కరెంట్ అఫైర్స్ అక్టోబర్ (24 - 31) బిట్ బ్యాంక్
1. అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేందుకు భారతీయ వాయుసేన ఇటీవల ‘‘టచ్ అండ్ గో’’ కసరత్తులను ఏ హైవేపై నిర్వహించింది ?
1) లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే
2) హజ్రా-కోల్‌కతా హైవే
3) కటక్ - చెన్నై హైవే
4) హైదరాబాద్ - విజయవాడ హైవే
- View Answer
- సమాధానం: 1
వివరణ: అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేందుకు భారతీయ వాయుసేన ఇటీవల ‘‘టచ్ అండ్ గో’’ కసరత్తులను లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై నిర్వహించింది. ఈ కసరత్తులో 12 కుపైగా మిరేజ్ -2000, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో పాటు 35 వేల కిలోల బరువైన సీ-130జే సూపర్ ఎక్స్‌ప్రెస్ హెర్కులెస్ విమానం పాలుపంచుకున్నాయి. సీ-130జే విమానాలు 2010లో వాయుసేనకు అందుబాటులోకి వచ్చాయి.
- సమాధానం: 1
2. 2017 సంవత్సరానికి గాను ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ పురస్కారానికి ఎంపికైన క్రీడాకారుడు ఎవరు ?
1) లియోనల్ మెస్సీ
2) క్రిస్టియానో రొనాల్డో
3) నేమార్
4) లూయిస్ సౌరెజ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పోర్చుగల్ జట్టు కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 2017 సంవత్సరానికి గాను ప్రపంచ ఉత్తమ ఫుట్ బాల్ ప్లేయర్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో రొనాల్డో 48 మ్యాచ్‌లు ఆడి 44 గోల్స్ చేశాడు.
- సమాధానం: 2
3. ‘‘క్వీన్ ఆఫ్ తుమ్రీ’’గా ప్రసిద్ధికెక్కిన గాయని ఎవరు ?
1) ఆశా భోంస్లే
2) అనురాధా పౌడ్వాల్
3) గిరిజా దేవి
4) లతా మంగేష్కర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని గిరిజాదేవి ‘‘క్వీన్ ఆఫ్ తుమ్రీ’’గా ప్రసిద్ధికెక్కారు. ఆమె ఇటీవల కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన గిరిజాదేవి 1972లో పద్మశ్రీ, 1989లో పద్మ భూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలు పొందారు.
- సమాధానం: 3
4. ‘‘గ్లోబల్ పాస్ పోర్ట్ పవర్ ర్యాంకు - 2017’’లో ఏ దేశ పాస్ పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది ?
1) జర్మనీ
2) భారత్
3) స్వీడన్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ‘‘గ్లోబల్ పాస్ పోర్ట్ పవర్ ర్యాంకు - 2017’’ జాబితాను ఆర్థిక సలహాల సంస్థ ఆర్టన్ క్యాపిటల్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తున్న దేశాల జాబితాలో సింగపూర్ 159 స్కోరుతో తొలి స్థానంలో నిలిచింది. 156 స్కోరుతో జర్మనీ రెండో స్థానంలో, 157 స్కోరుతో స్వీడన్, దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచాయి. భారత్ 75వ ర్యాంకులో ఉంది.
వివిధ దేశాల మధ్య అమలులో ఉన్న ఒప్పందం ప్రకారం ఏ దేశ పౌరులకై తే అత్యధిక దేశాల్లో వీసా అవసరం ఉండదో సదరు దేశ పాస్‌పోర్ట్ అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు.
- సమాధానం: 4
5. ఇటీవల ఏ దేశం మహిళలను క్రీడా మైదానాల్లోకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది ?
1) సౌదీ అరేబియా
2) ఇరాన్
3) సిరియా
4) ఇరాక్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సౌదీ అరేబియా మహిళలను క్రీడా మైదానాల్లోకి అనుమతిస్తు నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. సౌదీ అరేబియా ఇటీవలే మహిళల డ్రైవింగ్‌కు అనుమతి ఇచ్చింది.
- సమాధానం: 1
6. ఓ రోబోకు పౌరసత్వం ఇచ్చిన తొలి దేశం ఏది ?
1) జపాన్
2) సౌదీ అరేబియా
3) చైనా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 2
వివరణ: సౌదీ అరేబియా.. సోఫియా అనే కృత్రిమ మేధోశక్తి కలిగి ఉన్న హ్యూమనాయిడ్ రోబోకు పౌరసత్వం ఇచ్చింది. కృత్రిమ మేధోశక్తి పై దేశంలో జరుగుతున్న పరిశోధనలను ప్రోత్సహించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 2
7. భారత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు లోగోని ఏ జంతువు రూపంతో రూపొందించారు ?
1) సింహం
2) ఏనుగు
3) చిరుత
4) నెమలి
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.1.08 లక్షల కోట్లతో చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి చిరుత పులి రూపంతో లోగోని ఖరారు చేసింది. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థి చక్రధర్ ఆళ్ల ఈ లోగోని రూపొందించారు.
- సమాధానం: 3
8. తొలి అంతర్జాతీయ వినియోగదారుల పరిరక్షణ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తొలి అంతర్జాతీయ వినియోగదారుల పరిరక్షణ సదస్సు(International Consumer Protection Conference) న్యూఢిల్లీలో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుని ప్రారంభించారు.
2017 Theme : Empowering consumers in new markets
- సమాధానం: 1
9. భారత్‌లో ఎవరి జయంతిని పురస్కరించుకొనిజాతీయఐక్యతాదినోత్సవాన్నినిర్వహిస్తారు ?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) డా. బి.ఆర్. అంబేడ్కర్
3) పీవీ నర్సింహారావు
4) బాబు జగ్జీవన్ రావ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అక్టోబర్ 31న భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. 2014 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన 142వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం నుంచి ఇండియా గేట్ వరకు జరిగిన ఐక్యతా పరుగుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
- సమాధానం: 1
10. ఇటీవల భారత్‌లో పర్యటించిన ఇటలీ ప్రధానమంత్రి ఎవరు ?
1) పాలో జెంటిలోని
2) మాల్కం టర్న బుల్
3) షేక్ హసీనా
4) విక్రమసింఘే
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటలీ ప్రధాని పాలో జెంటిలోని ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రైల్వే భద్రత, విద్యుత్, సంయుక్త పెట్టుబడుల ప్రోత్సాహం తదితర ఆరు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 2018 మార్చిలో ఇటలీతో భారత ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రత్యేక లోగోని ఇరువురు నేతలు ఆవిష్కరించారు.
- సమాధానం: 1
11. ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల నాలుగో సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) మనీలా
3) బీజింగ్
4) కాట్మాండు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల నాలుగో సదస్సు ఫిలిప్పీన్‌స రాజధాని మనీలాలో జరిగింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద శక్తులను సమర్థంగా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆగ్నేయాసియా దేశాల సంఘం నిర్ణయించింది. ఈ సదస్సులో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
- సమాధానం: 2
12. తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది ?
1) యాదాద్రి భువనగిరి
2) భద్రాద్రి కొత్తగూడెం
3) సంగారెడ్డి జిల్లా
4) ఆసిఫాబాద్ జిల్లా
- View Answer
- సమాధానం: 3
వివరణ: రైల్వే లోకోమోటివ్‌స తయారీలో ఖ్యాతి గడించిన ప్రముఖ హైదరాబాద్ కంపెనీ మేధా సర్వో డ్రైవ్‌స రూ.800 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమ ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
- సమాధానం: 3
13. ఆధార్ నమోదులో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన మెట్రో నగరం ఏది ?
1) ఢిల్లీ
2) ముంబై
3) బెంగళూరు
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆధార్ నమోదులో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కై వసం చేసుకుందని యూఐడీఏఐ వెల్లడించింది. 2011 నాటికి హైదరాబాద్ జనాభా 93 లక్షలు కాగా.. 2017 సెప్టెంబర్ చివరి నాటికి ఆధార్ జారీ అయిన వారి సంఖ్య 1.09 కోట్లకు చేరింది. ఆధార్ నమోదులో ఢిల్లీ రెండో స్థానంలో, ముంబై మూడో స్థానంలో, బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 4
14. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారికి స్థానికత కల్పించే గడువును కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎంతకాలం పొడిగించింది ?
1) ఒక సంవత్సరం
2) రెండేళ్లు
3) మూడేళ్లు
4) నాలుగేళ్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే వారికి స్థానికత కల్పించడానికి ఉన్న గడువుని మరో రెండేళ్లు పెంచే ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. తొలుత విధించిన గడువు 2017 జూన్ 2తో ముగియగా మరో రెండేళ్లు పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.
- సమాధానం: 2
15. ప్రపంచ ఫార్ములా వన్ టైటిల్ - 2017 విజేత ఎవరు ?
1) సెబాస్టియన్ వెటెల్
2) వాల్తెరి బొటాస్
3) డేనియల్ రిక్కీయార్డో
4) లూయిస్ హామిల్టన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బ్రిటన్‌కు చెందిన మెర్సిడిస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగోసారి ఫార్ములావన్ ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ సీజన్లో 9 రేసుల్లో గెలిచి 333 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
- సమాధానం: 4
16. ‘‘డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణలు’’ పేరిట ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 100
2) 130
3) 142
4) 150
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘‘డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణలు’’ పేరిట ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో భారత్ 100వ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే ర్యాంకింగ్స లో భారత్ 130వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ తొలి స్థానంలో, సింగపూర్ రెండో స్థానంలో, డెన్మార్క్ మూడో స్థానంలో, దక్షిణ కొరియా నాలుగో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 1
1) జపాన్
2) ఆస్ట్రేలియా
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ ట్రామ్ సర్వీసులు చైనాలో ప్రారంభమయ్యాయి. నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని తంగ్షన్‌లో కమర్షియల్ సర్వీసులను అందించనున్నారు. మూడో బోగీలతో కూడిన ట్రామ్ లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. ఇది గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- సమాధానం: 3
18. ఇటీవల టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగీస్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి ?
1) స్విట్జర్లాండ్
2) రష్యా
3) అమెరికా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ ఇటీవల ప్రొఫెషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. హింగిస్ కెరీర్లో 5 సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 25 గ్రాండ్ స్లామ్స్ సాధించింది.
- సమాధానం: 1
19. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సీరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత ఎవరు ?
1) కెంటా నిషిమోటో
2) కిడాంబి శ్రీకాంత్
3) లిన్ డాన్
4) లీ చోంగ్ నీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సీరీస్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ గెలుచుకున్నాడు. ఫైనల్లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోను ఓడించి శ్రీకాంత్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
- సమాధానం: 2
20. అంతర్జాతీయ టీ 20ల్లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్ మెన్ ఎవరు ?
1) రిచర్డ్ లెవీ
2) గ్రిస్ గేల్
3) డేవిడ్ మిల్లర్
4) బ్రెండన్ మెక్ కల్లమ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ బంగ్లాదేశ్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో 35 బంతుల్లో వంద పరుగులు చేసి అంతర్జాతీయ టీ 20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్ లెవీ న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో నమోదు చేసిన సెంచరీ రికార్డుని తిరగరాశాడు.
- సమాధానం: 3
21. భారత్‌లో తొలిసారి జరిగిన అండర్ - 17 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను ఏ దేశం గెలుచుకుంది ?
1) ఇంగ్లండ్
2) స్పెయిన్
3) ఫ్రాన్స్
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ఫిఫా అండర్ - 17 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5-2 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది. ఇంగ్లండ్ ప్లేయర్ ఫాడెన్‌కు ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు లభించింది.
- సమాధానం: 1
22. ప్రో కబడ్డీ లీగ్ - 2017 టైటిల్‌ను ఏ జట్టు గెలుచుకుంది ?
1) గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్
2) తెలుగు టైటాన్స్
3) పట్నా పైరేట్స్
4) దబాంగ్ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రో కబడ్డీ లీగ్ సీజన్ - 5 విజేతగా పట్నా పైరేట్స్ నిలిచింది. ఫైనల్లో పట్నా పైరేట్స్ 55-38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. తద్వారా వరుసగా మూడోసారి టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 3
23. జాతీయ దర్యాప్తు సంస్థ - NIA డైరక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) శరద్ కుమార్
2) యోగేశ్ చందర్ మోదీ
3) అలోక్ కుమార్ వర్మా
4) సుదీప్ లఖ్తాకియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: జాతీయ దర్యాప్తు సంస్థ డెరైక్టర్ జనరల్‌గా శరద్ కుమార్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి యోగేశ్ చందర్ మోదీ అక్టోబర్ 30న బాధ్యతలు చేపట్టారు. ఆయన 2021 మే 31 వరకు పదవిలో కొనసాగుతారు.
- సమాధానం: 2
24. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించే నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డు - 2017కు ఎంపికై న రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
వివరణ: నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డు - 2017కు ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం(ఏపీ ఓబీఎంఎస్) అప్లికేషన్ ఎంపికైంది. ఈ - గవర్నెన్స్‌లో ఉత్తమ కంప్యూటర్ అప్లికేషన్‌కు ఈ అవార్డు అందజేస్తారు.
- సమాధానం: 3
1) గిరీష్ కర్నాడ్
2) అరుంధతి రాయ్
3) సల్మాన్ రష్దీ
4) విక్రమే సేథ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీష్ కర్నాడ్ 2017 సంవత్సరానికి గాను టాటా లిటరేచర్ లైవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. నాటక రంగానికి అందించిన సేవలకు గాను ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
- సమాధానం: 1
26. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ?
1) 1940
2) 1945
3) 1950
4) 1955
- View Answer
- సమాధానం: 2
వివరణ: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. లీగ్ ఆఫ్ నేషన్స్ స్థానంలో UNను ఏర్పాటు చేశారు. 51 దేశాలతో ప్రారంభమైన యూఎన్ఓలో ప్రస్తుతం 193 దేశాలకు సభ్యత్వం ఉంది. ప్రపంచ శాంతి, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక - ఆర్థిక అభివృద్ధికిదోహద పడటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
- సమాధానం: 2
27. బ్రిటిష్ పాలనపై భారత్ జరిపిన స్వాతంత్ర్య ఉద్యమంలో ఏ పోరాటాన్ని మొదటి స్వాతంత్ర్య సమరంగా గుర్తిస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1) సిపాయి తిరుగుబాటు
2) సహాయ నిరాకరణ
3) పైకా తిరుగుబాటు
4) ఉప్పు సత్యాగ్రహం
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో ఆంగ్లేయుల పాలనపై ఒడిశాలోని పైకా సైనికులు 1817లో తిరుగుబాటు చేశారు. దీన్ని మొదటి స్వాతంత్ర సమరంగా గుర్తిస్తామని, వచ్చే ఏడాది నుంచే చరిత్ర పాఠ్యపుస్తకాల్లో దీన్ని చేరుస్తామని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పైకా తిరుగుబాటు ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
రెండు వందల ఏళ్ల క్రితం గజపతిరాజులు ఒడిశా ప్రాంతాన్ని పాలించారు. వారి సైన్యమే పైకా. వీరిపై బ్రిటిష్ సైన్యం పెత్తనం, అణచివేతకు వ్యతిరేకంగా బక్సీ జగబంధు బిద్యాధర నాయకత్వంలో పైకా సైనికులు 1817లో బ్రిటిష్ పెత్తనంపై తిరగబడ్డారు. కాగా 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటుని ఇప్పటి వరకు మొదటి స్వాతంత్ర్య సమరంగా పరిగణిస్తున్నారు.
- సమాధానం: 3
28. వరల్డ్ పోలియో డేని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) అక్టోబర్ 24
2) అక్టోబర్ 26
3) అక్టోబర్ 28
4) అక్టోబర్ 30
- View Answer
- సమాధానం: 1
వివరణ: శాస్త్రవేత్త జొనాస్ సాల్క్ నేతృత్వంలోని పరిశోధక బృందం.. పోలియో మెలిటస్ (పోలియో వైరస్) నిరోధక టీకాలను కనుగొన్నారు. అక్టోబర్ 24న జొనాస్ జయంతిని పురస్కరించుకొని వరల్డ్ పోలియే డేని రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు 1988లో గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్(GPEI)ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించిన సమయంలో 125 దేశాల్లో పోలియో ఉండేది. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది.
- సమాధానం: 1
29. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ సోలార్ మిషన్‌లో భాగంగా భారతీయ రైల్వే తొలిసారి ఎన్ని మెగావాట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది ?
1) 5 మెగావాట్లు
2) 10 మెగావాట్లు
3) 20 మెగావాట్లు
4) 30 మెగావాట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతీయ రైల్వే తొలిసారి తన వ్యవస్థలో 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. హజ్రత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, ఢిల్లీ రైల్వే స్టేషన్ల పై కప్పులపై వీటిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేకు ఉన్న నెట్వర్క్ ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం.
- సమాధానం: 1
30. హృదయనాథ్ మంగేస్కర్ అవార్డు - 2017ను ఎవరికి ప్రకటించారు ?
1) సంజయ్ లీలా బన్సాలీ
2) అనుపమ్ ఖేర్
3) జావేద్ అఖ్తర్
4) విజయేంద్ర ప్రసాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: హృదయనాథ్ మంగేస్కర్ అవార్డుని ప్రముఖ కవి, రచయిత జావేద్ అఖ్తర్ అందుకున్నారు. ఈయన 1999లో పద్మశ్రీ, 2007లో పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. 2009లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు హృదయనాథ్ మంగేస్కర్ పేరిట హృదయేష్ ఆర్ట్స సంస్థ 2011లో ఈ అవార్డుని ఏర్పాటు చేసింది.
- సమాధానం: 3
31. ఇటీవల 14వ సార్క్ లా (SAARCLAW) కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) కొలంబో
3) ఢాకా
4) థింపు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 14వ SAARCLAW (South Asian Association for regional cooperation in Law) సమావేశం శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగింది. వీటితో పాటు 11వ సార్క్ ప్రధాన న్యాయమూర్తుల సమావేశాలు కూడా ఇక్కడే జరిగాయి.
- సమాధానం: 2
32. దేశంలోని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి ?
1) ఇండియా ఇంటర్నెట్
2) బ్రౌజ్ ఇండియా
3) భారత్ నెట్
4) హిందుస్తాన్ నెట్ వర్క్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు 2012లో భారత్‌నెట్ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులోని తొలి దశ 2017 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఇటీవల కేంద్రం ప్రకటించింది. తొలి దశలో దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
- సమాధానం: 3
33. భారత్‌లో తొలిసారి ప్రైవేటు షిప్ యార్డులో నిర్మితమైన ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్(OPV) ఏది ?
1) విక్రమ్
2) సర్యు
3) సమర్థ్
4) సుభద్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: నిఘా నౌక విక్రమ్‌ను లార్సన్ అండ్ టౌబ్రో కంపెనీ కట్టుపల్లి షిప్ యార్డులో నిర్మించింది. ఇది ప్రైవేటు షిప్ యార్డులో నిర్మితమైన తొలి ఓపీవీ నౌక. ఎల్ అండ్ టీ ఇటీవల ఈ నౌకను ఇండియన్ కోస్ట్ గార్డుకి అప్పగించింది. 2018 ఏప్రిల్‌లో ఈ నౌక విధుల్లో చేరుతుంది.
- సమాధానం: 1
34. భారత్ నుంచి ఆఫ్గనిస్తాన్‌కు సరకు రవాణాలో కీలకంగా మారిన ఛాబాహార్ పోర్ట్ ఏ దేశంలో ఉంది ?
1) భారత్
2) ఇరాన్
3) పాకిస్తాన్
4) ఆఫ్గనిస్తాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఛాబాహార్ పోర్ట్ ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలో ఉంది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. భారత్ ఇటీవల 1.1 మిలియన్ టన్నుల గోధుములను ఆఫ్గనిస్తాన్‌కు ఈ పోర్ట్ మీదుగా సరఫరా చేసింది. తమ దేశం మీదుగా రవాణాకుపాకిస్తాన్ అడ్డు చెబుతున్న నేపథ్యంలో ఛాబాహార్ పోర్ట్ భారత్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్ దేశాల మధ్య వ్యాపార సంబంధాల బలోపేతంలో కీలకంగా మారింది.
- సమాధానం: 2
35. గ్లోబల్ వైల్డ్ లైఫ్ కాన్ఫరెన్స్ - 2020 ఎక్కడ జరగనుంది ?
1) భారత్
2) జపాన్
3) ఆస్ట్రేలియా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2020 గ్లోబల్ వైల్డ్ లైఫ్ కాన్ఫరెన్స్‌ను భారత్ నిర్వహిస్తుందని ది యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్(UNEP) ఇటీవల ప్రకటించింది. Convention on the conservation of migratory species of wild animals(CMS) conference of parties 13(CMS COP13) పేరుతో ఈ సమావేశాలని నిర్వహిస్తారు. COP 12 సమావేశాలు ఇటీవల ఫిలిప్పీన్‌స రాజధాని మనీలాలో జరిగాయి.
COP 12 Theme : Their Future is our Future :Sustainable development for wildlife and people.
- సమాధానం: 1
36. PHD చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి 2017 సంవత్సరానికి గాను లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న వారు ఎవరు ?
1) ఓం పూరి
2) అమితాబ్ బచ్చన్
3) షర్మిలా ఠాగూర్
4) ధర్మేంద్ర
- View Answer
- సమాధానం: 3
వివరణ: PHD చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి 2017 సంవత్సరానికి గాను లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుని సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేశారు.
- సమాధానం: 3
37. క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ ఎనలిటిక్స్ విధానాల ద్వారా రైతుల పంట దిగుబడులు పెంచేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ ఎనలిటిక్స్ విధానాలను రైతులకు చేరువ చేసి పంట దిగుబడులు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 2
38. ఆర్టికల్ - 35A ఏ రాష్ట్రానికి సంబంధించినది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) జమ్ము అండ్ కశ్మీర్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జమ్ము కశ్మీర్లో శాశ్వత నివాసులు అన్న పదాన్ని నిర్వచించడానికి, వారికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పించేందుకు ఆ రాష్ట్ర శాసనభకు ఆర్టికల్ 35ఏ అధికారం ఇస్తోంది. రాజ్యాంగ సవరణ లేకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులు ద్వారానే 1954లో ఆర్టికల్ 370 ప్రకారం ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి చెందిన వి ద సిటిజన్స సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఇది సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.
- సమాధానం: 3
39. టెలికం నెట్‌వర్క్‌ల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను 2022-23 నాటికి ఎంత శాతం తగ్గించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించింది ?
1) 10 శాతం
2) 20 శాతం
3) 30 శాతం
4) 40 శాతం
- View Answer
- సమాధానం: 4
వివరణ: టెలికం రంగాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు ఈ రంగంలోని వ్యవస్థల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను 2022-23 నాటికి 40 శాతం తగ్గించాలని ట్రాయ్ ఇటీవల ప్రతిపాదించింది.
- సమాధానం: 4
40. ఏ రాష్ట్రంలో ప్రజా సేవల వ్యవస్థలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆసియా అభివృద్ధిబ్యాంకు మధ్య 300 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదిరింది ?
1) బిహార్
2) పశ్చిమ బెంగాల్
3) ఉత్తరాఖండ్
4) ఛత్తీస్ గఢ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ రుణంతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్థిక సంస్థల బలోపేతానికి కావాల్సిన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు 5 లక్షల డాలర్ల సహాయం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు అంగీకరించింది.
- సమాధానం: 2
41. వాయు కాలుష్యాన్ని తగ్గించేందకు ఏ రాష్ట్రంలోని పరిశ్రమల్లో పెట్రోలియం కోక్, ఫర్నేస్ ఆయిల్ వాడకాన్ని ఇటీవల సుప్రీం కోర్టు నిషేధించింది ?
1) ఉత్తరప్రదేశ్
2) హర్యానా
3) రాజస్థాన్
4) పై మూడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ రాష్ట్రాల్లో ఆయా రసాయనాల వినియోగాన్ని నిషేధించడంతో పాటు దేశ రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలకు పొల్యుషన్ ఎమిషన్ స్టాండర్డ్స్‌ను ఖరారు చేయనందుకుగాను కేంద్ర పర్యావరణ శాఖకు సుప్రీంకోర్టు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది.
- సమాధానం: 4
42. దౌత్య సంబంధాల్లో భాగంగా భారత్ ఈ కిందివాటిలో ఏ దేశంలో గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది ?
1) బంగ్లాదేశ్
2) శ్రీలంక
3) నేపాల్
4) భూటాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: శ్రీలంక దక్షిణ పోర్ట్ సిటీ అయిన హంబన్ టోటాలో 1200 ఇళ్ల నిర్మాణానికి ఇటీవల భారత్, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. 50 మోడల్ గ్రామాల్లో 60 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మిస్తారు. ఉత్తర, తూర్పు శ్రీలంకలో 50,000 వేల ఇళ్ల నిర్మాణానికి భారత్ గతంలోనే అంగీకారం తెలిపింది. కాగా ఇందులో 46,000 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.
- సమాధానం: 2
43. కింది వాటిలోని ఏ భారతీయ పదాలను ఇటీవల విడుదలైన ఆక్సఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ తాజా ఎడిషన్‌లో కొత్తగా చేర్చారు ?
1) సూర్య నమస్కార్
2) అన్నా
3) బాపు
4) పై మూడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: సెప్టెంబర్‌లో విడుదలైన ఆక్సఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ 2017 ఎడిషన్‌లో కొత్తగా 70 భారతీయ పదాలను చేర్చారు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషలలోని పదాలు కొత్తగా ఈ డిక్షనరీలో చేరాయి. మొత్తంగా తాజా ఎడిషన్‌లో కొత్తగా వెయ్యి పదాలను చేర్చారు.
- సమాధానం: 4
44. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ కోటా రిజర్వేషన్లను 21 శాతం నుంచి 26 శాతానికి పెంచింది ?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) పంజాబ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాజస్థాన్‌లో ఓబీసీ రిజర్వేషన్లను 21 శాతం నుంచి 26 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రత్యేక వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న గుజ్జార్ కమ్యూనిటీ ఉద్యమాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 1
45. న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) బిల్ ఇంగ్లీష్
2) విన్ స్టన్ పీటర్స్
3) జకిండా ఆర్డెన్
4) హెలెన్ క్లార్క్
- View Answer
- సమాధానం: 3
వివరణ: న్యూజిలాండ్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లేబర్ పార్టీకి చెందిన 37 ఏళ్ల జకిండా ఎర్డిన్.. 150 ఏళ్లలో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అతి చిన్న మహిళగా గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోయినా న్యూ న్యూజిలాండ్ ఫస్ట్, గ్రీన్స్ పార్టీలు ఆమెకు మద్దతు తెలిపాయి. దీంతో ఆమె సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 3
46. ఐసీసీ 2017 అక్టోబర్ 30న వెల్లడించిన వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం తొలి స్థానంలో ఉన్న బ్యాట్స్ మెన్ ఎవరు ?
1) విరాట్ కోహ్లీ
2) బాబార్ అజామ్
3) ఏబీ డెవిలయర్స్
4) డేవిడ్ వార్నర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 అక్టోబర్ 30న ఐసీసీ వెలువరించిన ర్యాంకింగ్స్ ప్రకారం విరాట్ కోహ్లీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 7వ ర్యాంకులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డెవిలియర్స్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నారు. మహిళా క్రికెట్ వన్డే బ్యాట్స్ఉమెన్ ర్యాంకింగ్స్‌లో మిథాలీ రాజ్ తొలిస్థానంలో ఉంది.
- సమాధానం: 1
47. ప్రపంచ నగరాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) అక్టోబర్ 31
2) అక్టోబర్ 29
3) అక్టోబర్ 27
4) అక్టోబర్ 25
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 Theme : Innovative governance, open cities.
- సమాధానం: 1
48. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటషన్ల విచారణ బాధ్యతను సుప్రీంకోర్టు ఎవరికి అప్పగించింది ?
1) పార్లమెంటరీ కమిటీ
2) రాజ్యాంగ ధర్మాసనం
3) ప్రత్యేక కమిటీ
4) ఎవరు కాదు
- View Answer
- సమాధానం: 2
49. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స మెన్లలో సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నది ఎవరు ?
1) విరాట్ కోహ్లీ
2) రికీ పాంటింగ్
3) కుమార సంగక్కర
4) హసీం ఆమ్లా
- View Answer
- సమాధానం: 1
వివరణ: వన్డేల్లో అత్యధిక సెంచరీల జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో (49 సెంచరీలు) ఉన్నాడు. విరాట్ కోహ్లీ రికీ పాంటింగ్‌ను (30 సెంచరీలు) అధిగమించి ఇటీవల రెండో స్థానానికి చేరుకున్నాడు.
- సమాధానం: 1
50. భారత్‌లో పదాతిదళాల దినోత్సవాన్ని (Infantry Day) ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) అక్టోబర్ 21
2) అక్టోబర్ 23
3) అక్టోబర్ 25
4) అక్టోబర్ 27
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1947లోజమ్ము అండ్ కశ్మీర్‌పై గిరిజన బృందాలు పాకిస్తాన్ సైన్యం సహాయంతో దండయాత్ర చేశాయి. అప్పటి భారత ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ ఆదేశాలతో సిక్ రిజైమ్లోని ఫస్ట్ బెటాలియన్ దళాలు గిరిజన సేనల దండయాత్రను అడ్డుకున్నాయి. స్వాతంత్ర్యం తర్వాత భారత సైన్యం జరిపిన తొలి ఇన్ఫాంట్రీ యాక్షన్ ఇదే. దీనికి గుర్తుగా ఏటా అక్టోబర్ 27న పదాతిదళాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 4