Hardeep Nijjar: భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ తీవ్రవాది కాల్చివేత
జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) గతంలో ప్రకటించిన 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉంది. పంజాబ్ నుంచి కెనడా పారిపోయి చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిజ్జర్‌ను అప్పగించాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కెనడా ప్రభత్వాన్ని కోరుతూ ఉంది. కానీ అంతలోనే కెనడాలోని గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతడిని కాల్చి చంపేశారు.
Silvio Berlusconi : ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కోనీ మృతి
ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్..
భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. కెనడాలోని భారత రాయబారి సంస్థ పైన ఇటీవల జరిగిన దాడుల్లో నిజ్జర్ ప్రమేయముందని స్వయంగా భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు.
పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్ కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్ కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే అనంతలోకాలకు వెళ్ళిపోయాడు నిజ్జర్.