కరెంట్ అఫైర్స్ (అక్టోబరు-20-26, 2020)
జాతీయం
1.ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటుకోసం‘‘ఆయుష్మాన్ సహకర్’’ పథకానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) ఎంత రుణాన్ని అందిస్తుంది?
1) రూ. 1,000 కోట్లు
2) రూ. 10,000 కోట్లు
3) రూ. 100 కోట్లు
4) రూ. 500 కోట్లు
- View Answer
- సమాధానం: 2
2. నవంబర్ 2020 లో ఫుడ్ సేఫ్టీ కంప్లియెన్స్ సిస్టమ్ (FoSCoS)ను ప్రారంభించనున్న సంస్థ?
1) ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2) వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
3) ఆహార, వ్యవసాయ సంస్థ
4) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
3. భారతదేశంలో ఇంగువ(Asafoetida) సాగును తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
4. ‘‘సేఫ్ సిటీ ప్రాజెక్ట్’’, ‘‘మిషన్ శక్తి’’ పేరుతో మహిళల భద్రతా ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) ఉత్తర ప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
5. భారతదేశపు తొలి మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్క్ (MMLP)ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్నారు?
1) అసోం
2) త్రిపుర
3) సిక్కిం
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 1
6. భారతదేశంలో పొడవైన బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) నెట్వర్క్ ఉన్న ఏకై క నగరం ఏది?
1) సూరత్
2) అహ్మదాబాద్
3) కోల్‌కతా
4) పాట్నా
- View Answer
- సమాధానం: 1
7. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం భారతదేశంలో నులి పురుగు(పరాన్నజీవి) సంక్రమణ లేదా సాయిల్ ట్రాన్స్మిటెడ్హెల్మిన్థియాసిస్ (STH) తగ్గినట్లు ఎన్ని రాష్ట్రాలు నివేదించాయి?
1) 13
2) 12
3) 14
4) 16
- View Answer
- సమాధానం: 3
8. ఏ సంవత్సరం నాటికిఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ((AAI)) ఉడాన్ రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ పథకం కింద కనీసం 100 విమానాశ్రయాలు, వాటర్ డ్రోమ్‌లు, హెలిపోర్ట్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది?
1) 2022
2) 2024
3) 2025
4) 2030
- View Answer
- సమాధానం: 2
9. నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్ (NSM) మూడవ దశ ఏ నెల నుండి ప్రారంభం కానుంది?
1) మార్చి 2021
2) జనవరి 2021
3) ఏప్రిల్ 2021
4) డిసెంబర్ 2020
- View Answer
- సమాధానం: 2
10. భారతదేశంలోతొలి అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) సిక్కిం
2) అసోం
3) త్రిపుర
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 2
11. ‘‘వైయస్ఆర్ బీమా’’ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాద బాధితుల కుటుంబాల కోసం తక్షణ ఆర్థిక సహాయంగా అందించేమొత్తం?
1) రూ .15,000
2) రూ .20,000
3) రూ .10,000
4) రూ .5000
- View Answer
- సమాధానం: 3
12. కేంద్ర ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసినఅనీమియా ముక్త్ (రక్తహీనత రహిత)భారత్ సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) అసోం
2) హరియాణ
3) గుజరాత్
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 2
13. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కార్యక్రమ అమలులో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా?
1) బహ్రాయిచ్, ఉత్తర ప్రదేశ్
2) మండి, హిమాచల్ ప్రదేశ్
3) బీజాపూర్, ఛత్తీస్‌గఢ్
4) పాలక్కాడ్, కేరళ
- View Answer
- సమాధానం: 2
14. జిల్లా స్థాయిలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (PFMS) ను తొలి సారిగా అమలు చేసిన కేంద్ర పాలిత ప్రాంతం ?
1) డామన్ - డియు
2) పుదుచ్చేరి
3) లడాఖ్
4) జమ్ము, కశ్మీర్
- View Answer
- సమాధానం: 4
15. ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సూర్యోదయ యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఒడిశా
2) గుజరాత్
3) ఉత్తర ప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
16. పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ’ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ (ITS) ఎ గ్లాన్స 2020’ అనే ప్రచురణ ప్రకారం విదేశీ పర్యాటక సందర్శకుల జాబితా 2019 లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) తమిళనాడు
2) గుజరాత్
3) ఉత్తర ప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
అంతర్జాతీయం
17.‘‘పోస్ట్-కోవిడ్ -19 అవకాశాలపై ప్రభుత్వ యువత సంభాషణ’’ అనే అంశంపై సౌదీ అరేబియా నిర్వహించిన తొలి వర్చువల్ జి 20 యూత్ 2020 సదస్సులో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు?
1) హర్ష్ వర్ధన్
2) కిరెన్ రిజిజు
3) మహేంద్ర నాథ్ పాండే
4) రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
- View Answer
- సమాధానం: 2
18. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం విడుదల చేసిన ‘‘ది కాస్ట్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ ఫుడ్ -2020’’ అనే నివేదిక ప్రకారం, ప్లేటు ఆహారం ఖరీదు ఆధారంగా భారతదేశ ర్యాంక్?
1) 22
2) 23
3) 18
4) 28
- View Answer
- సమాధానం: 4
19. భారత్-శ్రీలంక మారిటైమ్ వ్యాయామం SLINEX-20 8వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) ట్రిన్‌కోమలి, శ్రీలంక
2) కొచ్చి, భారత్
3) కొలంబో, శ్రీలంక
4) చెన్నై, భారత్
- View Answer
- సమాధానం: 1
20. నేషనల్ ఐడెంటిఫికేషన్ డేటాబేస్లోప్రపంచంలోనే ముఖ ధృవీకరణ (ఫేస్ రికగ్నిషన్)ను అటాచ్ చేసిన తొలిదేశం?
1) సింగపూర్
2) ఇజ్రాయెల్
3) మలేషియా
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
21. జనవరి 2021 నుండి భారత్‌లో తొలి ప్రత్యేక ’వాటర్ అటాచ్’ కలిగి ఉండనున్న దేశం?
1) ఇజ్రాయెల్
2) డెన్మార్క్
3) ఫిన్లాండ్
4) నెదర్లాండ్స
- View Answer
- సమాధానం: 1
22. ‘‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఔట్లుక్ 2020’’ 44వ ఎడిషన్ ప్రకారం (2018 సమయంలో) OECD దేశాలకు వచ్చిన వలసదారుల సంఖ్య ఆధారంగా భారత్ ర్యాంక్?
1) 5
2) 9
3) 2
4) 36
- View Answer
- సమాధానం: 3
23. రక్షణ ఉత్పత్తిలో సహ ఉత్పత్తి,సహ అభివృద్ధి కోసం భారత్ ఏ దేశంతో చర్చలు జరుపుతోంది?
1) అజర్బైజాన్
2) కజకిస్తాన్
3) కిర్గిస్తాన్
4) తుర్కెమెనిస్తాన్
- View Answer
- సమాధానం: 2
24. మార్చి 26, 2021 న ఏ దేశ 50 వ వేడుకల్లోభారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు?
1) మయన్మార్
2) నేపాల్
3) మాల్దీవులు
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
25. 3వ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 నివేదిక ప్రకారం 2019 లో వాయు కాలుష్యం కారణంగా శిశు మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం?
1) నేపాల్
2) నైజీరియా
3) భారత్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 3
26. లోవి ఇన్స్టిట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్ 2020 ఎడిషన్ ప్రకారం ఆసియాలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ ర్యాంక్?
1) 4
2) 2
3) 1
4) 5
- View Answer
- సమాధానం: 1
27.అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) లో అధికారికంగా చేరిన 190వ దేశం?
1) ది వాటికన్ సిటీ
2) ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండోరా
3) క్యూబా
4) ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: 2
28. భారత్‌లో కోవిడ్-19 కార్యక్రమాలకు మద్దతుగా USAID ప్రకటించిన మొత్తం ఎంత?
1) 5 మిలియన్ల అమెరికా డాలర్లు
2) 1 మిలియన్ అమెరికా డాలర్లు
3) 3 మిలియన్ల అమెరికా డాలర్లు
4) 2 మిలియన్ల అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం: 1
29. కరోనావైరస్సంబంధిత ఆరోగ్య, భద్రతా ప్రోటోకాల్ సమర్థవంత అమలులో ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన ఏరోడ్రోమ్‌లో అగ్రస్థానంలో నిలిచిన విమానాశ్రయం?
1) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం , ఢిల్లీ
2) లండన్ హీత్రూ విమానాశ్రయం
3) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
4) చాంగి విమానాశ్రయం, సింగపూర్
- View Answer
- సమాధానం: 4
30. ప్రపంచ బ్యాంక్ (WB) అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) వార్షిక సమావేశంలో భారత్‌కు ఎవరు ప్రాతినిధ్యం వహించారు?
1) హర్ష వర్ధన్
2) రవిశంకర్ ప్రసాద్
3) ఎస్ జైశంకర్
4) ప్రకాష్ జవ్దేకర్
- View Answer
- సమాధానం: 1
31. ‘హ్యూమన్ మొబిలిటీ, షేర్డ్ ఆపర్చునిటీస్‘ పేరుతో నివేదికను విడుదల చేిసిన సంస్థ?
1) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)
2) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP))
3) ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)
4) ప్రపంచ బ్యాంకు(WB )
- View Answer
- సమాధానం: 2
ఆర్థికం
32.టాక్టర్ ఫైనాన్స వ్యాపారం కోసం మహీంద్రాఅండ్‌మహీంద్రా (M&M) తో ఏ బ్యాంకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) ఇండియన్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
33. ’మూ పే’ అనే తొలిఫుల్లీ ఆటోమేటెడ్ ప్రత్యక్ష చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను (direct payment platform) ప్రారంభించిన స్టార్టప్?
1) ఆగ్రివెబ్
2) అఫిమిల్క్
3) బ్రెయిన్వైర్డ్
4) స్టెల్యాప్స్
- View Answer
- సమాధానం: 4
34. 2020-2021లో ఖరీఫ్ ఆహార ధాన్యంఅంచనా ఉత్పత్తి?
1) 143.38 మిలియన్ టన్నులు
2) 144.52 మిలియన్ టన్నులు
3) 134.52 మిలియన్ టన్నులు
4) 411.32 మిలియన్ టన్నులు
- View Answer
- సమాధానం: 2
35. చంద్రునిపై తొలి 4 జి సెల్యులార్ నెట్‌వర్క్‌లను నిర్మించడానికి నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ (NASA) ఏ సంస్థను ఎంపిక చేసింది?
1) నోకియా
2) రిలయన్స జియో
3) సిమెన్స
4) వొడాఫోన్
- View Answer
- సమాధానం: 1
36. 2 మిలియన్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను (నెక్స్ట్ జనరేషన్ క్రెడిట్ కార్డులు) ప్రవేశపెట్టనున్న సంస్థ?
1) ఫోన్‌పే
2) పేటీఎం
3) అమెజాన్
4) గూగుల్ పే
- View Answer
- సమాధానం: 2
37. ఈక్విటీ ఫండ్స్సేకరణకోసంఎంఎస్ఎంఇల(MSMEs)కు మద్దతు ఇవ్వడానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) జార్ఖండ్
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
38. ఐఐటి-మద్రాస్(IIT-Madras) ఇంక్యుబేషన్ సెల్ సహకారంతో (IND Spring Board)” ఐఎన్డీ స్పింగ్ బోర్డ్’’ అనే స్టార్టప్‌ల కోసం రూ .50 కోట్ల వరకు ప్రత్యేకమైన క్రెడిట్ సదుపాయాన్ని ప్రారంభించిన బ్యాంక్?
1) ఇండియన్ బ్యాంక్
2) ఇండస్ఇండ్ బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
39. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020 ను గెలుచుకున్న బ్యాంక్?
1) బ్యాంక్ ఆఫ్ ఘనా (BoG)
2) బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (BoS)
3) బ్యాంక్ ఆఫ్ మలేషియా (BoM)
4) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (BoE)
- View Answer
- సమాధానం: 1
40. IAF కోసం మిగ్ -29 సిమ్యులేటర్ సెంటర్‌ను రూ .753 కోట్లతో నిర్మించి, నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్.
2) లార్సెన్ - టుబ్రో
3) భారత్ డైనమిక్స్ లిమిటెడ్
4) అగ్నికుల్ కాస్మోస్
- View Answer
- సమాధానం: 1
41. ఐఎంఎఫ్(IMF)అంచనాల ప్రకారం 2020 లో ఆసియా ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదింపుకులోనవుతుంది?
1) 2.2%
2) 3.2%
3) 5.2%
4) 2.5%
- View Answer
- సమాధానం: 1
42. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ఆఫ్ ఇండియా ప్రారంభించిన భారత్ తొలి రియల్ టైమ్ బేస్ మెటల్స్ ఇండెక్స్ పేరు ?
1) ఐకామ్డెక్స్(iCOMDEX )
2) హెల్ప్డెక్స్(HELPDEX )
3) మెల్ట్డెక్స్(MELTDEX )
4)మెటల్‌డెక్స్(METLDEX)
- View Answer
- సమాధానం: 4
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
43. ఐఎన్ఎస్ చెన్నై(INS Chennai) (అక్టోబర్ 2020) నుండి ఇటీవల ఏ సూపర్సోనిక్ క్రూయిస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు?
1) రుద్రం
2) పృథ్వీ -2
3) పృథ్వీ -1
4) బ్రహ్మోస్
- View Answer
- సమాధానం: 4
44. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శాస్త్రవేత్తలు 2.5 మిలియన్ సంవత్సరాల నాటి భారతదేశపు తొలి డ్రాగన్‌ఫ్లై శిలాజాన్ని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) పశ్చిమ బెంగాల్
2) తెలంగాణ
3) కేరళ
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 4
45. ఒడిశాలోని ఐటిఆర్ చాందీపూర్‌లో ఇటీవల విజయవంతంగా పరీక్షించిన స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ గెడైడ్ క్షిపణి (SANT Missile) ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO)
2) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO)
3) భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)
4) ఆర్డినెన్స ఫ్యాక్టరీ బోర్డు (OFB)
- View Answer
- సమాధానం: 1
46. నీతీఆయోగ్ ఏ సంస్థతో, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ (CIC) ను ప్రారంభించింది?
1) ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
2) అమెజాన్ వెబ్ సర్వీసెస్
3) ఐబిఎం క్లౌడ్ సర్వీసెస్
4) మైక్రోసాఫ్ట్ అజూర్
- View Answer
- సమాధానం: 2
47. వ్యక్తులు బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి 2021 లో ఏ కంపెనీ భారత్‌లో బ్లాక్ చైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుంది?
1) బుర్సా బాండ్‌స
2) సిటీబ్యాంక్ బెర్హార్డ్
3) బాండ్ఈవాల్యూ
4) పిచ్ ప్లాట్ఫార్మ్స్
- View Answer
- సమాధానం: 3
48. ’ సస్టైనబుల్ ప్రాసెసింగ్ ఆఫ్ మునిసిపల్ వేస్ట్’ సమస్యను పరిష్కరించడానికి సస్టైనబుల్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ (MSW) ప్రాసెసింగ్ సౌకర్యాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMERI)
2) అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMPRI)
3) సెంట్రల్ ఎలక్టోక్రెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CECRI)
4) సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI)
- View Answer
- సమాధానం: 1
49.కోవిడ్-19 కోసం పునర్నిర్మిత ఔషధాల సమాచారం అందించడానికి CSIR ప్రారంభించిన వెబ్సైట్ పేరు?
1) కారెడ్ (CaRED)
2) క్యూరెడ్ (CuRED )
3) క్రెడ్(CRED )
4) సీఎస్ఐఆర్రెడ్ (CSIRED)
- View Answer
- సమాధానం: 2
50. హిందూ మహాసముద్రం సునామి హెచ్చరిక, ఉపశమన వ్యవస్థ కోసం ఇంటర్ గవర్నమెంటల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఇటీవల నిర్వహించిన మాక్ సునామి డ్రిల్ పేరు?
1) IOTsunami20
2) IOcean20
3) IOLaher20
4) IOWave20
- View Answer
- సమాధానం: 4
51. ఔటర్ స్పేస్ (బ్యాహ్యాంతరిక్ష) అన్వేషణ, ఉపయోగాల సహకారంపై ఏ దేశంతో బారత్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
1) నైజీరియా
2) పాపువా న్యూ గినియా
3) మలేషియా
4) నెదర్లాండ్స
- View Answer
- సమాధానం: 1
52. యాన్యువల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ICE) అవార్డులు 2020 లో సివిల్ ఇంజనీరింగ్‌లో రాణించినందుకు 2020 బ్రూనెల్ పతకాన్ని గెలుచుకున్న ప్రాజెక్ట్ ఏది?
1) జిలౌడు హైడ్రోపవర్ ప్లాంట్, చైనా
2) గ్రాండ్ కౌలీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్, యునెటైడ్ స్టేట్స్
3) సయనో-షుషెన్ష్క్యా హైడ్రోపవర్ ప్లాంట్, రష్యా
4) మంగ్దేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, భూటాన్
- View Answer
- సమాధానం: 4
53. విశాఖపట్నంలో నావల్ డాక్‌యార్డ్‌లో ఇటీవల ప్రారంభించిన యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ స్టిల్త్ కొర్వెట్టి పేరు ?
1) ఐఎన్ఎస్ కవరట్టి
2) ఐసీజీఎఎస్ కనక్లతా బారువా
3) ఐఎన్ఎస్ చెన్నై
4) ఐసీజీఎఎస్ విరాజ్
- View Answer
- సమాధానం: 1
54. తక్కువ ఖర్చుతో పోర్టబుల్ కోవిడ్ -19 టెస్ట్ కిట్‘‘కోవిరాప్’’ను అభివృద్ధి చేసిన సంస్థ?
1) ఐఐటీ కాన్పూర్
2)ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ బొంబాయి
4) ఐఐటీ ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 4
55. నిర్వహణ సమాచార వ్యవస్థలో పటాలు(మ్యాపులు),లీజు ప్రణాళికలు వంటి లెగసీ డ్రాయింగ్లను అనుసంధానించడానికి గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ పేరు?
1) ఇ-ధర్ని జియో పోర్టల్
2) ఇ-భూమి జియో పోర్టల్
3) ఇ-ధర్తి జియో పోర్టల్
4) ఇ-పృథ్వీ జియో పోర్టల్
- View Answer
- సమాధానం: 3
56. అరేబియా సముద్రంలో జరిపిన ప్రాక్టీస్ డ్రిల్‌లో లక్ష్యం మీద యాంటీ షిప్ క్షిపణిని (AShM) ప్రయోగించిన ఇండియన్ నేవీ మిస్సైల్ కొర్వెట్టి పేరు?
1) INS విక్రమాదిత్య
2) INS విరాట్
3)INS విగ్రహా
4) INS ప్రబల్
- View Answer
- సమాధానం: 4
57. ఇటీవల ఉత్తరాఖండ్‌లో గుర్తింపు పొందిన తొలి రామ్సర్ సైట్ ఏది?
1) ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్
2) సమన్ పక్షుల అభయారణ్యం
3) బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్
4) పార్వతి పక్షుల అభయారణ్యం
- View Answer
- సమాధానం: 1
58. పపంచ బ్యాంకు సహాయంతో భారత్ తొలిఇసుక దిబ్బ పార్కును అభివృద్ధి చేయనున్న రాష్ట్రం?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) గోవా
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
59. నాసికా కుహరం -గొంతు మధ్య దాగి ఉన్న ’ట్యూబరియల్ గ్రంథి’ అనే కొత్త జత లాలాజల గ్రంథులను ఏ దేశ పరిశోధకులు కనుగొన్నారు?
1) న్యూజిలాండ్
2) నెదర్లాండ్స
3) ఫిన్లాండ్
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 2
నియామకాలు
60.న్యూజిలాండ్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) కాన్స్టాంటినా డిటా
2) కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్
3) జసిండా ఆర్డెర్న్
4) సన్నా మెరైన్
- View Answer
- సమాధానం: 3
61. సెబీ(SEBI) ఏర్పాటు చేసిన మార్కెట్ డేటా సలహా కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) మాధాబి పురి బుచ్
2) సందీప్ త్యాగి
3) పవన్ రాయ్ జి
4) రమేష్ పురి
- View Answer
- సమాధానం: 1
62. రైతుల పంట వ్యర్థాల దహన పర్యవేక్షిణ, నిరోధనకు సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసింది?
1) శరద్ అరవింద్ బొబ్డే
2) అజ్జికుత్తిరా సోమయ్య బోపన్న
3) వి రామసుబ్రమణియన్
4) మదన్ భీమారావు లోకూర్
- View Answer
- సమాధానం: 4
63. ప్రామాణిక సైబర్ బాధ్యత బీమా(Standard Cyber Liability Insurance) ఆవశ్యకతను పరిశీలించడానికి IRDAI రూపొందించిన 9-సభ్యుల ప్యానెల్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) పి ఉమేష్
2) అజయ్ కుమార్ భల్లా
3) అజయ్ త్యాగి
4) తుషార్ మెహతా
- View Answer
- సమాధానం: 1
64. లెబనాన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) హసన్ దియాబ్
2) ముస్తఫా ఆదిబ్
3) సాద్ ఎల్-దిన్ హరిరి
4) డెనిస్ ష్మిహాల్
- View Answer
- సమాధానం: 3
65. అక్టోబర్ 2020- జూన్ 2021 కాలానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) పాలకమండలి ఛైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రాజీవ్ గౌబా
2) రాజీవ్ కుమార్
3) అపూర్వ చంద్ర
4) అజయ్ కుమార్ భల్లా
- View Answer
- సమాధానం: 3
క్రీడలు
66. పురుషుల సింగిల్స్ విభాగంలో డానిసా డెన్మార్క్ ఓపెన్ 2020 (బ్యాడ్మింటన్ టోర్నమెంట్)విజేత?
1) అండర్స్ అంటోన్సెన్
2) నోజోమి ఒకుహారా
3) కిదాంబి శ్రీకాంత్
4) యుకీ ఫుకుషిమా
- View Answer
- సమాధానం: 1
ముఖ్యమైన తేదీలు
67. ఏటా అంతర్జాతీయ చెఫ్స్దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) అక్టోబర్ 20
2) అక్టోబర్ 15
3) అక్టోబర్ 12
4) అక్టోబర్ 13
- View Answer
- సమాధానం: 1
68. ‘మనం విశ్వసించగల డేటాతో ప్రపంచాన్ని అనుసంధానం చేద్దాం’’ అనే 2020 సంవత్సరపు ఇతివృత్తంతో ప్రపంచ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
1) అక్టోబర్ 20
2) అక్టోబర్ 25
3) అక్టోబర్ 30
4) అక్టోబర్ 31
- View Answer
- సమాధానం: 1
69. ఏటా పోలీసు సంస్మారక దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) అక్టోబర్ 18
2) అక్టోబర్ 19
3) అక్టోబర్ 20
4) అక్టోబర్ 21
- View Answer
- సమాధానం: 4
70.ఏటా అంతర్జాతీయ మంచు చిరుత(స్నో లెపర్డ్)దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) అక్టోబర్ 20
2) అక్టోబర్ 21
3) అక్టోబర్ 22
4) అక్టోబర్ 23
- View Answer
- సమాధానం: 4
71. ఏ రోజును ఐక్యరాజ్యసమితి (UN) దినంగా పాటిస్తారు?
1) అక్టోబర్ 15
2) అక్టోబర్ 24
3) అక్టోబర్ 15
4) అక్టోబర్ 14
- View Answer
- సమాధానం: 2
72. ఏటా అక్టోబర్ 24 న పాటించే ప్రపంచ పోలియో దినోత్సవం 2020 ఇతివృత్తం ఏమిటి?
1) ఇప్పుడే పోలియోను అంతం చేయడం
2) ఈ రోజు చరిత్ర సృష్టించడం
3) పోలియోపై విజయం -ప్రపంచ ఆరోగ్యానికి ఓ విజయం
4) పోలియో నిర్మూలనకు దోహదం చేసి, గుర్తింపుపొందని యోధులకు నివాళి
- View Answer
- సమాధానం: 3
అవార్డులు, పురస్కారాలు
73.భారత మాజీరాష్ట్రపతి పణబ్ ముఖర్జీ ‘‘షేక్ ముజీబర్ రెహ్మాన్’’ పై రాసిన పుస్తకం (ఆంథాలజీ ఆఫ్ ఎస్సేస్) పేరు?
1) ది అన్ఫినిష్డ్ మెమొరీస్
2) వాయిస్ ఆఫ్ మిలియన్స్
3) వన్ ఇన్ ఎ మిలియన్
4) మిలియన్ వాయిసెస్ ఇన్ మై మైండ్
- View Answer
- సమాధానం: 2
74. అనుభవజ్ఞుడైన ఏ ఆర్థికవేత్త తన ఆత్మకథ ‘‘పోర్ట్రెయిట్స్ ఆఫ్ పవర్: హాఫ్ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ రింగ్‌సైడ్’’ ను ఇటీవల విడుదల చేశారు?
1) కిషోర్ భీమాని
2) ప్రదీప్ గూర్హా
3) నంద్ కిషోర్ సింగ్
4) శశి థరూర్
- View Answer
- సమాధానం: 3
75. ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి (HRD) కాంగ్రెస్ నిర్వహించిన నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స-పిఎస్‌యులో సీఈఓ ఆఫ్ ది ఇయర్, విజనరీ లీడర్షిప్ అవార్డును అందుకున్నది?
1) దెబాశీష్ పాండా
2) కె అనంత్ కృష్ణన్
3) ప్రసిద్ధ కృష్ణ
4) ప్రవీర్ కృష్ణ
- View Answer
- సమాధానం: 4
76. 17 వ వార్షిక స్టీవ్ అవార్డులలో బిజినెస్ ఇన్ విమెన్ - లైఫ్ టైం అఛీవ్మెంట్-బిజినెస్ విభాగంలో గోల్డ్ స్టీవ్ అవార్డు గ్రహీత ?
1) హేమ గుప్తా
2) నీనా గుప్తా
3) సీమా గుప్తా
4) ఐశ్వర్య శ్రీధర్
- View Answer
- సమాధానం: 3
77. 2020 సంవత్సరపు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ పురస్కారం గెలుచుకున్న తొలిభారతీయ మహిళ?
1) సీమా గుప్తా
2) నిహాల్ సరిన్
3) ఐశ్వర్య శ్రీధర్
4) సునిధి
- View Answer
- సమాధానం: 3