PM Modi Mother Heeraben : ప్రధాని మోదీకి మాతృ వియోగం..
Sakshi Education
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆమెను యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆస్పత్రిలో చేరారు.
అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు.ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజును జరుపుకున్నారు. హీరాబెన్ మృతిపై ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని నా తల్లి ఈశ్వరుడి పాదాల వద్దకు చేరింది. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది’’ అని ట్వీట్ చేశారు.
Published date : 30 Dec 2022 09:03AM