Chairman and Managing Director: ఆయిల్ ఇండియా సీఎండీగా ఎంపికైన వ్యక్తి?
దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ– ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా రంజిత్ రాత్ ఎంపికయ్యారు. ఈ మేరకు మార్చి 13న ప్రభుత్వ రంగ నియామకాల బోర్డ్ (పీఈఎస్‌బీ) ఒక ప్రకటన విడుదల చేసింది. 50 సంవత్సరాల రంజిత్ రాత్ ప్రస్తుతం మినీరత్న కంపెనీగా గుర్తింపు పొందిన మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ (ఎంఈసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయిల్ ఇండియా ప్రధాన కార్యాలయం అస్సాం రాష్ట్రం, దిబ్రూఘర్ జిల్లా, దులియాజన్ పట్టణంలో ఉంది.
President of Chile: చిలీ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేత?
ప్రస్తుత సీఎండీగా సుశీల్..
ఆయిల్ ఇండియా ప్రస్తుత సీఎండీగా సుశీల్ చంద్ర మిశ్రా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఏడాది జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేస్తారు. అటు తర్వాత రాత్ ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఇందుకు తొలుత ఆయన సచ్చీలతపై సీవీసీ, సీబీఐ వంటి అవినీతి నిరోధక శాఖల నుంచి క్లియరెన్స్‌లు ఇవ్వాలి. అటు తర్వాత రాత్ ఎంపికకు నియామకపు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయాలి.
IRDAI: ఐఆర్‌డీఏఐ చైర్మన్‌గా నియమితులైన ఐఏఎస్ ఆఫీసర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : రంజిత్ రాత్
ఎక్కడ : దులియాజన్ పట్టణం, దిబ్రూఘర్ జిల్లా, అస్సాం
ఎందుకు : ఆయిల్ ఇండియా ప్రస్తుత సీఎండీ సుశీల్ చంద్ర మిశ్రా.. 2022, జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో..