కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 1 - 8, 2017) బిట్ బ్యాంక్
1. అగ్రికల్చర్ ఔట్లుక్ 2017-2026 నివేదిక ప్రకారం ప్రపంచ బీఫ్ ఎగుమతిలో భారత్ ఏ స్థానంలో ఉంది ?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆహార, వ్యవసాయ సంస్థ (FAO), ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(OECD) విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ బీఫ్ ఎగుమతిలో బ్రెజిల్ తొలి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో భారత్ ఉంది. 2016లో భారత్ నుంచి 1.56 మిలియన్ టన్నుల బీఫ్ ఎగుమతి అయ్యింది.
- సమాధానం: 3
2. ప్రతిష్టాత్మక మోహన్ భగన్ రత్న పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) సుబ్రత భట్టాచార్య
2) జులన్ గోస్వామి
3) బల్వంత్ సింగ్
4) దీపా షాసాహ
- View Answer
- సమాధానం: 1
వివరణ: మోహన్ భగన్ క్లబ్ మాజీ కెప్టెన్ సుబ్రతా భట్టా చార్య మోహన్ భగన్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. భారత మహిళ క్రికెట్ జట్టు ప్లేయర్ జూలన్ గోస్వామి ప్రత్యేక పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 1
3. డీఆర్డీవో ఇటీవల తయారు చేసిన మానవ రహిత యుద్ధ ట్యాంక్ పేరు ఏమిటి ?
1) యుద్ధ్
2) మంత్ర
3) విజన్
4) రోడ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నిఘా, మందుపాతరులను కనుగొనటం, అణు - జీవ ప్రమాదాలను ముందే పసిగట్టడం కోసం డీఆర్డీవో మానవ రహిత మంత్ర ట్యాంకులను తయారు చేసింది. వీటిని రిమోట్ ద్వారా నడుపుతారు.
డీఆర్డీవో ప్రస్తుత చైర్మన్ - ఎస్ క్రిస్టోఫర్
- సమాధానం: 2
4. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఆగస్టు 8
2) ఆగస్టు 5
3) ఆగస్టు 1
4) జూలై 29
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో.. ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని తీర్మానించారు.
2017 Slogan : Fresh Ecology for Tigers Protection
- సమాధానం: 4
5. 7వ సార్క్ కళాకారుల క్యాంప్ మరియు ఎగ్జిబిషన్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) ఖాట్మాండ్
3) ఢాకా
4) రంగూన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఖాట్మాండులో 4 రోజుల పాటు 7వ సార్క్ కళాకారుల క్యాంప్ మరియు ఎగ్జిబిషన్‌ను ఎక్కడ నిర్వహించారు.
- సమాధానం: 2
6. అంగ్‌కోర్‌వాట్ దేవాలయం పునరుద్ధరణకు కృషి చేసినందుకు గాను రామన్ మెగససే అవార్డుకు ఎంపికైంది ఎవరు ?
1) యోషికియా ఇషిజావా
2) గెట్సీ షణ్ముగం
3) అబ్బాన్ నబ్బన్
4) టోనీ టే
- View Answer
- సమాధానం: 1
వివరణ: కాంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్ దేవాలయం పునరుద్ధరణకు కృషి చేసినందుకు గాను జపాన్‌కు చెందిన యోషికియా ఇషిజావా రామన్ మెగససే అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీలంకలో ఎల్టీటీఈపై యుద్ధం సమయంలో అనాథలను, బాధిత ప్రజలను కాపాడినందుకు గాను గెట్సీ షణ్ముగం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సింగపూర్‌కు చెందిన టోనీ టే 1983 నుంచి పేదలకు, వృద్ధులకు, వలస వచ్చిన వారికి ఉచితంగా భోజనం అందిస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.
- సమాధానం: 1
7. చైనా ఇటీవల దేని నుంచి సహజవాయువును ఉత్పత్తి చేసింది ?
1) బ్యూటెన్ హైరిన్
2) ప్రొపెన్ హైడ్రేట్
3) హైడ్రో కార్బన్
4) మీథేన్ హైడ్రేట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో లభించే మీథేన్ హైడ్రేట్ ( ఫ్లేమేబుల్ ఐస్ ) నుంచి చైనా సహజ వాయువును తయారు చేసింది. మీథేన్ హైడ్రేట్.. అత్యంత ఎక్కువగా మండే స్వభావం ఉన్న ఇంధనం.
- సమాధానం: 4
8. FINA ప్రపంచ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
1) బుడాపెస్ట్
2) బుకారెస్ట్
3) వియన్నా
4) స్టుట్గార్ట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ఈ చాంపియన్‌షిప్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో కెల్లెట్ డ్రెస్సెల్ ఒకే రోజు మూడు బంగారు పతకాలు గెలుపొందింది.
- సమాధానం: 1
9. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఆగస్టు 1
2) జూలై 30
3) జూలై 25
4) జూలై 20
- View Answer
- సమాధానం:
వివరణ: మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా జూలై 30న నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది.
2017 Theme : Act to protect and assist trafficked persons.
- సమాధానం:
10. ప్రతిష్టాత్మక లాగోస్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) మనుఅత్రి
2) బి సుమేథ్
3) రాహుల్ యాదవ్
4) కరణ్ రాజన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ టోర్నీ నైజీరాయాలో జరిగింది. ఇందులో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రాహుల్ యాదవ్, పురుషుల డబుల్స్ టైటిల్‌ను మనుఅత్రి, బి సుమేథ్ గెలుపొందారు.
- సమాధానం: 3
11. హంగేరియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ టైటిల్ విజేత ఎవరు ?
1) సెబాస్టియన్ వెటల్
2) డెనియల్ రిక్కీ యార్డో
3) రైక్కో నెన్
4) లేవిస్ హామిల్టన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: హంగేరియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసులో సెబాస్టియన్ వెటల్ తొలి స్థానంలో నిలిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు. మొదటి రన్నరప్‌గా కిమ్ రైక్కో నెన్ నిలిచాడు.
- సమాధానం: 1
12. 19వ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య వ్యాపార కమిటీ సమావేశాన్ని ఎక్కడన నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) కాన్పూర్
3) గోవా
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు ( 10 దేశాలు) సంయుక్తంగా ఈ కమిటీని 2012లో ఏర్పాటు చేశాయి. RECPతో ఆరు దేశాలు స్వేచ్ఛా వర్తక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, చైనా, దక్షిణ కొరియా, భారత్.
- సమాధానం: 4
13. ఇటీవల ఆమోదం పొందిన రాజ్యాంగ సవరణ 123 దేనికి సంబంధించిన ది ?
1) ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం
2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన
3) సాంఘిక, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు
4) బ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 123వ రాజ్యాంగ సవరణ ప్రకారం 338B, 342A ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో కొత్తగా చేర్చారు. 338B ఆర్టికల్ ప్రకారం జాతీయ బీసీ కమిషన్ నిర్మాణం మరియు విధులు.. 342A ప్రకారం రాష్ట్రపతికి సాంఘిక మరియు విద్యా పరంగా వెనుకబడిన వారితో కూడిన జాబితా తయారు చేసే అధికారం ఉంటుంది.
- సమాధానం: 3
14. ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉపశమనం కింద కేంద్ర ఎంత ప్యాకేజీని ప్రకటించింది ?
1) రూ.1000 కోట్లు
2) రూ.2,350 కోట్లు
3) రూ.3,500 కోట్లు
4) రూ.5,600 కోట్లు
- View Answer
- సమాధానం: 2
15. చైనా ఇటీవల ఏ ప్రాంతంలో తొలి మిలిటరీ బేస్‌ను ఏర్పాటు చేసింది ?
1) డిలినోవా
2) జి బౌటి
3) శ్రీలంక
4) మార్షల్ దీవులు
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనా మిలటరీని ఏర్పాటు చేసి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జి బౌటిలో తొలి విదేశీ మిలటరీ బేస్‌ను ఏర్పాటు చేసింది. జి బౌటి తూర్పు ఆఫ్రికాలో ఉంది.
- సమాధానం: 2
16. భారత్‌లో ప్రారంభమైన తొలి పేమెంట్స్ బ్యాంకు ఏది ?
1) పేటీఎం
2) జియో మనీ
3) ఎయిర్టెల్ మనీ
4) ఐడియా మనీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్‌లో తొలి పేమెంట్స్ బ్యాంకుని ఎయిర్టెల్.. ఎయిర్టెల్ మనీ పేరుతో ప్రారంభించింది. ఇందుకోసం ఎయిర్టెల్ హెచ్పీసీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం హెచ్‌పీసీఎల్‌కు చెందిన 14 వేల పెట్రోల్ బంక్‌లలో ఎయిర్టెల్ బ్యాంకింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు.
- సమాధానం: 2
17. ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు ?
1) ముఖేశ్ అంబానీ
2) లికా షింగ్
3) సునీల్ మిట్టల్
4) జాక్ మా
- View Answer
- సమాధానం: 4
వివరణ: బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 43.75 బిలియన్ డాలర్ల సంపదతో జాక్ మా ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 35.2 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ రెండో స్థానంలో, హాంకాంగ్‌కు చెందిన లికాషింగ్ మూడో స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 4
18. 2024లో ఏ దేశం సమ్మర్ ఒలింపిక్స్‌ను నిర్వహించనుంది ?
1) ఫ్రాన్స్
2) లాస్ ఏంజెల్స్
3) ఇంగ్లండ్
4) కెనడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2024లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సమ్మర్ ఒలింపిక్స్ జరగనుంది. 2028లో లాస్ ఏంజె ల్స్ వేదికగా ఒలింపిక్స్ జరుగుతుంది.
- సమాధానం: 1
19. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఎప్పడు నిర్వహిస్తారు ?
1) జూలై నెల చివరి వారం
2) ఆగస్టు తొలి వారం
3) ఆగస్టు మూడో వారం
4) సెప్టెంబర్ తొలివారం
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1992 నుంచి యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు తొలి వారంలో(1-7) ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తారు.
2017 Theme : Sustaining breast breeding together.
- సమాధానం: 2
20. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ తయారు చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎంత మంది యువత ఇంటర్నెట్ వాడుతున్నారు ?
1) 200 మిలియన్ల మంది
2) 490 మిలియన్ల మంది
3) 830 మిలియన్ల మంది
4) 1000 మిలియన్ల మంది
- View Answer
- సమాధానం: 3
వివరణ: ICT ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్ - 2017 పేరుతో ప్రపంచ ఇంటర్నెట్ వినియోగదారుల జాబితాను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం 830 మిలియన్ల మంది యువత ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. ఇందులో 39 శాతం మంది భారత్, చైనా నుంచే ఉన్నారు.
- సమాధానం: 3
21. భారత్ ఇటీవల ఏ దేశంతో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదుర్చుకుంది ?
1) సోమాలియా
2) జి బౌటి
3) నైజీరియా
4) జింబాబ్వే
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 ఆగస్టు 1న భారత్, సోమాలియా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరింది.
- సమాధానం: 1
22. ఇటీవల ప్రపంచ బ్యాంకు ఏ నదిపై నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది ?
1) నర్మదా నది
2) తీస్తా
3) ఫెని
4) జీలం
- View Answer
- సమాధానం: 4
వివరణ: జీలం, చీనాబ్ నదులపై భారత్ చేపట్టిన జల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు ఇటీవల అనుమతి ఇచ్చింది. పాకిస్తాన్ ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ 2016లో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది.
- సమాధానం: 4
23. బ్రిక్స్ దేశాల వ్యాపార మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) మాస్కో
2) పరత్య్
3) షాంఘై
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ సమావేశంలో భారత తరపున అప్పటి వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.
- సమాధానం: 3
24. ఆది పెరుక్కు ఉత్సవాలను ఏ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు ?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) కేరళ
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆది పెరుక్కు ఉత్సవాలను తమిళనాడులో నిర్వహిస్తారు. ఆ రాష్ట్ర క్యాలెండర్లో ఆది నెల ప్రారంభంలో ఈ వేడుకలు జరుపుతారు.
- సమాధానం: 2
25. అమెరికా ఇటీవల ఏ దేశానికి తమ దేశ పర్యాటకులు వెళ్లకూడదని హెచ్చరించింది ?
1) ఉత్తరకొరియా
2) చైనా
3) భారత్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
26. ఇరాన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) ఇబ్రహీం రైస్సీ
2) ఆయుతుల్లా ఖైమైని
3) అహమ్మద్ నెజాది
4) హసన్ రౌహాని
- View Answer
- సమాధానం: 4
వివరణ: హసన్ రౌహాని రెండోసారి ఇరాన్ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రౌహానికి 57 శాతం ఓట్లు వచ్చాయి.
- సమాధానం: 4
27. Incred సంస్థ ఇటీవల ఎవరిని సౌహార్థ రాయబారిగా నియమించింది ?
1) అమితాబ్ బచ్చన్
2) అనుష్క శర్మ
3) సల్మాన్ ఖాన్
4) రాహుల్ ద్రవిడ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ముంబయికి చెందిన Incred అనే ప్రముఖ ఆర్థిక సేవల గ్రూప్ రాహుల్ ద్రవిడ్‌ను సౌహార్థ రాయబారిగా నియమించుకుంది.
- సమాధానం: 4
28. పంజాబ్ ప్రభుత్వం ఇటీవల ఏ క్రీడాకారిణిని డీఎస్పీగా నియమించింది ?
1) దీపా మాలిక్
2) హర్మన్ ప్రీత్‌కౌర్
3) రవీందర్ కౌర్
4) జులన్ గోస్వామి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ - 2017 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 115 బంతుల్లో 171 పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్.. భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. ఇందుకు గుర్తింపుగా పంజాబ్ ప్రభుత్వం ఆమెను డీఎస్పీగా నియమించింది.
- సమాధానం: 2
29. ఎయిర్టెల్ సంస్థ.. టెలీనార్ను విలీనం చేసుకోవడం ద్వారా ఎన్ని సర్కిళ్లలో అదనపు స్పెక్ట్రమ్‌ను పొందనుంది ?
1) 7
2)15
3)19
4) 23
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎయిర్‌టెల్‌లో టెలీనార్ విలీనానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అస్సాం టెలీ సర్కిళ్లలో స్పెక్ట్రమ్, లెసైన్స్, నిర్వహణ, ఉద్యోగులు, 44 మిలియన్ల వినియోగదారులను ఎయిర్టెల్ పొందనుంది.
- సమాధానం: 1
30. ఏ సర్టిఫికెట్ పొందేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది ?
1) డెత్ సర్టిఫికెట్
2) కుల ధృవీకరణ
3) ఆస్తుల రిజిస్ట్రేషన్
4) వాహనాల రిజిస్ట్రేషన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ నిబంధనను జమ్ము కశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో మినహాయించారు.
- సమాధానం: 1
31. ఇటీవల ఏ రాష్ట్రం విద్యార్థుల ఉత్తీర్ణత పెంచటానికి ఆర్.కే. మహజన్ కమిటీని ఏర్పాటు చేసింది ?
1) తెలంగాణ
2) కేరళ
3) ఉత్తరప్రదేశ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: విద్యా బోధనలో సత్ఫలితాలు సాధించని 50 ఏళ్లకు పైబడిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను రాజీనామా చేయాలని కమిటీ సూచించింది.
- సమాధానం: 4
32. దేశంలోనే తొలిసారి హెలీ టాక్సీ సేవలను ఏ నగరంలో ప్రారంభించారు ?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) న్యూఢిల్లీ
4) ముంబయి
- View Answer
- సమాధానం: 2
వివరణ: తంబి ఏవియేషన్, బెంగళూరు అంతర్జాతీయ ఎయిల్ లిమిటెడ్ సంయుక్తంగా దేశంలోనే తొలిసారిగా హెలీ టాక్సీ సేవలను బెంగళూరు ఎయిర్పోర్ట్, ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రారంభించాయి.
- సమాధానం: 2
33. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం జపాన్, భారత్ కోఆర్డినేషన్ ఫోరమ్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది ?
1) బెంగళూరు
2) న్యూఢిల్లీ
3) కోహిమ
4) గౌహతి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈశాన్య రాష్ట్రాలలో రోడ్డు మార్గాల ఏర్పాటు, విపత్తు నిర్వహణ, ఆహార ప్రాసెసింగ్, ఆర్గానిక్ ఫామింగ్, పర్యాటకరంగ అభివృద్ధి కోసం జపాన్ - ఇండియా కో ఆర్డినేషన్ ఫోరమ్ ఏర్పడింది.
- సమాధానం: 2
34. ఇటీవల ఏ దేశం విదేశీయులకు పౌరసత్వం ఇచ్చింది ?
1) సౌదీ అరేబియా
2) ఇరాన్
3) ఖతార్
4) కువైట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఖతార్ మహిళలు విదేశీయులను పెళ్లి చేసుకొని పిల్లలకు కలిగి ఉన్నట్లయితే.. ఆ పిల్లలకు ఖతార్ పౌరసత్వం ఇస్తూ ఖతార్ ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది.
- సమాధానం: 3
35. ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న రచయిత్రి ఎవరు ?
1) పౌల్ హాకిన్స్
2) ఇఎల్ జెమ్
3) జే కే రౌలింగ్
4) జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జే కే రౌలింగ్ ఈ ఏడాది 72 మిలియన్ల పౌండ్ల ఆదాయం పొందారు.
- సమాధానం: 3
36. దేశంలోనే తొలి ప్రైవేట్ క్షిపణి ఉప వ్యవస్థ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) ముంబయి
4) లక్నో
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలోనే తొలిసారిగా క్షిపణి ఉప వ్యవస్థ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో 2.5 బిలియన్ డాలర్ల వ్యయంతో కల్యాణి గ్రూప్, ఇజ్రాయెల్ రాఫెల్స్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రారంభించాయి.
- సమాధానం: 1
37. ప్రతిష్టాత్మక ప్రేమ్ నజీర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) సురేందరన్
2) శారద
3) టి.పి. మాధవన్
4) మీనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ మళయాల నటుడు ప్రేమ్ నజీర్ గౌరవార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. అవార్డు కింద రూ.75 వేల నగదు అందజేస్తారు. టి.పి. మాధవన్ ప్రత్యేక పురస్కారం కింద రూ. 50 వేల నగదు అందుకున్నారు.
- సమాధానం: 2
38. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ ఎయిర్‌పోర్ట్‌లో 1 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది ?
1) తిరుపతి
2) కడప
3) రాజమండ్రి
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 1
వివరణ: పూర్తిగా సోలార్ విద్యుత్ ఆధారంగా పనిచేస్తున్న ప్రపంచంలోనే తొలి ఎయిర్పోర్ట్.. కొచ్చిన్ విమానాశ్రయం. ఇదే తరహాలో తిరుపతి, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లను తీర్చిదిద్దేందుకు 1 మెగావాట్ల సౌరశక్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 1
39. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వం ముఖ్య స్థానంలో నియమించిన భారత సంతతి వ్యక్తి ఎవరు ?
1) నీల్ చటర్జీ
2) కృష్ణా ఆర్
3) విశాల్ అమీన్
4) పై అందరు
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత సంతతికి చెందిన ముగ్గురు అమెరికన్లు నీల్ చటర్జీ, కృష్ణా ఆర్, విశాల్ అమీన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యమైన పదవుల్లో నియమించారు.
- సమాధానం: 4
40. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ సౌహార్థ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) హృతిక్ రోషన్
2) షారూఖ్ ఖాన్
3) అక్షయ్ కుమార్
4) సునీల్ శెట్టి
- View Answer
- సమాధానం: 3
41. రువాండా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
1) ఫిలిప్పె పేమనా
2) పౌల్ కగమే
3) ఫ్రాంక్ హబీనీజా
4) ఫింల్స్ నీజానే
- View Answer
- సమాధానం: 2
వివరణ: రువాండా దేశానికి మూడోసారి అధ్యక్షుడిగా పాల్ కగమే ఎన్నికయ్యాడు. ఎన్నికలో ఈయనకు 98.66 శాతం ఓట్లు వచ్చాయి.
- సమాధానం: 2
42. పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వంలో చోటు సంపాదించుకున్న హిందువు ఎవరు ?
1) డా.దర్శన్ లాల్
2) డా.సత్యపాల్
3) డా.అమిత్ రంజన్
4) డా.రమేశ్ యాదవ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నవాజ్ షరీఫ్ స్థానంలో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన షాహీద్ ఖాన్ అబ్బాసీ.. తన క్యాబినెట్లో డా.దర్శన్ లాల్ ను మంత్రిగా నియమించారు. దీంతో.. పాకిస్తాన్లో 20 ఏళ్ల తర్వాత ఓ హిందువు మంత్రి పదవి చేపట్టాడు.
- సమాధానం: 1
43. హిరోషిమా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఆగస్టు 1
2) ఆగస్టు 3
3) ఆగస్టు 4
4) ఆగస్టు 6
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1945 ఆగస్టు 6న అమెరికా జపాన్‌లోని హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే అణు బాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఏటా ఆగస్టు 6న హిరోషిమా డేను నిర్వహిస్తారు. అమెరికా చరిత్రలో హిరోషిమాను సందర్శించి పుష్పాంజలి ఘటించిన ఏకైక అధ్యక్షుడు బరాక్ ఒబామా.
- సమాధానం: 4
44. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఆగస్టు 1
2) ఆగస్టు 3
3) ఆగస్టు 7
4) ఆగస్టు 10
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2015లో తొలిసారి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇటీవల మూడవ జాతీయ చేనేత దినోత్సవాన్ని గౌహతిలో నిర్వహించారు. చేనేత వస్త్రాల వాడకం పెంచి, చేనేత పరిశ్రమను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 3
45. ఇటీవల ఏ రైల్వేస్టేషన్‌కు దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పేరు పెట్టారు ?
1) ఖరగ్‌పూర్
2) మొగల్ వాయి
3) షెర్షా సవాయి
4) రాజ్‌గిర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పేరుని వారణాసి సమీపంలోని మొగల్ వాయి రైల్వేస్టేషన్‌కు పెట్టారు.
- సమాధానం: 2
46. ఇరాన్లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహర్ పోర్టు ఏ సంవత్సరంలోగా నిర్వహణలోకి వస్తుంది ?
1) 2018
2) 2019
3) 2020
4) 2022
- View Answer
- సమాధానం: 1
వివరణ: 6 బిలియన్ డాలర్ల వ్యయంతో భారత్ ఇరాన్‌లోని చాబహర్ రేవుని అభివృద్ధి చేస్తుంది. ఇది పూర్తయితే భారత్ - ఇరాన్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది.
- సమాధానం: 1
47. కేంద్ర ప్రభుత్వం టోకు ధరల సూచీకి ఏ సంవత్సరాన్ని ఆధారంగా ప్రకటించింది ?
1) 2004-05
2) 2011-12
3) 2013-14
4) 2015-16
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత ప్రభుత్వం టోకు ధరల సూచి (WPI) ని 2004-05 నుంచి 2011-12కు మార్చింది.
- సమాధానం: 2
48. భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) మీరాకుమార్
2) గోపాలకృష్ణ గాంధి
3) రాజీందర్ కౌర్
4) వెంకయ్యనాయుడు
- View Answer
- సమాధానం: 4
49. నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది ?
1) అరవింద్ పనగరియా
2) వి.ఎస్. సంపత్
3) రాజీవ్ కుమార్
4) వినోద్ పాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: గోఖలే ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ ఛాన్సలర్ రాజీవ్ కుమార్ నీతి ఆయోగ్‌కు నూతన వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. వినోద్ పాల్ నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా నియమితులయ్యారు.
- సమాధానం: 3
50. ఏ దేశ నావికా దళం కోసం భారత్ గస్తీ నౌకను తయారు చేసింది ?
1) బంగ్లాదేశ్
2) బహ్రెయిన్
3) ఇరాన్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఎస్ఎల్ఎన్ఎస్ సయురాల అనే తీర ప్రాంత గస్తీ నౌకను గోవా షిప్ యార్డులో నిర్మాణం చేసి శ్రీలంకకు అందించింది. ఈ నౌక పొడవు 105.7 మీటర్లు, వెడల్పు 13.6 మీటర్లు. 26 నాట్ల గరిష్ట వేగంతో ఈ నౌక ప్రయాణిస్తుంది.
- సమాధానం: 4