కరెంట్ అఫైర్స్ ( ఏప్రిల్ 23 - 30) బిట్ బ్యాంక్
1. టైమ్ మ్యాగజైన్ 100 అత్యుత్తమ ప్రభావశీలురైన నాయకుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నది ఎవరు ?
1) నరేంద్ర మోదీ
2) పోప్ ఫ్రాన్సిస్
3) మార్గట్ రాబి
4) డొనాల్డ్ ట్రంప్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆస్ట్రేలియా ప్రముఖ నటి మార్గట్ రాబి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. పోప్ ఫ్రాన్సిస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు శేఖర్ శర్మ ఈ జాబితాలో చోటు సంపాదించారు.
- సమాధానం: 3
2. ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది ?
1) గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్
2) కె.జి. వ్యాలి అథారిటీ
3) ఎన్ఎండీసీ
4) జీఎన్డీ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెరైక్టరేట్స్ సంస్థ 1991లో గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. దుబాయిలో జరిగిన 27వ ప్రపంచ కాంగ్రెస్ గ్లోబల్ కన్వెన్షన్‌లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
- సమాధానం: 1
3. చైనా ఇటీవల అంతరిక్షంలోకి పంపిన మానవ రహిత కార్గో నౌక?
1) లాంగ్ మార్చ్ - 3ఏ
2) తెంజ్వౌ - I
3) జియాంగ్ - 2డీ
4) వెన్ జిబావో - IB
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2022లోపు శాశ్వత అంతరిక్ష స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో చైనా ఈ వాహక నౌకను పంపింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా మాత్రమే అంతరిక్షంలో స్పేస్ స్టేషన్లు కలిగి ఉన్నాయి.
- సమాధానం: 2
4. ఉపగ్రహ ఆధారిత రియల్ టైమ్ గ్లోబల్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి ఎయిర్ లైన్స్ ఏది ?
1) ఇండియన్ ఎయిర్‌లైన్స్
2) గరుడ ఎయిర్‌లైన్స్
3) సింగపూర్ ఎయిర్‌లైన్స్
4) మలేషియన్ ఎయిర్‌లైన్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇరిడియమ్ అనే అమెరికా సంస్థ 72 సమాచార ఉపగ్రహాల ద్వారా విమానాల ట్రాకింగ్ వ్యవస్థను ప్రారంభించింది.
- సమాధానం: 4
5. జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 21
2) ఏప్రిల్ 22
3) ఏప్రిల్ 23
4) ఏప్రిల్ 25
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1947 ఏప్రిల్ 21న భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి బ్యాచ్ ఐఏఎస్‌లను ఉద్దేశించి ప్రసింగించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
6. నేపాల్ అధ్యక్షుడు ఎవరు ?
1) మహేంద్ర కొయిరాలా
2) రామ భరణ్ యాదవ్
3) బిద్యాదేవి భండారి
4) దేవేంద్ర సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఏప్రిల్ 17-21 వరకు భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా రూ. 5,700 కోట్ల విలువైన అరుణ్ - 3 ప్రాజెక్టు, ముజఫర్ పూర్ ధాల్క్బార్ హై ఓల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటు కోసం రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
- సమాధానం: 3
7. భారత్, ఇండోనేషియా ఎనర్జీ ఫోరమ్ తొలి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) బాలి
4) జకార్తా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ సమావేశంలో ఆయిల్ అండ్ గ్యాస్ అంశంపై ఇరు దేశాలు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
- సమాధానం: 4
8. పాకిస్తాన్‌కు చెందిన గ్వదార్ నౌకాశ్రయాన్ని 40 ఏళ్లపాటు లీజుకి తీసుకున్న దేశం ఏది ?
1) శ్రీలంక
2) చైనా
3) ఇండోనేషియా
4) ఖజకిస్తాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనా - పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా చైనా పాకిస్తాన్‌లోని గ్వదార్ పోర్టుని అభివృద్ధి పరిచి 40 ఏళ్ల పాటు లీజుకి తీసుకుంది.
- సమాధానం: 2
9. మార్కెట్ విలువ ప్రకారం భారత్‌లో అత్యంత విలువ కలిగిన ప్రైవేటు కంపెనీ ఏది ?
1) టాటా గ్రూప్
2) రిలయన్స్ ఇండస్ట్రీస్
3) హిందూస్తాన్ యూనిలీవర్
4) ఎయిర్టెల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ రూ. 4,60,291 కోట్లు.
- సమాధానం: 2
10. కేంద్ర ప్రభుత్వం నాల్కో సంస్థలో ఎంత శాతం షేర్లను బహిరంగ మార్కెట్లో అమ్మనుంది ?
1) 30.09 శాతం
2) 28 శాతం
3) 23 శాతం
4) 92 శాతం
- View Answer
- సమాధానం: 4
వివరణ: జాతీయ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ( NALCO ) కు చెందిన 92 శాతం షేర్లను అమ్మడం ద్వారా ప్రభుత్వం రూ.1,200 కోట్ల నిధులను సేకరించనుంది.
- సమాధానం: 4
11. ఈ కింది వారిలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న వారు ఎవరు ?
1) డా. రాజేంద్ర ముఖర్జీ
2) నారిమన్
3) డా. భక్తియాదవ్
4) డా. విజేంద్ర
- View Answer
- సమాధానం: 3
వివరణ: గైనకాలజిస్ట్ డాక్టర్ భక్తి యాదవ్ (91) గత 68 ఏళ్లుగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఆయనని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
- సమాధానం: 3
12. గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అవార్డ్స్ - 2017లో అత్యుత్తమ ప్రతిభ విభాగంలో పురస్కారానికి ఎంపికైంది ఎవరు ?
1) అదితి అశోక్
2) ఎస్ఎస్పీ చౌరాసియా
3) ఆలిషేర్
4) రాధాసింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ అవార్డుల్లో అత్యుత్తమ ప్రతిభ విభాగంలో అదితి అశోక్, ఈ ఏటి మేటి పురుష క్రీడాకారుడు విభాగంలో ఎస్ఎస్పీ చౌరాసియా, గోల్ఫ్ కీపర్ ఉత్తమ ప్రదర్శన విభాగంలో ఆలిషేర్ అవార్డులకు ఎంపికయ్యారు.
- సమాధానం: 1
13. 80వ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డుల్లో జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైంది ఎవరు ?
1) ఆశిష్ విద్యార్థి
2) రితుపర్ణ సేన్ గుప్తా
3) ప్రొనెన్ చటర్జీ
4) మౌషుమి చటర్జీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: మౌషుమి చటర్జీ హిందీ, బెంగాలీ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.
- సమాధానం: 4
14. ప్రతిష్టాత్మక లెల్ట్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది ?
1) ఎన్ఎండీసీ
2) ఎయిర్ ఐజ్వాల్
3) డిడి యాదగిరి
4) డిడి సప్తగిరి
- View Answer
- సమాధానం: 2
వివరణ: మిజోరంలోని ప్రముఖ మ్యాగజైన్ లెల్ట్ ఏటా ప్రతిభగల వ్యక్తులను, మిజోరం సమగ్రాభివృద్ధికి కృషి చేసిన వారికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ సంవత్సరం ఎయిర్ ఐజ్వాల్ అవార్డుకి ఎంపికైంది.
- సమాధానం: 2
15. ఏ క్రీడను 2018 ఆసియా క్రీడల నుంచి తొలగించారు ?
1) క్రికెట్
2) సామ్బూ
3) సర్ఫింగ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2018 ఆసియా క్రీడలు ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబంగ్‌లో జరగుతాయి. ఈ క్రీడల నుంచి క్రికెట్, సామ్బూ, సర్ఫింగ్, స్టేక్బోర్డ్లను తొలగించారు. మొత్తం ఈవె ంట్లను 493 నుంచి 431కి తగ్గించారు.
- సమాధానం: 4
16. అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 22
2) ఏప్రిల్ 20
3) ఏప్రిల్ 15
4) ఏప్రిల్ 10
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఏటా ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1969లో యునెస్కో నిర్వహించిన వాతావరణ సదస్సులోజాన్మెక్ కొన్నెల్ ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా 1971 నుంచి ఏటా ఏప్రిల్ 22న అంతర్జాతీయ భూమి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 1
17. ఇటీవల థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా మూసివేసిన దేశం ఏది ?
1) భారత్
2) జర్మనీ
3) బ్రిటన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 3
వివరణ: పారిశ్రామికీకరణ మొదలైన నాటి నుంచి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఆధారపడిన బ్రిటన్.. పర్యావరణ పరిరక్షణ కోసం 2017 ఏప్రిల్ 20 నాటికి దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలను సహజవాయువు కేంద్రాలుగా మార్చింది.
- సమాధానం: 3
18. క్యూబా ఇటీవల ఏ దేశంతో దౌత్య సంబంధాలు ప్రారంభించింది ?
1) మొనాకో
2) మొరాకో
3) బ్రిటన్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1963లో అల్జీరియా - మొరాకో వివాదంలో.. క్యూబా అల్జీరియాకు అండగా నిలిచింది. అనంతరం 1970లో క్యూబా పశ్చిమ సహారా స్వాతంత్య్రాన్ని గుర్తించింది. దీంతో క్యూబా - మొరాకో దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్లీ 37 సంవత్సరాల తర్వాత రెండు దేశాలు పరస్పర అంగీకారంతో దౌత్య సంబంధాలు ప్రారంభించాయి.
- సమాధానం: 2
19. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఏ దేశానికి ఎక్కువ సంపద తరలుతుంది?
1) చైనా
2) బ్రిటన్
3) ఆస్ట్రేలియా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: వలస, అభివృద్ధి పేరుతో ప్రపంచ బ్యాంకు ఇటీవల నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ దేశాల నుంచి భారత్‌లోకి వస్తున్న సంపద 62.7 బిలియన్ డాలర్లు (2016). భారత్ తర్వాతి స్థానాల్లో చైనా, ఫిలిప్పైన్స్, మెక్సికోలు ఉన్నాయి.
- సమాధానం: 4
20. ఈ కింది వాటిలో కృషి కర్మాన్ పురస్కారం 2015-16కు ఎంపికైన రాష్ట్రం ఏది ?
1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) తెలంగాణ
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 1
వివరణ: గోధుమల దిగుబడిలో గణనీయమైన వృద్ధి సాధించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ను కృషి కర్మాన్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆ రాష్ట్రం ఈ పురస్కారం గెలుచుకోవడం వరుసగా 5వసారి. కృషి కర్మాన్ పురస్కారాన్ని 2010-11లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది.
- సమాధానం: 1
21. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) పుల్లెల గోపీచంద్
2) హిమంత బిస్వాశర్మ
3) షారంజన్
4) శ్రీజన్ మండల్
- View Answer
- సమాధానం: 2
22. మానవ రోగ నిరోధక శక్తి వ్యవస్థలో నూతన రక్త కణాలను కనుగొన్నది ఎవరు ?
1) ప్రొ. మెక్ డేవిడ్
2) ప్రొ. రామ్స్లిజేట్
3) ప్రొ. రాంజే నలిన్
4) రాహుల్ సాతిజా
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత సంతతికి చెందిన రాహుల్ సాతిజా (న్యూయార్క్ యూనివర్సిటీ), కార్తీక్ శేఖర్(బోర్డ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఎమ్ఐటీ) కలిసి మానవ రోగ నిరోధక వ్యవస్థలో నూతన రక్తకణాలు (Dendritic cells)ను కనుగొన్నారు.
- సమాధానం: 4
23. ప్రపంచ పుస్తక, కాపీరైట్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 30
2) ఏప్రిల్ 27
3) ఏప్రిల్ 25
4) ఏప్రిల్ 23
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1995లో జరిగిన యునెస్కో సాధారణ సమావేశంలో ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక, కాపీరైట్ దినోత్సవాన్ని నిర్వహించాలనితీర్మానం చేశారు. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 4
24. ఇటీవల ట్రాన్స్జెండర్ల కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో హిజ్రా ట్రాన్స్జండర్ల సంక్షేమ బోర్డుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ తరహా బోర్డుని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు గతంలోనే ఏర్పాటు చేశాయి.
- సమాధానం: 3
25. ఆసియాలో అతిపెద్ద చర్చ్ ఏది ?
1) ది సుమి బాప్టిస్ట్ చర్చ్, జున్హెబొటొ
2) సెయింట్ కేథెడ్రల్
3) సెయింట్ జోన్ చర్చ్
4) సెయింట్ ఆన్చ్ చర్చ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నాగాలాండ్‌లో రూ.36 కోట్ల వ్యయంతో ది సుమి బాప్టిస్ట్ చర్చ్ జున్హెబొటొను నిర్మించారు. ఈ నిర్మాణం పూర్తికావడానికి 10 ఏళ్లు పట్టింది. ఈ చర్చిలో ఒకేసారి 8,500 మంది ప్రార్థనలు చేయవచ్చు.
- సమాధానం: 1
26. ప్రపంచంలో సైన్యంపై ఎక్కువ ఖర్చుపెడుతున్న దేశం ఏది ?
1) చైనా
2) రష్యా
3) అమెరికా
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (SIPRI) సంస్థ నిర్వహించిన ప్రపంచ మిలటరీ వ్యయం సర్వే - 2016లో అన్ని దేశాలు కలిపి 1,686 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయని తేలింది. ఇందులో 611 బిలియన్ డాలర్ల వ్యయంతో అమెరికా తొలి స్థానంలో ఉండగా 215 బిలియన్ డాలర్ల వ్యయంతో చైనా రెండో స్థానంలో ఉంది. 3వ స్థానంలో రష్యా 69.2 బిలియన్ డాలర్లు, 4వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా 63.7 బిలియన్ డాలర్లు సైన్యంపై ఖర్చు చేస్తున్నాయి. ఈ నివేదికలో 5వ స్థానంలో భారత్ మిలటరీపై 55.9 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది.
- సమాధానం: 3
27. అంతరిక్షంలో ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేసి రికార్డ్ నెలకొల్పిన వ్యోమగామి ఎవరు ?
1) సునీతా విలియమ్స్
2) జెఫ్ విలియమ్స్
3) పెగ్గి విట్సన్
4) అండా గాడ్రిన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంతరిక్షంలో 534 రోజుల పాటున్న జెఫ్ విలియమ్స్ రికార్డుని పెగ్గి విట్సన్ ఇటీవల అధిగమించారు. ఆమె 2017 సెప్టెంబర్ వరకు స్పేస్‌లో ఉండనున్నారు.
- సమాధానం: 3
28. ప్రపంచంలో అతి ఎక్కువ ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) జపాన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచంలో అతి ఎక్కువ ఎల్పీజీ దిగుమతి దారు చైనా. ఈ విషయంలో ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న జపాన్ ఎల్పీజీ స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనపై దృష్టి సారించింది. దీంతో ఎల్పీజీ దిగుమతిలో మూడో స్థానంలో ఉన్న భారత్ రెండో స్థానానికి చేరింది. 2016-17లో భారత్ 11 మిలియన్ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంది.
- సమాధానం: 2
29. భారత్ నుంచి తొలిసారి మామిడి పండ్లను దిగుమతి చేసుకున్న దేశం ఏది ?
1) కెనడా
2) స్వీడన్
3) రష్యా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
30. భారత్ ఇటీవల ఏ దేశం నుంచి దిగుమతి అవుతున్న రసాయనాలపై యాంటి డంపింగ్ డ్యూటీని విధించింది ?
1) థాయ్‌ల్యాండ్
2) మలేషియా
3) జపాన్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫోమ్ పరిశ్రమలో వాడే రసాయనాలు థాయ్‌ల్యాండ్ నుంచి చౌకగా దిగుమతి అవుతుండట దేశీయ పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. దీంతో దేశంలోని పరిశ్రమలను రక్షించేందుకు భారత్ ఒక టన్నుకు 135.40 డాలర్ల యాంటి డంపింగ్ డ్యూటిని విధించింది.
- సమాధానం: 1
31. ప్రతిష్టాత్మక గోల్డ్‌మన్ పర్యావరణ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) రామ్ కుమార్ లోహియా
2) ఎరిన్ బ్రోకవిచ్
3) ప్రఫుల్ల సమంతర
4) మనేకా గాంధి
- View Answer
- సమాధానం: 3
వివరణ: గోల్డ్‌మన్ పర్యావరణ పురస్కారాన్ని గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు. ఒడిశాలోని నియమ్‌గిరి కొండల ప్రాంతంలో డోగ్రీఖోండ్ తెగకు చెందిన గిరిజన ప్రజలు నివశిస్తున్నారు. ఈ ప్రాంతంలో అపారంగా ఉన్న బాక్సైట్ నిలువలను తవ్వేందుకు ఒడిశా ప్రభుత్వం వేదాంత కంపెనీకి అనుమతులు ఇచ్చింది. ఇక్కడ గనుల తవ్వకాలు చేపడితే పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని.. గిరిజన ప్రజలు భూములు కోల్పోతారంటూ ప్రఫుల్ల సమంతర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని చేపట్టారు. గోల్డ్‌మన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఆయన పోరాటాన్ని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
- సమాధానం: 3
32. ప్రతిష్టాత్మక పి.సి. చంద్ర పురస్కారం - 2017కు ఎంపికైంది ఎవరు ?
1) థెరిసా మే
2) కైలాష్ సత్యార్థి
3) అన్నా హజారే
4) మానసి ప్రధాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మానవతావాది పి.సి. చంద్ర గౌరవర్థం పీసీ చంద్రగ్రూప్ 1993లో ఈ అవార్డుని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం కింద రూ. 10 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందిస్తారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
- సమాధానం: 1
33. 41వ హాంకాంగ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన సినిమా ఏది ?
1) సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్
2) ఎమ్ఎస్ ధోని, ది అన్‌టోల్డ్ స్టోరీ
3) రామనుజన్
4) న్యూటన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: హాంకాంగ్ అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని 1976లో ప్రారంభించారు. అమిత్ మాస్కుర్ దర్శకత్వం వహించిన హిందీ హాస్య చిత్రం న్యూటన్ ఉత్తమ సినిమా పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 4
34. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) దినేశ్ పటేల్
2) మ్రిదుల్ గె హ్లాట్
3) ఐస్ ఇస్రాని
4) అనూప్ తివారి
- View Answer
- సమాధానం: 2
35. మోంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) రాఫెల్ నాదల్
2) ఆల్బర్ట్ వినోలస్
3) ఫెలిసియానో లోపెజ్
4) రోహన్ బోపన్న
- View Answer
- సమాధానం: 1
వివరణ: మొనాకాలో జరిగిన మోంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆల్బర్ట్ వినోలస్ను ఓడించి రాఫెల్ నాదల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో ఫెలిసియానో లోపెజ్, మార్క్ లోపెజ్ ఓడించి రోహన్ బోపన్న, పాబ్లొ క్వెవాస్ టైటిల్ విజేతగా నిలిచారు.
- సమాధానం: 1
36. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 30
2) ఏప్రిల్ 27
3) ఏప్రిల్ 24
4) ఏప్రిల్ 21
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1992 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. దీనికి గుర్తుగా ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 3
37. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 10
2) ఏప్రిల్ 15
3) ఏప్రిల్ 20
4) ఏప్రిల్ 25
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2007 మే నెలలో నిర్వహించిన 60వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించారు. ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాల ద్వారా దోమల నివారణ, మలేరియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.
2017 థీమ్ : End Malaria for goal
- సమాధానం: 4
38. ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 30
2) ఏప్రిల్ 26
3) ఏప్రిల్ 23
4) ఏప్రిల్ 20
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2017 థీమ్ : Innovation - Improving lives
- సమాధానం: 2
39. ప్రపంచ ఇమ్యూనైజేషన్ వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 24 - 30
2) మే 1 - 7
3) మే 8 - 6
4) మే 24 - 30
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ వారోత్సవాల్లో భాగంగా వ్యాధి నిరోధక టీకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.
- సమాధానం: 1
40. భారత్‌లో తొలి సముద్ర రోప్ వేను ఏ ప్రాంతాల మధ్య నిర్మించనున్నారు ?
1) పూరి - చిల్కా సరస్సు
2) కాకినాడ - కొరంగి మడ అడవులు
3) ముంబయి - ఎలిఫెంటా దీవి
4) పిరమ్బెట్ దీవి - గుండి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ముంబయి పోర్టు ట్రస్ట్ దేశంలో తొలి మరియు అతి పొడవైన సముద్ర రోప్ వేను ముంబయి - ఎలిఫెంటా మధ్య నిర్మించనున్నట్లు ప్రకటించింది.
- సమాధానం: 3
41. దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్ర విశ్వవిద్యాలాయన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?
1) ఛత్తీస్‌గఢ్
2) బిహార్
3) ఒడిశా
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
42. భారతీయ రైల్వే ఇటీవల ఏ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ?
1) సూరత్
2) భిలాయి
3) నాగ్‌పూర్
4) సంభాల్పూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయిలో రూ.200 కోట్ల వ్యయంతో భారతీయ రైల్వే సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఈ ప్లాంట్‌ను నిర్మిస్తుంది.
- సమాధానం: 2
43. భారత్ ఇటీవల ఏ దేశంతో కలిసి సంయుక్త నౌక విన్యాసాలు నిర్వహించింది ?
1) బ్రిటన్
2) ఫ్రాన్స్
3) కెనడా
4) చైనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: వరుణ పేరుతో మధ్యదరా సముద్రంలో భారత్ - ఫ్రాన్స్ సంయుక్తంగా నౌక విన్యాసాలు నిర్వహించాయి.
- సమాధానం: 2
44. అరక్ హేవి వాటర్ రియాక్టర్‌ను ఇరాన్ ఏ దేశంతో కలిసి పునర్ నిర్మించనుంది ?
1)చైనా
2) జర్మనీ
3) కెనడా
4) భారత్
- View Answer
- సమాధానం: 1
45. 24వ అరేబియన్ ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) దుబాయి
2) షార్జా
3) సనా
4) రియాద్
- View Answer
- సమాధానం: 1
46. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) దాసరి నారాయణరావు
2) శివాజి గణేశన్
3) కాశినాథుని విశ్వనాథ్
4) రజనీకాంత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: చిత్ర రంగానికి అందించిన సేవలకు గాను నటుడు, దర్శకుడు కె.విశ్వనాథ్ 48వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. ఇది సినిమా రంగంలో ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం.
- సమాధానం: 3
47. ఈశాన్య రాష్ట్రంలో అతిపెద్ద ఐటీ హబ్‌ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) ఐజ్వాల్
2) అగర్తాలా
3) ఇంఫాల్
4) గ్యాంగ్‌టక్
- View Answer
- సమాధానం: 2
వివరణ: త్రిపుర రాజధాని అగర్తాలలో రూ.50 కోట్ల వ్యయంతో ఐటీహబ్‌ను నిర్మించారు. దీనిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రారంభించారు.
- సమాధానం: 2
48. ప్రపంచ మాస్టర్స్ క్రీడల్లో 100 మీటర్స్ స్ప్రింట్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) మన్‌కౌర్
2) రిచర్డ్ లీ
3) టోని బౌమన్
4) వెస్ట్ హమ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆక్‌ల్యాండ్‌లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్ (పరుగు పందెం)లో భారత్ కు చెందిన 101 ఏళ్ల మన్‌కౌర్ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
- సమాధానం: 1
49. మార్లేబోన్ క్రికెట్ క్లబ్లో గౌరవ జీవితకాల సభ్యత్వం పొందిన భారత మహిళా క్రికెటర్ ఎవరు ?
1) మిథాలీ రాజ్
2) సుజీ బేట్స్
3) హైడే టిఫైన్
4) సంధ్య అగర్వాల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సంధ్య అగర్వాల్ భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. ఆమె (1984-1995) కెరీర్లో 13 టెస్ట్‌లు, 21 వన్డే మ్యాచ్‌లు ఆడారు. బీసీసీఐ తరపున మహిళల క్రికెట్ జట్టుకి కోచ్‌గానూ వ్యవహరించారు.
- సమాధానం: 4
50. ఆసియా గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ షాట్‌పుట్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించింది ఎవరు ?
1) నీరజ్ చోప్రా
2) మన్‌ప్రీత్ కౌర్
3) తింటూ లుక
4) డ్యూట్ చాంద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆసియా గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ పోటీలు చైనాలోని జున్హులో జరిగాయి. ఈ పోటీల్లో షాట్‌పుట్‌ను 18.86 మీ విసిరి మన్ ప్రీత్‌కౌర్ పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయంతో ఆమె ప్రపంచ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫై అయ్యింది.
- సమాధానం: 2