కరెంట్ అఫైర్స్ (ఏప్రిల్ 23 - 30) బిట్ బ్యాంక్
1. ఎన్టీఆర్ క్యాన్సర్ కేర్ ట్రస్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని జిల్లాల్లో అందుబాటులోకి తెస్తున్నట్టుఇటీవల ప్రకటించింది?
1) 13
2) 4
3) 9
4) 10
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రంలోని 13 జిల్లాలో క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వైద్య సేవలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు టాటా ట్రస్ట్ సహకారం అందిస్తోంది.
- సమాధానం: 1
2. ‘ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం’అమలులో దేశవ్యాప్తంగా తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం మాతృత్వ వందన యోజన పథకం’ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లీబిడ్డ చల్లగా’ అని మార్చింది. ఈ పథకానికి 60 శాతం నిధులు కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్రం భరిస్తుంది. గర్భవతులకు పౌష్ఠికాహారం కోసం రూ.6,000 మొత్తాన్ని అందిస్తారు. పథకం అమలులో దేశవ్యాప్తంగా ఏపీ తొలిస్థానంలో ఉంది.
- సమాధానం: 2
3. తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం - 2018కి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయితీలు ఉన్నట్టు గుర్తించింది ?
1) 12,751
2) 11,250
3) 10,000
4) 20,000
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం - 2018ను అనుసరించి రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 844 గ్రామ పంచాయితీలు, మేడ్చల్ జిల్లాలో అత్యల్పంగా 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
- సమాధానం: 1
4. జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 23
2) ఏప్రిల్ 24
3) ఏప్రిల్ 25
4) ఏప్రిల్ 26
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2010 నుంచి ఏటా ఏప్రిల్ 24న పంచాయితీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 2018 పంచాయితీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్‌ను ప్రారంభించారు.
- సమాధానం: 2
5. న్యాయవాద వృత్తిలో ఉంటూ నేరుగా సుప్రీం కోర్టు జడ్జి అయిన తొలి మహిళా న్యాయవాది ఎవరు ?
1) ఇందు మల్హోత్రా
2) రచనా రెడ్డి
3) మీనాక్షి లేఖి
4) కరుణా నుండి
- View Answer
- సమాధానం: 1
వివరణ: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా ఇటీవల సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో న్యాయవాద వృత్తిలో ఉంటూ నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.
- సమాధానం: 1
6. ఏ రాష్ట్రంలో భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) కేంద్ర ప్రభుత్వం ఇటీవల పూర్తిగా ఎత్తివేసింది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) మేఘాలయ
3) సిక్కిం
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మేఘాలయలో భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పూర్తిగా ఎత్తివేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో పాక్షికంగా తొలగించింది. భద్రతా దళాల ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎవరినైనా, ఎక్కడైనా, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేసే వీలు ఈ చట్టం ద్వారా కలుగుతుంది.
- సమాధానం: 2
7. కింది వాటిలో ఏ దేశంలో 35 ఏళ్ల నిషేధం తర్వాత ఇటీవల తిరిగి సినిమా థియేటర్లను ప్రారంభించారు ?
1) పాకిస్థాన్
2) ఆఫ్గనిస్థాన్
3) సిరియా
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సౌదీ అరేబియాలో 35 ఏళ్ల సుదీర్ఘ నిషేధం తర్వాత మొదటి సినిమా థియేటర్‌ను ఇటీవల తిరిగి ప్రారంభించారు. ఆ దేశ రాజధాని రియాద్‌లో ఈ థియేటర్‌ను ప్రారంభించారు. మొదటిగా బ్లాక్ పాంథర్ చిత్రాన్ని ప్రదర్శించారు.
- సమాధానం: 4
8. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ రుణ భారం ఎంత ?
1) 100 ట్రిలియన్ డాలర్లు
2) 125 ట్రిలియన్ డాలర్లు
3) 164 ట్రిలియన్ డాలర్లు
4) 200 ట్రిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ రుణ భారాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇటీవల నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2016 నాటికి ప్రపంచ రుణ భారం 164 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ జీడీపీతో పోలిస్తే ఇది 225 శాతం అధికమని ఐఎంఎఫ్ వెల్లడించింది.
- సమాధానం: 3
9. ప్రతిష్టాత్మక డోరిన్ మార్గరెట్ మాప్లర్ అవార్డుని ఈ కింది వాటిలోని ఏ సంస్థ అందిస్తోంది ?
1) ఇక్రిశాట్
2) ఇస్రో
3) నాసా
4) సీసీఎంబీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రతిష్టాత్మక డోరీన్ మార్గరెట్ మాప్లర్ పురస్కారాన్ని ఏటా ఇక్రిశాట్ ప్రకటిస్తుంది. పంటల పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తోంది. 2018 సంవత్సరానికి మమతా శర్మ, పూజా భట్నాగర్‌లకు ఈ అవార్డు ప్రకటించింది. తెగుళ్లను తట్టుకునే అధునాతన వంగడాల అభివృద్ధి, ఫంగస్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా అడ్డుకునేందుకు చేసిన పరిశోధనలకు గాను వారికి ఈ అవార్డులు దక్కాయి.
- సమాధానం: 1
10. ఇటీవల వార్తల్లో నిలిచిన మూన్ జే ఇన్ ఏ దేశ అధ్యక్షుడు?
1) ఉత్తర కొరియా
2) దక్షిణ కొరియా
3) జపాన్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: మూన్ జే ఇన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు. ఇటీవల ఆయన ఉత్తర కొరియాతో శాంతి చర్చల కోసం ఆ దేశానికి వెళ్లారు. తద్వారా 65 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. ఇందులో భాగంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తో ఆయన చర్చలు జరిపారు. కొరియా ద్వీపాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడమే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యమని రెండు దేశాల అధ్యక్షులు ఈ సందర్భంగా ప్రకటించారు.
- సమాధానం: 2
11. దాదాపు 150 ప్రభుత్వ సర్వీసులను స్మార్ట్‌ఫోన్ ద్వారానే పొందేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యాప్ ఏది?
1) టీయాప్ ఫోలియో
2) టీ యాప్ సేవ
3) టీ మీ సేవ
4) టీ ఎం సర్వీసెస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టీ యాప్ ఫోలియోను ప్రారంభించింది. దీని ద్వారా మీ సేవకు వెళ్లకుండా దాదాపు 150 ప్రభుత్వ సేవలను స్మార్ట్ ఫోన్ ద్వారానే పొందవచ్చు. ఇందుకోసం యాప్‌తో ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలి.
- సమాధానం: 1
12. కింది వాటిలో ఏ రాష్ట్రం ఇటీవల ఈ - పంచాయితీ అవార్డు దక్కించుకుంది ?
1) బిహార్
2) మధ్యప్రదేశ్
3) తెలంగాణ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఏప్రిల్ 24న జరిగిన పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ - పంచాయితీ అవార్డులు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డుని దక్కించుకుంది. పంచాయితీరాజ్ శాఖలోని పలు పథకాలకు వెబ్ సైట్లను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరచడంలో మొదటి స్థానంలో నిలిచినందుకు గాను రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది.
- సమాధానం: 3
13. దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతగా ఇటీవల రికార్డు సృష్టించిన వారు ఎవరు ?
1) నారా చంద్రబాబు నాయుడు
2) నితీశ్ కుమార్
3) పవన్ చామ్లింగ్
4) శివరాజ్ పాటిల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ దేశంలో సుదీర్ఘ కాలం సీఎం పదవిలో ఉన్న నేతగా ఇటీవల రికార్డు సృష్టించారు. 2018, ఏప్రిల్ 29 నాటికి చామ్లింగ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి 23 ఏళ్ల 4 నెలల 17 రోజులు పూర్తయ్యాయి. ఇది జ్యోతిబసు పదవీకాలం కంటే ఒక రోజు ఎక్కువ. జ్యోతిబసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా 23 ఏళ్ల 4 నెలల 16 రోజులు ఉన్నారు.
- సమాధానం: 3
14. సరస్వతీ సమ్మాన్ - 2017 పురస్కారానికి ఇటీవల ఎవరిని ఎంపిక చేశారు ?
1) సీతాన్షు యశశ్చంద్ర
2) వినతి భోలా
3) మేఘా రావ్
4) మేఘా శర్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర సరస్వతీ సమ్మాన్ - 2017 పురస్కారానికి ఎంపికయ్యారు. 2009లో ప్రచురితమైన వాఖర్ అనే కవితా సంకలనానికిగాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది. కేకే బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డుని అందిస్తుంది.
- సమాధానం: 1
15. ఇటీవల కన్నుమూసిన బలాంత్రపు రజనీకాంతరావు ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు ?
1) పాత్రికేయం
2) రాజకీయం
3) సంగీతం
4) వ్యాపారం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలాంత్రపు రజనీకాంతరావు ఇటీవల విజయవాడలో కన్నుమూశారు. ఆయన 1978లో విజయవాడ ఆకాశవాణి కేంద్ర సంచాలకుడిగా పదవీ విరమణ చేశారు. జేజిమామయ్య పేరుతో బాలల కోసం ఆయన ఎన్నో రచనలు చేశారు. 1961లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 2007లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్నారు.
- సమాధానం: 3
16. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎవరిని నియమించింది ?
1) మండలి బుద్ధప్రసాద్
2) కె.రాఘవేంద్రరావు
3) రమణ దీక్షితులు
4) తనికెళ్ల భరణి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) చైర్మన్ గా ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఆయన ఏప్రిల్ 23న బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 2
17. ఇటీవల ఏ రాష్ట్రంలోని రైతులు స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాశారు ?
1) రాజస్థాన్
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: గుజరాత్‌లోని భావ్నగర్జిల్లాలోని 12 గ్రామాలకు చెందిన 5,259 మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి, ప్రధానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు తమ పొలాలను బలవంతంగా కట్టబెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
- సమాధానం: 4
18. భారత్‌లోని ఏ నగరంలో 2019లో అంతర్జాతీయ విత్తన సదస్సు జరగనుంది ?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) అమరావతి
4) జైపూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2019 జూన్ 23 నుంచి జూలై 3 వరకు అంతర్జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్ వేదికగా జరుగనుంది. ఆసియా ఖండంలోనే 95 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో మొదటిసారిగా ఈ సదస్సు జరగనుంది. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించనున్నారుు.
- సమాధానం: 2
19. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో తెలంగాణ నుంచి ఏ ఆలయాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కు దత్తత ఇవ్వనున్నట్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించింది ?
1) యాదాద్రి ఆలయం
2) రాజరాజేశ్వర ఆలయం
3) కొమురెల్లి మల్లన్న ఆలయం
4) రామప్ప ఆలయం
- View Answer
- సమాధానం: 4
వివరణ: అడాప్ట్ హెరిటేజ్ - వారసత్వ కట్టడాల దత్తత పథకంలో భాగంగా తెలంగాణ నుంచి హన్మకొండలోని రామప్ప ఆలయాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్టుకు దత్తత ఇచ్చేందుకు అంగీకరించినట్టు ఏఎస్ఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న పురాతన కట్టడాలు, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వాటి సంరక్షణకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, పర్యాటక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ‘అడాప్ట్హెరిటేజ్’ పథకాన్ని 2017లో ప్రారంభించాయి.
- సమాధానం: 4
20. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్ 11 నాటికి దేశవ్యాప్తంగా జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తం ఎంత ?
1) రూ.70 వేల కోట్లు
2) రూ.60 వేల కోట్లు
3) రూ.80,545.70 కోట్లు
4) రూ.90,755.60 కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్ 11 నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఉన్న జన్ ధన్ ఖాతాల్లో మొత్తం రూ.80,545.70 కోట్లు ఉన్నాయి. 2017 మార్చి నుంచి డిపాజిట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
- సమాధానం: 3
21. ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఇతర దేశాల నుంచి స్వదేశాలకు సొమ్ము పంపుతున్న వారి జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది ?
1) భారత్
2) చైనా
3) ఫిలిప్పీన్‌స
4) మెక్సికో
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇతర దేశాల నుంచి స్వదేశాలకు సొమ్ము పంపుతున్న వారికి సంబంధించిన దేశాల జాబితాను ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఇందులో 69 బిలియన్ డాలర్లతో భారత్ తొలి స్థానంలో నిలవగా, 64 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 33 బిలియన్ డాలర్లతో ఫిలిప్పీన్స్ మూడో స్థానంలో, 31 బిలియన్ డాలర్లతో మెక్సికో నాలుగో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 1
22. దక్షిణ ఆసియా జూడో చాంపియన్‌షిప్ - 2018 టైటిల్‌ను ఏ దేశ జట్టు గెలుచుకుంది ?
1) పాకిస్థాన్
2) నేపాల్
3) బంగ్లాదేశ్
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: నేపాల్‌లో జరిగిన దక్షిణ ఆసియా జూడో చాంపియన్షిప్ని భారత జట్టు గెలుచుకుంది. పురుషుల విభాగంలో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్‌ని గెలుచుకోగా, మహిళల విభాగంలో భారత జట్టు నేపాల్‌ని ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది.
- సమాధానం: 4
23. రామ్సార్ ప్రాంతంగా త్వరలో గుర్తింపబడనున్న సుందర్బన్ రిజర్వు ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) తెలంగాణ
2) ఒడిశా
3) బిహార్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సుందర్బన్ రిజర్వు ఫారెస్ట్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ రిజర్వు ఫారెస్టుకి రామ్సార్ ఒడంబడిక కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత గుర్తింపు కోసం ఆ రాష్ట్ర అటవీ శాఖ దరఖాస్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ గుర్తింపు లభిస్తే అంతర్జాతీయ సంరక్షణ హోదా పొందిన భారత్‌లోని అతిపెద్ద చిత్తడి నేలల ప్రాంతంగా సబర్బన్ రిజర్వు ఫారెస్టు నిలుస్తుంది. ప్రస్తుతం భారత్‌లో 26 ప్రాంతాలకు ఈ గుర్తింపు ఉంది. రామ్సార్ ఒడంబడిక 1975 డిసెంబర్ 21న అమల్లోకి వచ్చింది. చిత్తడి నేలల సంరక్షణ కోసం ఈ ఒడంబడికపై 170 దేశాలు సంతకం చేశాయి.
- సమాధానం: 4
24. కింది వారిలో మాస్టర్ దీననాథ్ మంగేష్కర్ జీవితకాల సాఫల్య పురస్కారం - 2018కు ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎస్పీ బాలసుబ్రమణ్యం
2) లతా మంగేష్కర్
3) ఆశా భోంస్లే
4) దేవీశ్రీ ప్రసాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సీనియర్ గాయని ఆశా భోంస్లే, సరోద్ మాస్ట్రో అమ్జద్ అలీ ఖాన్, సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ 2018 సంవత్సరానికిగాను మాస్టర్ దీననాథ్ మంగేష్కర్ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 3
25. షిరుయి లిలి పేరుతో వార్షిక జానపద పండుగని కింది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
1) అరుణాచల్ ప్రదేశ్
2) మణిపూర్
3) జమ్ము కశ్మీర్
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 2
వివరణ: షిరుయి లిలి వార్షిక జానపద పండుగ మణిపూర్‌లో జరుగుతుంది. ఏటా ఏప్రిల్ మాసంలో ఈ పండుగని నిర్వహిస్తారు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న షిరుయి లిలి పువ్వు సంరక్షణ, పర్వత ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఏటా ఈ పండుగని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహిస్తోంది.
- సమాధానం: 2
26. ప్రపంచ మలేరియా డే ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 23
2) ఏప్రిల్ 25
3) ఏప్రిల్ 27
4) ఏప్రిల్ 29
- View Answer
- సమాధానం:
వివరణ: మలేరియా వైరస్‌ను నియంత్రించేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా డే నిర్వహిస్తారు.
2018 Theme : "Ready to beat Malaria''
- సమాధానం:
27. భారత్ ఇటీవల ఏ దేశంతో కలిసిహరిమావు శక్తి పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించింది ?
1) మలేషియా
2) మయన్మార్
3) ఇండోనేషియా
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్ , మలేషియా సంయుక్తంగా హరిమావు శక్తి పేరుతో ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఇవి రెండు వారాల పాటు మలేషియాలో జరిగాయి. రెండు దేశాల సైన్యం మధ్య సహాయ సహకారాలను పెంపొందించేందుకు ఈ విన్యాసాలను నిర్వహించారు.
- సమాధానం: 1
28. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో సభ్యత్వం పొందిన దేశాలు ఎన్ని ?
1) 198
2) 204
3) 104
4) 175
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)లో 104 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశంలో మొత్తం దేశాలకు అంతర్జాతీయ టీ20 హోదా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 18 దేశాలకు మాత్రమే ఈ హోదా ఉంది. ఈ నిర్ణయంతో 2018 జూలై 1 నుంచి అన్ని దేశాల మహిళా జట్లకు, 2019 జనవరి 1 నుంచి అన్ని దేశాల పురుషుల జట్లకు ఈ హోదా వర్తిస్తుంది.
- సమాధానం: 3
29. ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ - 2018లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది?
1) అమెరికా
2) నార్వే
3) స్విట్జర్లాండ్
4) భారత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ - 2018 (ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ)లో నార్వే తొలి స్థానంలో నిలిచింది. ఉత్తర కొరియా ఆఖరి స్థానంలో ఉంది. భారత్ ఈ సూచీలో 138 స్థానంలో, పాకిస్థాన్ 139వ స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 2
30. అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) రెక్స్ టిల్లర్ సన్
2) మైక్ పొంపెయ్
3) జానీ కార్నిన్
4) మార్క్ వార్నర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సీఐఏ మాజీ డెరైక్టర్ మైక్ పొంపెయ్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఇటీవల నియమితులయ్యారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న రైక్స్ టిల్లర్ సన్ను మార్చిలో ఆ పదవి నుంచి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు.
- సమాధానం: 2
31. "My Journey from Marxism &Leninism to Nehruvian Socialism’ పుస్తక రచయిత ఎవరు ?
1) సిహెచ్ హన్మంతరావు
2) టి.ఎన్. శ్రీనివాసన్
3) మహిర్ రక్షిత్
4) మురళీ మనోహర్ జోషి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ మాజీ మెంబర్ సీహెచ్ హన్మంతరావు రచించిన "My Journey from Marxism&Leninism to Nehruvian Socialism' పుస్తకాన్ని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇటీవల విడుదల చేశారు.
- సమాధానం: 1
32. బీసీసీఐ అందించే ప్రతిష్టాత్మక సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం - 2018ని ఇటీవల ఎవరికి ప్రకటించారు?
1) సంధ్యా అగర్వాల్
2) నీలిమా జొగాలేకర్
3) డయానా ఎడుల్జీ
4) సుభాంగీ కుల్ కామీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: బీసీసీఐ ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు సీకే నాయుడు జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని 2018కి గాను భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీకి ప్రకటించారు. అలాగే భారత క్రికెటర్ పంకజ్ రాయ్ కి ఆయన మరణానంతరం ఈ అవార్డుని ప్రకటించారు.
- సమాధానం: 3
33. 2018 ఆసియాన్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) కిడాంబి శ్రీకాంత్
2) చైన్ లాంగ్
3) పారుపల్లి కశ్యప్
4) కెంటో మొమోటా
- View Answer
- సమాధానం: 4
వివరణ: జపాన్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటో మొమోటా 2018 బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ జు యింగ్ గెలుచుకుంది.
- సమాధానం: 4
34. అజర్ బైజాన్ గ్రాండ్ ప్రీ - 2018 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) లూయిస్ హామిల్టన్
2) సెబాస్టియన్ వెటల్
3) వాల్టెరీ బొట్టాస్
4) డేనియల్ రిక్కియార్డో
- View Answer
- సమాధానం: 1
వివరణ: మెర్సిడిస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అజర్ బైజాన్ గ్రాండ్ ప్రీ - 2018 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇది అతడికి 63వ టైటిల్ కాగా 2018 సీజన్లో మొదటిది.
- సమాధానం: 1
35. 11వ బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) రోజర్ ఫెడరర్
2) డామినిక్ థెయిమ్
3) రాఫెల్ నాదల్
4) జకోవిచ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ 11వ బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. గ్రీక్ ప్లేయర్ స్టెఫానోస్ సిట్ సిపాస్ను ఓడించి నాదల్ ఈ టైటిల్ గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
36. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 155209 ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ కిందివాటిలో ఏ అంశానికి సంబంధించింది?
1) అంబులెన్స్ సేవలకు
2) రైతు సేవలకు
3) అంగన్ వాడీ సేవలకు
4) రిక్రూట్ మెంట్ సేవలకు
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తూ మెరుగైన సేవల కోసం తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబరు 155209ను ప్రారంభించింది. ప్రత్యేక హెల్ప్‌లైన్ పనిదినాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుంది.
- సమాధానం: 3
37. లోక్ తాంత్రిక్ జనతా దళ్ పేరుతో ఇటీవల కొత్త పార్టీని స్థాపించిన నేత ఎవరు ?
1) శరద్ యాదవ్
2) నితీశ్ కుమార్
3) లాలూ ప్రసాద్ యాదవ్
4) ములాయం సింగ్ యాదవ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: గతంలో జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న శరద్ యాదవ్ ఇటీవల లోక్ తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) పార్టీని స్థాపించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో విభేదాలు వచ్చి ఆయన జేడీయూ నుంచి విడిపోయారు. అయితే జేడీయూ పార్టీ గుర్తుపై ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది.
- సమాధానం: 1
38. హమ్రో సిక్కిం పేరుతో ఇటీవల కొత్త పార్టీని స్థాపించిన భైచుంగ్ భుటియా ఏ క్రీడకు సంబంధించినవారు ?
1) క్రికెట్
2) ఫుట్ బాల్
3) హాకీ
4) బ్యాడ్మింటన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా హమ్రో సిక్కిం పేరుతో ఇటీవల కొత్త పార్టీని స్థాపించారు. తన సొంత రాష్ట్రమైన సిక్కింలో కుల-మతతత్వ రాజకీయాలు, అవినీతిపై పోరాటం చేయాలన్న లక్ష్యంతో సొంత పార్టీని ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇంతకుముందు ఆయన పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్‌లో ఉన్నారు.
- సమాధానం: 2
39. సివిల్ సర్వీసెస్ - 2017 ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన దురిశెట్టి అనుదీప్ తెలంగాణలోని ఏ జిల్లాకు చెందినవాడు ?
1) నల్గొండ
2) సిరిసిల్ల
3) జగిత్యాల
4) కామారెడ్డి
- View Answer
- సమాధానం: 3
వివరణ: సివిల్ సర్వీసెస్-2017 ఫలితాల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. 2018 ఏప్రిల్ 27న యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసిన ఫలితాల్లో అనుదీప్ మొదటి ర్యాంకుతో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు ఎంపికయ్యారు. హర్యాణాకు చెందిన అనుకుమారి రెండో ర్యాంక్, ఆ రాష్ట్రానికే చెందిన సచిన్ గుప్తా మూడో ర్యాంక్ సాధించారు.
- సమాధానం: 3
40. ప్రతి నెలా ఏ తేదీన సివిల్ రైట్స్ డే ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది?
1) 15
2) 30
3) 20
4) 1
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రతినెలా 30న జిల్లా కేంద్రాల్లో సివిల్ రైట్స్‌డే నిర్వహించాని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలోనే సివిల్ రైట్స్‌డే నిర్వహించాని పేర్కొంది. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్.
- సమాధానం: 2
41. ప్రపంచంలోనే తొలి తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని ఏ దేశం నిర్మించింది ?
1) రష్యా
2) ఉత్తర కొరియా
3) జపాన్
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘అకడమిక్ లోమనోసోవ్’ అనే తేలియాడే అణువిద్యుత్ కేంద్రాన్ని సముద్రంలో రష్యా నిర్మించింది. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే అణువిద్యుత్ కేంద్రం. ఉత్పత్తి ప్రారంభిస్తే దీని ద్వారా ఏటా 50 వేల టన్నుల కార్బన్ డై ఆకై ్సడ్ ఉద్గారాన్ని తగ్గించొచ్చని రష్యా వెల్లడించింది.
- సమాధానం: 1
42. చారిత్రక కట్టడాలైన ఎర్రకోట, గండికోట నిర్వహణ బాధ్యతలను ఏ సంస్థ దక్కించుకుంది ?
1) జీఎంఆర్
2) దాల్మియా భారత్ లిమిటెడ్
3) ఎల్ అండ్ టీ
4) జీవీకే
- View Answer
- సమాధానం: 3
వివరణ: అడాప్ట్ ఎ హెరిటేజ్ పథకంలో భాగంగా చారిత్రక కట్టడాలైన ఎర్రకోట, గండికోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. దీని ప్రకారం ఎర్రకోట, గండికోట నిర్వహణకు రూ. 25 కోట్లను ఆ సంస్థ ఖర్చు చేస్తుంది.
- సమాధానం: 3
43. పార్లమెంట్, శాసనసభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది ?
1) తెలంగాణ
2) ఒడిశా
3) బిహార్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పార్లమెంట్, శాసన సభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించి సెషన్స జడ్జి స్థాయిలో హైదరాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది.
- సమాధానం: 1
44. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా బస్సులను జీపీఎస్ ద్వారా తెలుసుకునేందుకు లైవ్ ట్రాక్ యాప్‌ను ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) అరుణాచల్ ప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ రాష్ట్రంలోని అన్ని బస్సులకు లైవ్ ట్రాక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం లైవ్ ట్రాక్ (డ్రీమ్ స్టెప్) అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా గ్రామీణ ప్రయాణికులు కూడా బస్సు ఎక్కడ ఉంది? ఎంత సేపట్లో వస్తుంది? వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
- సమాధానం: 1
45. హైదరాబాద్ చుట్టూ ఎన్ని కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ ఉంది ?
1) 100 కి.మీ.
2) 158 కి.మీ.
3) 200 కి.మీ.
4) 75 కి.మీ.
- View Answer
- సమాధానం: 2
వివరణ: హైదరాబాద్ చుట్టు 158 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు నిర్మాణం ఇటీవల పూర్తయింది. ఓఆర్ఆర్ నిర్మాణంలో చివరి దశ అయిన కండ్లకోయ జంక్షన్‌ను ఇటీవల ప్రారంభించారు. 12 ఏళ్లలో మొత్తం 158 కి.మీ. మార్గంను రూ.6,696 కోట్ల వ్యయంతో నిర్మించారు.
- సమాధానం: 2
46. ఇటీవల కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పనలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ?
1) ఒడిశా
2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పనలో ఒడిశా మొదటి స్థానంలో, కేరళ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 1
47. ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపిన జాతీయ వెదురు మిషన్‌ను ఎన్ని ఏళ్ల పాటు అమలు చేస్తారు ?
1) 1
2) 2
3) 3
4) 5
- View Answer
- సమాధానం: 2
వివరణ: పునర్వ్యవస్థీకృత జాతీయ వెదురు మిషన్ (ఎన్‌బీఎం) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు అమలు చేయనున్న ఈ పథకానికి రూ.1,290 కోట్లు కేటాయించగా ఇందులో కేంద్రం రూ.950 కోట్లు భరిస్తుంది. ఈ మిషన్‌లో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు.
- సమాధానం: 2
48. ఆఫ్రికాలోని కిలిమంజారోని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఇటీవల రికార్డు సృష్టించిన సమన్యు యాదవ్ ఏ రాష్ట్రానికి చెందివాడు ?
1) బిహార్
2) తెలంగాణ
3) ఉత్తరప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఏడేళ్ల సమన్యు ఇటీవల ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. దీని ఎత్తు 5,380 మీటర్లు. దీంతో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పాడు. అమెరికాకు చెందిన క్యాష్ అనే బాలుడి పేరిట ఉన్న ఈ రికార్డును మూడో తరగతి చదువుతున్న సమన్యు అధిగమించాడు. సమన్యు ఇప్పటికే మౌంట్ ఎవరెస్ట్‌ను కూడా అధిరోహించాడు.
- సమాధానం: 4
49. సురవం సుధాకర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వారు ?
1) సీపీఐ-ఎం
2) సీపీఐ
3) కాంగ్రెస్ పార్టీ
4) బీజేపీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: సురవరం సుధాకర్ రెడ్డి సీపీఐ పార్టీకి చెందిన వారు. కేరళలోని కొల్లాంలో ఇటీవల జరిగిన పార్టీ 23వ ప్లీనరీ సమావేశాల్లో ఆయన సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. తెలంగాణలోని నల్గొండ నియోజక వర్గం నుంచి రెండు సార్లు (1998-99, 2004-09) లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సుధాకర్ రెడ్డి 2012లో తొలిసారి సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
- సమాధానం: 2
50. పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) అధ్యక్షునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) మల్లికార్జున ఖర్గే
2) జితేందర్ రెడ్డి
3) అశోక గజపతి రాజు
4) జ్యోతిరాదిత్య సింథియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) అధ్యక్షునిగా లోక్‌సభ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. 22 మంది సభ్యులు గల ఈ కమిటీ ప్రభుత్వ ఖర్చులు పార్లమెంట్ కేటాయింపులకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. అంచనాల కమిటీకి బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీని, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీకి శాంతకుమార్‌ను చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలు ఏడాదిపాటు కొనసాగుతాయి.
- సమాధానం: 1