కరెంట్ అఫైర్స్ (2020, సెప్టెంబర్ 08-14) బిట్ బ్యాంక్
జాతీయం
1. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకు చెందిన డీపీఐఐటీ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకింగ్ 2019 లో ఏ భారతీయ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) తెలంగాణ
3) ఉత్తర ప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
2. దేశంలోనే తొలిసారిగా "అప్కా మిత్రా" పేరుతో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యా చాట్‌బోట్ లను ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్
2) హరియాణ
3) మహారాష్ట్ర
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
3. నీటి రవాణాను మెట్రోకు ఫీడర్ సేవగా అనుసంధానించిన దేశంలోనే మొట్టమొదటి నగరం ఏది?
1) ముంబై
2) కొచ్చి
3) విశాఖపట్నం
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
4. "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" మరియు "వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్" అనే రెండు పోషకాహార పథకాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
5. గిరిజన పాఠశాలల్లో గేమిఫైడ్ లెర్నింగ్ ను అమలు చేయడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ యాప్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది?
1) సూపర్ వై
2) స్టెప్ యాప్
3) బైజు
4) రియా రాబిట్
- View Answer
- సమాధానం: 2
6. 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) నిర్వహించిన జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) 75 వ రౌండ్ ప్రకారం... దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది?
1) తెలంగాణ
2) హిమాచల్ ప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
7. దేశంలో తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ అంబులెన్స్ సేవలు ఏ నగరంలో ప్రారంభమయ్యాయి?
1) కోల్‌కతా
2) చెన్నై
3) కొచ్చి
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 4
8. తమిళనాడులో మొట్టమొదటి పూర్తి డిజిటల్ ఎకానమీ జిల్లాగా ఏ జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది?
1) కోయంబత్తూర్
2) చెన్నై
3) ఈరోడ్
4) విరుదునగర్
- View Answer
- సమాధానం: 4
9. వ్యవసాయ రంగంలో మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి న్యూట్రిహబ్తో వుయ్ హబ్(WE HUB) భాగస్వామ్యం చేసుకుంది. ఈ వుయ్ హబ్ ఏ రాష్ట్రానికి చెందినది?
1) పంజాబ్
2) హిమాచల్ ప్రదేశ్
3) తెలంగాణ
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
10. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని బలోపేతం చేయడానికి యుకె ఇండియా బిజినెస్ కౌన్సిల్‌తో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తన అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తెలంగాణ
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
11. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్‌లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపీఎస్ఎస్డీసీ) తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది?
1) యుఐపాత్
2) ఆర్క్ రోబోట్
3) సిస్టమాంటిక్స్
4) రోబోసాపియన్స్
- View Answer
- సమాధానం: 1
12. హుబ్బాలి రైల్వే స్టేషన్ ను శ్రీ సిద్ధారౌధ స్వామీజీ రైల్వే స్టేషన్ గా పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హుబ్బాలి రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) సిక్కిం
2) తెలంగాణ
3) కర్ణాటక
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 3
13. మార్కెట్ సంబంధిత సమాచారాన్ని రైతులు నేరుగా తెలుసుకునేందుకు ప్రధాని మోదీ ఇటీవల ఏ యాప్ ను ఆవిష్కరించారు?
1) ఈ-గోపాల
2) నంద గోపాల
3) దేశి గౌ
4) ఇ-గౌ మిత్రా
- View Answer
- సమాధానం: 1
14. భారతదేశపు అతిపెద్ద పిగ్గేరీ మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
1) పశ్చిమ బెంగాల్
2) కేరళ
3) మహారాష్ట్ర
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 4
15. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి కిసాన్ రైలు ఏ రాష్ట్రం నుంచి ఇటీవల న్యూఢిల్లీకి ప్రారంభించబడింది?
1) తమిళనాడు
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
16. వైఎస్సార్ ఆసారా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
17. రైతు ఉత్పత్తి సంస్థలను ప్రోత్సాహం, నిర్వహణకు సంబంధించి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) తో ఏ రాష్ట్రం / యుటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) మధ్యప్రదేశ్
2) హరియాణ
3) లద్దాఖ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
అంతర్జాతీయం
18. మొదటి ప్రపంచ యుద్ధ వారసత్వ నగరంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ నగరాన్ని ప్రకటించారు?
1) న్యూజెర్సీ
2) శాన్ ఫ్రాన్సిస్కో
3) న్యూయార్క్
4) విల్మింగ్టన్
- View Answer
- సమాధానం: 4
19. సౌదీ అరేబియా నిర్వహించిన జీ 20 విద్యా మంత్రుల వర్చువల్ సమావేశంలో భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారు?
1) అమిత్ షా
2) నరేంద్ర మోదీ
3) రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’
4) రామ్ నాథ్ కోవింద్
- View Answer
- సమాధానం: 3
20. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ నగరంలో హాజరయ్యారు?
1) నూర్-సుల్తాన్
2) ఇస్లామాబాద్
3) బీజింగ్
4) మాస్కో
- View Answer
- సమాధానం: 4
21. బంగాళాఖాతంలో జరిగిన ఇంద్ర నేవి-20 సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొన్నాయి?
1) భారతదేశం, జపాన్
2) భారతదేశం, ఫ్రాన్స్
3) భారతదేశం, రష్యా
4) భారతదేశం, యుకె
- View Answer
- సమాధానం: 3
22. ఎకే -47 203 రైఫిల్స్ ను కొనుగొలు చేయడానికి భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
1) ఫ్రాన్స్
2) ఇజ్రాయెల్
3) రష్యా
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 3
23. జమ్మూలో మొదటిసారిగా గంజాయి మెడిసిన్ ప్రాజెక్టును స్థాపించడానికి సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ తో ఏ దేశం సహకార ఒప్పందం చేసుకుంది?
1) ఇజ్రాయెల్
2) పోర్చుగల్
3) కెనడా
4) స్పెయిన్
- View Answer
- సమాధానం: 3
24. 5 జీ టెక్నాలజీ అభివృద్ధిలో యుఎస్ఏ, భారత్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న దేశం ఏది?
1) జపాన్
2) ఇజ్రాయెల్
3) రష్యా
4) చైనా
- View Answer
- సమాధానం: 2
25. కోవిడ్-19 వ్యాక్సిన్ ల సేకరణ మరియు సరఫరాకు ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది?
1) ప్రపంచ ఆరోగ్య సంస్థ
2) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం
3) అమ్నెస్టీ ఇంటర్నేషనల్
4) యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్
- View Answer
- సమాధానం: 4
26. సరఫరా, సేవల విషయంలో పరస్పర సహకారం కోసం భారత్‌తో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది?
1) పోలాండ్
2) చైనా
3) జర్మనీ
4) జపాన్
- View Answer
- సమాధానం: 4
27. ఇండో-పసిఫిక్రీజియన్ లో ఆర్థిక, వ్యూహాత్మక సవాళ్లు అనే అంశంపై జరిగిన త్రైపాక్షిక సమావేశంలో భారత్, ఆస్ట్రేలియాతో పాటు ఏ దేశం పాల్గొంది?
1) ఇజ్రాయెల్
2) ఫ్రాన్స్
3) జపాన్
4) యుఎఈ
- View Answer
- సమాధానం: 2
28. పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్ ఫ్యాట్స్ లేని ప్రపంచాన్ని సాధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఏ సంవత్సరానికి లక్ష్యాన్ని నిర్దేశించింది?
1) 2027
2) 2030
3) 2025
4) 2023
- View Answer
- సమాధానం: 4
29. ఐరాస శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో వైద్య సదుపాయాలను బలపరిచేందుకు రెండు నిపుణుల బృందాలను భారత్ ఏ దేశానికి అందిస్తోంది?
1) కాంగో
2) దక్షిణ సూడాన్
3) పైవి ఏవీ లేవు
4) రెండూ (1) మరియు (2)
- View Answer
- సమాధానం: 4
ఆర్థికం
30. ఏఐఎమ్(AIM) స్టార్ట్-అప్ ఇన్నోవేటర్లను శక్తివంతం చేయడానికి నీతి ఆయోగ్ కి చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1) జెండెస్క్
2) గ్రూవ్
3) ఫ్రెష్‌వర్క్స్ ఇంక్.
4) హబ్స్పాట్
- View Answer
- సమాధానం: 3
31. ఎర్నెస్ట్ &యంగ్ నివేదిక ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాలలో భారతదేశ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో ఎంత సంభావ్య వృద్ధిని అంచనా వేశారు?
1) 14.7 బిలియన్ డాలర్లు
2) 24.1 బిలియన్ డాలర్లు
3) 35.6 బిలియన్ డాలర్లు
4) 29.9 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
32. లాజిస్టిక్స్ సరఫరా కోసం దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌నెట్ పోర్ట్ టెర్మినల్స్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి?
1) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TTtTTCS)
2) ఇన్ఫోసిస్
3) కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్
4) టెక్ మహీంద్రా
- View Answer
- సమాధానం: 1
33. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం క్షీణత నమోదు చేసుకుంటుంది?
1) 10.0 శాతం
2) 10.5 శాతం
3) 12.0 శాతం
4) 11.5 శాతం
- View Answer
- సమాధానం: 2
34. ఇండ్-రా అంచనా ప్రకారం... 2020-21 ఆర్థిక ఏడాదిలో భారతదేశ జీడీపీ ఎంత?
1) - 13.6 శాతం
2) - 11.2 శాతం
3) - 10.9 శాతం
4) - 11.8 శాతం
- View Answer
- సమాధానం: 4
35. ఇన్విట్ మోడల్(InvIT model) ద్వారా ఆస్తి మోనటైజేషన్ చేపట్టిన విద్యుత్ రంగంలోని తొలి పబ్లిక్ సెక్టార్(పీఎస్‌యు) కంపెనీ?
1) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
2) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
3) నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్
4) రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 2
36. న్యూయార్క్ కు చెందిన ఆర్థిక ప్రచురణ గ్లోబల్ ఫైనాన్స్ చేత ప్రపంచంలోనే ఉత్తమ బ్యాంకుగా గుర్తించబడిన బ్యాంకు ఏది?
1) వెల్స్ ఫార్గో
2) డీబీఎస్ బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ అమెరికా
4) జెపీమోర్గాన్ చేజ్
- View Answer
- సమాధానం: 2
37. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన ప్రకారం... దేశ జీడీపీలో ఎంఎస్ఎంఈల సహకారం 30 శాతం నుంచి ఎంత శాతం వరకు పెరగాలని లక్ష్యంగా నిర్దేశించారు?
1) 40 శాతం
2) 45 శాతం
3) 50 శాతం
4) 55 శాతం
- View Answer
- సమాధానం: 3
38. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రకటించిన EASE 2.0 అవార్డుల్లో... అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకుల విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన బ్యాంక్?
1) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
39. ‘షీకోడ్స్’ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ప్రారంభించడానికి నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేసిన సంస్థ ఏది?
1) ఇన్ఫోసిస్
2) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
3) డెల్ టెక్నాలజీస్
4) విప్రో
- View Answer
- సమాధానం: 3
40. సేంద్రీయ పత్తి సాగుదారుల కోసం “సఫాల్” కార్యక్రమం ద్వారా రుణం అందించాలని ఏ బ్యాంకు ప్రణాళికలు రచిస్తోంది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) కెనరా బ్యాంక్
4) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
41. క్రిసిల్ అంచనా ప్రకారం... 2020-21 ఆర్థిక ఏడాదిలో భారత్ జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుంది?
1) - 5 శాతం
2) - 9 శాతం
3) - 7 శాతం
4) - 10 శాతం
- View Answer
- సమాధానం: 2
42. భారతీయ విద్యార్థుల కోసం “AI క్లాస్రూమ్ సిరీస్” ను ప్రారంభించడానికి నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ తో ఏ సంస్థ భాగాస్వామ్య ఒప్పందం చేసుకుంది?
1) ఫేస్బుక్
2) ఇన్ఫోసిస్
3) మైక్రోసాఫ్ట్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 3
43. ‘ఎకనామిక్ ఫ్రీడం ఆఫ్ ది వరల్డ్: 2020 వార్షిక నివేదిక’ 24 వ ఎడిషన్‌లో భారతదేశ ర్యాంక్ ఎంత?
1) 55
2) 65
3) 105
4) 115
- View Answer
- సమాధానం: 3
44. మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విభాగాన్ని ఇటీవల ఏ సంస్థ పునరుద్ధరించింది?
1) ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఆఫ్ ఇండియా
2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా
4) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్
45. ఇటీవల దేశీయంగా అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగించి హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ వెహికల్ (హెచ్‌ఎస్‌టిడివి) ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్
2) భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
3) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
4) నేషనల్ స్పేస్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్
- View Answer
- సమాధానం: 2
46. 3డీ(3D) భూకంప డేటా సేకరణకు సంబంధించి ఇటీవల ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు?
1) సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ
2) సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ న్యూక్లియర్ రీసెర్చ్
3) నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
4) వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ
- View Answer
- సమాధానం: 4
47. టైఫూన్ కు పేరు పెట్టడానికి ‘హైషెన్’ అనే పేరును సిఫారసు చేసిన దేశం ఏది?
1) చైనా
2) వియత్నాం
3) థాయిలాండ్
4) కంబోడియా
- View Answer
- సమాధానం: 1
48. భారతదేశ వ్యాప్తంగా సౌర శక్తి రంగాన్ని బలోపేతం చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఇ) తో సీఎస్ఐఆర్ కి చెందిన ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
2) సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్
3) సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
4) సెంట్రల్ గ్లాస్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- View Answer
- సమాధానం: 3
49. యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు ఏ సంస్థతో జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) లింక్డ్ఇన్
2) మాన్స్టెర్
3) గ్లాస్‌డోర్
4) ఏంజెల్ లిస్ట్
- View Answer
- సమాధానం: 1
50. లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్‌యుహెచ్) ను అభివృద్ధి చేసి, దానిని ఇటీవల హిమాలయాల్లో పరీక్షించిన సంస్థ ఏది?
1) భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్
2) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్
3) హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
4) భారత్ డైనమిక్స్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
51. మత్స్య 6 అనే అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ ను ఏ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అభివృద్ధి చేశారు?
1) ఐఐఎస్సీ బెంగళూరు
2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ ఢిల్లీ
4) ఐఐటీ బాంబే
- View Answer
- సమాధానం: 4
52. ప్రపంచ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) రూపొందించిన యొక్క లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2020 ప్రకారం... 1970, 2016 మధ్య ప్రపంచ సకశేరుకాల సగటు శాతం క్షీణత ఎంత?
1) 56 శాతం
2) 61 శాతం
3) 68 శాతం
4) 72 శాతం
- View Answer
- సమాధానం: 3
వార్తల్లో వ్యక్తులు
53. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కోఆర్డినేషన్ కమిటీ (ఎంపీఐసీసీ) అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు?
1) వసుధ కామత్
2) నజ్మా అక్తర్
3) సన్యుక్త సమద్దార్
4) దీప్తి షా
- View Answer
- సమాధానం: 3
54. మహమ్మారి సంసిద్ధత, ప్రతిస్పందన కోసం ఏర్పాటైన డబ్ల్యూహెచ్‌వో(WHO) ప్యానెల్ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
1) గీతా నారాయణన్
2) బలరాం భార్గవ
3) ప్రీతి సూడాన్
4) కల్పేష్ శర్మ
- View Answer
- సమాధానం: 3
55. లోన్ మారటోరియం ప్రభావాలను అంచనా వేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) సందీప్ రావు
2) రాజీవ్ మెహ్రీషి
3) పవన్ రాథోడ్
4) రమేష్ హెచ్ ధోలాకియా
- View Answer
- సమాధానం: 2
56. ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) నిర్వహించే పిల్లల హక్కుల ప్రచారం ‘ప్రతి పిల్లల కోసం’ కు సంబంధించి ప్రముఖ న్యాయవాదిగా ఎవరు నియమించబడ్డారు?
1) రణవీర్ సింగ్
2) ఆయుష్మాన్ ఖుర్రానా
3) రాధికా ఆప్టే
4) మనుషి చిల్లార్
- View Answer
- సమాధానం: 2
57. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) శరద్ కుమార్
2) బిమల్ జలన్
3) రతన్ థియం
4) పరేష్ రావల్
- View Answer
- సమాధానం: 4
క్రీడలు
58. ఇటీవల క్రికెట్ కు వీడ్కోలు పలికి ఇయాన్ బెల్ ఏ దేశానికి చెందినవాడు?
1) వెస్టిండీస్
2) ఇంగ్లాండ్
3) దక్షిణాఫ్రికా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
59. 2020 ఇటాలియన్ గ్రాండ్ ప్రి టైటిల్ ఎవరు గెలుచుకున్నారు?
1) పీటర్ అరుండెల్
2) కార్లో అబేట్
3) మైఖేల్ షూమేకర్
4) పియరీ గ్యాస్లీ
- View Answer
- సమాధానం: 4
60. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) అనిల్ జైన్
2) సుమన్ కపూర్
3) సుందర్ అయ్యర్
4) రోహిత్ రాజ్‌పాల్
- View Answer
- సమాధానం: 1
ముఖ్యమైన తేదీలు:
61. ఏటా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 6
2) సెప్టెంబర్ 7
3) సెప్టెంబర్ 5
4) సెప్టెంబర్ 8
- View Answer
- సమాధానం: 4
62. ఏటా హిమాలయ దివాస్ ను ఎప్పుడు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 8
2) సెప్టెంబర్ 7
3) సెప్టెంబర్ 9
4) సెప్టెంబర్ 14
- View Answer
- సమాధానం: 3
63. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10 న పాటించే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ థీమ్ ఏమిటి?
1) “ఆత్మహత్యను నివారించడం: జీవితాలను చేరుకోవడం, జీవితాలను రక్షించడం”
2) “కనెక్ట్, కమ్యూనికేట్, కేర్”
3) “ఒక్క నిమిషం, జీవితాన్ని మార్చండి”
4) “ఆత్మహత్యలను నివారించడానికి కలిసి పనిచేయడం”
- View Answer
- సమాధానం: 4
64. ఏటా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 11
2) సెప్టెంబర్ 14
3) సెప్టెంబర్ 16
4) సెప్టెంబర్ 18
- View Answer
- సమాధానం: 1
65. 2020 ఏడాది మొట్ట మొదటిసారిగా నిర్వహించిన ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవంను ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 10
2) సెప్టెంబర్ 12
3) సెప్టెంబర్ 15
4) సెప్టెంబర్ 19
- View Answer
- సమాధానం: 2
66. ఏటా హిందీ దివాస్ ను ఏప్పుడు పాటిస్తారు?
1) సెప్టెంబర్ 10
2) సెప్టెంబర్ 14
3) సెప్టెంబర్ 15
4) సెప్టెంబర్ 19
- View Answer
- సమాధానం: 2
అవార్డులు, వార్తల్లో వ్యక్తులు
67. ‘సంవాద్ ఉపనిషద్’ & ‘అక్షర్ యాత్ర’ పేరుతో పుస్తకాన్ని రచించినది ఎవరు?
1) గులాబ్ కొఠారి
2) కలరాజ్ మిశ్రా
3) బర్ఖా దత్
4) రాజ్‌దీప్ సర్దేసాయ్
- View Answer
- సమాధానం: 1
68. “బ్రేకింగ్ ది కోకన్ @ 40” అనే పుస్తక రచయిత ఎవరు?
1) రిచా జా
2) సీమా చారి
3) రాధా ఎం నాయర్
4) అపరాజిత వాసుదేవ్
- View Answer
- సమాధానం: 3
69. 2019 సంవత్సరానికిగాను ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ఎవరు పొందారు?
1) ఎలా భట్
2) డేవిడ్ అటెన్బరోగ్
3) ఏంజెలా మెర్కెల్
4) మన్మోహన్ సింగ్
- View Answer
- సమాధానం: 2