో అంతర్జాతీయ స్కీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ఫైన్ ఎజ్డర్ 3200 కప్‌లో స్లాలోమ్ రేస్ విభాగంలో అంచల్ కాంస్య పతకం గెలిచింది.
- సమాధానం: 2
48. గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రం హై రిస్క్ ప్రెగ్నెన్సీ పోర్టల్‌ను ప్రారంభించింది ?
1) పంజాబ్
2) కేరళ
3) హరియాణా
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా హరియాణా రాష్ట్ర ప్రభుత్వం హై రిస్క్ ప్రెగ్నెన్సీ పోర్టల్(HRP)ని ప్రారంభించింది. సమస్యలను ముందుగానే గుర్తించి మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు 2017 నవంబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తుంది.
- సమాధానం: 3
49. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండో కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది ?
1) మిజోరం
2) గోవా
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII) రెండో కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. మొదటి FTII మహారాష్ట్రలోని పూణెలో ఉంది. FTII ప్రస్తుత చైర్మన్ అనుపమ్ ఖేర్.
- సమాధానం: 3
50. ఇండియన్ ఆర్మీ డేని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జనవరి 10
2) జనవరి 12
3) జనవరి 9
4) జనవరి 15
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 1949 జనవరి 15న జనరల్ సర్ ఫ్రాన్సిస్ బట్చర్ నుంచి ఫీల్డ్ మార్షల్ కోదండేరా ఎం కారియప్ప భారత ఆర్మీ తొలి కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేని నిర్వహిస్తారు.
- సమాధానం: 4