Telugu Lyricist: ప్రముఖ పాటల రచయిత కందికొండ ఇకలేరు
ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి (49) ఇక లేరు. చాలా కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 12న హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో 1973 అక్టోబరు 13న సాంబయ్య, కొమురమ్మ దంపతులకు కందికొండ జన్మించారు. మానుకోటలో ఇంటర్ పూర్తి చేసి, మహబూబాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్ సెకండియర్‌లో చక్రి (దివంగత సంగీతదర్శకుడు)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పాటల మీద ఆసక్తి ఉండడంతో ‘సాహితీ కళా భారతి’ అనే ఇ¯Œ స్టిట్యూట్ ప్రారంభించారు. పుణేలో జరిగిన జాతీయస్థాయి క్రీడల పోటీల్లో పరుగు పందెంలో పాల్గొన్న కందికొండ.. 1997– 98లో మిస్టర్ బాడీ బిల్డర్‌గానూ గెలిచారు.
Air India Board: ఎయిర్ ఇండియా చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ పూర్తి చేసిన కందికొండ.. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంతో గేయరచయితగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. పదమూడు వందలకు పైగా పాటలు రాశారు. సినిమా పాటలతోనే కాదు.. సంప్రదాయ, జానపద పాటల్లోనూ తన ప్రతిభ చాటారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ‘మాగాణి మట్టి మెరుపు తెలంగాణ’, ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్క బతుకమ్మా’ వంటి చెప్పుకోదగ్గ పాటలు ఉన్నాయి.
Chairman and Managing Director: ఆయిల్ ఇండియా సీఎండీగా ఎంపికైన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ కవి, పాటల రచయిత కన్నుమూత
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కేన్సర్ కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్